
ఒక్క చిరునవ్వుతో వెండితెరపై వెలుగులు కురిపించే నటి జెనీలియా దేశ్‌ముఖ్. ఎప్పుడూ క్లాసిక్ అందాన్ని కంఫర్ట్‌తో కలిపి, ఫ్రెష్ ఫ్యాషన్‌తో మెరిసిపోతుంది. ఆ యూనిక్ చార్మ్‌ను సినిమాల్లోనే కాదు, జీవితంలోనూ చూపిస్తోంది.
జ్యూలరీ బ్రాండ్: షాచీ ఫైన్ జ్యూలరీ, ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
చీర బ్రాండ్: యాష్‌డెన్, ధర: రూ. 98,000
నాకు స్టయిల్ అంటే సింప్లిసిటీ. ట్రెండ్ కంటే కంఫర్ట్ ముఖ్యం. చిన్న చోకర్, లైట్ ఇయర్ రింగ్స్, సాఫ్ట్ లిప్‌గ్లోస్, ఇదే నా సిగ్నేచర్ లుక్. ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటే మేకప్ లేకపోయినా, ముఖం ఆటోమేటిక్‌గా మెరిసిపోతుందని చెబుతోంది జెనీలియా.
రిబ్బన్స్ రీ ఎంట్రీ!
ఒకప్పుడు జడకే పరిమితమైన ఈ నాజూకైన పట్టీ, రిబ్బన్స్. ఇప్పుడు మెడ మీద మెరిసేలా ఓ కొత్త స్టయిల్ స్టేట్‌మెంట్‌ను సృష్టిస్తోంది. జడల చివర అలముకునే ఈ చిన్నదానికి ఇప్పుడు ఫ్యాషన్‌లో పెద్ద స్థానం దక్కుతోంది. ఇది వచ్చినప్పటి నుంచీ పొడవైన హారాల జమానా కాస్త వెనక్కి వెళ్లిందనే చెప్పాలి.
మధ్యలో ఓ చిన్న పెండెంట్, చుట్టూ సన్నని రిబ్బతో వచ్చే ఈ చోకర్ వేసుకొని, అద్దం ముందు నిలబడగానే ‘ఇంత అందంగా నేనేనా?’ అన్న ఆశ్చర్యంతో మురిసిపోతారు! చీరా, లెహంగా, కుర్తా ఏదైనా సరే, ఈ రిబ్బన్స్ చోకర్ మెడమీద పడితే లుక్‌కి కొత్త శోభ చేకూరుతుంది. హెయిర్ స్టయిల్ బ్రేడ్ అయినా, బన్ అయినా, ఏదైనా మెడ భాగం స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి.
మేకప్ విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తక్కువ టచ్ ఇచ్చినా సరే, చోకర్ ముఖాన్ని హైలైట్ చేయగలదు. ఇది వేసుకున్నాక, ఇంకొక హారం అవసరం లేదు. ఎందుకంటే, ఈ ఒక్కదానికే పొడవైన హారాల గర్వాన్ని తగ్గించేంత స్టయిల్, పవర్ ఉంది. చిన్నదిగా కనిపించినా, గొప్పగా మెరిసిపోతుంది.
(చదవండి: సెల్ఫ్ బ్రాండ్..అదే ట్రెండ్..! పేరులో ఐడెంటిటీ..అదే ఇవాళ స్టైల్లో మేటి..)