లైట్‌ వెయిట్‌... రిచ్‌ లుక్‌ | Hyderabad fashion designer abhigna crepe saree with digital print | Sakshi
Sakshi News home page

సంప్రదాయ చీరకట్టుకు ఆధునిక డిజిటల్‌ కళ

Dec 20 2025 7:35 PM | Updated on Dec 20 2025 8:05 PM

Hyderabad fashion designer abhigna crepe saree with digital print

ఏ సీజన్‌ అయినా ఏ వేడుకైనా చాలా సులువుగా ఎంపిక చేసుకునే జాబితాలో ఈ ఏడాది ముందు వరుసలో ఉంది క్రేప్‌. సంప్రదాయ పెళ్లి వేడుకలోనూ ఆధునిక కాక్‌టెయిల్ పార్టీలోనూ ప్రత్యేకంగా వెలిగిపోయే క్రేప్‌ విత్‌ డిజిటల్‌ ప్రింట్స్‌ చేస్తున్న హంగామా గురించి హైదరాబాద్‌లో ఉంటున్న డిజైనర్‌ అభిజ్ఞ చెబుతున్న విశేషాలు ఇవి..

ఇప్పుడు చాలావరకు ఐదు రోజుల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగినవి మెహందీ, హల్దీ, రిసెప్షన్స్‌కి.. పువ్వుల ప్రింట్లున్న చీరలు, లెహంగాలు ధరించడం చూస్తున్నాం. అలాగే కుటుంబ సభ్యులు ఒకచోట కలిసి చేసుకున్న పార్టీలు, బయట జరిగే కాక్‌టెయిల్స్‌కు ఫ్లోరల్స్‌ కనువిందు చేస్తున్నాయి. డ్రెస్‌ ఆధునికమైనా, సంప్రదాయం అయినా కట్, డ్రేప్‌లో చిన్న చిన్న మార్పులు తీసుకు వస్తున్నారు. ఇదంతా క్రేప్, జార్జెట్‌ పైన ఫ్లోరల్స్‌ చేసే సందడి వల్లే సాధ్యం అవుతుంది అని చెప్పచ్చు.

డిజిటల్‌ ప్రింటింగ్‌ 
త్రీ డీ డిజైన్స్‌ ఎక్కువ శాతం ఫ్లోరల్స్‌ ఉంటాయి. కొన్ని ప్రయోగాత్మకంగా ఫ్రూట్‌ డిజైన్స్‌ చేశాం. ఫ్యాబ్రిక్‌ మేనికి మృదువుగా ఉంటుంది. ఇరవై ఏళ్ల వారినీ సీతాకోక చిలుకల్లా చూపితే, యాభై ఏళ్ల వారినీ హుందాగా చూపుతున్నాయి. సంప్రదాయ చీరకట్టుకు ఆధునిక డిజిటల్‌ కళ ఈ ఇయర్‌ బాగా నడిచింది. పెద్ద పెద్ద పువ్వులు, జామెట్రి నమూనాలు, తేలికగా ఉండే ఫ్యాబ్రిక్‌పైన అన్ని రకాల డిజైన్లు అందంగా కనువిందు చేస్తున్నాయి.

లేత రంగుల ట్రెండ్‌
ఈ ఏడాది లేత, ప్లెయిన్‌ కలర్స్‌ని బాగా ఇష్టపడ్డారు. ఇలా ప్లెయిన్‌గా ఉండే ఫ్యాబ్రిక్‌ పైన పెద్ద పూల నుండి అబ్‌స్ట్రాక్ట్‌ ఆర్ట్‌ వరకు చూపు తిప్పుకోనివ్వని ఆర్ట్‌ వీటి సొంతం. మరిన్ని హంగుల కోసం డిజిటల్‌ డిజైన్స్‌ను అనుసరిస్తూ ఎంబ్రాయిడరీ లేదా స్వీక్వెన్స్‌ వర్క్‌తో ఇంకాస్త బ్రైట్‌గా డిజైన్‌ చేస్తున్నాం. ఈ డిజైన్‌లు సెమీ క్రేప్, మైసూర్‌ సిల్క్‌పైనా అందంగా అమరుతున్నాయి. ప్రత్యేకమైన డిజైన్లు ఆర్డర్ల మీద చేస్తాం కాబట్టి, ఏ ఎంపిక అది స్టేట్‌మెంట్‌ పీస్‌గా ఉంటుంది. ఏ సందర్భంలోనైనా ప్రత్యేకత చాటుతుంది.

డిజైన్‌కే ప్రాముఖ్యం
సాధారణంగా స్కిన్‌ టోన్‌ బట్టి ఫ్యాబ్రిక్‌ రంగుల ఎంపిక చేసుకునేవారు గతంలో. నేడు డిజైన్‌కే ప్రాముఖ్యం పెరిగింది. లేత రంగులు ఉండటం వల్ల ఏ స్కిన్‌టోన్‌ కైనా ఇవి బాగా నప్పుతున్నాయి. ఫ్యాబ్రిక్‌ మృదువుగా, తేలికగా ఉండటం, రిచ్‌ లుక్‌ ని ఇవ్వడం ఈ క్రేప్‌ శారీ ఎంపికలో ప్రధానమైనవి. 

గ్రాండ్‌గా జరిగే వివాహ వేడుకలు, పండగలు, కాక్‌టెయిల్ పార్టీలకూ నప్పడంతో వీటి ఎంపికలో మరో ఆప్షన్‌కు వెళ్లడం లేదు.

ఇరవై నుంచి 30 ఏళ్ల లోపు అయితే బ్లౌజ్ ప్యాటర్న్స్‌లో వెస్ట్రన్‌ స్టైల్‌ వి–నెక్స్, స్లీవ్‌లెస్‌.. వంటివి కోరుకుంటున్నారు. ఆ తర్వాత ఏజ్‌ గ్రూప్‌ హై నెక్స్‌ ఎంపిక చేసుకుంటున్నారు. 

చూడండి: ఎరుపు చీర‌, ముత్యాల నెక్లెస్‌లో నీతా అంబానీ

ఫ్యాబ్రిక్‌ నాణ్యత, డిజైన్‌లో ప్రత్యేకతను అనుసరించి వీటి ధరలు ఉంటున్నాయి. 
ఈ ఫ్లోరల్‌ ప్రింట్‌ శారీస్‌ లేదా డ్రెస్సులకు ఆభరణాల అవసరం అంతగా పడదు. సన్నటి చైన్లు లేదా ముత్యాలు లేదా బీడ్స్‌ నెక్‌పీస్‌లు బాగుంటున్నాయి. 

కేశాలంకరణలో ఎక్కువగా లూజ్‌ హెయిర్, ఫిష్‌టెయిల్, బన్స్‌.. కూడా సెట్‌ అవుతాయి. చిన్న పాటి కేశాలంకరణతోనూ ఈ ఫ్లోరల్‌ శారీస్‌కి మరింత అందాన్ని తీసుకురావచ్చు.

- అభిజ్ఞ, ఫ్యాషన్‌ డిజైనర్, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement