breaking news
Fashion designing
-
సృజనార్చన
అర్చన కొచ్చర్.. బాలీవుడ్లో షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, మలైకా అరోరా, కంగనా రనౌత్, డయానా పెంటీ మొదలైన వారికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా చేసి సెలబ్రిటీ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్‌గా పాపులర్ అయ్యారు. ఇప్పుడు జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలలో ఫ్యాషన్, టాలెంట్ సెగ్మెంట్స్ కోసం అవుట్‌ఫిట్స్‌ని డిజైన్ చేసి తెలంగాణ టెక్స్టైల్స్, చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. ఈ నేపథ్యంలో అర్చన పరిచయం ఆమె మాటల్లోనే.‘నేను పుట్టి, పెరిగింది ముంబైలో. కామర్స్‌లో డిగ్రీ చేశాను. ఫ్యాషన్‌కు సంబంధించిన అకడమిక్ డిగ్రీ ఏమీ లేదు కానీ.. ఫ్యాషన్ పట్ల ప్యాషన్ నాకు ఊహ తెలిసిన నాటి నుంచే మొదలైందని చె పొ్పచ్చు. దీనికి స్ఫూర్తి చిన్నప్పటి నుంచి నేను చూసిన చేనేత, ఎంబ్రాయిడరీ కళాకారులే! ఏళ్ల నాటి ఈ కళా సంస్కృతిని ప్రతి తరానికి పరిచయం చేస్తూ వాటిని ప్రిజర్వ్ చేస్తున్న తీరు నన్ను అబ్బురపరచేది. ఆ కళల పట్ల వాళ్లకున్న నిబద్ధత, నైపుణ్యం, సృజనాత్మకతకు ముచ్చటేసేది. వీటన్నిటికీ ఓ వేదిక ఏర్పర్చి.. ప్రపంచమంతా గుర్తించేలా చేయాలనిపించింది.ప్రతి నేత వెనుక ఉన్న చారిత్రక కథనాన్ని ప్రపంచానికి వినిపించాలనిపించింది. ఆ ప్రేరణతోనే ఫ్యాషన్ డిజైనింగ్లోకి అడుగుపెట్టాను. పదహారవ ఏటనే ఫస్ట్ ఎగ్జిబిషన్‌ను పెట్టాను. ఇరవయ్యేళ్ళకే బ్రైడల్ వేర్ డిజైనర్‌గా పాపులర్ అయ్యాను. అయితే నా ఈ జర్నీకి మా అమ్మనూ ఓ స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్ పట్ల నాకున్న ఆసక్తిని గమనించి దాని వివరాల్లోకి వెళ్లేలా ప్రోత్సహించింది. ఈ రోజు నేనీ స్థాయిలో ఉండటానికి మా అమ్మతో పాటు మా వారు రాజీవ్ కొచ్చర్, మా అమ్మాయి సిమ్రాన్ కారణం. వాళ్ల ప్రోత్సాహ సహకారాలు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. అహింసా సిల్క్పట్టు అనగానే ఆ నేతకు ఎన్ని పట్టుపురుగులను పొట్టన పెట్టుకున్నారో అనే ఆలోచన, అభిప్రాయానికి వచ్చేస్తారు ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించే ఎవ్వరైనా! అందులో నేను కూడా! అందుకే ఒక ఫ్యాషన్ డిజైనర్‌గా పర్యావరణహితమైన ఫ్యాషన్‌ను, డిజైన్స్‌ను క్రియేట్ చేసి, ప్రమోట్ చేయాలని నిశ్చయించుకున్నాను. ఆప్రాజెక్ట్కి ‘అహింసా సిల్క్’ అనే పేరు పెట్టాను. జార్ఖండ్ వెళ్లి.. అక్కడి గిరిజన స్త్రీలతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. ఈప్రాజెక్ట్ వల్ల ఆ గిరిజన మహిళలకు ఉ పాధి దొరకడమే కాదు వాళ్ల ఆత్మవిశ్వాసం పెరిగింది, వాళ్లకు ఆర్థిక స్వాతంత్య్రమూ వచ్చింది. ఈ అహింసా సిల్క్ డిజైన్స్‌తో న్యూయార్క్ ఫ్యాషన్ షోలో పాల్గొన్నాను. అంతర్జాతీయ గుర్తింపు దొరికింది.మిస్ వరల్డ్ బ్యూటీ ప్యాజెంట్లో..ఫ్యాషన్ ప్రపంచంలో నా ప్రయాణం చిన్నగానే మొదలైంది. కానీ ప్రతిచోటా మన దేశ ప్రతిభను చాటడానికే ప్రయత్నించాను. ‘అహింసా సిల్క్’ ప్రాజెక్ట్‌తో మన దేశానికున్న రిచ్ టెక్స్టైల్ హెరిటేజ్ ని ప్రపంచానికి పరిచయం చేశాను. ప్రతి కలెక్షన్ వెనుక భారతీయ చేనేత కళానైపుణ్యం, సంస్కృతిని చూపించాను. అందుకే ఈ రోజు నాకు మిస్ వరల్డ్ (Miss World) బ్యూటీ పాజెంట్‌లో అవుట్‌ఫిట్స్‌ని డిజైన్ చేసే అవకాశం దక్కింది. ఇది నా ఘనత కాదు.. మన చేనేత సంస్కృతికున్న స్ట్రెంత్. పోచంపల్లి ఇక్కత్, గొల్లభామ, నారాయణ్‌పేట్ చీరలు, లగ్జరియస్ బ్రోకేడ్స్, బంగారు జరీ చీరలు, జర్దోసీ ఎంబ్రాయిడరీ, హైదరాబాద్ ముత్యాలతో 240 అవుట్‌ఫిట్స్‌ను డిజైన్ చేశాం. ప్రతి త్రెడ్‌లో డీటైయిలింగ్ కనపడుతుంది. అది మన కళాకారుల నైపుణ్యం, సృజనాత్మకతకు అద్దం పడుతుంది. ఈ డిజైన్స్‌ను ధరిస్తున్న ప్రతిఒక్క పార్టిసిపెంట్‌కి ఈ దేశ ఘన చరిత్రను ధరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అలా ఈ డిజైన్స్ అన్నీ మన కల్చర్, ప్రైడ్, గ్లోబల్ సిస్టర్హుడ్కి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇవి పార్టిసిపెంట్స్ అంటున్న మాటలు! ఈ మొత్తం అవుట్‌ఫిట్స్‌ని డిజైన్ చేయడానికి నాకు, నా టీమ్‌కి నెల రోజులు పట్టింది. వీటిని టాప్ మోడల్ రౌండ్, ఫినాలేలో ధరిస్తారు.దక్షిణ భారత ఫ్యాషన్ కాపిటల్‌గా.. పోచంపల్లి ఇక్కత్ నుంచి గద్వాల దాకా తెలంగాణకు ఘనమైన చేనేత చరిత్ర ఉంది. ఇక్కడ సంప్రదాయ నేతకు ఎంతప్రాధాన్యం ఉందో ఫ్యాషన్‌కూ అంతేప్రాముఖ్యత కనిపిస్తుంది. తమ మూలాలను ఎంత గౌరవిస్తారో ట్రెండ్స్‌నూ అంతే ఆదరిస్తారు. ఇక్కడ హెరిటేజ్‌కి, మోడర్న్ స్టయిల్‌కి మధ్య స్ట్రాంగ్ కనెక్షన్ కనిపిస్తుంది. అందుకే ఈప్రాంతం నాకు కల్చర్ అండ్ ఫ్యాషన్ల ఫ్యూజన్‌గా కనిపిస్తుంది. ఫ్యాషన్ అందంగా.. సస్టెయినబుల్‌గా ఇవాల్వ్ అవడానికి ఈ బ్యాలెన్స్ చాలా ముఖ్యం.తెలంగాణ టెక్స్టైల్స్, చేనేత కళను కంటెంపరరీ ఫ్యాషన్‌గా మలచడానికి దీనికి మించి ఇంకేం కావాలి! అంతేకాదు హైదరాబాద్‌లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాంస్కృతిక సంపద, సృజన ఇవన్నీ దీన్ని సౌత్ ఇండియా ఫ్యాషన్ హబ్‌గా మారే స్కోప్నిస్తున్నాయి. ఈ బ్యూటీ పాజెంట్ సక్సెస్‌తో ఫ్యాషన్ షోస్‌కు తెలంగాణ మంచి హోస్ట్‌గా ఉండగలదని నిరూపించుకుంది. విరివిగా ఫ్యాషన్ షోలు జరిగితే స్థానిక ఫ్యాషన్ డిజైనర్స్, చేనేత కళాకారులకూ మంచి సపోర్ట్ దొరుకుతుంది’ అని చెప్పారు అర్చన.– రమ సరస్వతిఫొటోలు: ఎస్ ఎస్ ఠాకూర్ -
Fashion: మనుసుకు నచ్చిన రంగులు.. కలర్ – కంఫర్ట్!
‘మనసుకు నచ్చిన రంగులు ఉండాలి. ట్రెండ్‌కు తగినట్టు ఉండాలి. స్పెషల్ లుక్ అనిపించాలి. అన్నింటికి మించి సౌకర్యంగా ఉండాలి’అంటూ ఎంచుకునే డ్రెస్సింగ్ విషయంలో తీసుకునే జాగ్రత్తల గురించి హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఉంటున్న నిఖితారెడ్డి తన వార్డ్రోబ్ ముచ్చట్లను ఈ విధంగా పంచుకున్నారు.ఐదేళ్ల లోపు పిల్లలకు ఎంబ్రాయిడరీ డ్రెస్సులు ఆన్లైన్లో చాలా డిజైన్స్ వస్తున్నాయి. నా శారీ కలర్ లేదా పార్టీ థీమ్ కలర్‌ని బట్టి వాటిని ఎంపిక చేసుకుంటాను. పాప వేసుకున్న పింక్ కలర్ లెహంగా, దుపట్టా అలా ప్లాన్ చేసిందే. పట్టు డ్రెస్సులు మాత్రం మెటీరియల్ తీసుకొని, స్టిచింగ్ చేయిస్తాను.కలర్ కాంబినేషన్స్..నా ఫేవరెట్ కలర్స్ ఆరెంజ్, పింక్. దీంతో నా వార్డ్‌రోబ్‌లో ఈ కలర్ కాంబినేషన్ డ్రెస్సులు ఎక్కువ చేరుతుంటాయి. అయితే, ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. చుడీదార్ ఎంపిక చేసుకున్నా ఒక చిన్న ఆరెంజ్ ఎలిమెంట్ అయినా ఉండాలి. ఇదే కాంబినేషన్లో బేబీ షవర్ సమయంలో మా ఫ్యామిలీ షూట్‌కి పట్టుచీర, కుర్తా పైజామా సెట్ ఆరెంజ్ కాంబినేషన్ ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నాం.సెలబ్రిటీ స్టయిల్..ఆరెంజ్ శారీ స్టైల్లో నటి అదితీరావు హైదరీ ఫొటో సోషల్ మీడియా లో చూశాను. నాకు బాగా నచ్చింది. ఆ విధంగా ఉండాలని ఆరెంజ్ శారీ, బ్లౌజ్ మెటీరియల్ అన్నీ సొంతంగా ఎంపిక చేసుకుని, డిజైన్ చేయించుకున్నాను. ముత్యాలు, పచ్చలు, కుందన్స్ కాంబినేషన్ జ్యువెలరీని దానికి సెట్ చేశాను.మిక్స్ అండ్ మ్యాచ్..పెళ్లి సమయంలో తీసుకున్న చీరలు, అమ్మవాళ్లు కానుకగా ఇచ్చినవి.. ప్రత్యేక సందర్భాలలో వేసుకోవడానికి బ్లౌజ్ డిజైన్స్ ద్వారా మార్పులు చేస్తుంటాను. కానీ, చాలా వరకు ఏ డ్రెస్ సెట్ ఎలా ఉంటే అలాగే వేసుకోవాలనుకుంటాను. పెద్దగా మిక్స్ అండ్ మ్యాచ్ చేయను.థీమ్ పార్టీలు..ముందుగా కంఫర్ట్‌గా ఉండే డ్రెస్సులకే ్రపాధాన్యత ఇస్తాను. ఇప్పుడు మదర్ డాటర్ కాంబినేషన్ సెట్స్ వస్తున్నాయి. వాటిని ప్లాన్ చేస్తాను. అలాగే, పాపకు నాకు బర్త్ డే గిఫ్ట్స్ డ్రెస్సులు వస్తుంటాయి. వాటిని చిన్న మార్పులతో థీమ్డ్ పార్టీలకు ప్లాన్ చేస్తాను.ఎంబ్రాయిడరీ.. క్వాలిటీ ఫస్ట్..ఫ్లోరల్ ప్రింట్స్ స్టోర్స్‌లోనూ ఆన్‌లైన్‌లోనూ మార్కెట్లో ఎంపిక చేసుకుంటాను. కానీ, ఎంబ్రాయిడరీ అయితే కొన్ని ప్రత్యేకమైన చోట్లనే బాగుంటాయి. డిజైన్ పరంగానూ, క్వాలిటీ పరంగానూ బాగున్నవి అయితేనే ఎంబ్రాయిడరీ డ్రెస్సులను ఎంపిక చేసుకుంటాను.ఫ్లోరల్స్..దగ్గరి బంధువుల పెళ్లిలో ప్రతిదీ వేడుకగా ఉండాల్సిందే. ముఖ్యంగా సంగీత్, హల్దీ, రిసెప్షన్.. వంటి వేడుకలకు వైవిధ్యంగా ఉండాలి. హల్దీ ఫంక్షన్ కోసం రెడీ అవ్వడానికి ఫ్లోరల్ డిజైన్స్, ఫ్లోరల్ జ్యువెలరీ బాగుంటుంది. ఇందుకు ఆన్లైన్ మార్కెట్లోనూ మంచి మంచి మోడల్స్ లభిస్తున్నాయి. ఫ్లోరల్ డిజైన్స్ అలా ఎంపిక చేసుకుని తీసుకున్నవే. మా కజిన్ హల్దీ ఫంక్షన్‌కి డ్రెస్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. వెస్ట్రన్ స్టయిల్..బ్లాక్ థీమ్డ్ డ్రెస్‌ను న్యూ ఇయర్ సందర్భంగా, కజిన్స్‌తో బర్త్డేస్కు వెళ్లాలంటే మోడర్న్‌గా ఉండేవి ప్లాన్ చేసుకుంటాను.ప్రయాణాలకు ఒక స్టయిల్..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎగ్జిబిషన్స్ స్టాల్స్ పెడుతుంటారు. వాటిలో లాంగ్ ఆరెంజ్ ఫ్రాక్ ఎంపిక చేసుకున్నాను. ఇలాంటివి టూర్స్‌కి వెళ్లినప్పుడు వేసుకుంటాను. వాటిల్లో ఫొటోస్ కూడా బ్రైట్‌గా వస్తాయి. అలాగే, లాంగ్ ఫ్రాక్స్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉండేలా చూసుకుంటాను. -
తిరుపతి : అదిరే డ్రస్‌లతో అదరగొట్టిన విద్యార్థినులు (ఫోటోలు)
-
ఇదీ.. శారీనే! కొంచెం స్టయిల్ మారిందంతే!!
సౌకర్యంగా ఉండే ఫ్యాషనబుల్ డ్రెస్సుల కోసం నవతరం ఎప్పుడూ వెతుకుతుంటుంది. అలాగని సంప్రదాయాన్ని వదిలిపెట్టదు. ఈ విషయాలపై స్పష్టత ఉన్న డిజైనర్లు చీరను ఎన్ని హంగులుగా తీర్చిదిద్దుతున్నారో చూడాల్సిందే! డ్రెస్‌ను పోలి ఉండేలా.. శారీ అనిపించేలా ఇండోవెస్ట్రన్ లుక్‌తో ఆకట్టుకునేలా యంగ్‌స్టర్స్ ఆలోచనలకు తగినట్టుగా డిజైన్ చేస్తున్నారు.అన్ని రకాల ఫ్యాబ్రిక్..కాటన్, సిల్క్, చందేరీ... ఏ ఫ్యాబ్రిక్ శారీ అయినా ఈ డిజైన్‌కు వాడచ్చు. పల్లూను కుర్తా స్టైల్లో ధరించి, నడుము భాగంలో బెల్ట్ సెట్ చేస్తే మరో శారీ స్టైల్ మీ సొంతం అవుతుంది.ఖఫ్తాన్ శారీ..ఈ డిజైన్ శారీ లాంగ్ గౌన్‌ను తలపిస్తుంది. శారీ గౌన్లా కనిపిస్తుంది. ప్లెయిన్ శారీకి కుచ్చులు సెట్ చేసి, పల్లూ భాగాన్ని మాత్రం ఖఫ్తాన్ స్టైల్లో డిజైన్ చేయాలి. నెక్ భాగాన్ని కూడా పల్లూ డిజైన్‌లో వచ్చేలా సెట్ చేయాలి.ఆభరణాల అమరిక..హెయిర్‌స్టైల్ మోడల్స్ లేదా ఆభరణాల ఎంపిక ఈ స్టైల్ డ్రెస్‌కు అంతగా అవసరం లేదు. శారీనే న్యూ లుక్‌తో ఆకట్టుకుంటుంది కాబట్టి ఇతరత్రా అలంకరణా సింపుల్‌గా ఉంటేనే చూడముచ్చటగా ఉంటుంది.సౌకర్యంగా..భుజం మీదుగా తీసే కొంగు భాగంలో డిజైన్‌ను బట్టి హ్యాండ్ స్టైల్‌ను అమర్చుకోవచ్చు. ఇది సౌకర్యంగానూ, స్టైల్‌గానూ కనిపిస్తుంది.ఎంబ్రాయిడరీ..పల్లూ మధ్య భాగంలో ఖఫ్తాన్కి మెడ నుంచి ఎంబ్రాయిడరీ వర్క్‌తో ప్లెయిన్ శారీని కూడా మెరిపించవచ్చు. -
విజయవాడ : ఫ్యాషన్ షోలో మెరిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
Shruti Malhotra: ‘ఏదైనా చేయాలి.. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’..
కల ఉన్న చోట కష్టం ఉంటుంది. ‘మరింత కష్టపడతాను’ అంటూ ముందుకువెళ్లాలి. లక్ష్యం ఉన్న చోట సవాలు ఎదురొస్తుంది. సరిౖయెన జవాబు చెప్పి ఆ సవాలును వెనక్కి పంపించాలి. ఇందుకు నిలువెత్తు ఉదాహరణ శృతి మల్హోత్రా. జార్ఖండ్‌లోని రాంచికి చెందిన శృతి ఎన్నో చిన్న బ్రాండ్లను పెద్ద సక్సెస్ చేసింది. సక్సెస్‌కు సరిౖయెన అడ్రస్‌గా పేరు తెచ్చుకుంది. శృతి మల్హోత్రా బాల్యంలోకి వెళితే.. ప్రతిరోజు రాత్రి నలుగురు అక్కాచెల్లెళ్లు వార్తలు వినడానికి రేడియో ముందు కూర్చునేవారు. కొత్త విషయాలు, ఆసక్తికరమైన విషయాలను రూల్ నోట్ ΄్యాడ్లో రాసుకునేవారు. మరుసటి రోజు తండ్రితో వాటి గురించి చర్చించేవారు. తండ్రి వాటి గురించి మరిన్ని కొత్త విషయాలు వివరంగా చెప్పేవాడు. శృతి తండ్రి పిల్లలకు తరచుగా చెప్పే మాట.. ‘స్వతంత్రంగా ఉండండి’ ‘పెద్ద కలలు కనడానికి వెనకాడ వద్దు’ ‘ఈ ప్రపంచంలో మీకు అత్యున్నత స్నేహితుడు.. విద్య’ తండ్రి మాటలు అక్షరాలా ఆచరించడం వల్లే పదిమందీ మెచ్చుకునే స్థాయికి ఎదిగింది శృతి మల్హోత్రా. మిషనరీ స్కూల్ నుంచి దిల్లీ యూనివర్శిటీలో చదువుకోవడం వరకు ‘స్వతంత్రంగా ఉండడం’ అనే లక్షణాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. దీనివల్ల ఆమె చాలామందికి‘రెబెల్’గా కనిపించేది. ‘ఏదైనా చేయాలి. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’ అనే లక్ష్యాన్ని కాలేజీ రోజుల్లోనే నిర్దేశించుకుంది మల్హోత్రా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువు పూర్తయిన తరువాత ఫ్యాషన్ కంపెనీ ‘బెనెటన్’తో ప్రొఫెషనల్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. నైకీ, ప్లానెట్ స్పోర్ట్స్‌లో కూడా అద్బుతమైన ఇన్నింగ్స్‌ను ప్రదర్శించింది. స్థూలంగా చెప్పాలంటే ఫ్యాషన్, లైఫ్ స్టైల్ జైనింగ్లలో ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంది. 2007లో ఎథికల్ బ్యూటీబ్రాండ్ ‘ది బాడీ షాప్’లో చేరింది. ఇది తన ప్రయాణ గతిని మార్చేసింది. రిటైల్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్లలో అడుగుడుగునా పురుషాధిక్యత కనిపించే కాలంలో మహిళలు అడుగు వేసి నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ‘వేరే వారి కంటే ఒక మెట్టుకింద ఉండడానికి నేను ఎప్పుడూ ఇష్టపడలేదు. సవాలుగా తీసుకున్నాను. రెట్టింపు కష్టపడ్డాను’ అంటుంది మల్హోత్రా. ఆ కాలంలో బ్యూటీప్రొడక్ట్స్కు సంబంధించిన రిటైల్ బిజినెస్ ఫార్మసీ, డిపార్ట్మెంటల్ స్టోర్లలో మాత్రమే కనిపించేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జీరో నుంచి ప్రయాణంప్రొరంభించాను’ అంటుంది మల్హోత్రా. ‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’ అనే సన్నాయి నొక్కుల నుంచి ‘ఈ రంగంలో పెద్ద పేరున్న మహిళ’ అనే ప్రశంస వరకు శృతి మల్హోత్రా ఎంతో ప్రయాణం చేసింది. ఎన్నో పాఠాలు నేర్చింది. ఎందరికో గుణపాఠాలు చెప్పింది. ‘క్వెస్ట్ రిటైల్’ గ్రూప్ సీయీవోగా ఎంతో పేరు తెచ్చుకుంది. ‘శృతి మల్హోత్రా సీయీవో మాత్రమే కాదు ఎన్నో బ్రాండ్స్‌ను విజయవంతం చేసిన డ్రైవింగ్ ఫోర్స్’ అంటాడు ఫ్యాషన్ కంపెనీ లకొస్టే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీయీవో రాజేష్ జైన్. తన సక్సెస్‌కు కారణం తల్లిదండ్రులు అని చెబుతుంది మల్హోత్రా. చదువు చెప్పించడం నుంచి కలల సాధనలో వెన్నుదన్నుగా నిలవడం వరకు వారి పాత్ర ఎంతో ఉందని చెబుతోంది. ‘వృత్తి జీవితంలో ఎంతోమంది మేల్ కొలీగ్స్‌తో పనిచేశాను. ఎప్పుడూ ఎవరితోటీ సమస్య రాలేదు. పురుషులతో సమానంగా స్త్రీలకు అవకాశం లేకపోవడమే అసలు సమస్య. మహిళలకు సమానావకాశాలు కల్పించడం విషయంలో ఎన్నోసార్లు పోరాడాను’ అంటుంది మల్హోత్రా. ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ముఖ్యం కాదు. మీరు ఎక్కడికి వెళుతున్నారన్నది ముఖ్యం’అనేది శృతి మల్హోత్రాకు ఇష్టమైన మాట. ఇవి చదవండి: Sagubadi: మార్కెట్‌ను బట్టి సేద్యం! ఆపై నేరుగా ప్రజలకే అమ్మకం.. -
ఫైనల్లీ.. తన క్రష్ ఎవరో బయటపెట్టిన రష్మిక!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. యానిమల్ మూవీతో రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటీని దక్కించుకున్న రష్మిక.. స్టార్ హీరోలకి మించిన ఫాలోయింగ్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. వరుస హిట్స్‌తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది. అటు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తెగ బిజీగా మారిపోయిందీ బ్యూటీ. ఇక రష్మిక అండే పడి చచ్చే అభిమానులు ఎంతో మంది ఉంటారు. మరి రష్మిక క్రష్ ఎవరో తెలుసా? ఈమధ్యే తన క్రష్‌ని బయటపెట్టింది రష్మిక. సాంప్రదాయ చీరకట్టు అంటే తనకెంతో ఇష్టమని, ఫ్యాన్స్ ఆ ఇష్టాన్ని మరింత పెంచేశారు అంటూ రీసెంట్‌గానే చెప్పుకొచ్చింది. ఇక యానిమల్ ప్రమోషన్స్‌లోనూ దాదాపు చీరకట్టులోనే కనిపించింది ఈ బ్యూటీ. సాంప్రదాయంగా కనిపిస్తూనే ఫ్యాషన్ ట్రెండ్‌ను సెట్ చేయడంలో తగ్గేదేలే అంటుంది రష్మిక. ఇక తన దుస్తుల్లో స్ట్టన్నింగ్గా కంటే కంఫర్ట్‌గా ఉండటాన్నే ఇష్టపడతాను. అందుకే కంఫర్ట్‌గా ఉండే ఔట్ఫిట్సే నా ఫ్యాషన్ స్టయిల్ అంటూ రివీల్ చేసింది. తాజాగా ప్రమోషన్స్‌లో గులాబీ రంగు చీరలో తళుక్కుమంది ఈ బ్యూటీ. ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన ఈ చీర ధర అక్షరాలు రూ. 1,90,000లుగా ఉంది. -
రాశీఖన్నా ధరించిన ఈ డ్రెస్ అన్ని లక్షలా? అంత ఏముందో!
అందం, అభినయాలతో ఆకట్టుకున్న కథానాయిక రాశీ ఖన్నా. ఫిట్నెస్ మీద ఎంత స్పృహతో ఉంటుందో దాన్ని ఎలివేట్ చేసే ఫ్యాషన్ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉంటుంది. ఆ స్టయిలిష్ స్టార్ అభిరుచికి అద్దం పడుతున్న బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. ప్రతిభను నమ్ముకోవాలి ఎలాంటి సినీ నేపథ్యం, ఎవరి అండా లేకుండానే ఈ ఫీల్డ్‌లోకి ఎంటరయ్యా. నటిగా మంచి పేరు సంపాదించుకున్నా! మనకున్న నేపథ్యం.. ఫీల్డ్‌లోకి ఎంటర్ అవడానికి ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుందేమో కానీ చాన్స్‌లు అందించేది మాత్రం మనలోని ప్రతిభే! అందుకే ప్రతిభను నమ్ముకోవాలి! – రాశీ ఖన్నా జ్యూలరీ బ్రాండ్: మాయా సాంఘ్వీ జ్యూయెల్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. మాయా సాంఘ్వీ జ్యూయెల్స్.. అతి ప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో ‘మాయా సాంఘ్వీ జ్యూయెల్స్’ ఒకటి. 1994లో ప్రారంభమైన ఈ దేశీ బ్రాండ్ నేడు అంత్జాతీయ స్థాయికి ఎదిగింది. సంస్కృతీసంప్రదాయ డిజైన్స్‌తోపాటు ఆధునిక డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాల్లోని ఔట్‌లెట్స్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ లభ్యం. శాంతి బనారస్.. సంప్రదాయ బనారస్‌కు పాశ్చాత్య మెరుగులు అద్దడంలో ‘శాంతి బనారస్’ శైలే వేరు. అంతేకాదు అల్లికలు, కుందన్ వర్క్స్‌తో అందమైన డిజైన్స్ రూపొందించడంలోనూ ఈ బ్రాండ్ ఫేమస్. ఈ డిజైన్స్‌కు విదేశాల్లోనూ డిమాండ్ ఎక్కువే. అయినా సరసమైన ధరల్లోనే లభిస్తాయి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ చీర డిజైనర్: శాంతి బనారస్ ధర: రూ. 1,40,000 ∙దీపిక కొండి -
వింటర్ సీజన్‌కి ప్రత్యేకంగా స్టైలింగ్.. వివాహ వేడుకల్లో అట్రాక్షన్
వివాహ వేడుకలలో కట్టే చీరలే దివ్యంగా వెలిగిపోతుంటాయి. ఇక వాటికి అదనంగా మరో స్టయిల్‌ను కూడా జోడిస్తే.. ఆ వెలుగులు రెట్టింపు అవుతాయి. పట్టు, వెల్వెట్, ఎంబ్రాయిడరీ దుపట్టా చీర మీదకు ధరించినా, డ్రేపింగ్‌లో జత చేసినా ఆ స్టైల్ హుందాగా కనిపిస్తుంది. ఈ వింటర్ సీజన్‌కి ప్రత్యేకంగా ఉండటమే కాదు చలి నుంచి రక్షణను కూడా ఇస్తుంది. ఎవర్‌గ్రీన్‌గా ఉండే శారీ కట్టుకి మహారాణి కళను లె చ్చే దుపట్టా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. కాంట్రాస్ట్ శారీ కలర్, దుపట్టా కలరా పూర్తి కాంట్రాస్ట్ ఉన్నది ఎంచుకోవాలి. దీనివల్ల రెండూ భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. శాలువా స్టైల్ చీర మీదకు దుపట్టాను శాలువా మాదిరి కప్పుకున్నా ఈ సీజన్‌కి వెచ్చగా, బ్రైట్‌గా ఉంటుంది. అయితే, దుపట్టా గ్రాండ్‌గా ఉన్నది ఎంచుకోవాలి. ఇందుకు పట్టు, బ్రొకేడ్, ఎంబ్రాయిడరీ దుపట్టాలను చీరలను ఎంపికను బట్టి తీసుకోవాలి. డ్రేపింగ్ దుపట్టా చీరకట్టులో భాగంగా దుపట్టాను జత చేర్చి కట్టడం ఒక స్టైల్. ఈ కట్టును నిపుణుల ఆధ్యర్యంలో సెట్ చేయించుకోవాలి. ఈ కట్టుకు కూడా కాంట్రాస్ట్ కలర్స్ ఉండేలా చూసుకోవాలి. రంగు ఒకటే... డిజైన్ వేరు సేమ్ కలర్ శారీ దుపట్టాను ఎంచుకున్నా ఎంబ్రాయిడరీ డిజైన్‌లో కాంబినేషన్స్ చూసుకోవాలి. చీర డిజైన్ హెవీగా ఉంటే, దుపట్టా డిజైన్ బ్రైట్‌గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. పట్టు శారీ మీదకు డిజైనర్ దుపట్టాను ఎంచుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. -
అమ్మ లిప్‌స్టిక్, అమ్మమ్మ చీరలతో యంగ్ ఎంట్రప్రెన్యూర్‌గా..
జీవితంలో ఇది అవ్వాలి! అది అవ్వాలి! అని కలలు కంటుంటాము. కొంతమంది కలలు మాత్రమే నిజం అవుతాయి. కొంతమంది పరిస్థితులకు తలొగ్గి ఇష్టం లేకపోయినా సర్దుకుపోయి బతికేస్తుంటారు. హిమాద్రి పటేల్ మాత్రం ఈ కోవకు చెందిన అమ్మాయి కాదు. ఇక ఇంతేలే అని సరిపెట్టుకోకుండా తను అనుకున్నది సాధించేందుకు అందర్ని ఒప్పించి, కష్టపడి.. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా కంటెంట్ క్రియేటర్, ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది. డెహ్రాడూన్‌కు చెందిన 26 ఏళ్ల హిమాద్రి పటేల్ చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేది. మేకప్ అంటే ఎంతో ఆసక్తి. అమ్మ వాడే లిప్‌స్టిక్ రాసుకుని తనని తాను అద్దంలో చూసుకుని తెగ మురిసిపోతుండేది. ఎప్పుడూ నలుగురిలో ప్రత్యేకంగా ఉండేందుకు తాపత్రయ పడేది. ఇంటర్మీడియట్లో ఉండగానే జాతీయ, అంతర్జాతీయ మేకప్ ట్యుటోరియల్స్ చూసి మెకప్ మెళుకువలు నేర్చుకుంటుండేది. ఇలా నేర్చుకుంటూ తను కూడా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంది. కానీ దానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈలోపు ఇంటర్మీడియట్ పూర్తయింది. తరువాత ఫ్యాషన్‌ను కెరీర్‌గా మలచుకోవాలనుకుంది. తల్లిదండ్రులు ఇంజినీరింగ్ చేయమని చె΄్పారు. ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులను నొప్పించలేక కంప్యూటర్ సైన్స్‌లో చేరింది. బీటెక్ చదువుతున్నప్పటికీ మేకప్ మెళకువలు నేర్చుకుంటూనే ఉంది. ఇన్ఫోసిస్‌ను వదిలి ఇన్ఫ్లుయెన్సర్గా... బీటెక్ చదువుతున్నప్పటికీ మనసు యూట్యూబ్‌పైనే ఉండడంతో మరోసారి తల్లిదండ్రులను యూట్యూబ్ ఛానల్ పెడతానని అడిగింది. అయినా ఒప్పుకోలేదు. అప్పుడు హిమాద్రి అక్క... ‘‘ఛానల్‌ను పెట్టనివ్వండి. ఆమెకు మూడు నెలలు సమయం ఇద్దాం. ఆలోపు తనని తాను నిరూపించుకుంటే ఒకే. లేదంటే మనం చెప్పినట్టు చేస్తుంది’’ అని తల్లిదండ్రులను ఒప్పించింది. దీంతో హిమాద్రి పటేల్ పేరుతోనే యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. ఒక లిప్‌స్టిక్, ఐలైనర్‌తో ఛానల్లో వీడియోలు పోస్టుచేయడం ప్రారంభించింది. అందంగా కనిపించేందుకు ఎటువంటి హానీ లేని మేకప్‌ను ఎలా వేసుకోవాలో చెబుతూ వీడియోలు పోస్టుచేసేది. ఎక్కువగా నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారాలు చెబుతుండడంతో తన ఛానల్‌కు మంచి ఆదరణ లభించింది. మరోపక్క బీటెక్ ఫైనల్ ఇయర్లోకి వచ్చింది. క్యాంపస్ సెలక్షన్స్‌లోనూ మంచి ప్రతిభచూపి ఇన్ఫోసిస్, క్యాప్జెమినీలలో ఉద్యోగం సంపాదించింది. అయినా హిమాద్రికి పెద్ద సంతోషంగా అనిపించలేదు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదింటివరకు చేసే సాంప్రదాయ ఉద్యోగం చేయడం తనకి నచ్చలేదు. తల్లిదండ్రులు ఇన్ఫోసిస్‌లో చేరమని చెప్పారు. కానీ తను యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతానని చెప్పింది. అప్పటికే హిమాద్రి మీద నమ్మకం ఉన్న తల్లిదండ్రులు యూట్యూబర్‌గా కొనసాగడానికి ఒప్పుకున్నారు. అప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్ వివిధ రకాల సరికొత్త కంటెంట్‌ను అప్లోడ్ చేస్తూ సంపాదిస్తూ, ఎక్కువమంది ఫాలోవర్స్‌తో.. బ్యూటీ, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా పాపులర్ అయ్యింది. అమ్మమ్మ చీరలుచూసి... హిమాద్రి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ కట్టుకునే చీరలను జాగ్రత్తగా గమనించేది. నిమిషంలో కుచ్చిళ్లు పెట్టుకుని అందంగా చీరకట్టుకుని సైకిల్ తొక్కేది అమ్మమ్మ. అంతేగాక చీరలకు తనే స్వయంగా డిజైన్లు కుట్టుకోవడం, ఇంట్లో అందరికి స్టోల్స్ అల్లడాన్ని చూసి పెరిగిన హిమాద్రి అలాంటి బట్టలనే మార్కెట్లో విక్రయించాలనుకుని..‘డ్రై బై హిమాద్రి’ పేరిట క్లాత్ బ్రాండ్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బ్రాండ్ ద్వారా అత్యంత నాణ్యమైన, సాంప్రదాయ దుస్తులను విక్రయిస్తోంది. అలనాటి డిజైన్ చీరలు, డ్రెస్‌లను భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా హిమాద్రి దూసుకుపోతోంది. గౌరవంగా... డ్రై (ఈఖఐ) అంటే సంస్కృతంలో గౌరవం అని అర్థం. అమ్మాయిలు, మహిళలు ధరించే చీరలు, డ్రెస్‌లు ఏవైనా గౌరవించేలా వారి కట్టుబొట్టు ఉండాలి. అందుకు తగ్గట్టుగా సాంప్రదాయ వస్త్రాలను తయారు చేసి విక్రయిస్తోంది హిమాద్రి. వ్యాపార రంగంలో ఎటువంటి అనుభవమూ లేదు. కుటుంబం నుంచి వచ్చిన తొలివ్యాపారి కావడంతో హిమాద్రి అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. వివిధ రకాల చిక్కులను తన అక్క సాయంతో ఎదుర్కొంటూ.. చిన్నచిన్న వేడుకల నుంచి వెడ్డింగ్ డ్రెస్‌ల వరకు అన్ని వస్త్రాలను రూపొందించి డ్రైబ్రాండ్కు గుర్తింపు తెచ్చుకుని యంగ్ ఎంట్రప్రెన్యూర్లకు ప్రేరణగా నిలుస్తోంది. ఐదు గంటలకు పడుకునేవాళ్లం అక్కా నేను రాత్రంతా మేలుకుని చేయాల్సిన పనిగురించి పరిశోధించి, వివరంగా తెలుసుకుని పేపర్ వర్క్ పూర్తిచేసేవాళ్లం. లీగల్ విషయాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి తెల్లవారుజామున ఐదు గంటలకు పడుకునేవాళ్లం. అలా అన్నివిధాలా సన్నద్దమయ్యాక అంటే రెండేళ్ల తరువాత డ్రై బ్రాండ్‌ను గతేడాది అక్టోబర్‌లో తీసుకొచ్చాం. ఆర్థికంగా ఎవరూ సాయం చేయలేదు. యూట్యూబ్, కంటెంట్ బిజినెస్ ద్వారా వచ్చిన ఆదాయంతో దాచుకున్న డబ్బులనే డ్రై బ్రాండ్‌కు పెట్టుబడిగా పెట్టుకున్నాను. ప్రారంభంలో పెద్దగా ఆర్డర్లు ఏమీ రాలేదు. నెల తరువాత ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. అలా వచ్చిన ఆర్డర్లతో పెట్టుబడికి కొంత, మిగతాది వర్కర్లకు జీతాలకు ఇచ్చేదాన్ని. అలా చేస్తూ ఇప్పుడు కాస్త లాభాలు ఆర్జిస్తున్నాను. – హిమాద్రి పటేల్ -
