
ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ (Louis Vuitton) ఇటీవల అరుదైన, విచిత్రమైన, ఖరీదైన ఉత్పత్తులతో వార్తల్లో నిలుస్తోంది. పారిస్‌లో జరిగిన మెన్స్ స్ప్రింగ్/సమ్మర్ 2026 షోలో ఈ సరి కొత్త బ్యాగ్‌ను లాంచ్ చేసింది. లైఫ్‌బాయ్ రింగ్‌లా వున్న ఈ బ్యాగు ధర చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. అదీ పురుషుల బ్యాగ్ ఇంత ధర పలకడం నెట్టింట సంచలనంగా మారింది.
ఈ బ్యాగ్ ధర సుమారు 10,000 డాలర్లు, అంటే భారతీయ రూపాయల్లో రూ. 8,60,000. లూయిస్ విట్టన్ సిగ్నేచర్ మోనోగ్రామ్ లెదర్ కాన్వాస్‌తో దీన్ని తయారు చేసింది. చక్కటి స్టోరేజ్ స్పేస్‌తో బ్యాగ్‌లో మూడు వేర్వేరు జిప్ కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి, ఎడ్జస్టబుల్ లెదర్ స్ట్రాప్ కారణంగా భుజంపై లేదా క్రాస్-బాడీగగా వేసుకోవచ్చు. దీంతో లూయిస్ బ్రాండ్ అంతే మరి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ బ్యాగ్ సృజనాత్మక డిజైన్, కళా నైపుణ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ లగ్జరీ బ్యాగు హాట్ కేకుల్లా సేల్ కావడం విశేషమేమరి. లూయీ విటోన్ గతంలో విమానం, డాల్ఫిన్, లాబ్‌స్టర్ ఆకారంలో బ్యాగ్‌లను తయారు చేసిన చరిత్ర ఉంది. ఇవన్నీ ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: చదివింది తక్కువే, రూ.500తో ముంబైకి, కట్ చేస్తే కోటీశ్వరుడుగా