ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన 20 ఏళ్ల నాటి మూవీని గుర్తు చేసుకున్నారు. నా సినీ ప్రయాణంలో అత్యంత ఆనందాన్నిచ్చిన చిత్రాలలో ఇది ఒకటని ట్వీట్ చేశారు. హ్యపీ చిత్రానికి నేటితో 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇంతటి అద్భుతమైన విజయాన్ని అందించిన కరుణాకర్ గారికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు.
నా ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన హీరోయిన్ జెనీలియా, టాలెంటెడ్ మనోజ్ భాజ్‌పాయ్.. నాతో పాటు ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులందరూ కలిసి ఈ ప్రయాణాన్ని మర్చిపోలేనిదిగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. హృదయాన్ని హత్తుకునే సంగీతం అందించినందుకు యువన్ రాజాకు, సాంకేతిక నిపుణులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు అండగా నిలిచినందుకు మా నాన్న అల్లు అరవింద్ గారికి, గీతా ఆర్ట్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
20 years of #Happy. 🖤
One of the most enjoyable films of my journey.
Grateful to #AKarunakar garu for the beautiful vision.
My wonderful co-star dear @geneliad, the amazing talent @BajpayeeManoj ji, and many other artists made it a truly joyful ride.@thisisysr garu for his… pic.twitter.com/zeUTwRPdlR— Allu Arjun (@alluarjun) January 27, 2026