అదిరేటి డ్రెస్సు.. యూనిక్ డ్రెస్సింగ్ స్టైల్
-
ఫ్యాషన్ టాక్: స్టైలు మారింది, డిజైన్ అదిరింది
డ్రెస్సింగ్‌లో ఎప్పుడూ యునిక్‌గా ఉండాలనే ఆలోచన నేటి యూత్‌ది. వారి అభిరుచికి తగినట్టుగా అందుబాటులోకి వచ్చింది. వన్‌సైడ్ లాంగ్ స్టయిల్. టాప్ లేదా కుర్తీ ఒక వైపు పొడవుగా, మరోవైపు పొట్టిగా ఉండటం ఈ స్టయిల్ ప్రత్యేకత. రెండు రంగులు భిన్నం కావచ్చు. రెండు ఫ్యాబ్రిక్స్ కూడా వేర్వేరువి అయి ఉండవచ్చు. కుర్తా లేదా టాప్ డిజైన్‌లో ప్రత్యేకత కనిపించాలంటే ఓ చిన్న మార్పు తీసుకురావాలి. డిజైనర్స్ చేసిన ఓ చిన్న ఆలోచన యూత్‌ని మరింతగా ఆకట్టుకుంటుంది. వెస్ట్రన్ నుంచి ఇండియన్ వేర్‌లోకి ఈ డిజైన్ కొత్తగా ఆకట్టుకుంటోంది. వెస్ట్రన్ పార్టీలో ప్రత్యేకతను చాటడమే కాదు, స్ట్రీట్ స్టయిల్గానూ మార్కులు కొట్టేస్తోంది ఈ డిజైన్. -
గడ్డిదారంతో దుస్తులు.. పట్టుపురుగులొద్దు, పత్తి వద్దు. పాలిస్టర్ వద్దు
‘పట్టు కోసం పట్టుపురుగుల ్రపాణాలు తీయవద్దు. పత్తి కోసం రైతులు కష్టాలను కొని తెచ్చుకోవద్దు. మట్టిలో కలవడానికి మొరాయిస్తుంది పాలియెస్టర్. ఆ దుస్తులతో పర్యావరణానికి హాని కలిగించద్దు.గడ్డి దారంతో ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్ తీసుకువద్దాం.స్టైల్ స్టేట్మెంట్కి కొత్త నిర్వచనం ఇద్దాం’... ...అంటోంది నేచర్ లవర్ శృతి రావల్. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన శృతి అంతర్జాతీయ సదస్సులో తన పరిశోధన పత్రాన్ని సమర్పించింది. పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే తన సంకల్పానికి వస్త్ర ప్రపంచాన్ని వేదికగా మార్చుకుందామె. ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పట్ల తన ఆసక్తిని సాక్షితో పంచుకున్నదీ యువతి. ఫ్యాషన్ – పర్యావరణం ‘‘నేను పుట్టింది హరియాణాలోని పంచకుల. అమ్మ పుట్టిల్లు పంజాబ్. నాన్నది హరియాణా. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చేటప్పటికి నేను సిక్తŠస్ క్లాస్‌లో ఉన్నాను. ఇక నా చదువు, కెరీర్ అంతా హైదరాబాద్‌తోనే ముడివడిపోయింది. ఫ్యాషన్ ప్రపంచాన్ని బాగా అధ్యయనం చేసే కొద్దీ ఈ ఇండస్ట్రీ నుంచి పర్యావరణానికి కలిగే హాని అర్థమైంది. చాలా ఆందోళన కలిగింది. మన వస్త్రాల మోజు భూమిని అతలాకుతలం చేస్తోంది. భూమాతను కలుషితం చేస్తున్న ఇండస్ట్రీలలో ఫ్యాషన్ ఇండస్ట్రీ రెండవది. దీనికి పరిష్కారం ఈ రంగంలోనే వెతకాలనిపించింది. పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాన్ని చూపించాలనేదే నా ప్రయత్నం. నా స్టూడియోకి ‘ఎవోక్’ అని పేరు పెట్టడంలోని ఉద్దేశం కూడా పర్యావరణం పట్ల నిద్ర మేల్కొనండి’ అని పిలుపునివ్వడం. రిస్క్ అని హెచ్చరించారు! ఎవోక్ ్రపాజెక్ట్ నా బ్రెయిన్ చైల్డ్. ఈ ఎకో ఫ్రెండ్లీ క్లోతింగ్ స్టూడియోని 2020 మార్చిలో ్రపారంభించాను, అదే నెలలో లాక్డౌన్ మొదలైంది. ఆ మెటీరియల్‌తో మాస్కులు చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి విరాళంగా ఇచ్చాను. ఈ ్రపాజెక్టు ్రపారంభానికి ముందే... ‘రిస్క్ చేస్తున్నావు’ అన్నారు తెలిసిన వాళ్లందరూ. పర్యావరణ పరిరక్షణ గురించి దశాబ్దాలుగా చెప్తున్నా కూడా సమాజంలో తగినంత చైతన్యం రానేలేదు. ఈ గడ్డి దుస్తుల గురించి అసలే తెలియదు. రంగు భరోసా, వస్త్రం మన్నిక ఉంటుందని కూడా తెలియదు. అలాంటప్పుడు మార్కెట్ ఎలా? పెట్టుబడి వెనక్కి వచ్చేదెప్పటికి? అన్నారు. అందరూ అలా అనుకుని తమను తాము సేఫ్జోన్లో ఉంచుకుంటే చాలా? బాగా లాభాలు వచ్చే రంగాన్నే ఎంచుకోవాలనే స్వార్థం తప్పు కాదు. కానీ లాభాల కోసం కొన్నేళ్లపాటు ఎదురు చూడగలిగిన ఆర్థిక పరిపుష్టి ఉన్నవాళ్లయినా ఒక ప్రయత్నం చేయాలి. ఇరవై ఏళ్ల కిందట ఎవరూ ముందుకు రాకపోతే మనం ఈ రోజు ఎలక్ట్రానిక్ వెహికల్‌ను వాడగలిగేవాళ్లమా? అలాగే వీగన్ డైట్ గురించి కూడా ఎంతోమంది సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చైతన్యవంతం చేశారు. నేను కూడా గత నెల 23వ తేదీన హెంప్, బెంబెర్గ్, టెన్సెల్, సిట్రస్ పీల్ వస్త్రాలతో రూపొందించిన డిజైనర్ వేర్‌తో ఫ్యాషన్ పెరేడ్ నిర్వహించాను. ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉద్యమంలో మమేకమయ్యే క్రమంలో నేను వెజిటేరియన్‌గా మారిపోయాను’’ అని చెప్పింది శృతి. ‘భవిష్యత్తులో మనం ప్రతి విషయంలోనూ పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సిందే. అందులో భాగంగా నేను నా ఫ్యాషన్ రంగాన్నే మాధ్యమంగా ఎంచుకున్నాను’ అని చె΄్పారు శృతి రావల్. ఆకులతో దారం ! ఒక రైతు పొలం దున్ని పత్తి పంట వేసి ఒక కేజీ పత్తి పండించాలంటే ఇరవై వేల లీటర్ల నీరు కావాలి. ఒక టెక్స్టైలర్ ఒక టీ షర్టుకి రంగులద్దడానికి రెండున్నర వేల లీటర్ల నీరు కావాలి. పత్తి పండడానికి పట్టే నీటిని భూమి పీల్చుకుంటుంది, ఇది కొంతలో కొంత నయం. కానీ హాట్ డైయింగ్ పద్ధతిలో రసాయన రంగులద్దిన నీరు భూమిని కలుషితం చేస్తుంది. అందుకే నేను గడ్డి మొక్కల దారంతో వడికిన వస్త్రాలను పరిచయం చేస్తున్నాను. మనదేశంలో ఇలాంటి సంస్థలు నాలుగైదుకి మించిలేవు. ఇక పూర్తి స్థాయి హెంప్ (నార) క్లోతింగ్ స్టూడియో హైదరాబాద్‌లో ఇదొక్కటే. ఆకులను శుభ్రం చేసే ్రపాసెస్లో బూజు పట్టకుండా సహజసిద్ధమైన వనరులనే జత చేస్తారు. ఎండిన ఆకులతో దారం వడుకుతారు. మొక్కల ఆకుల దారంతో వస్త్రాలు తయారు చేసే పరిశ్రమలు మనదేశంలో రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లో మాత్రమే ఉన్నాయి. ఈ గడ్డి రకం మొక్కలు పత్తిలాగ ఎక్కువ నీటిని తీసుకోవు, పత్తికంటే త్వరగా పెరిగి చేతికి వస్తాయి. వీటి పరిరక్షణ కోసం శ్రమించాల్సిన అవసరం ఉండదు. ఈ దారం ఇప్పుడు చైనా నుంచి దిగుమతి అవుతోంది. ఈ దుస్తులు ఎలా ఉంటాయోననే ఆందోళన అక్కర్లేదు. నేను ధరించింది హెంప్ వీవింగ్ డ్రస్సే. క్లాత్ మీద డిజైన్లు నేను రూపొందించి డిజిటల్ ప్రింట్ చేయిస్తాను. కోల్డ్ డై కలర్స్ కాబట్టి క్లాత్‌తోపాటు ఎక్కువ కాలం మన్నుతాయి. – శృతి రావల్, ఫౌండర్, ఎవోక్ స్టూడియో,హైదరాబాద్ - – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సూత్ర ఎగ్జిబిషన్లో మోడల్స్ సందడి.. ( ఫొటోలు)
-
బ్యూటిఫుల్ సక్సెస్ మంత్ర
సక్సెస్ ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఎందుకంటే అది ఆనందాన్నిస్తుంది కాబట్టి. ఆనందాలు మళ్లీ మళ్లీ కావాలి... కొత్త కొత్త రూపాల్లో రావాలి... ఇదీ సంగీతారాజేశ్ ఆకాంక్ష. స్పెషల్ ఎడ్యుకేషన్‌లో నిస్వార్థసేవ. ఫ్యాషన్ ఇండస్ట్రీకి కొత్త నడక. బ్యూటీ ఇండస్ట్రీ అధ్యయనం. మహిళలకు మార్కెట్ పాఠాల బోధన. అన్నింటిలో రాణిస్తున్న... ఆమె ‘సక్సెస్ మంత్ర’ ఏమై ఉంటుంది? ఓ ముప్పై– నలభై ఏళ్ల కిందట... ‘ఇది ఇంపోర్టెడ్ శారీ, మా అన్న సింగపూర్ నుంచి తెచ్చాడు’ అని ఒకరు హోదా ఒలకబోసేవారు. ‘నాది కూడా ఇంపోర్టెడే. ఫలానా నగరంలో స్మగుల్డ్ గూడ్స్ దొరుకుతాయి’ అని మరొకరు... మీకు నేనేమీ తీసిపోను అన్నంత ధీమాగా. అప్పట్లో ఇలా నడిచేవి సగటు మహిళల కబుర్లు. వాళ్లలో ఎవరికీ స్మగుల్డ్ గూడ్స్ కొనడం చట్టరీత్యా నేరమనే విషయం తెలియదు కూడా. సింథటిక్ మోజుతోపాటు ఇలాంటి హోదాల ప్రదర్శనలో మన సంప్రదాయ వస్త్రాలు తెరమరుగయ్యాయి, క్రమంగా వస్త్రాల తయారీదారులు కనుమరుగవడం కూడా మొదలైంది. అలాంటి సమయంలో గ్లోబలైజేషన్ రూపంలో వచ్చింది ఓ పెనుమార్పు. మన చేనేతలకు విదేశాల్లో అందుతున్న గౌరవాలను స్వయంగా చూసిన మన మహిళలే మన సంప్రదాయ చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్లయ్యారు. నిర్లిప్తంగా మిగిలిపోయిన చేనేత, హస్తకళాకారుల వైపు చూసింది భారతీయ ఫ్యాషన్ ఇండస్ట్రీ. అలాంటి సమయంలో పెన్ కలంకారీని పునరుద్ధరించడానికి స్వచ్ఛందంగా సేవ చేశారు సంగీతా రాజేశ్. అంతకంటే ముందు ఆమె పిల్లల చదువు వారి మానసిల్లోసానికి, మే«ధావికాసానికి దోహదం చేయాలి తప్ప బడి అంటే భయపడేలాగ ఉండకూడదని స్పెషల్ కిడ్స్ కోసం ప్రత్యేకమైన కరిక్యులమ్ తయారు చేశారు. పిల్లల్లో మేధావికాసానికి మన తాతమ్మల నుంచి ఇంట్లో ఆడుకున్న బోర్డ్‌గేమ్స్ దోహదం చేస్తాయని ఆచరణ లో చూపించారామె. సోషల్ మీడియా లో లక్షలాది ఫాలోవర్లున్న ఇన్ఫ్లూయెన్సర్ కూడా. ఇప్పుడు తాజాగా ‘మనిషిని సమాజంలో ఆత్మవిశ్వాసం తో ముందుకు నడిపించే సాధనం అందంగా కనిపించడం కూడా’ అని మరో ప్రయోగానికి తెర తీశారు. ♦ స్పెషల్ పాఠాలు ‘‘నేను మధురైలో పుట్టాను, దిండిగల్‌లో పెరిగాను. హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబంలోని అబ్బాయితో పెళ్లయింది. అలా పాతికేళ్ల కిందట హైదరాబాద్‌కి వచ్చాను. నేను స్పెషల్ ఎడ్యుకేటర్ని, స్పెషల్ చిల్డ్రన్‌కి స్పీచ్ థెరపీ, వాళ్లకు కాన్సెప్ట్ అర్థమయ్యేటట్లు టీచింగ్ మెటీరియల్, ప్రత్యేకమైన టీచింగ్ మెథడాలజీతో క్లాసులు చెప్పి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ పరీక్షలు రాయించి మెయిన్ స్ట్రీమ్‌కి పంపించడం నా బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్. అందులో బిజీగా ఉన్నప్పుడు కలంకారీ మీద ఆసక్తి కలిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో నిష్ణాతులు చేసే పెన్ కలంకారీ మీద అధ్యయనం చేశాను. వాళ్ల చేతిలో కళ ఉంది, నా దగ్గర సృజన ఉంది. ఆ రెండింటినీ కలుపుతూ కొత్త ప్యాటర్న్స్ తెచ్చాం. వాటి ఖరీదు ఎక్కువే. కానీ ఒక చీర అమ్మగలిగానంటే దానిని తయారు చేసిన కుటుంబం నెలంతా ఆకలి లేకుండా జీవించగలుగుతుంది. పెన్ కలంకారీని ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాను. వీవర్స్‌కి ప్రయోజనం కల్పించడంలో నా లక్ష్యం నెరవేరింది. ఆ తర్వాత చాలామంది ఇదే పంథాను అనుసరించారు. పెన్ కలంకారీ కళాకారుడికి సూచనలు ఇస్తూ... ♦ పంచడానికే జ్ఞానం! నేను ప్రధానంగా టీచర్ని కావడంతో నాకు తెలిసిన, నేను తెలుసుకున్న విషయాలను నాలో దాచుకోలేను. జ్ఞానం ఉన్నది పలువురికి పంచడానికే అన్నట్లు ఉంటాను. వినడానికి నా ఎదురుగా ఎవరూ లేకపోతే ఫేస్బుక్లో చెబుతాను. అలా తొమ్మిదేళ్ల కిందటే నేను ఎఫ్బీ వేదికగా కాస్ట్యూమ్ ప్రజెంటేషన్ ఇచ్చాను. కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. నాకు అప్పటికే ఎనిమిది లక్షల ఫాలోవర్లున్నారు. ఆ టైమ్‌లో నాకు అసలైన చాలెంజ్ నా వ్యాపారాన్ని కొనసాగించడం కాదు, నా ఉద్యోగులకు జీతాలివ్వడం. రెండు వారాలు మినహా మిగతా కోవిడ్ సమయమంతా పని చేశాను. అప్పుడు షోరూమ్‌లు, మాల్స్‌లో జనం కనిపించలేదు, కానీ ఆన్లైన్లో చాలా ఎక్కువగా కొనుగోళ్లు చేశారు. ♦ అదే నా సక్సెస్ సూత్ర నేను కోవిడ్ టైమ్‌లో సూరత్, జైపూర్‌కు వెళ్లి అక్కడి నుంచి లైవ్‌లో డిస్ప్లే చేశాను. గంటల్లోనే కొనుగోళ్లు జరిగాయి. స్టాక్ అక్కడి నుంచే నేరుగా డెలివరీ ఇచ్చేశాను. ఒక రవాణా ఖర్చు, ఒక స్టేట్ జీఎస్టీ తగ్గిపోతే ఎంత ఆదానో ఆలోచించండి. విదేశాలకు వెళ్లాల్సిన స్టాక్ ఆగింది, మార్కెట్ చేసి పెట్టమని అడిగిన వాళ్ల స్టాక్‌ను ఆన్లైన్లో అమ్మేశాను. దాంతో స్టాక్ కొనుగోలుకు డబ్బు పెట్టాల్సిన అవసరం రాలేదు. అటు ఉత్పత్తిదారులు, నేను– నా ఉద్యోగులు, వినియోగదారులు... అందరికీ ప్రయోజనమే. అందుకే విన్ విన్ డీల్ ఎప్పుడూ సక్సెస్ అవుతుందని నమ్ముతాను. గృహిణులు కొంతమంది ఇంట్లోనే చిన్న స్థాయిలో దుస్తులు, ఇతర ఇంటికి అవసరమైన వస్తువుల వ్యాపారం చేస్తున్నారు. కానీ అదంతా అవ్యవస్థీకృతంగా ఉంది. అలాంటి హోమ్ సెల్లర్స్‌ను ఒక వేదిక మీదకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఔత్సాహిక మహిళలకు బోధన తరగతులలో పాఠాలు చెప్తున్నాను. వ్యాపారం కోసం ఓ సొంత ఫోన్ నంబరు, బ్యాంకు అకౌంట్ నిర్వహణ, ఆన్లైన్ లావాదేవీలలో శిక్షణ, మార్కెట్ మెళకువలతోపాటు డెడ్స్టాక్ను ఎలా డీల్ చేసే సులువు కూడా నేర్పిస్తున్నాను. హోమ్ సెల్లర్స్ చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే... స్నేహితులు, బంధువులలో కస్టమర్లను వెతుక్కోవడం. ఆ పొరపాటు వల్ల స్నేహితులు, బంధువులు దూరమవుతారు తప్ప, లాంగ్ టర్మ్ కస్టమర్లను ఏర్పరుచుకోవడం సాధ్యం కాదు. ప్రొఫెషన్నీ, కుటుంబ బంధాలను కలపకూడదు’’ అని తాను నేర్చుకున్న, అనుసరించిన సక్సెస్ సూత్రను వివరించారు సంగీతారాజేశ్. స్పెషల్ చాలెంజ్ ఫ్యాషన్ ఇండస్ట్రీని బాగా అధ్యయనం చేశాను, కాబట్టే బ్యూటీకి ఉన్న ఆదరణ, మేకోవర్ అవసరాన్ని కూడా తెలుసుకోగలిగాను. ఫ్యాషన్, బ్యూటీ... ఈ రెండూ ఒకదానితో ఒకటి కలగలిసి ఉంటాయి. అందం అనేది మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే సాధనం. మరి అలాంటప్పుడు అందాన్ని పెంచుకోవడానికి ఎన్నెన్నో అధునాతన సాధనాలు అందుబాటులోకి వచ్చిన నేటి తరుణంలో అందంగా కనిపించడం అనే ఆకాంక్షకు ఎవరైనా ఎందుకు దూరంగా ఉండాలి? నేను వయసులో ఉన్నప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీతో పరుగులు పెట్టాను, రిటైర్మెంట్ లేకుండా ఒకచోట స్థిమితంగా ఉంటూ నిర్వహించుకోవడానికి ఇప్పుడు కొత్త కెరీర్లోకి అడుగుపెట్టాను. ఇందులో కూడా సక్సెస్ అయ్యి, మరో ఐదేళ్లలో కొత్త తరానికి పాఠాలు చెప్పే స్థాయికి చేరుతాను. నేను కెరీర్ రోల్స్ ఎన్ని మార్చినా స్పెషల్ ఎడ్యుకేటర్ రోల్లో కొనసాగుతూనే ఉంటాను. – సంగీతారాజేశ్, స్పెషల్ ఎడ్యుకేటర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కట్టుకున్న ఈ చీర ధర ఎంతంటే?
‘చిటియా కలైయా వే.. ఓ బేబీ మెరీ చిటియా కలైయా వే’ అనే ఈ హిందీ (‘రాయ్’ సినిమా) పాట భాషాకతీతంగా ఎంత హిట్టో తెలియని సినీ ప్రేక్షకుల్లేరు. అలాగే ఆ పాట మీద డాన్స్ చేసిన ఆ మూవీ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రతిభ గురించి కూడా పరిచయం లేని అభిమానుల్లేరు. ఇక జాక్వెలిన్ స్టైల్ గురించి, ఫ్యాషన్‌లో ఆమెకున్న అభిరుచి, ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను తెలిపే బ్రాండ్స్ ఏంటో చూద్దామా ! 'నా దృష్టిలో ఫ్యాషన్ అంటే సౌకర్యమే. 1990ల చివర్లో వచ్చిన ట్రెండ్స్ అంటే నాకు భలే ఇష్టం' అని ఫ్యాషన్‌పై తనకున్న మమకారాన్ని తెలిపింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆమె ఎక్కువగా వాడే బ్రాండ్స్‌లలో 'రోజ్ రూమ్' ఒకటి. ఈ 'రోజ్ రూమ్' బ్రాండ్ చీర ధర రూ. 15, 500. ఇక జ్యూయెలరీ విషయానికొస్తే 'అమ్రిస్'ను ఎక్కుగా ప్రిఫర్ చేస్తుంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ బ్రాండ్‌లోని నెక్లెస్, కమ్మలు, ఉంగరం ధరలు నాణ్యత, డిజైన్ బట్టి ఉంటాయి. రోజ్ రూమ్: ‘ఓ స్త్రీగా నాలో నేను దేన్ని నమ్ముతాను.. ఎలా ఉండాలనుకుంటాను.. ఏం కోరుకుంటానో అవే నా డిజైన్స్ ద్వారా చెప్పాలనుకుంటాను. నా దృష్టిలో దేవుడి అద్భుతమైన సృష్టి స్త్రీ. నా బ్రాండ్ ఆమెను మరింత అద్భుతంగా మలస్తుంది’ అంటోంది ‘రోజ్ రూమ్’ లేబుల్ వ్యవస్థాపకురాలు ఇషా. ఇంతకు మించి ఈ బ్రాండ్‌కు వివరణ, వర్ణన ఏం ఉంటుంది! ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ధరలూ అందుబాటులోనే. అమ్రిస్: పన్నెండేళ్ల కిందట మొదలైందీ బ్రాండ్. వ్యవస్థాపకురాలు.. ప్రేరణ రాజ్‌పాల్. నగల పట్ల, నగల డిజైన్స్ పట్ల తన అత్తగారికున్న ఆసక్తి, అభిరుచితో స్ఫూర్తి పొంది ఈ జ్యూయెలరీ బ్రాండ్‌ను స్థాపించారు ఆమె. అనతికాలంలోనే ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్‌తోపాటు దుబాయ్, సింగపూర్, న్యూయార్క్ వంటి ప్రపంచ నగరాలకూ అమ్రిస్ను విస్తరించారు. నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధరలు. -
పరి పూనమ్ చౌదరి.. ఉమన్ ఆఫ్ బునాయ్
తెలిసీ తెలియని వయసులో... ‘‘పెద్దయ్యాక నేను డాక్టర్ని అవుతాను.. ఇంజినీర్ని అవుతాను... కలెక్టర్ అవుతాను’’ అని చెప్పి ఆ తర్వాత మర్చిపోయేవారు కొందరైతే, పెద్దయ్యాక ఏమవ్వాలో చిన్నతనంలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా కష్టపడి, సమాజంలో తమకంటూ ఒక ఉన్నత స్థానాన్ని ఏర్పరచుకునేవారు మరికొందరు. ఈ రెండో కోవకు చెందిన అమ్మాయే పరి పూనమ్ చౌదరి. జైపూర్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పరి పూనమ్ చౌదరికి చిన్నప్పటి నుంచి ఫ్యాషనబుల్‌గా ఉండే దుస్తులంటే ఎంతో ఆసక్తి. పదమూడేళ్ల వయసులో తన అభిరుచి ఫ్యాషన్ అని తెలుసుకుంది పరి. అప్పటినుంచి ఆ రంగంలో గొప్ప స్థాయికి ఎదగాలని కలలు కనేది. తన కలను నిజం చేసుకునేందుకు డిగ్రీ చదువుతూనే ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిప్లొమా కోర్సు చేసింది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో ఫ్యాషన్ మీడియా స్టైలింగ్ కోర్సును నేర్చుకుంది. తరువాత 2014లో ఢిల్లీలో మాస్టర్స్ చేస్తూనే ఫైన్ ఆర్ట్స్, స్ట్రీట్ ఫొటోగ్రఫీ, విజువల్ ఆర్ట్స్’, లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్ కోర్సులు చేసింది. తన చదువుకు తగ్గట్టే ఫ్యాషన్ ప్రపంచంలో తన మార్కును చూపించాలన్న ఆలోచన వచ్చింది పూనమ్‌కి. వెంటనే తను రూపొందించిన డిజైన్లతో ఒక బ్లాగ్‌ను ప్రారంభించింది. దాంతోబాటు ఇన్ స్టాగ్రామ్ పేజిలో ఫ్యాషన్ కు సంబంధించిన పోస్టులు పెడుతూ యూజర్లను ఆకట్టుకునేది. బ్లాగ్ ప్రారంభించిన రెండేళ్ల తరవాత తన ఫ్యాషన్ డిజైనింగ్ ఐడియాలతో ‘బునాయ్’ అనే బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ మార్కెట్లోకి వచ్చే సమయానికి పరి వయసు 23 ఏళ్లు. బునాయ్ బ్రాండ్... భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబిస్తూనే ఫ్యాషనబుల్‌గా ఉండే డ్రెస్‌లతో 2016లో బునాయ్ని జైపూర్‌లో ప్రారంభించింది. సంప్రదాయాలకు తగ్గట్టుగా స్టైల్‌గా ఉండే వస్త్రాలను అందుబాటు ధరలకు అందించడమే బునాయ్ లక్ష్యం. అందులో భాగంగా కొన్ని డ్రెస్‌లను ఆన్ లైన్ లో పెట్టింది. వారం తిరక్కుండానే అన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో బట్టలే కాకుండా, ఆభరణాలు, సంప్రదాయ ఎంబ్రాయిడరీ డిజైన్లు, హస్తకళాకారులు రూపొందించిన అలంకరణ వస్తువులను విక్రయించేది. కస్టమర్ల అభిరుచులకు, వారి స్కిన్ టోన్‌కు సరిపడినట్లు డిజైన్ చేయడం, నాణ్యమైన బట్టను అందుబాటు ధరకే అందించడంతో అతికొద్దికాలంలోనే ఆమె బ్రాండ్ ‘బునాయ్’ ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. కార్పొరేట్ మోడల్స్ నుంచి గృహిణుల వరకు అందరూ వేసుకోదగిన డ్రెస్‌లు లభించడం కూడా బునాయ్ బ్రాండ్ పాపులర్ అవడానికి మరో కారణం. ఉమన్ ఆఫ్ బునాయ్ ప్రారంభంలో కేవలం యాభై వేల రూపాయలతో కొన్ని కుట్టుమిషన్లను కొని, ఇద్దరు టైలర్స్‌ను చేర్చుకుని బునాయ్ని ప్రారంభించిన పరి నేడు నాలుగు వందలకు పైగా ఉద్యోగులు, మూడున్నర లక్షల కస్టమర్లతో, కోట్ల టర్నోవర్‌తో వాణిజ్య ప్రపంచంలో దూసుకుపోతుండడంతో పూనమ్‌కి ‘ఉమన్ ఆఫ్ బునై’ అనే స్థాయిలో గుర్తింపు వచ్చింది. మామూలు వారితోపాటు సోనాక్షి సిన్హా, భూమి పెడ్నేకర్, దివ్యాంకా త్రిపాఠీ, రిధి డోగ్రా వంటి ఎంతోమంది సెలబ్రెటీలు కూడా బునాయ్ బ్రాండ్‌వే కావాలని అడిగి కొనేంతగా పాపులర్ అయింది. ఇన్ స్టాగ్రామ్ పేజీలో పదిలక్షలకుపైగా ఫాలోవర్స్‌తో పరి ఫ్యాషన్ ఇన్ ఫ్లుయెన్సర్ అనే పేరుతోబాటు, గతేడాది బీడబ్ల్యూ ఇచ్చే ఎంట్రప్రెన్యూర్షిప్ అవార్డ్స్’లో ఈ–కామర్స్ టెక్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు కూడా ఆమెను వరించింది. -
ది గ్రూమింగ్ స్కూల్ కలలు నెరవేర్చే డిజిటల్ బడి
సాధారణ పల్లెల నుంచి పెద్దపట్టణాల వరకు ఎంతోమంది అమ్మాయిలకు ‘మిస్ ఇండియా’ మిస్ దివా’ కావాలనే లక్ష్యం ఉండవచ్చు. పక్కవారి నుంచి వెక్కిరింపులు కూడా ఎదురు కావచ్చు. ‘అది మనలాంటి వాళ్ల కోసం కాదు’ అంటూ అతిశయోక్తుల సమాచారం వెల్లువెత్తవచ్చు. ఈ గందరగోళాన్ని పక్కకు నెట్టి, స్పష్టత ఇవ్వడానికి, విజయం వైపు దారి చూపడానికి వచ్చిందే.. ది గ్రూమింగ్ స్కూల్. ‘అందంగా కనిపించాలనే ఆసక్తి మీలో ఉందా? ఆత్మవిశ్వాసం ఉందా? మీలోని శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనే ఉత్సాహం ఉందా?...‘అయితే ఈ లైఫ్ ఛేంజింగ్ స్కూల్ మీకోసమే’ అంటోంది మిస్ ఇండియా ఆర్గనైజేషన్(ముంబై). దశాబ్దాలుగా ఎంటర్ టైన్మెంట్, ఫ్యాషన్ ఇండస్ట్రీలో మంచి పేరున్న మిస్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎంఐవో) ఎంతోమంది యువతులు అందాల కిరీటాన్ని అందుకోవడంలో సహాయపడింది. ‘డూ–ఇట్–యువర్సెల్ఫ్’ అని నినదిస్తున్న ‘ఎంఐవో’ ఔత్సాహిక యువతుల కోసం ‘ది గ్రూమింగ్ స్కూల్’ ద్వారా వివిధ రంగాల నిపుణులతో వీడియో ట్యుటోరియల్స్ నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. స్కిన్‌కేర్, హెయిర్‌కేర్, స్టైలింగ్, మేకప్, వ్యక్తిత్వ వికాసం, ఫ్యాషన్ స్టైలింగ్, సోషల్ మీడియా... మొదలైన వాటిలో నిపుణులు వీడియో తరగతులు నిర్వహిస్తారు. వారిలో కొందరు... అయేషా సేథ్ (మేకప్ ఆర్టిస్ట్), అలేషియా రౌత్(ర్యాంప్ వాకర్), సంజీవ్‌దత్తా (పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్), భరత్ గుప్తా (ఫ్యాషన్ స్టైలీస్ట్), డా.జార దాదీ (స్కిన్‌కేర్ కోచ్). యువతులను బ్యూటిఫుల్ అండ్ సక్సెస్‌ఫుల్‌గా నిలపడంలో వీరి పాఠాలు ఉపయోగపడతాయి. ఈ జెండర్–న్యూట్రల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత నైపుణ్యం సొంతం అవుతుంది. ‘కల కనడం ఎంత ముఖ్యమో, ఆ కలను సాకారం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. తమ లక్ష్యాన్ని చేరుకోవాలనుకునేవారి కోసం, నిర్మాణాత్మకమైన పాఠాలతో ఒక బలమైన వేదికను ఏర్పాటు చేశాం’ అంటుంది మిస్ ఇండియా ఆర్గనైజేషన్. కోర్సు పూర్తయిన తరువాత అభ్యర్థులకు సంస్థ నుంచి సర్టిఫికెట్లు అందుతాయి. అంతకంటే ముఖ్యంగా ఆత్మబలం అపారంగా అందుతుంది! -
6 లక్షల పెట్టుబడి.. 4 కుట్టు మిషన్లతో ఆరంభం.. లక్షల్లో ఆదాయం!
ఇరవై ఎనిమిదేళ్ల ఓషియానాకు వ్యాపారం చేయాలన్న ఆశ బలంగా ఉంది. కానీ ‘‘ఇంట్లో ఎవరూ వ్యాపారస్థులు లేరు, ఏ అనుభవం లేకుండా వ్యాపారం ఎలా చేస్తావు’’ అంటూ తల్లిదండ్రులు ఆమె ఉత్సాహంపై నీళ్లు చల్లారు. అయితే అక్కడితో తన ఆశను వదిలేయకుండా, వాళ్లను ఎలాగో ఒప్పించి ఓ స్టార్టప్ ను ప్రారంభించింది. అనుభవం లేకపోయినా అంకిత భావం ఉండటం వల్ల ప్రారంభంలో ఎదురైన అనేక ఆటుపోట్లను ధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు దూసుకుపోయింది. ఫలితం.. ఇప్పుడామె ఆదాయం నెలకు కొన్ని లక్షలు. అలా వ్యాపారం చేయాలన్న ఎంతోమంది ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తోంది ఓషియానా. ఢిల్లీకి చెందిన ఓషియానా ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. చదువు పూర్తయిన వెంటనే ఓ ‘ఫ్యాషన్ ఎక్స్పోర్ట్ హౌజ్’లో చేరింది. అక్కడ ఉద్యోగం చేస్తోంది కానీ మనసులో మాత్రం బిజినెస్ చేయాలని బాగా కోరిక. తన కోరికను తల్లిదండ్రుల ముందుంచితే ‘‘ఉద్యోగంలో ఎటువంటి రిస్కూ ఉండదు. వ్యాపారం అయితే లాభనష్టాలతో కూడుకున్నది. ఎక్కువ ఒత్తిడికి గురవ్వాల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగం చెయ్యి’’ అని ప్రభుత్వ ఉద్యోగస్థులైన తల్లిదండ్రులు ఆమెను వెనక్కు లాగే ప్రయత్నం చేశారు. కానీ ఓషియానా వారి అభిప్రాయాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ తన మనసులో ఉన్న బిజినెస్ ప్లాన్ గురించి వివరించి ‘‘మీరు నాకు ఆరునెలలు సమయం ఇవ్వండి. నన్ను నేను నిరూపించుకుంటాను. అది జరగని పక్షంలో మీరన్నట్లే చేస్తాను’’ అని చెప్పి ఒప్పించింది. ఫ్రెండ్‌తో కలిసి.. తల్లిదండ్రులు ఒప్పుకున్న వెంటనే ఆలస్యం చేయకుండా 2019 ఫిబ్రవరిలో తన స్నేహితుడు సౌరభ్ తోకస్తో కలిసి ‘మోడ్రన్ మిత్’ పేరిట ఓ స్టార్టప్‌ను ప్రారంభించింది. ఓషియానా ఉద్యోగం చేసేటప్పుడు దాచుకున్న డబ్బులు, ఇంకా సౌరభ్ తెచ్చిన కొంత మొత్తం కలిపి ఆరు లక్షల రూపాయలతో.. నాలుగు కుట్టు మిషన్లు, నలుగురు కళాకారులతో రెగ్జిన్ , కార్క్, కాటన్ , పైనాపిల్ వ్యర్థాలు, క్యాక్టస్ ఫైబర్ వంటి వీగన్ పదార్థాలతో బ్యాగ్‌ల తయారీ మొదలు పెట్టింది. చూడటానికి చాలా మోడర్న్‌గా ఉంటూ మన్నికగా ఉండే ఈ బ్యాగ్‌లకు మంచి ఆదరణ లభించింది. విక్రయాలు బాగా జరిగేవి. అలా వచ్చిన లాభాన్ని మళ్లీ దానిలోనే పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తీసుకొచ్చింది. నేడు 15 మంది హస్త కళాకారులు, పది మిషన్లతో మోడ్రన్ మిత్ దూసుకుపోతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న మిత్ కస్టమర్లకు నాణ్యమైన బ్యాగ్‌లు అందించేందుకు ప్రస్తుతం అందుబాటు లో ఉన్న టెక్నాలజీ, లేటెస్ట్ డిజైన్లను వాడుకుని నెలకు 14 నుంచి 20 లక్షల వరకు ఓషియానా ఆర్జిస్తోంది. డిజైన్ , నాణ్యతే మా ప్రత్యేకత ‘‘ఫ్యాషన్ పరిశ్రమలో డిజైన్ తోపాటు నాణ్యత చాలా ముఖ్యం. అందుకే నేను ముందు మంచి హస్తకళాకారులను అన్వేషించాను. తరతరాలుగా అదే పనిచేస్తోన్న కుటుంబాలకు చెందిన కళాకారులను ఎంపికచేశాను. నా కంపెనీలో పనిచేస్తోన్న కళాకారుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. వీళ్లు చేతితోనే అందమైన డిజైన్లు రూపొందిస్తారు. రెగ్జిన్ , కార్క్, కాటన్ లను ఢిల్లీ, కోల్‌కతాల నుంచి సేకరించి అందమైన బ్యాగ్‌లు రూపొందిస్తున్నాము. పైనాపిల్ వ్యర్థాలు, క్యాక్టస్ ఫైబర్‌ను కూడా తయారీలో వాడుతున్నాం. వీటివల్ల పర్యావరణానికి హాని కలగదు. మా దగ్గర 130 రకాల బ్యాగ్‌లు తయారవుతాయి. వీటిలో హ్యాండ్ బ్యాగ్స్, టాట్స్, స్లింగ్ బ్యాగ్స్, మేకప్ పౌచ్‌లు, ట్రావెలింగ్, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు ఉన్నాయి. ఎటువంటి వ్యాపార అనుభవం లేని అమ్మాయిగా ప్రారంభంలో నాకు చాలా సమస్యలు ఎదురైనప్పటికీ సౌరభ్ సాయంతో అన్నింటినీ అధిగమించగలిగాను. మా ఉత్పత్తులను ఆన్ లైన్ ద్వారా నేరుగా కస్టమర్లకు చేరుస్తూ వ్యాపారాన్ని లాభాల్లో నడిపిస్తున్నాను. ఎవరైనా స్టార్టప్ ప్రారంభించాలనుకుంటే ముందు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో దాన్ని బాగా పరిశోధించి అర్థం చేసుకోవాలి. తర్వాత తక్కువ పెట్టుబడితో ప్రారంభించి దానిపై పట్టు సాధించాక అంచెలంచెలుగా దానిని పెంచుకోవాలి’’ అని స్టార్టప్ ఔత్సాహికులకు సూచిస్తోంది ఓషియానా. -
ఫ్యాషన్.. యువతకు ఇప్పుడు చక్కటి కెరీర్.. విజయం సాధించండిలా
ఫ్యాషన్.. యువతకు ఇప్పుడు చక్కటి కెరీర్ మార్గంగా నిలుస్తోంది. ఫ్యాషన్ రంగానికి అవసరమైన నైపుణ్యాలు, అర్హతలు ఉంటే.. ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి! ఇలాంటి నైపుణ్యాలు అందించే వేదిక.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)!! దేశవ్యాప్తంగా ఉన్న నిఫ్ట్ క్యాంపస్‌ల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ప్రతి ఏటా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్–2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. నిఫ్ట్ క్యాంపస్‌ల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, అర్హతలు, ప్రవేశ ప్రక్రియ, పరీక్ష విధానం, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం.. హెయిర్ స్టైల్ అదిరిపోవాలి. డ్రెస్సింగ్ ట్రెండీగా ఉండాలి. ఎదుటివాళ్లు కళ్లు తిప్పుకోకూడదు. చివరకు కాళ్లకు తొడిగే ఫుట్‌వేర్ సైతం వెరైటీగా ఉండాల్సిందే! ఇది నేటి యువత ఫ్యాషన్ ధోరణి!! ఇలాంటి ప్రొడక్ట్స్‌ను మార్కెట్లో తేవాలంటే..అంత తేలిక కాదు. అందుకు ఫ్యాషన్ నిపుణులు అవసరం ఉంటుంది. ఇదే ఇప్పుడు యువతకు కెరీర్ అవకాశంగా మారుతోంది. నిఫ్ట్ ప్రత్యేకత భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యాసంస్థ.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్). ఈ ఇన్స్టిట్యూట్కు దేశ వ్యాప్తంగా 17క్యాంపస్‌లు ఉన్నాయి. ఫ్యాషన్ రంగానికి సంబంధించి డిజైన్, ఫ్యాషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో.. బ్యాచిలర్, మాస్టర్ స్థాయిలో కోర్సులను అందిస్తున్నారు. నిఫ్ట్ క్యాంపస్‌లు అందించే ఈ కోర్సులకు ఎంతో గుర్తింపు ఉంది. వీటిల్లో ప్రవేశం పొందాలంటే.. నిఫ్ట్–అడ్మిషన్ ప్రక్రియలో విజయం సాధించాల్సి ఉంటుంది. 2022–23 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బ్యాచిలర్ స్థాయి డిజైన్ ►బ్యాచిలర్ స్థాయిలో..బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ పేరుతో అందుబాటులో ఉన్న కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్; లెదర్ డిజైన్; యాక్ససరీస్ డిజైన్; టెక్స్టైల్ డిజైన్; నిట్వేర్ డిజైన్; ఫ్యాషన్ కమ్యూనికేషన్. ►వీటికి ఏదైనా గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. వయసు 24ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ బ్యాచిలర్ స్థాయిలోనే.. ఫ్యాషన్ విభాగంలో టెక్నికల్ నైపుణ్యాలను అందించే ప్రత్యేక కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఇందులో ప్రవేశానికి ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. వయసు 24ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. పీజీ ప్రోగ్రామ్‌లు ►పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో.. మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. ►మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్: అర్హత: బ్యాచిలర్ డిగ్రీ లేదా నిఫ్ట్/నిడ్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా(కనీసం మూడేళ్లు)ఉత్తీర్ణులు అర్హులు. ►మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ: నిఫ్ట్ అందించే బీ.ఎఫ్.టెక్ ఉత్తీర్ణులు లేదా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి బీటెక్/బీఈ ఉత్తీర్ణులు అర్హులు. ►పీజీ కోర్సులకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. మూడంచెల ఎంపిక ప్రక్రియ నిఫ్ట్–అడ్మిషన్ ప్రక్రియ మూడంచెల్లో ఉంటుంది. తొలిదశలో క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్(సీఏటీ);జనరల్ ఎబిలిటీ టెస్ట్(జీఏటీ)ను నిర్వహిస్తారు. ఆ తర్వాత దశలో సిట్యుయేషన్ టెస్ట్ ఉంటుంది. చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్లు ఉంటాయి. వీటిలో విజయం సాధిస్తే సీటు ఖరారు చేస్తారు. తొలి దశ జీఏటీ ►బ్యాచిలర్, పీజీ కోర్సుల అభ్యర్థులకు తొలి దశలో జీఏటీ(జనరల్ ఎబిలిటీ టెస్ట్)ను నిర్వహిస్తారు. పరీక్ష ప్రశ్నల క్లిష్టత స్థాయి మాస్టర్ కోర్సుల్లో కాస్త ఎక్కువగా ఉంటుంది. ►బీడిజైన్ కోర్సుకు జీఏటీ పేపర్లో 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. ►ఎండిజైన్ కోర్సుకు జీఏటీ పేపర్లో 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. ►జీఏటీలోనూ పలు విభాగాల నుంచి నిర్దిష్ట సంఖ్యలో ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు క్వాంటిటేటివ్ ఎబిలిటీ; కమ్యూనికేషన్ ఎబిలిటీ; ఇంగ్లిష్ కాంప్రహెన్షన్; అనలిటికల్ ఎబిలిటీ; జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యాషన్ టెక్నాలజీ.. ప్రత్యేక పరీక్ష బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సులకు తొలి దశ ప్రవేశ పరీక్ష జీఏటీని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ఈ పరీక్షలో క్యాంటిటేటివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటితోపాటు ఒక కేస్ స్టడీ కూడా ఉంటుంది. మొత్తంగా ఈ పరీక్షలో బీ.ఎఫ్.టెక్, ఎం.ఎఫ్.టెక్‌లకు సంబంధించి 150 ప్రశ్నలు ఉంటాయి. రెండో దశ.. సీఏటీ నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్ ప్రక్రియలో రెండో దశ పరీక్ష.. సీఏటీ(క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్). అభ్యర్థుల్లోని పరిశీలనాత్మక నైపుణ్యం, సృజనాత్మకత, డిజైన్ సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఈ పరీక్ష ఉంటుంది. మూడో దశ.. సిట్యుయేషన్ టెస్ట్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అభ్యర్థుల సృజనాత్మక ప్రతిభను పరిశీలించే విధంగా మూడో దశలో నిర్వహించే పరీక్ష.. సిట్యుయేషన్ టెస్ట్. ఇది పూర్తిగా ప్రాక్టికల్ అప్రోచ్‌తో ఉంటుంది. అభ్యర్థులకు నిర్ణీత మెటీరియల్ అందించి ఏదైనా ఆకృతిని రూపొందించమని సూచిస్తారు. లేదా ఏదైనా ఒక సందర్భాన్ని పేర్కొని.. దానికి తగినట్లుగా ఊహా చిత్రం గీయమని అడుగుతారు. చివరగా.. జీడీ, పీఐ నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్లోని తొలి మూడు దశల్లో విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ)లు నిర్వహిస్తారు. జీడీ ద్వారా అభ్యర్థి భావవ్యక్తీకరణ, స్పష్టత, ఆలోచన సామర్థ్యాలను పరిశీలిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ పూర్తిగా ఫ్యాషన్ కెరీర్ పట్ల అభ్యర్థికున్న ఆసక్తి, దానికి సరితూగే తత్వాలను గ్రహించే విధంగా ఉంటుంది. ఇందులోనూ విజయం సాధిస్తే ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు. విజయం సాధించండిలా ►నిఫ్ట్ అడ్మిషన్ ప్రక్రియలో పేర్కొన్న జీఏటీ, సీఏటీ, సిట్యుయేషన్ టెస్ట్‌లు.. వాటిలో సెక్షన్లు, సంబంధిత సబ్జెక్ట్‌లలో రాణించడానికి ఆయా అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ►క్వాంటిటేటివ్ ఎబిలిటీ: ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్,అర్థమెటిక్స్ నుంచి ఉంటాయి. వర్క్ అండ్ టాస్క్, శాతాలు, నిష్పత్తులు,టైమ్ అండ్ డిస్టెన్స్,టైమ్ అండ్ వర్క్ సంబంధించిన అంశాల్లో పట్టు సాధించాలి. ►కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్: ఇంగ్లిష్ భాషలో ప్రాథమిక నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.అభ్యర్థులు బేసిక్ గ్రామర్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ►అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ: విశ్లేషణ సామర్థ్యాన్ని, తార్కిక నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. నిర్దిష్టంగా ఒక అంశంలో ఇమిడి ఉన్న ప్రధాన కాన్సెప్ట్‌లు, వాటికి సంబంధించి అప్లికేషన్ అప్రోచ్‌తో ప్రాక్టీస్ చేయడం అలవర్చుకోవాలి. ►జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్: ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు హైస్కూల్ స్థాయి సోషల్ స్టడీస్ నుంచి ఉంటాయి. అదే విధంగా ముఖ్యమైన తేదీలు–సందర్భాలు వంటివి కూడా అడుగుతారు. తాజాగా జరిగిన ముఖ్యమైన సంఘటనలు కూడా తెలుసుకోవాలి. ► కేస్ స్టడీ: బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సుల అభ్యర్థులకు మాత్రమే నిర్వహించే కేస్ స్టడీ వినూత్నంగా ఉంటుంది. ఒక వాస్తవ సమస్యను ఇచ్చి.. దానికి పరిష్కారం అడుగుతారు. దీనిలో రాణించాలంటే.. అభ్యర్థులు వాస్తవ అన్వయ దృక్పథం, సమస్యను గుర్తించే లక్షణం పెంచుకోవాలి. ఆసక్తి ప్రధానం ఫ్యాషన్ రంగంలో ప్రవేశించాలనుకునే యువతకు ఆసక్తి ఎంతో ప్రధానం. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులు,జీవన శైలి,వ్యక్తుల అభిరుచుల్లో మార్పులు గమనిస్తూ.. ప్రొడక్ట్ డిజైన్ చేసే దూరదృష్టి అవసరం. ప్రస్తుతం ఫ్యాషన్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగావకాశాలకు ఎలాంటి ఢోకా లేదు. –ప్రొ.ఎల్.మదన్ కుమార్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్, నిఫ్ట్, హైదరాబాద్ కోర్సులు–సీట్లు ►జాతీయ స్థాయిలో మొత్తం 17 నిఫ్ట్ క్యాంపస్‌ల్లో అందుబాటులో ఉన్న కోర్సులు–సీట్ల వివరాలు: బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్: 686, లెదర్ డిజైన్: 168, యాక్ససరీ డిజైన్: 600, టెక్స్టైల్ డిజైన్: 646, నిట్వేర్ డిజైన్: 296, ఫ్యాషన్ కమ్యూనికేషన్: 642,బీఎఫ్‌టెక్(అపెరల్ ప్రొడక్షన్): 518, మాస్టర్ ఆఫ్ డిజైన్: 171, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్: 650, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ: 140. ►నిఫ్ట్ హైదరాబాద్ క్యాంపస్‌లో అందుబాటులో ఉన్న కోర్సులు, సీట్ల వివరాలు..బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్: 37, యాక్ససరీ డిజైన్:37, టెక్స్టైల్ డిజైన్: 37, నిట్వేర్ డిజైన్: 37, ఫ్యాషన్ కమ్యూనికేషన్: 37, బీ.ఎఫ్.టెక్(అపరెల్ ప్రొడక్షన్): 37,మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్: 37. n అన్ని క్యాంపస్‌లలోనూ ఇక్కడ పేర్కొన్న సీట్లతోపాటు ప్రతి కోర్సులో అయిదు సీట్లను అదనంగా.. ఎన్ఆర్ఐ విద్యార్థులు, సార్క్ దేశాల విద్యార్థులు, విదేశీ విద్యార్థుల కోసం కేటాయించారు. ముఖ్య సమాచారం ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ►యూజీ/పీజీ కోర్సులకు దరఖాస్తులకు చివరి తేది: 2022 జనవరి మొదటి వారం. ►బ్యాచిలర్ కోర్సులకు రాత పరీక్ష తేదీలు: 2022 ఫిబ్రవరి మొదటి వారం ►వివరాలకు వెబ్సైట్: https://www.nift.ac.in/ -
Blouse Mehndi: మెహందీని ఇలా కూడా వాడుతున్నారా!
చేతి నిండా ఎర్రగా పండే.. ‘మెహందీ’ అంటే ఇష్టంలేని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పటి వరకు మెహంది అనగానే చేతులు, కాళ్లు, కొన్ని సార్లు తెల్లజట్టుకు వేసుకోవటం తెలుసు. అయితే రోజురోజుకు మహిళలు కొత్త ఫ్యాషన్ ఫాలో అవుతూ ట్రెండీగా మెరిసిపోతున్నారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చే ప్రతి ఫ్యాషన్ బ్రాండ్లను వాడుతున్నారు. భిన్నమైన చుడీదార్లు, డిజైన్ శారీలు, బ్లౌజులు వేసుకొని ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. అయితే తాజాగా మెహందీ బ్లౌజ్ వేసుకున్న ఓ మహిళకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను థానోస్ జాట్ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మెహందీ బ్లౌజ్ ఎలా ఉంటుందని ఆశ్చర్యపోతున్నారా? అయితే సాధారణంగా ధరించే బ్లౌజ్‌కు బదులుగా శరీరంపై హెన్నా(మెహంది) డిజైన్ వేసుకోవడం. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు.. ‘కొత్తగా ఉంది డిజైన్’.. ‘మెహందీని ఇలా కూడా వాడుతున్నారా?’.. అసలు బ్లౌజ్‌గా మెహందీని వేసుకోవడం ఏంటీ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Thanos (@thanos_jatt) -
బొగ్గు గౌను.. మైనం చీర..ఫ్యాషన్ డిజైనర్ సృజన
కాలానుగుణంగా దుస్తులను రూపొందించి, విభిన్న మోడల్స్‌లో ఆకట్టుకునే ఫ్యాషన్ డిజైనర్లను ఎంతో మందిని చూశాం. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో బరేలీ జిల్లా వాసి ఫ్యాషన్ డిజైనర్ గుప్తా పరిచయం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆర్ట్‌ను సైన్స్‌ను కలగలిపి వినూత్న డిజైన్లు రూపొందించి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఏడుసార్లు గుర్తింపు తెచ్చుకుంది. టిష్యూ పేపర్‌తో చేసిన గౌను, మైనంతో చేసిన డ్రెస్, ఫెవికాల్తో చేసిన తెల్లటి దుస్తులు, బొగ్గు, తారుతో చేసిన గౌన్లు్ల, స్వచ్ఛమైన బంగారంతో రూపొందించిన లెహెంగా, వైట్ సిమెంట్‌తో చేసిన డ్రెస్, లిక్విడ్ సోప్‌తో చేసిన చీర.. ఇలా ఆమె రూపొందించిన వినూత్నమైన ఏడురకాల దుస్తులకు ఏడు సార్లు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కింది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసిన రాఖీ డ్రెస్ డిజైన్స్‌లో చేస్తున్న ఆసక్తికర ప్రయోగాలు తెలుసుకున్నా కొద్దీ ఆసక్తికరంగా ఉంటాయి. మోడల్ దుస్తులతో సైన్స్ ప్రాజెక్ట్ రాఖీ గుప్తా కుటుంబంలో అందరూ వైద్య వృత్తిలో ఉన్నారు. రాఖీ కూడా డాక్టర్ అవుతుంది అని అనుకున్నారు ఆమె తల్లీ తండ్రి. కానీ, చిన్ననాటి నుంచి రాఖీ ప్రవర్తన వేరుగా ఉండేది. తినడానికి ప్లేట్లో రొట్టెలను పెడితే, వాటిని అందంగా అలంకరించేది. స్కూల్లో టీచర్ సైన్స్ ప్రాజెక్ట్ చేయమంటే వార్తాపత్రికల కటింగ్‌తో డ్రెస్ డిజైన్స్ చేసి, పుస్తకంలో అతికించేది. ‘రెడ్ కార్పెట్‌పై నడిచే మోడల్స్ ధరించే దుస్తులంటే నాకు చాలా ఇష్టం. నా మనసు ఆసుపత్రిలో కాకుండా దేవకన్యలు, యువరాణుల దుస్తులలో చిక్కుకుంది. దీంతో నేను ఫ్యాషన్ డిజైనింగ్‌నే ఎంచుకున్నాను’ అంటుంది రాఖీ. సరైన దారి.. 2009లో ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరాను. ఆ కోర్సు సమయంలోనే ఫ్యాషన్ షోలు చేశాను. అక్కడ నా డిజైన్స్‌కు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత సంవత్సరం నాన్న చనిపోయారు. సర్వం కోల్పోయినట్టుగా అనిపించింది. డిజైనింగ్ నుంచి బయటకు వచ్చేశాను. అప్పుడు అమ్మ నాకు అండగా నిలిచింది. రంగుల ప్రపంచంపై నాకున్న ఇష్టాన్ని పదే పదే చెప్పేది. దీంతో తిరిగి డిజైనింగ్‌పై దృష్టి పెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డిజైనింగ్‌లో ఏదో కొత్త పని చేస్తూనే ఉన్నాను. సైన్స్, కళల కలయికకు గుర్తింపు ఫ్యాషన్ ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. ఇందులో డిజైనర్లందరూ తమ సృజనను చూపుతూనే ఉంటారు. నేను సంప్రదాయ దుస్తులను ముఖ్యంగా పెళ్లి డ్రెస్సులను డిజైన్ చేసేదాన్ని. ఫ్యాషన్ అనేది కేవలం బట్టలకే పరిమితం కాదని, ఏదో కొత్తదనాన్ని చూపాలనుకున్నాను. అప్పుడే సైన్స్ ద్వారా ఏదైనా సృష్టించాలనుకున్నాను. ఆ తర్వాత నా ఆలోచనలపై పరిశోధన చేస్తూనే ఉన్నాను. ప్రజలు ఊహించని విధంగా మైనం, బొగ్గు బేస్ చేసుకొని రెండు డ్రెస్సులను తయారు చేశాను. ఆ రెండింటికీ లిమ్కాబుక్ రికార్డ్‌లో చోటు దక్కింది. ఎంతో మంది చేత ప్రశంసలు, గౌరవం దక్కాయి. డిజైనింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ వీలు చూసుకొని ఇతర వస్తువులనూ ఉపయోగిస్తూ ఫ్యాబ్రిక్‌ను తయారు చేయడం, వాటితో డ్రెస్సులను రూపొందించడం నా హాబీ. దీంట్లో భాగంగానే వైట్ సిమెంట్, ఫెవికాల్, సోప్ లిక్విడ్ ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ చీరలు, డ్రెస్సులు రూపొందించాను. ఏడురకాల ఈ దుస్తులకు ఏడుసార్లు లిమ్కా బుక్రికార్డులో చోటు దక్కించుకున్నాను’’ అని వివరించారు రాఖీ గుప్తా. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తూ, సైన్స్‌ను కళను కలిపి తయారుచేసే డిజైన్లతో రికార్డులు సాధిస్తూ తీరిక లేకుండా ఉండే రాఖీ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటుంది. అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళుతుంది. వృద్ధాశ్రమంలోని బామ్మలకు నచ్చిన చీరలు ఇచ్చి వస్తుంటుంది. పిల్లలకు చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తుంది. బహుమతులు, భోజనం అందిస్తుంది. వినూత్నంగా ఆలోచించమని అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. ఆమె చేస్తున్న కృషికి గాను మహిళా సాధికారత అవార్డు, విశిష్ట పౌర పురస్కారం లభించాయి. -
చీర కట్టుల్లో సమ్మోహనపరుస్తున్న అందాల అదితీ
అందం, అభినయంతో ప్రేక్షకులను సమ్మోహనపరుస్తున్న నటి అదితీరావు హైదరీ. స్క్రీన్ మీద ఎంచుకునే పాత్రల్లోనే కాదు.. అప్పియరెన్స్ కోసం అనుసరించే ఫ్యాషన్‌లోనూ వినూత్నమైన అభిరుచి ఆమెది! ఆ టేస్ట్‌కు అద్దం పట్టే బ్రాండ్సే ఇవీ.. ది హౌస్ ఆఫ్ ఎమ్‌బీజే .. ‘ది సింబల్ ఆఫ్ టైమ్‌లెస్’.. అనేది ఈ సంస్థ క్యాప్షన్. తగ్గట్టుగానే రాజుల కాలం నుంచి నేటి వరకూ ఉన్న ప్రతి డిజైన్‌లో ఆభరణాలు లభిస్తాయిక్కడ. 1897లో ప్రారంభమై, వంద సంవత్సరాలకు పైగా ఎన్నో అద్భుతమైన బంగారు, వెండి, వజ్రాభరణాలను వీరు అందిస్తున్నారు. వివాహాది శుభకార్యాలకు పెట్టింది పేరు. చాలా మంది సెలబ్రిటీస్ తమ పెళ్లిళ్లలో వీరి ఆభరణాల్లోనే మెరిశారు. ఇక్కడ ఏది కొనాలన్నా లక్షల నుంచి కోట్లు ఖర్చు చేయాల్సిందే. బంగారం ధర, వజ్రాల నాణ్యతతో సంబంధం ఉండదు. కేవలం డిజైన్ ఆధారంగానే ధర నిర్ణయిస్తారు. ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: ది హౌస్ ఆఫ్ ఎమ్‌బీజే పునీత్ బలానా, సెలబ్రిటీస్ స్టైలిస్ట్, ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. పునీత్ బలానా .. ఇతని కలెక్షన్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతుంటాయి. కారణం.. పునీత్ బలానా అంటే టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్ పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్. రాజస్థాన్‌లో పుట్టి, సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేసి, ఎన్నో అందమైన ఫ్యాషన్ డిజైన్స్‌ను అందించాడు. ఈ దుస్తులన్నీ ఎంత సంప్రదాయబద్ధంగా ఉంటాయో, అంతే మోడర్న్‌గానూ ఉంటాయి. అదే ఇతని బ్రాండ్ వాల్యూనూ పెంచింది. పునీత్ బలానా లేబుల్ సృష్టిని బాలీవుడ్ తారలు విద్యా బాలన్, కృతి సనన్, రవీనా టాండన్, అదితిరావ్ హైదరి వంటి ఎంతో మంది సెలబ్రిటీస్ కోరుకుంటారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంది. చీర డిజైనర్: పునీత్ బలానా ధర: రూ. 45,000 - దీపిక కొండి చదవండి: World's loneliest whale: పాపం.. ఒంటరైన తిమింగలం..తలను గోడకేసి బాదుకుని..! -
రెండు చీరల కట్టు.. ఆధునికంగా ఆ‘కట్టు’
ఎన్ని మోడ్రన్ డ్రెస్సులు వచ్చినా చీరకట్టుకే మన అమ్మాయిలు ఓటేస్తున్నారు. సంప్రదాయ వేడుకకు, ఇండోవ్రెస్టన్ స్టైల్ పార్టీలకు చీరతోనే సింగారించుకుంటున్నారు. అందుకే, చీరకట్టులోనూ ఎన్నో వినూత్నమార్పులు వచ్చాయి. రెడీమేడ్‌గా వేసుకునే ధోతీ శారీ, ప్యాంట్, పలాజో వంటి శారీస్‌తో పాటు రెండు చీరలతోనూ వినూత్న స్టైల్ తీసుకువస్తున్నారు. పండగలకు, వివాహ వేడుకలకు ఓస్టైల్, వెస్ట్రన్ పార్టీలకూ మరో స్టైల్‌తో ఇలా చీరకట్టులో మెరిసిపోతున్నారు. పెప్లమ్ శారీ కలంకారీ పెప్లమ్ బ్లౌజ్‌తో ప్లెయిన్ శారీ కట్టుకు ఆధునికత జతగా చేరింది. ఏ విధమైన ఇతరత్రా హంగులు లేకుండా చూడగానే వావ్ అనిపించే కళ నేటి కాలపు అమ్మాయిల ఛాయిస్‌గా మారింది. శారీ విత్ దుపట్టా స్టైల్ కంచిపట్టు చీరతో పాటు కంచిపట్టు దుపట్టా కూడా ఎంచుకొని వేడుకలకు ఇలా రెడీ అవ్వచ్చు. రెండు విభిన్నరంగుల కాంబినేషన్‌తో ఈ స్టైల్ తీసుకురావచ్చు. ఎడమ, కుడి భుజాల మీదుగా తీసిన కొంగులు మూలంగా యువరాణీ కళ కనువిందుచేస్తుంది. ప్యాంట్ శారీ ఒకే కలర్, ప్రింట్ కాంబినేషన్లో ప్యాంట్‌కు జత చేసిన పవిట కొంగుతో ఈ డ్రెస్ నవతరం అమ్మాయిలను ఆకర్షిస్తుంది. ఏవిధమైన హంగులు లేకుండా ధరించడానికి సులువుగా ఉండే స్టైల్ ఇది. ఇది ధోతీ శారీకి దగ్గరగా ఉన్నా ప్యాంట్ కావడంతో స్టైల్ భిన్నంగా ఉంటుంది. కాటన్, సిల్క్ ఇతర ప్యాటర్న్లలోనూ ఇవి రెడీమేడ్‌గా లభిస్తున్నాయి. రెండు చీరల కట్టు పూర్తి కాంట్రాస్ట్ చందేరీ చీరలను ఎంచుకొని ఒక రంగు చీరను ఒకవైపుకు లెహంగా కుచ్చిళ్లు సెట్ చేసుకొని, మరోవైపు మరో చీరతో కుచ్చిళ్లు తీసి, భుజం మీదుగా పవిట కొంగు తీయాలి. దీనిని బ్యాలెన్స్ చేసుకోలేం అనుకునేవారు బెల్ట్ లేదా వడ్డాణంతో నడుము దగ్గర సెట్ చేసుకోవచ్చు. బ్లౌజ్‌ను బట్టి, ఈ శారీ అలంకరణ ఆధునికంగానూ, సంప్రదాయంగానూ మార్చుకోవచ్చు. ధోతీ శారీ పండగలకు, పుట్టిన రోజు వేడుకలకు సింపుల్‌గా, గ్రేస్‌గా కనిపించాలంటే ఈ స్టైల్ సరిగ్గా నప్పుతుంది. ధరించడమూ సులువు. పవిట కొంగు ధోతీకి జత చేసి రావడంతో ఇది ధోతీ శారీ డ్రెస్‌గానూ మార్కులు కొట్టేసింది. లంగా ఓణీ స్టైల్లో చీర కట్టు రెండు భిన్నమైన రంగులు తీసుకొని ఒకవైపు ఒక చీర పచ్చ, రెండవ వైపు గులాబీ రంగు చీర కుచ్చిళ్లను సెట్ చేస్తూ లంగాఓణీ మోడల్ వచ్చేలా కట్టుకోవడం. ఈ కట్టు సంప్రదాయ వేడుకలకు సరైన ఎంపిక అవుతుంది. -
షరారా శారీ.. చూపు తిప్పుకోలేరు మరి!
లంగా ఓణీ వేసుకున్న కళ రావాలి.. చీరకట్టుకున్న హుందాతనం కళ్లకు కట్టాలి.. ఇండోవెస్ట్రన్ లుక్ అనిపించాలి.. పూర్తి ట్రెడిషనల్ అని మార్కులు కొట్టేయాలి వీన్నింటికీ ఒకే ఒక సమాధానం షరారా శారీ డ్రెస్. నవతరం అమ్మాయి అయినా సంప్రదాయ వేడుకలకు తగినట్టుగా తయారు కావాలని కోరుకుంటుంది. అందుకు తగిన డ్రెస్‌ను ఎంపిక చేసుకుంటుంది. కానీ, సంప్రదాయ చీరకట్టులో సౌకర్యం ఉండదనుకునేవారికి స్టైల్‌గా సమాధానం చెబుతోంది షరారా శారీ. వందల ఏళ్ల ఘనత షరారాను ఘరారా అని కూడా అంటారు. ఇది పూర్తిగా సంప్రదాయ లక్నో డ్రెస్‌గా కూడా చెప్పుకోవచ్చు. ఈ డ్రెస్ పుట్టినిల్లుగా ఉత్తరప్రదేశ్ నవాబ్‌ల ఇంట 19, 20 శతాబ్దాలలో డెయిలీ డ్రెస్‌గా పేరొందింది. టాప్‌గా షార్ట్ కుర్తీ, బాటమ్‌గా షరారా ప్యాంట్ ధరించి దుపట్టాను తల మీదుగా తీసుకుంటూ భుజాలనిండా కప్పుకుంటారు. నడుము నుంచి మోకాలి వరకు ఫిట్ గా ఉంటూ, మోకాలి నుంచి కింద వరకు వెడల్పుగా, కుచ్చులతోనూ ఉంటుంది. అయితే, ఈ స్టైల్ లోనే చిన్న మార్పు చేసి దుపట్టాను పవిటలా ధరించి లంగా ఓణీ స్టైల్, ఇంకొంచెం ముందుకు వెళ్లి శారీ స్టైల్లో తీసుకువస్తున్నారు. చాలా వరకు ఈ షరారా సూట్స్ సిల్క్ బ్రొకేడ్‌తో డిజైన్ చేసినవి ఉంటాయి. ఈ డ్రెస్ ఇప్పుడు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంది. ముఖ్యంగా పండగలు, వివాహ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇలా స్టైలిష్ లుక్ ► మన సంప్రదాయ చీరకట్టు స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకోవడానికి షరారా శారీ అమ్మాయిలకు సరైన ఎంపిక అవుతుంది. ► సాయంకాలాలు గెట్ టు గెదర్ వంటి పార్టీలకైతే ప్రిల్స్, ఫ్లోరల్, టాప్ టు బాటమ్ సేమ్ కలర్ షరారా శారీ సెట్ బాగా నప్పుతుంది. వీటికి పెద్దగా ఆభరణాల అలంకరణ అవసరం ఉండదు. ► సంప్రదాయ పండగలు ఎరుపు, పసుపు షరారా డ్రెస్ సరైన ఎంపిక. ► వివాహ వేడుకలకు ఎంబ్రాయిడరీ బ్లౌజ్, సంప్రదాయ ఆభరణాల ఎంపిక సరైన అందాన్ని తీసుకువస్తాయి. ► శరీరాకృతి ఫిట్‌గా ఉన్నవారు ఈ తరహా స్టైల్‌ను ఎంపిక చేసుకుంటే వేడుకలో ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. ► టాప్‌గా షార్ట్ కుర్తా వేసుకుంటే ఒక స్టైల్, ఎంబ్రాయిడీ బ్లౌజ్ లేదా స్లీవ్‌లెస్ ట్యునిక్ వేసుకుంటే మరో స్టైల్‌తో ఆకట్టుకుంటుంది షరారా సూట్. ► షరారా ప్యాంట్లా కాకుండా కుచ్చులు ఎంత ఎక్కువగా ఉన్నది ఎంచుకుంటే అంత అందంగా, అచ్చు శారీ కట్టుకున్న విధంగా కనిపిస్తారు. ప్యాంట్ స్టైల్ కావడం, దానికి బెల్ట్ జత చేయడంతో సౌకర్యంగానూ ఉంటుంది. -
ఫ్యాషన్ డిజైనింగ్ ముసుగులో వ్యభిచారం.. బిల్ కలెక్టర్ బాగోతం
సాక్షి, కుషాయిగూడ: ఫ్యాషన్ డిజైనింగ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళ గుట్టును కుషాయిగూడ, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. నిర్వాహకురాలితో పాటుగా విటుడు, వ్యభిచారానికి పాల్పడుతున్న యువతిని అరెస్టు చేసిన ఘటన గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ మన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ వాసవీశివనగర్ పార్కు సమీపంలో ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్న సునీతా మండల్ (40) అనే మహిళ ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తూ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. విషయం తెలిసిన కుషాయిగూడ, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. అదే ఇంట్లో ఇటీవలే అద్దెకు దిగిన బిల్ కలెక్టర్ వావనగారి మహాదేవ్, ఓ యువతితో కలిసి బెడ్రూంలో ఉండగా రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిర్వాహకురాలు సునీతా మండల్, విటుడు మహదేవ్‌తో పాటుగా వ్యభిచారానికి పాల్పడుతున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, రెండు సెల్ఫోన్లు, బైక్‌ను స్వా«దీనం చేసుకున్నారు. గతంలో ఆమెపై జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయిందన్నారు. గురువారం కేసు నమోదు చేసి నిందితులను మేజిస్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు వివరించారు. చదవండి: KPHB Colony: యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి.. -
ఫ్యాషన్ కెరీర్.. ఎలా చేస్తే బెటర్!
ఇంటర్మీడియెట్ తర్వాత ఫ్యాషన్, డిజైన్ రంగంలో కెరీర్ కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన కోర్సులు, అవకాశాల గురించి చెప్పండి? ప్రస్తుత ట్రెండీ కోర్సుల్లో చెప్పుకోదగ్గది ఫ్యాషన్ డిజైన్. ఇందులో దుస్తుల నుంచి పాదరక్షల వరకూ... వివిధ విభాగాల్లో స్పెషలైజేషన్స్ చేయవచ్చు. ఫ్యాషన్ డిజైన్ ప్రధానంగా కంటికి ఆహ్లాదకరంగా, ధరించడానికి ఆకర్షణీయంగా ఉండే వస్త్రాలను రూపొందించే విభాగంగా భావిస్తుంటారు. వాస్తవానికి ఇందులో మనిషి ధరించే అన్ని వస్తువుల డిజైనింగ్‌కు సంబంధించిన అంశాలు ఉంటాయి. అంటే కళ్లజోడు నుంచి పాదరక్షల వరకూ.. అన్నీ ఫ్యాషన్ రంగానికి చెందినవే. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి ఇందులో ఆయా విభాగాలను ఎంచుకోవచ్చు. ఫ్యాషన్ డిజైన్‌లో.. ఫ్యాబ్రిక్ డిజైన్, డిజైన్ ప్రాసెస్ మేనేజ్మెంట్, కాన్సెప్ట్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ యాక్ససరీ డిజైన్, ప్రింటింగ్, క్వాలిటీ కంట్రోల్, టెక్స్టైల్ సైన్స్, ఫ్యాషన్ మర్కండైజింగ్, మార్కెటింగ్ అండ్ కలర్ మిక్సింగ్‌పై దృష్టి సారిస్తారు. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు ఆధునిక ఫ్యాషన్ ప్రపంచానికి అవసరమయ్యే నైపుణ్యాలను నేర్చుకుంటారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థులు.. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ నిఫ్ట్(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) క్యాంపస్‌ల్లో ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. అందుకోసం ఏటా నిర్వహించే నిఫ్ట్ ఎంట్రెన్స్‌లో ఉత్తీర్ణతతోపాటు సిట్యూయేషన్ టెస్ట్ తదితర ఎంపిక ప్రక్రియలోనూ ప్రతిభ చూపాల్సి ఉంటుంది. నిఫ్ట్తోపాటు దేశంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ), ఐఐటీ బాంబే, హైదరాబాద్ తదితర ఐఐటీలు, ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్(ఏఐఎఫ్‌డీ), ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) వంటి వాటిల్లో ఫ్యాషన్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. చదవండి: Stand Up Comedians: ఇదిగో నవ్వుల ఆక్సిజన్! మొటిమల కోసం క్రీమ్స్ వాడాను, కానీ: సాయిపల్లవి -
Shanta Verma: వయసా? హహ్హా...
50 వచ్చేశాయి.. 60 వచ్చేశాయి.. బాబోయ్ 70 వచ్చేశాయి. ఉత్తరప్రదేశ్ శాంతా వర్మకు 76. ‘అప్పుడే ఏం వయసొచ్చిందనీ?’ అంటుందామె నవ్వుతూ. హాయిగా భర్తతో కలిసి వీడియోలు చేస్తుంది. నవ్వుతుంది. ఫ్యాషన్ దుస్తులు ధరిస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ పోస్టులతో 16000 మంది ఫాలోయెర్స్‌ను సంపాదించుకుంది. ‘కృష్ణా రామా అనుకునే వయసు’ అని ఎవరైనా అంటే ఆమెకు కోపం వస్తుంది. ‘ఈ స్టీరియోటైప్స్ను బద్దలు కొట్టండి. సంతోషంగా జీవించండి’ అంటుందామె. వయసును ఫీలవుతూ కుంగుబాటు తెచ్చుకునేవారు ఆమెను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 76 ఏళ్ల శాంతా వర్మ తన జీవితంలో ఎన్నో సుదీర్ఘమైన రోజులు, నెలలు, సంవత్సరాలు చూసి ఉంటుంది. కాని ఇప్పుడు ఆమె నిజంగా బతుకుతున్నది ‘30 సెకన్ల’లో. అవును. ఆమె చేసే 30 సెకన్ల వీడియోలు ఆమెను సంతోషంగా ఉంచుతున్నాయి. పాపులర్ చేస్తున్నాయి. అభిమానులను సంపాదించి పెడుతున్నాయి. వయసు గడిచిపోయింది అనుకుంటుంటారు కొందరు ఒక వయసు వచ్చాక. కాని శాంతా వర్మ వయసు మొదలైంది అనే భావనలో ఉంటారు. ఆమె ఇప్పుడు సోషల్ మీడియా సన్సెషన్. వీడియోల్లో ఆమె చీరలో సంప్రదాయంగా ఆమె దేవుని పటానికి దండం పెట్టుకుంటుంది. ఆ తర్వాత తన గదిలోకి రాగానే ఫోన్ అందుకుంటుంది. ఆ ఫోన్లో చూసిన ఫ్యాషన్ దుస్తులను మనకు చూపించి క్షణాల్లో వాటిలోకి మారిపోతుంది. మహా మహా మోడల్స్‌కు లేనంత గ్రేస్‌తో అంటే ఏమాత్రం ఎబ్బెట్టుగా లేకుండా వాటిలో కనిపిస్తుంది. మోడ్రన్ దుస్తుల్లో ఆమె అంత చక్కగా కనిపించడం నిజంగా విశేషం. మరో వీడియోలో హైహీల్స్ చెప్పుల డబ్బా విప్పుతుంది. ఒక హై హీల్‌ను ఎగరేస్తుంది. అంతే. విఠలాచార్య సినిమాలో లాగా ఆ హైహీల్స్‌తో వాటికి తగ్గ షర్ట్ అండ్ స్కర్ట్‌లో కుర్చీలో దర్జాగా కనిపిస్తుంది. మరో వీడియోలో మనవరాలితో కలిసి కోడి కూత పెట్టినట్టు పెడుతూ స్టెప్పులేస్తుంది. ‘ఇన్స్టాగ్రామ్’లో 30 సెకన్ల వీడియోలు పెట్టే వీలుంది. ‘రీల్స్’ అనే ఇన్స్టాగ్రామ్ ఫీచర్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. అలాంటి 30 సెకన్ల వీడియోలతో శాంతా వర్మ పాపులర్ అయ్యింది. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీ పేరు ‘మిస్టర్ అండ్ మిసెస్ వర్మ’. జీవిస్తున్న క్షణాలు శాంతా వర్మ సొంత ఊరు ఉత్తరప్రదేశ్‌లోని భోకర్హెడి అనే చిన్న పల్లెటూరు. 15 ఏళ్ల వయసులో యశ్పాల్ సింగ్‌తో పెళ్లయ్యింది. ‘ఆ తర్వాత నా జీవితం అంతా అత్తామామలను చూసుకోవడం, పిల్లలని పెంచడం, వంట చేయడం, ఇల్లు కట్టుకోవడంతోనే సరిపోయింది. స్త్రీలకు కలలు, ఆకాంక్షలు, సరదాలు, ముచ్చట్లు ఎన్నో ఉండొచ్చు. కాని వాటికి టైమ్ లేకుండానే జీవితం గడిచిపోతుంది. కాని జీవితాన్ని ఎప్పుడైనా మొదలెట్టొచ్చని నాకు ఇప్పుడు అనిపిస్తోంది’ అంటుంది శాంతా. 82 ఏళ్ల భర్తతో కలిసి హర్యానాలోని కల్క అనే చిన్న ఊళ్లో స్థిరపడిన శాంతా వర్మ అక్కడ తన కొడుకు, కోడలు, మనవరాలితో కలిసి జీవిస్తోంది. ‘గత సంవత్సరం లాక్డౌన్లో నా మనవరాలు జనిత నాకు ఇన్‌స్టాగ్రామ్‌ను పరిచయం చేసింది. ఇక అంతే. దానికి నేను అతుక్కుపోయాను’ అంటుంది శాంతా వర్మ. నిజానికి శాంతా వర్మ మనవరాలు జనిత తాతగారి కోసం ఇన్స్టాగ్రామ్ పేజీని మొదలెడదామనుకుంది. మొదలెట్టింది కూడా. ఎందుకంటే యశ్పాల్ సింగ్ మంచి జోకులు కట్ చేయగల సమర్థుడు. ఆయన మీద వీడియోలు షూట్ చేస్తుంటే శాంతా వర్మ వచ్చి తాను అంతకన్నా బాగా చేయగలనని చూపించింది. దాంతో ఇద్దరి మీదా వీడియోలు మొదలెట్టింది మనవరాలు. మెల్లగా శాంతావర్మ ప్రతిభ బయటికి వచ్చి ఆమెకు అభిమానులు పెరిగారు. ‘నేను మా ఆయన్ని సరదాగా విమర్శిస్తూ చేసే వీడియోలు నెటిజన్స్‌కు నచ్చుతున్నాయి. మగాళ్లను ఏదో ఒకటి అనాలని ఆడవాళ్లకు ఉంటుంది కదా’ అంటుంది శాంతా వర్మ. భర్త మీద వంక పెట్టి ఆమె మగవాళ్లలోని లోపాలను సరదాగా ఎద్దేవా చేస్తూ ఉంటుంది. 61 ఏళ్ల దాంపత్యం శాంతావర్మకు, యశ్పాల్ సింగ్‌కు పెళ్లయ్యి 61 ఏళ్లు. ‘ఇన్ని సంవత్సరాలలో మేమిద్దరం ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా ఆయన నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారు’ అంటుంది శాంతా వర్మ పెళ్లయిన కొత్తల్లో బుల్లెట్ నడపాలని తాను అనుకుంటే భర్త నేర్పడానికి ప్రయత్నించే ఫొటోను చూపెడుతూ. ఆమె భర్త అందుకుంటూ ‘ఆమె ఈ వీడియోలు చేసి తన ప్రతిభను చూపడం మొదలెట్టాక ఉదయాన్నే నా మార్నింగ్ వాక్ అయ్యాక మా ఇంటి తోటలోని పూలను కోసి ఆమెకు బొకేలా అందించడం తప్పక చేస్తున్నాను. ఆమె సిగ్గుపడుతుంది గాని నేను చేయగల పని అదే’ అంటాడు. భార్యకు పూలు అప్పుడప్పుడన్నా కానుక గా ఇద్దాం అనుకునే వయసులో ఉన్న భర్తలు తక్కువ. కాని యశ్పాల్ తన ప్రేమ ప్రకటనకు వయసు లేదు అనుకుంటున్నాడు. 16000 మంది అభిమానులు శాంతా వర్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో 16 వేల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. ఒక నానమ్మ తన భర్తతో కలిసి ఉత్సాహంగా జీవించడం వారిలో స్ఫూర్తి నింపుతోంది. మంచి మంచి బట్టల్లో వీడియోలు చేస్తూ బోర్డమ్ను నిర్లిప్తతను నిస్సత్తువను వాళ్లు వదిలించుకునే ప్రయత్నం చేస్తుంటే సంతోషపడుతున్నారు. శరీరం ఏ మంచి ప్రకటనకు అయినా సిద్ధంగా ఉంటుంది. మనసులో జీవం ఉండాలి. ఆ జీవాన్ని నింపుకోవడానికి ప్రయత్నిస్తే బతుకంతా పాటలాగా సాగిపోతుందని నిరూపిస్తోంది శాంతా వర్మ. – సాక్షి ఫ్యామిలీ -
Fashion: ఇకత్ స్టైల్.. ఎవర్గ్రీన్
ఇకత్ కాటన్ వేసవి ఉక్కపోతను తట్టుకుంటుంది. సంప్రదాయకతను కళ్లకు కడుతుంది. ఆధునికతనూ సింగారించుకుంటుంది. ఈ ఫ్యాబ్రిక్ కలనేతలోనే ఎవర్గ్రీన్ అనిపించే గొప్పదనం దాగుంటుంది. ఇక ఈ ఫ్యాబ్రిక్‌తో డ్రెస్సులను సందర్భానికి తగినట్టు డిజైన్ చేయించుకోవచ్చు. ఒకప్పుడు బెడ్షీట్స్గానే పేరొందిన ఇకత్ ఆ తర్వాత చీరలు, డ్రెస్సుల రూపంలోకి మారి అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంది. క్యాజువల్ వేర్‌గానూ, పార్టీవేర్‌గానూ, అఫిషియల్ వేర్‌గానూ తన ప్రత్యేకతను చాటుతూనే ఉంది. ఇండోవెస్ట్రన్ స్టైల్లో డిజైన్ చేసిన ఇకత్ డ్రెస్సులు ఈ తరం అమ్మాయిలను, అమ్మలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అబ్బాయిలకు కుర్తీలు, అమ్మాయిలకు ఫ్రాక్స్, లాంగ్ గౌన్స్తో పాటు వీటికి ఈ కాలానికి తగినట్టు మ్యాచింగ్‌గా ఇకత్ మాస్క్‌లను కూడా జత చేసుకోవచ్చు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉండే ఇకత్ సింగిల్, డబుల్, పట్టులో లభిస్తుంది. కాటన్లో అయితే యంగ్‌స్టర్స్‌కి ఫ్రాక్స్. మోడలింగ్‌కి ప్యాంట్–క్రాప్‌టాప్ విత్ ఓవర్ కోట్, లాంగ్గౌన్స్ చిన్న చిన్న గెట్ టు గెదర్ పార్టీలకు హ్యాపీగా ధరించవ్చు. ఇది చేనేతకారులను ప్రోత్సహించాల్సిన సమయం. ఇకత్ క్లాత్‌తో ఎన్ని డిజైన్లు చేసుకోగలిగితే అన్నీ ప్రయత్నించవచ్చు. అందుకు కొన్ని మోడల్స్ ఇవి. – రజితారాజ్, డిజైనర్, హైదరాబాద్ -
Summer Collection: ఇండియన్ కలంకారీ
చీర మొదటిసారి కట్టుకోవడానికి ప్రయత్నించే అమ్మాయిలు సోషల్ మీడియాలో తమ లుక్స్ అప్డేట్ చేసుకోవాలనుకునే మగువలు కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునే వేడుకలకు హాజరయ్యే అతివలు ఇలా కలంకారీ శారీ, క్రాప్‌టాప్ ధరించి కొత్తగా మెరిసిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని కాళహస్తి పెన్‌కలంకారీ కళకు ప్రసిద్ధి. కాటన్ చీరల మీద వేసే కలంకారీ డిజైన్‌లో పూర్తిగా సేంద్రీయ రంగులు వాడుతుంటారు. ఏ కాలమైనా మేనికి హాయినివ్వడంతో పాటు, ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపించడం కలంకారీ ప్రత్యేకత. ఈ స్పెషల్ శారీకీ ఇంకొన్ని స్టైలిష్ హంగులు అద్దితే మోస్ట్ బ్యూటిఫుల్ అనకుండా ఉండలేరు. మిడీస్, స్కర్ట్స్ మీదకు వాడే క్రాప్‌టాప్స్.. షర్ట్ స్టైల్ లాంగ్ బ్లౌజులను ఈ స్టైల్‌కి ఎంచుకోవచ్చు. వయసుతో నిమిత్తం లేకుండా, బొద్దుగా ఉన్నవారు కూడా ఈ స్టైల్‌ని ఎంచక్కా ఫాలో అవ్వచ్చు. ఇది ఇండోవెస్ట్రన్ స్టైల్ కాబట్టి బంగారు ఆభరణాలకన్నా ఫంకీ జ్యువెలరీ మరింత వన్నె తీసుకొస్తుంది. టెర్రకోట, జర్మన్ సిల్వర్, ఫ్యాబ్రిక్.. ముఖ్యంగా హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ ప్రత్యేక అందాన్ని తీసుకువస్తుంది. మేకప్‌తో పెద్దగా పనిలేదు. హెవీగా మేకోవర్ అంతకన్నా అవసరం లేదు. సింపుల్ అండ్ స్టైలిష్ అనిపించే ఈ తరహా డ్రెస్సింగ్‌ను మీరూ ఫాలో అవ్వచ్చు. ఈ వేసవి వేడుకలను మరింత హాయిగా ఎంజాయ్ చేయచ్చు. హేమంత్ సిరీ ఫ్యాషన్ డిజైనర్ హైదరాబాద్ మరిన్ని డిజైన్లు.. Women Party Wear Dresses: పార్టీవేర్.. సీజన్కేర్.. Fashion: చేనేతలతో సీజన్ వేర్ చేనేత చీరల్లో ప్రస్తుతం వేటికి డిమాండ్ ఉంది? -
Women Party Wear Dresses: పార్టీవేర్.. సీజన్కేర్..
సీజన్‌కు తగ్గట్టు స్టైల్‌గా ఉండాలి వేడుకకు తగ్గట్టు బ్రైట్‌గా ఉండాలి అంతకుమించి కంఫర్ట్ ఉండాలి డిజైనర్ క్రాప్‌టాప్స్, పలాజో స్కర్ట్స్‌తో సింపుల్ అండ్ మార్వలెస్ అంటూ మార్కులు కొట్టేయడం ఇప్పుడిక సూపర్ ఈజీ. రాబోయేది పెళ్ళిళ్ల సీజన్. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తక్కువ మందితో సింపుల్‌గా కుటుంబసభ్యుల మధ్యన మాత్రమే వేడుకలు జరిగే అవకాశాలున్నాయి. బర్త్‌డే పార్టీ అయినా, చిన్న చిన్న గ్యాదరింగ్స్ అయినా తక్కువ మందితో జరుపుకునే వేడుక ల్లో మీరు బ్రైట్‌గా వెలిగిపోవాలంటే సింపుల్ ఐడియా స్కర్ట్ పలాజో, డిఫరెంట్ క్రాప్‌టాప్. అందులోనూ ఇది వేసవి కూడా కావడంతో ధరించే డ్రెస్ సౌకర్యంగానూ ఉండాలి. అదే టైమ్‌లో బ్రైట్‌గా కనిపించాలి. స్టైలిష్ అనిపించాలి. ఈ హంగులన్నీ తీసుకువచ్చే ఇండోవెస్ట్రన్ స్టైల్‌ని కాటన్ ఫ్యాబ్రిక్‌తోనే ప్లాన్ చేసుకోవచ్చు. సౌకర్యమే ఫస్ట్ ప్రింటెడ్ కాటన్‌తో డిజైన్ చేసిన డ్రెస్సులివి. క్యాజువల్ వేర్కి, పార్టీవేర్‌కి వాడుకోదగినవి. ఇకత్ కాటన్, హకోబా కాటన్, ప్రింటెడ్ కాటన్స్ని పలాజో డిజైన్‌కి తీసుకున్నాం. పలాజోలు ఇష్టం లేనివారు ఇదే ప్యాటర్న్‌తో స్కర్ట్‌లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. వీటికి కాంబినేషన్‌గా ఫ్లోరల్ షిఫాన్, చందేరీతో డిజైన్ చేసిన క్రాప్‌టాప్స్, పెప్లమ్ స్టైల్ క్రాప్‌టాప్ జత చేశాం. ఈ డ్రెస్సింగ్ బర్త్‌డే వంటి పార్టీలకు బాగా నప్పుతాయి. ఇది వేసవి కాబట్టి ఈ డ్రెస్సింగ్ చాలా సౌకర్యంగా ఉంటుంది. అమ్మాయిలకు మాత్రమే ఈ డ్రెస్సులు బాగుంటాయి అనుకోనక్కర్లేదు. అన్ని వయసుల వారూ ఈ డ్రెస్సింగ్ స్టైల్‌ను కొన్ని మార్పులతో ప్లాన్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఈ స్టైల్‌కు నప్పే దుపట్టాను కూడా జత చేసుకోవచ్చు. భార్గవి అమిరినేని ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ -
షాపింగ్ బ్యాగులతో వినూత్నంగా డ్రెస్సులు
షాపింగ్‌కు నుంచి వచ్చేటప్పుడు వెంట అక్కడి బ్యాగ్ కూడా మనతో పాటు వచ్చేస్తుంది. అలా ఒక్కోటిగా పేరుకుపోయిన బ్యాగులను మూలన పడేయడం లేదా చెత్తబుట్ట పాలు చేయడం సాధారణంగా చూస్తుంటాం. 22 ఏళ్ల టీచా ఏరియల్ మాత్రం వినూత్నంగా ఆలోచించింది. రకరకాల షాపింగ్ బ్యాగులతో డిజైనర్ డ్రెస్సులను రూపొందిస్తుంది. ఆ డ్రెస్సులను ధరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఆమె ఆలోచనను యూజర్స్ తెగ ప్రశంసిస్తున్నారు. వేస్టేజ్‌ను ఎలా తిరిగి వాడుకోవచ్చో ఈ విధానం భేషుగ్గా తెలియజేస్తుందని లైక్‌ల మీద లైకులు ఇస్తున్నారు. ఏరియల్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ విద్యార్థి. తను చేసిన ఆలోచన మాత్రం ప్రపంచమంతా ఆకట్టుకునేలా ఉంది. షాపింగ్ బ్యాగుల నుండి అధిక మొత్తంలో ఫ్యాషన్ దుస్తులను సృష్టించిన ఘనత ఏరియల్ సొంతం. ఆమె తన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు సరదాగా వచ్చిన ఆలోచనను ఇలా ఆచరణలో పెట్టేసింది. ఆధునిక కాలంలో వస్తున్న మార్పులకు తగ్గట్టు చేసే ఆలోచనల్లో షాపింగ్ బ్యాగ్ డ్రెస్సులు క్లిక్ అయ్యాయి. ఒక్కో బ్యాగ్ కట్ చేసి.. వినూత్నంగా డ్రెస్సులు తయారు చేయడానికి ఇంట్లో స్టోర్ రూమ్‌లో ఉంచిన బ్యాగ్‌లను బయటకు తీసుకువచ్చింది. లాక్డౌన్ టైమ్ ఈ సృజనకు కొంత ఊతమిచ్చింది. ‘మొదట్లో ఖాళీ సమయం బాగా విసుగ్గా అనిపించేది. ఎప్పుడైతే షాపింగ్ బ్యాగుల నుండి ఫ్యాషన్ డ్రెస్సులను తయారుచేయాలనే ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి సమయమే తెలియలేదంటుంది’ ఏరియల్. డ్రెస్సుల కోసం వాల్‌మార్ట్, టార్గెట్, వేన్స్, ట్రేడర్ జో బ్రాండ్ బ్యాగ్‌లను ఉపయోగించింది. ఆమె తన ఫ్రెండ్‌తో కలిసి ప్రతి సంచిని జాగ్రత్తగా కట్ చేసి, అమరిక ప్రకారం కుట్టింది. మిగిలిన సంచుల మెటీరియల్ నుండి అందమైన ఉపకరణాలనూ తయారు చేసింది. మనం ఉపయోగించి, పడేసే వస్తువులను తిరిగి ఎన్నిసార్లు వాడదగినవి రూపొందించుకోవచ్చో తన ప్రయత్నంతో తెలియజేస్తుంది. ఏరియల్ డ్రెస్ డిజైన్స్ చూసినవారు తాము కూడా అలాంటి దుస్తులు డిజైన్ చేస్తామని తెలిపారు. ఈ షాపింగ్ సంచుల నుండి కర్టెన్లు, రగ్గులు, ఇతర వాడదగిన వస్తువులను ఎలా ఉపయోగించాలో ప్రజలు నేర్చుకోవాలని ఈ అమ్మాయి కోరుతుంది. -
లాక్మే సంపూర్ణ స్టయిల్
ఏ నెల అయినా... ఏ కాలమైనా ఇకత్, కాటన్ హ్యాండ్లూమ్స్తోడిజైన్ చేసిన డ్రెస్సులుఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి.దాదాపు నూట యాభై ఏళ్ల క్రితం వచ్చిన అమెరికన్ నవల ‘లిటిల్ ఉమెన్’లోనిజో మార్చ్ పాత్రనుస్ఫూర్తిగా తీసుకొనిడిజైన్ చేసిన డ్రెస్సులుఈ ఆధునిక కాలానపరిచయం చేశారు‘ఎకా’ లేబుల్ డిజైనర్ రీనా సింగ్. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టిస్కో)సహకారంతో తెలంగాణ వస్త్రాలకు అధునికతను జోడించిఇటీవల జరిగిన లాక్మే ఫ్యాషన్ వేదిక మీద ప్రదర్శించారు. హ్యాండ్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన ఇకత్ కాటన్ జాకెట్లో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వేదిక మీద ఆకట్టుకుంది. స్టైలిష్ ప్రింటెడ్ స్పగెట్టి టాప్, వెల్వెట్ వైడ్ లెగ్హ్యాండ్ ఎంబ్రాయిడరీ ప్యాంటు మీద కాటన్ జాకెట్‌ను ధరించింది. చేత్తో చేసిన జర్దోసీ, అందమైన పువ్వులు, కాలర్, కఫ్స్, పాకెట్స్, బెల్ట్‌ల వంటి వాటితో ఈ కలెక్షన్‌కి అదనపు హంగులు తీసుకొచ్చారు. హ్యాండ్లూమ్స్‌తో ప్లీటెడ్ స్కర్ట్స్, బాక్సీ జాకెట్లు, లాంగ్ కోట్లు, లేయర్డ్ దుస్తులను ప్రదర్శించారు రీనా సింగ్. డిజైన్లలో సున్నితమైన లేస్, వెడల్పాటి పొరలు, ఉన్ని ఫ్లాయిడ్, ఆర్గన్జా ఆప్లిక్ వర్క్ కనిపిస్తాయి. అల్లికలు, రంగుల మిశ్రమంతో ఈ డిజైన్స్ ఉంటాయి. ఢిల్లీ ఫ్యాషన్ డిజైనర్ రీనా సింగ్ ‘ఎకా’ లేబుల్‌తో ఈ ఏడాది లాక్మే ఫ్యాషన్ వీక్ వేదిక మీద తెలంగాణ చేనేత కారులు రూపొందించిన ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన కలెక్షన్నుప్రదర్శించి, కనువిందు చేశారు. తన డిజైనర్ దుస్తుల గురించి ప్రస్తావిస్తూ – ‘19వశతాబ్దిలో అమెరికా రచయిత్రి లూయిసా మే అల్కాట్స్ నవల ‘లిటిల్ ఉమెన్’లోని జో మార్చ్ పాత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ డిజైన్స్ చేశాను. టామ్‌బాయ్ నుంచి సంపూర్ణ స్త్రీగా మారిన జో మార్చ్ ఈ డిజైన్స్‌కి ప్రేరణ. నా డిజైన్స్‌కి అంతర్జాతీయ మార్కెట్ రావాలి. దాంట్లో భాగంగా తెలంగాణ చేనేతల గురించి తెలుసుకున్నాను. డబుల్, సింగల్ ఇకత్ కోసం తెలంగాణలోని కోవలగూడెం, టస్సర్ సిల్క్‌కి మహదేవ్పూర్, కాటన్ ఫ్యాబ్రిక్‌కి నారాయణ్‌పేట్ ప్రాంతాల నేతకారులను కలిశాను. తెలంగాణ పొడి వాతావరణం కనుక ఇక్కడ సిల్క్ కాటన్‌తో మిక్స్ చేసిన ఫ్యాబ్రిక్ ప్రధానంగా ఉంటుంది. స్పన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మందంగా ఉంటుంది. అందుకని మూలాంశం దెబ్బతినకుండా పట్టు, పత్తి ట్విస్టెడ్ దారాలకు డైయింగ్ చేసి నేయడంతో వీటికి మరింత వన్నె వచ్చింది. ఫ్యాషన్ పరిశ్రమలో అతి పెద్ద కాలుష్యకారకాలు దుస్తులే. ఈ రోజు మోడల్ రేపటికి పాతదైపోతుంది. డిజైన్స్ అందుకు వాడే ఫాబ్రిక్ ప్రతి సీజన్లోనూ ధరించేలా ఉండాలి. ఈ తరహా వస్త్రాలను ప్రపంచ దృష్టికి తీసుకురావడానికి ఈ ప్రాంతంలో మరింత కృషి చేయాలనుకుంటున్నాను’ అని తెలిపారు రీనా సింగ్. -
ఫిట్ సెట్ గ్లో
ఏ వయసు వారికైనా కుర్తా–పైజామా వన్నె తెస్తుంది. సరైనా టాప్ సరిపోయే బాటమ్ ఎంచుకుంటే ఆకృతి అదిరిపోతుంది. రెగ్యులర్‌గా వేసుకోవడానికి పార్టీల్లో ధరించడానికి వీలుగా దుపట్టాలను, టాప్స్‌ను ఎలా ఎంచుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నాం. కుర్తా–పైజామా సెట్‌ను ఫిట్‌గా స్టిచ్ చేయించుకోండి. సౌందర్యంతో వెలిగిపోండి. ►ఈ కుర్తా సెమీ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసినది. దీనికి చికంకారి, సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ ఉన్న ఫ్యాబ్రిక్‌ని యోక్‌కి, స్లీవ్స్‌కి వాడారు. అదనంగా స్లీవ్స్‌కి ఫ్రిల్స్ వాడటంతో ఆకర్షణీయంగా మారింది. ఫ్రిల్స్, గ్యాదర్స్, టాజిల్స్ ఫ్యాషన్‌లో ఉన్నాయి కాబట్టి వీటిని ఉపయోగిస్తూ చేసిన డిజైన్ ఇది. లైట్ గోల్డ్ కలర్ బార్డర్ని నెట్ దుపట్టాకు జత చేశారు. సేమ్ కలర్ ప్రింటెడ్ ట్రౌజర్ని బాట మ్గా వేశారు. ►ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన కుర్తా. స్కర్ట్ పార్ట్‌ని సర్క్యులర్ ఫ్లెయిర్ తీసుకున్నారు. జార్జెట్ దుపట్టా. యోక్లో సెల్ఫ్కలర్ కట్‌దానా ఎంబ్రాయిడరీ చేశారు. ఫ్లెయిర్ ఉన్న స్కర్ట్ పార్ట్‌కి సెల్ఫ్ కలర్లో మిషన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేశారు. దుపట్టా జార్జెట్. అంచులు థ్రెడ్ ఎంబ్రాయిడరీ. రెండింటిలో ఆఫ్‌వైట్ కాంబినేషన్ ఉంది కాబట్టి బాటమ్‌గా హాఫ్‌వైట్ తీసుకున్నారు. ►ఇది రా సిల్క్ కుర్తా. ఈ ఫ్యాబ్రిక్‌లో ప్లెయిన్నే ఎక్కువ ఉపయోగిస్తుంటారు. ఇది రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న ఫ్యాబ్రిక్. సింగిల్ ఫ్యాబ్రిక్‌లోనే హై నెక్ తీసుకున్నారు. ఈ షేడ్‌ను అడ్డంగానూ, నిలువుగానూ తీసుకోవచ్చు. ఇప్పుడు మోచేతుల వరకు స్లీవ్స్ ఉండటం అనేది ఫ్యాషన్‌లో ఉంది కాబట్టి ఇలా తీసుకోవచ్చు. దుపట్టా నెట్ది తీసుకొని రెండు షేడ్స్ వచ్చేలా డై చేయించి, లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌తో చేసిన ఎంబ్రాయిడరీ అంచును దుపట్టాకు జత చేశారు. స్లిమ్ ఫిట్ ట్రౌజర్, యాంకిల్ లెంగ్త్ లెగ్గింగ్ బాటమ్‌గా వాడుకోవచ్చు. ►శాటిన్ ఆనియన్ పింక్ అనార్కలీ ఇది. కలీ భాగాన్ని ఐదు మీటర్లతో డిజైన్ చేశారు. దీనికి ముదురు మెరూన్ కలర్ నెట్ దుపట్టా ఇచ్చారు. దుపట్టా అంచులకు టాజిల్స్ను జత చేశారు. నెక్కి, స్ట్రెయిట్ లైన్‌కి స్వీక్వెన్స్, బీడ్స్‌తో ఎంబ్రాయిడరీ చేశారు. దుపట్టా రంగులో ఉన్న కాటన్ సిల్క్ ట్రౌజర్ని బాటమ్‌గా ఉపయోగించారు. ►చందేరీ బ్రొకేడ్‌తో డిజైన్ చేసిన చైనీస్ నెక్ అనార్కలీ ఇది. 90ల కాలంలో పఫ్ స్లీవ్స్ ఫ్యాషన్‌లో ఉండేవి. ఇప్పుడు ఇవి ట్రెండ్‌లో ఉన్నాయి కాబట్టి ఈ స్లీవ్స్ జత చేశారు. ఆర్గంజా దుపట్టాకి ఫ్రిల్స్ జత చేశారు. అయితే, ఈ ఫ్రిల్స్కి వైర్ పీకో చేయడంతో వంపులు తిరిగినట్టు వస్తుంది. రెగ్యులర్ చుడీకన్నా స్టైలిష్ లుక్ కోసం యాంకిల్ లెంగ్త్ లెగ్గింగ్ వేసుకుంటే బాగుంటుంది. ►శాటిన్ ప్రింటెడ్ ఫ్యాబిక్తో డిజైన్ చేసిన కుర్తా ఇది. కుర్తాకి నడుము దగ్గర నుంచి సైడ్ స్లిట్ తీసుకున్నారు. బీడ్స్‌తో ఎంబ్రాయిడరీ చేసిన నెక్‌లైన్‌ని జత చేశారు. బ్లాక్ గ్రే కాంబినేషన్లో ఉన్న ప్రింట్ కాబట్టి గ్రే కలర్ నెట్ దుపట్టాకు తీసుకున్నారు. దీనికి సన్నని స్టోన్స్ స్టిక్ చేశారు. ఈ దుపట్టాకి శాటిన్ ఫ్రిల్ లైన్‌ని తయారుచేసి జతచేశారు. కుర్తా కి వైట్, గ్రే ప్రింట్ ఉంది కాబట్టి దుపట్టాను కూడా అదే కలర్ కాంబినేషన్‌తో డిజైన్ చేశారు. మంగారెడ్డి ఫ్యాషన్ డిజైనర్ mrstitchingsolutions@gmail.com -
ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థిని ఆత్మహత్య
మలక్‌పేట: ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి ..సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్‌కు చెందిన జన్వాడ రాజు కుమార్తె స్పందన(21), కుమారుడు అభినయ్ మూసారంబాగ్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ నగరంలో విద్యాభ్యాసం చేస్తున్నారు. స్పందన బషీర్‌బాగ్‌లోని బొన్ఫైర్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. కొరియర్ కోసం ఆదివారం రాత్రి ఆమె సోదరుడు బయటికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న స్పందన సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన అభినయ్ ఆమెను యశోద ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై బలరాజ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్యాడ్ గర్ల్
కోయంబత్తూరులోని గణపతి ప్రాంతానికి వెళ్లి ఇషానా గురించి అడిగారంటే వెంటనే ‘ఆనా క్రియేషన్స్ ఆనా క్లాత్ ప్యాడ్స్’ దుకాణం చూపిస్తారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ప్రఖ్యాత ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలూ గుర్తెరగగలిగిన పద్దెనిమిదేళ్ల ఇషానా గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే చిరుపారిశ్రామికవేత్తగా ఆమెకు తెలియకుండా ఆమె చేత పరిస్థితులు వేయించిన తొలి అడుగులలోకి వెళ్లాలి. ముస్లిం మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది ఇషానా. 2018లో ప్లస్ టూ వరకు కోయంబత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడే ప్యాషన్ డిజైనింగ్ లో భాగంగా మిషన్ కుట్టడం నేర్చుకుంది. అదే సమయం పర్యావరణ పరిరక్షణకు పనిచేసిన బృందంలో సభ్యురాలిగా ఉంది. ఆమె ఆర్థిక స్తోమత ఉన్నత చదువులకు వెళ్లకుండా ఆమెను అడ్డుకోవడమే కాకుండా.. ప్రతి యువతికి యవ్వనంలో నెలసరికి అవసరమయ్యే శానిటరీ ప్యాడ్స్ కొనుగోలుకూ అవరోధం అయింది. అదే ఆమెలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టేలా చేసింది. నాటి తరంలో ఆడవారు క్లాత్ ద్వారానే నెలసరిని ఎదుర్కొనటం, వాటి కారణంగా పర్యావరణానికి కూడా ఎటువంటి నష్టం వాటిల్లక పోవటంపై ఇషానా పలు ఆర్టికల్స్ తిరగేసేలా చేసింది. చివరికి ఇషానా చేత క్లాత్ ప్యాడ్ నాప్కిన్స్ తయారికీ నాంది పలికించింది. నాన్న దాచిన డబ్బే పెట్టుబడి స్థానికంగా కాటన్ మిల్స్ లో దొరికే పల్చటి పాప్లిన్ క్లాత్ పీస్ ద్వారా ప్యాడ్స్ తయారు చేసి వాటిని మధ్యలో పెట్టి వాషబుల్ నాప్కిన్స్ తయారు చేయటం మొదలు పెట్టింది ఇషానా. ముందుగా తాను వాడి చూసి, తన స్నేహితులు, ఇరుగు పొరుగు వారి వినియోగానికి అందించింది. వారి నుంచి వచ్చిన సానుకూల స్పందన ఇషానాలో ఆత్మవిశ్వాసం పెంచేలా చేసింది. దాంతో తన ప్రాడక్ట్‌ని మార్కెట్ లోకి విడుదల చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఆర్థికంగా సహాయం చేసే వారు లేకపోవటంతో పెట్టుబడి కోసం తన తల్లిదండ్రులను డబ్బు అడిగింది. ఇస్మాయిల్, సబీనా ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగులు. అయినప్పటికీ కూతురి ఆసక్తి, ప్రతిభ గమనించిన తండ్రి ఆమె పెళ్లి కోసం దాచిన నాలుగు లక్షలు ఇషానా చేతిలో పెట్టాడు. తండ్రి నమ్మకమే పెట్టుబడిగా తన ఇంటిపక్కనే ఉన్న ఒక షాపును అద్దెకు తీసుకుని ఐదు కుట్టు మిషన్లు కొనుగోలు చేసి పది మంది మహిళల సాయంతో గత మే నెలలో వాషబుల్ (ఉతికి వాడే) నాప్కిన్స్ తయారీ మొదలు పెట్టింది. రెండునెలల క్రితం వరకు కోయంబత్తూరు నగరానికే పరిమితమైన ఈ న్యాప్కిన్ల అమ్మకాలు ఆన్లైన్ తోపాటు, తమిళనాడులోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. వంద మందికి ఉపాధి! ఆరంభంలో రోజుకు వందల సంఖ్యలో తయారీతో సరిపెట్టుకున్న ఇషానా.. ఇప్పుడు వేల ప్యాడ్స్ తయారీలో చిన్నపారిశ్రామికవేత్తగా మారింది. ప్రస్తుతం ఇషానా దగ్గర ఇరవై మంది మహిళలు పని చేస్తుండగా బయట నుండి సుమారు ఎనభై మంది మహిళలు రోజుకు అరవై నుండి డెబ్భై ప్యాడ్స్ కుట్టి ఆమెకు అందిస్తున్నారు. వాటి ద్వారా ప్రతి మహిళకు ఉపాధితోపాటు రోజుకు 400–500 రూపాయలు ఇంటి నుండే సంపాదించుకునే అవకాశం లభిస్తోంది. ఒకవైపు వందకుపైగా మహిళలకు ఉపాధి, మరోవైపు చిన్న తరహా పరిశ్రమతో పద్దెనిమిదేళ్ల వయస్సులో యువ పారిశ్రామికవేత్తగా ఇషానా ఇప్పుడు కోయంబత్తూరు నగరానికి గర్వకారణంగా నిలుస్తోంది. ఈ విషయమై ఇషాను కదిలిస్తే నిండుగా నవ్వుతుంది. ‘‘ఇది నాపై నమ్మకం పెట్టుకున్న నా తల్లిదండ్రుల విజయం’’ అంటుంది. తన ఉత్పత్తికి పేటెంట్ హక్కేమీ తీసుకోలేదని, ఎవరైనా తన వద్దకు వస్తే తయారీ విధానం నేర్పుతానని అంటోంది. – సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి సాక్షీ టీవీ, చెన్నైబ్యూరో -
సందడిగా హాలోవీన్ నైట్
-
లఖోటియా : ఫ్రెషర్స్ హుషార్
-
ప్యారిస్ టూర్ అన్నారు.. తిండికీ దిక్కులేదు
దొడ్డబళ్లాపురం: ‘ఫ్యాషన్ రాజధాని అయిన ప్యారిస్ నగరాన్ని చూపిస్తాం. అద్భుతమైన టీచింగ్, మంచి ఉద్యోగాలు గ్యారంటీ అన్నారు. తీరా క్లాసులకి వెళ్తే బోధకులు కూడా లేరు’ అని విద్యార్థులు లబోదిబోమన్నారు. లక్షలకొద్దీ ఫీజులు దండుకుని సౌకర్యాలు కల్పించని కాలేజీ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా విద్యార్థులు ధర్నా చేసిన సంఘటన దొడ్డబళ్లాపురం అపెరల్ పార్కులోని ఓ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజీలో చోటుచేసుకుంది. విద్యార్థుల్లో అధికమంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. మంగళవారం సాయంత్రం నుండి అర్థరాత్రి వరకూ విద్యార్థులు తరగతులు భహిష్కరించి కాలేజ్ మెయిన్ గేట్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెలుగు విద్యార్థులు అమత, కీర్తన తరదితరులు కాలేజీలో చేరేముందు అనేక హామీలు ఇచ్చిన యాజమాన్యం, విద్యార్థులు చేరాక తమ సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. కాలేజీ గేట్ వద్ద బైఠాయించిన విద్యార్థులు ప్లేస్మెంట్లు లేవు, ఫ్యాషన్ షోలు లేవు ముఖ్యంగా ప్లేస్మెంట్లు కల్పించడం లేదని, ఫ్యాషన్ షోలు, గ్రాడ్యుయేషన్ డేలు నిర్వహించడం లేదని వాపోయారు. విద్యార్థులందరికీ ఒకే మొత్తం ఫీజు కాకుండా రూ.3 లక్షల నుండి 15 లక్షల వరకూ వసూలు చేశారన్నారు. తీరా కాలేజీలో చూస్తే టీచర్లు లేరని, ల్యాబ్‌లు, ఎక్విప్మెంట్లు అస్సలు లేవన్నారు. లక్షల ఫీజులు వసూలు చేసిన మంచి నీరు,నాణ్యమైన ఆహారం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇదేమని ప్రశ్నిస్తే సిబ్బంది బెదిరిస్తున్నారని, డిగ్రీ క్యాన్సిల్ చేయిస్తానని, అంతు చూస్తామని సర్టిఫికెట్లు ఇవ్వకుండా హెచ్చరిస్తున్నారన్నారు. కాలేజ్‌లో చేరిన మొదటి రోజుల్లో విద్యార్థులను ప్యారిస్ తీసికెళ్తామని చెప్పారని, అందుకు డబ్బులు కూడా అధికంగా కట్టించుకుని ఇప్పుడు ఆ వూసే ఎత్తడం లేదన్నారు. తరచూ ప్రిన్సిపాల్స్ మారుతుండడంతో కాలేజీలో చెప్పుకోడానికీ దిక్కులేకుండాపోయిందన్నారు. కాలేజీ ఫీజులుకాక అధికంగా వివిధ రకాలుగా ఫీజులు గుంజుతున్నారన్నారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ కాలేజీలో చేరితే నిలువునా ముంచేసారని భోరుమన్నారు. అనంతరం పోలీసుల జోక్యంతో విద్యార్థులు ధర్నా విరమించారు. -
కాదెవరూ ఫ్యాషన్‌కు అనర్హం
సాక్షి, హైదరాబాద్: మీరెప్పుడైనా లావుగా, బొద్దుగా ఉన్నవాళ్లు మోడల్స్‌గా ఉండటం చూశారా ? అన్నీ ప్రముఖ షాపింగ్ మాల్స్‌లోనూ, ఈ-కామర్స్ సంస్థల్లోనూ కాస్త సన్నగా, నాజూకుగా ఉన్నవారినే మోడల్స్‌గా తీసుకొని తమ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసుకుంటారు. అయితే ఈ సాంప్రదాయ పద్దతికి మేము వ్యతిరేకం అంటోంది యునైటెడ్ కింగ్డామ్ (యూకే)కి చెందిన ‘ప్రిటీ లిటిల్‌థింగ్’ (పీఎల్టీ) అనే రిటైల్ సంస్థ. తమ ఉత్పత్తులను స్థూలకాయులకు చేరువ చేసేందుకు హెయిలీ బాల్డవిన్ అనే సంస్థతో ప్రిటీ లిటిల్‌థింగ్ జతకట్టింది. దీనికై నాజూకుగా ఉన్న మోడల్స్‌తో పాటు బొద్దుగా (ప్లస్ సైజ్) ఉన్న పలువురిని ఎంపిక చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ట్విటర్లో ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ఆన్లైన్ సంస్థలు స్థూలకాయులకు సరిపడా సైజు దుస్తులను సరిగా చూపలేకపోవడంతో దుస్తుల ఎంపికలో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడక్కడా దొరికినప్పటికీ అవి అంతగా సంతృప్తిని ఇవ్వడం లేదని అంటున్నారు. ఈ సందర్భంలో వెలుగులోకి వచ్చిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ, వారికి కావాల్సిన దుస్తులను విభిన్న సైజుల్లో ఉన్న మోడల్స్ ద్వారా చేరువ చేస్తామని అంటోంది. అంటే ఇకపై లావుగా కనిపించే మోడల్స్ ఫోటోలు సైతం ఆ సంస్థ వెబ్సైట్లో కనిపించనున్నాయి. బొద్దుగా ఉన్నవారు ఏ బెరుకు లేకుండా తమకు సరిపడా దుస్తులను ఎంపిక చేసుకోవచ్చు. నెటిజన్లంతా ఈ మార్పును ఆహ్వానించడమే గాక, ఈ నిర్ణయం తీసుకున్న పీఎల్టీ సంస్థను ప్రశంసిస్తున్నారు. మహిళలు దీన్ని ట్విటర్లో షేర్ చేస్తూ ఇదో మంచి ఉద్యమమని అభిప్రాయపడుతున్నారు. -
ఆర్గానిక్ అటెన్షన్
ఇప్పుడంతా నేచురల్ ట్రెండ్. తినే తిండే కాదు...ధరించే దుస్తులూ సహజసిద్ధంగా రూపొందించినవే కావాలనే శ్రద్ధఅందరిలోనూ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే కొన్ని బ్రాండెడ్ దుస్తులు మార్కెట్లోకి రాగా... ఇప్పుడిప్పుడే సిటీ డిజైనర్లు కూడా ఆర్గానిక్ దుస్తులకు అడ్రెస్‌గా మారుతున్నారు. సిటీ యువ డిజైనర్ సంతోష్ ఇటీవల జరిగిన పుణె ఫ్యాషన్ వీక్‌లో పూర్తిస్థాయి ఆర్గానిక్ దుస్తులను ప్రదర్శించి... అగ్రగామి ఫ్యాషన్ వేదికలపై ఇలాంటి కలెక్షన్‌ను ప్రదర్శించిన తొలి సిటీ డిజైనర్‌గా ఘనతసాధించాడు. ఈ సందర్భంగా సంతోష్ ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివీ... సాక్షి, సిటీబ్యూరో : మనం ధరించే ప్రతిది రకరకాల రసాయనాలు వినియోగించి తయారు చేసిందే. తెల్లని కాటన్ దుస్తుల తయారీలోనూ ఆ రంగు కోసం కెమికల్స్ వాడతారు. రసాయనరహితంగా పూర్తి ఆర్గానిక్ దుస్తుల తయారీ అనేది కొంత సాహసంతో కూడిన ప్రయోగమేనని చెప్పాలి. ఇదే పుణె ఫ్యాషన్ వీక్ నిర్వాహకులను ఆకట్టుకుంది. పుణె భేష్ అనే.. దేశంలోని అగ్రగామి ఫ్యాషన్ ఫెస్టివల్స్‌లో ఒకటైన పుణె ఫ్యాషన్ వీక్‌లో నా డిజైన్స్‌కు మంచి ఆదరణ లభించింది. అక్కడికి వచ్చిన వారంతా నాకన్నా దాదాపు 10ఏళ్లు సీనియర్స్. ఆర్గానిక్ వర్క్ అనేది అంతర్జాతీయ స్థాయి డిజైనర్లు మాత్రమే సాహసించేది కావడంతో మంచి ప్రశంసలు వచ్చాయి. నా డిజైన్స్‌కు అక్కడి ఆంగ్ల పత్రికల్లో వచ్చినరివ్యూల ద్వారా జాతీయ స్థాయిలో నిర్వహించే మరో 4 ఫ్యాషన్ వీక్స్‌లో అవకాశాలు నా తలుపు తట్టాయి. అందరూ అనుకున్నట్టు ఇవేవీ అంత ఖరీదైనవి కూడా కాదు. ఉత్పత్తి వ్యయం కూడా మీటర్‌కి రూ.1,000లోపే అవుతుంది. అయితే వీటి వాడకంపై ప్రజకల్లో అవగాహన పెరగాల్సి ఉంది. అందుకే ఇకపై ప్రతి ఏటా ఆర్గానిక్ దుస్తుల తయారీని ప్లాన్ చేస్తున్నాను. నా షోలలో తప్పకుండా ఒక సీక్వెన్స్ దీనికి కేటాయించాలని నిర్ణయించుకున్నాను. షేడ్స్ తక్కువ.. సమయం ఎక్కువ దేశంలో ఇప్పటికే కొన్ని బ్రాండ్స్ నేచురల్ డైస్‌తో చేసిన దుస్తులు విక్రయిస్తున్నప్పటికీ, ఏవీ 100 శాతం ఆర్గానిక్ అని చెప్పలేం. ఎందుకంటే పూర్తిగా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్, డైతో తయారు చేసినవి తక్కువ షేడ్స్‌లో మాత్రమే లభ్యమవుతాయి. ఆర్గానిక్ దుస్తులకు కాటన్, లెనిన్, పట్టు... ఫ్యాబ్రిక్స్ మాత్రమే నప్పుతాయి. అలాగే ఈ దుస్తుల తయారీకి మిగిలిన వాటితో పోలిస్తే పట్టే సమయం కూడా బాగా ఎక్కువ. పుణె ఫ్యాషన్ వీక్ కోసం నేను రూపొందించినఆర్గానిక్ దుస్తుల తయారీలో ఫ్యాబ్రిక్ మొత్తం చేనేతలనేవినియోగించాను. సిద్ధిపేటలోని ఆదర్శ్ సొసైటీ ఆధ్వర్యంలోడాక్టర్ సునంద ఈ ఫ్యాబ్రిక్స్ తయారీ చేయించారు. అదే విధంగా ఉల్లిపాయ, పసుపు వంటి దినుసులతో పాటు చెట్ల ఆకులు, కాండం, వేర్లను ఉపయోగించి ఆకుపచ్చ, బ్లూ, ఎల్లో, బ్రిక్ షేడ్స్‌తో రంగులు సృష్టించాం. కొంచెం డల్ ఫినిష్ ఉండే ఫ్యాబ్రిక్‌కి అత్యాధునిక డిజైనింగ్ వర్క్ జత చేసి ఆకట్టుకునేలా డ్రెస్సులను తీర్చిదిద్దాం. మొత్తం 20 డ్రెస్సులను తయారు చేస్తే.. 16 రకాల డిజైన్లను ఈ షోలో ప్రదర్శించాను. -
పల్లె ఫ్యాషన్
-
దారం బంగారం
సిల్క్ దారాలను చుట్టి, పూసలు గుచ్చి, తీగలు అల్లి .. ఇలా అందమైన ఆభరణాలను రూపొందించుకోవచ్చు. పండుగకు స్వర్ణాభరణాలు ఎలాగూ ఉంటాయి. తేలికగా, అత్యంత ఆకర్షణీయంగా, సంప్రదాయ దుస్తులకు మ్యాచ్ అయ్యేలా దారాల ఆభరణాలు ఉంటే.. పండుగ కళ కొత్తగా శోభిళ్లుతుంది. దారాలతో రూపొందించిన ఆభరణాల డిజైన్స్‌లో కొన్ని మోడల్స్.. తయారీకి కావల్సినవి రంగుల సిల్క్ దారాలు, సన్నని ప్లాస్టిక్ ట్యూ (గాజులు, హారాల తయారీకి)/ టూల్స్, గ్లూ, టూల్స్ కట్టర్, పూసలు, బీడ్ క్యాప్స్, జుంకా బేస్, చెయిన్స్.... వంటివి ముందుగా సిద్ధం చేసుకోవాలి. (ఈ కిట్ మార్కెట్లోనూ, ఆన్‌లైన్‌లోనూ లభిస్తుంది). ఎక్కువ మొత్తంలో, నచ్చిన డిజైన్లను రూపొందించుకోవడానికి ఈ కిట్స్ ఉపయోగపడతాయి. నేరుగా సిల్క్ థ్రెడ్ ఆభరణాలు కొనుగోలు చేయాలంటే రూ.100 నుంచి వేలల్లో లభిస్తున్నాయి. -
స్టార్స్ తళుకులు..ఫ్యాషన్ మెరుపులు
ఫ్యామిలీ వేడుకల నుంచి ఫ్యాషన్ ఈవెంట్ల దాకా.. అవార్డ్ ఫంక్షన్ల నుంచి ఆడియో లాంచ్‌ల దాకా.. అన్నింటా తారల తళుకుబెళుకులే. నగరంలో జరిగే పబ్లిక్ ఈవెంట్స్‌లో సినిమా తారలు కనపడడం ఇప్పుడు సర్వసాధారణమైంది. అదే సమయంలో సదరు ఫంక్షన్లలో వీరి స్పెషల్ లుక్ మాత్రం తరచుగా టాక్ ఆఫ్ ది సిటీగా మారుతోంది. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఓ అవార్డ్‌ల వేడుకలో తారల స్పెషల్ లుక్ మరోసారి సిటీ ఫ్యాషన్‌కు హాట్ టాపిక్ అయింది. నిన్నా మొన్నటి దాకా అవుటాఫ్ సినిమా లుక్‌లో సమంత టాప్ ఇన్ టౌన్ కాగా.. ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పుడు యువ తారలు పోటీపడుతున్నారు. ఒకప్పుడు సినిమా తారలు బయట కనపడడం చాలా అరుదు. అరకొరగా కనపడినా.. హెవీ మేకప్, విభిన్న రకాల కాస్ట్యూమ్స్ వేసిన భారాన్ని తగ్గించుకోవడానికి అన్నట్టుగా చాలా సింపుల్‌గా కనిపించడానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది.. సినిమాల్లో కనపడ్డానికన్నా బయట మరింత స్పెషల్‌గా ఉండాలన్నట్టు అందాల తారలు పోటీపడుతున్నారు. బయట కెమెరా కళ్లను తిప్పుకోనివ్వకుండా అద్భుతమైన డ్రెస్సింగ్ స్టైల్స్‌తో అదరగొడుతున్నారు. బాలీవుడ్ టు టాలీవుడ్ గతంతో పోలిస్తే టాలీవుడ్లో యువ తారలు ఇప్పుడు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. పబ్లిక్ లుక్ విషయంలో నవయువ టాలీవుడ్‌కి బాలీవుడ్ ఆదర్శంగా మారింది. ముంబయిలో జరిగే పబ్లిక్ ఈవెంట్స్‌లో తారలు బాగా పాల్గొంటారు. అంతేకాదు.. ఆ ఈవెంట్స్ కోసం స్పెషల్ డిజైన్స్‌ను సెలక్ట్ చేసుకుంటారు. సదరు ఈవెంట్స్‌లో వారు ధరించిన దుస్తులు, యాక్సెసరీస్ వంటివి పత్రికలు, మేగ్జైన్స్లో ఫ్యాషన్ పండితుల సమీక్షకు నోచుకుంటున్నాయి. దీంతో అక్కడ తారలు మరింత కేర్‌ఫుల్‌గా తమని తాము తీర్చిదిద్దుకోక తప్పడం లేదు. సాధారణంగా సినిమాల్లో పాత్ర, సన్నివేశం డిమాండ్ చేసిన మేరకు దుస్తులు ధరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా తమదైన స్టైల్ స్టేట్మెంట్ ఇదీ అని చెప్పుకునేందుకు గాని నచ్చిన పర్సనల్ స్టైల్‌ని చూపించేందుకు గాని పెద్దగా ఆస్కారం ఉండదు. దాంతో ఫ్యాషన్ విషయంలో తమదైన అభిరుచిని వ్యక్తపరచేందుకు తారలు పబ్లిక్ ఈవెంట్స్‌ను ఓ అవకాశంగా మార్చుకుంటున్నారు. పోటాపోటీ.. ఎవరికి వారేసాటి.. టాలీవుడ్ హీరోయిన్లలో సమంత పబ్లిక్ స్టైల్స్‌లో చాలా కాలం టాప్ ప్లేస్‌లో కొనసాగారు. విభిన్న రకాల దుస్తులు, యాక్సెసరీస్‌తో నార్త్ ఇండియన్ స్టార్స్‌కు దీటుగా వేడుకల్లో కనిపించేవారామె. ‘ఈవెంట్స్‌కి గెస్ట్‌గా వెళ్లినప్పుడు శామ్స్ (సమంత) డిఫరెంట్ లుక్‌తో కనపడాలనుకుంటుంది. ప్రత్యేక శ్రధ్ధతో లుక్‌ని తీర్చిదిద్దుకుంటుంది. అందుకే సినిమాలను మించి ఈవెంట్స్‌లో ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుంది’ అన్నారు సమంతకు వ్యక్తిగత స్టైలిస్ట్ నీరజ కోన. అయితే పెళ్లికి కాస్త ముందు నుంచే ఆమె బయట ఈవెంట్స్‌లో పాల్గొనడం తగ్గింది. ఈ క్రమంలో ఇప్పుడు పలువురు యువతారలు సమంతనే స్ఫూర్తిగా తీసుకుంటూ ఈవెంట్స్‌కి గ్లామర్ అద్దుతున్నారు. వీరి అవుట్ లుక్ పుణ్యమాని సిటీ డిజైనర్ల సత్తాకు చెప్పుకోదగ్గ పరీక్ష ఎదురవుతోంది. మరో విశేషం ఏమిటంటే.. సిటీలో సినిమా కాస్ట్యూమ్ డిజైనర్స్, సినిమా రంగానికి అవతల ఫ్యాషన్ రంగంలో పేరొందిన డిజైనర్స్ వేర్వేరు కావడంతో.. ఈ ఈవెంట్స్ పుణ్యమాని సిటీ డిజైనర్స్‌కు సినిమాస్టార్స్తో కలిసి పనిచేసే అవకాశం బాగా పెరిగింది. -
పెళ్లి దుస్తుల్లో మోడల్స్ మెరుపులు
-
సన్నీ కొత్త బిజినెస్ 'గుడ్ గర్ల్స్ బ్యాడ్ బాయ్స్'
బాలీవుడ్ అందాల తార సన్నిలియోన్ ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెడుతోంది. నటిగా వరుస సినిమాలతో యమా బిజీగా ఉన్న ఈ బ్యూటీ వ్యాపారరంగంలోనూ దూసుకుపోయేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే లస్ట్ పేరుతో పర్ఫ్యూమ్ కంపెనీ పెట్టిన సన్నీ, ఇప్పుడు ఫ్యాషన్ రంగం మీద దృష్టి పెట్టింది. యువతను టార్గెట్ చేస్తూ గుడ్ గర్ల్స్ బ్యాడ్ బాయ్స్ పేరుతో డిజైనర్ దుస్తులను మార్కెట్ చేయనుంది. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీలు అనుష్క శర్మ, దీపిక పదుకొనే, సోనమ్ కపూర్ లు ఫ్యాషన్గ రంగంలో దూసుకుపోతున్నారు. తాజాగా సన్నీ లియోన్ కూడా ఈ రంగంలో తన మార్క్ చూపించేందుకు సిద్దమవుతోంది. Proud to announce the Launch of #goodgirlsbadboyz clothing capsule created by @Archana_Kochhar and myself sold at https://t.co/sSlCz2Pt8C SHOP NOW!! "GoodGirl's love BadBoyz" pic.twitter.com/q60xGfLiGD — Sunny Leone (@SunnyLeone) 20 November 2017 -
ఫ్యాషన్ స్మైల్.. అదిరెన్ స్టైల్..
-
మిస్టర్ అండ్ మిస్ మెరుపుల్
మిస్టర్స్ మెరిపించారు.. మిస్సమ్మలుమురిపించారు.. మిస్టర్ అండ్ మిస్ ట్రెండ్స్హైదరాబాద్–2017 ఫైనల్స్ తాజ్కృష్ణాహోటల్లో మంగళవారం సందడిగా జరిగాయి. యువతీ యువకులు ర్యాంప్ వాక్‌తో అలరించారు. నిర్వాహకులు అమీర్ అలీఖాన్, మహమ్మద్ షోహలుద్దీన్, పేజీత్రీ ప్రముఖులు పాల్గొన్నారు. – జూబ్లీహిల్స్ -
గ్లామరస్ షో
సావిత్రి నుంచి సమంత వరకు తారల దుస్తులు... యువతుల డ్రెస్సింగ్ స్టైల్స్‌కి స్ఫూర్తిని అందించడంలో ముందుంటాయనేది తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంలో స్టార్స్‌తో పోటీ పడుతున్నారు టీవీ యాంకర్స్. చిన్ని తెరపై కేవలం వ్యాఖ్యానంతో మాత్రమే కాకుండా... గ్లామరస్తో రియాలిటీ షోలను రక్తికట్టిస్తున్న కొందరు టీవీ స్టార్స్‌కి ఇప్పుడు యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్. ‘సినిమాలకు తీసిపోని విధంగా యాంకర్ల డ్రెస్సింగ్‌ను తీర్చిదిద్దాల్సి ఉంటుంది’ అంటున్నారు సిటీ డిజైనర్ దీప్తి. ‘అంబర’ లేబుల్‌తో ఫ్యాషన్ రంగంలో స్వల్ప కాలంలోనే టాప్ ప్లేస్‌కు చేరుకున్న ఈమె.. టీవీ స్టార్లకు డ్రెస్‌ల డిజైనింగ్‌లో అందవేసిన చేయి అనిపించుకుంటున్నారు. సుమ, ఝాన్సీ, ఉదయభాను తర్వాత చిన్ని తెర రాణులుగా మారిన అనసూయ, శ్రీముఖి, రేష్మి, లాస్య... లాంటి వారికి కేవలం యాంకరింగ్ ఒకటే సరిపోవడం లేదు. వీరు గ్లామర్ ద్వారానూ మెప్పించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వీరి డ్రెస్సింగ్‌కు, డిజైనింగ్‌కు ప్రాధాన్యత మరింత పెరిగింది. దీంతో సిటీ డిజైనర్లకు చిన్ని తెర సెలబ్రిటీల డిజైనింగ్ బాధ్యతలూ వచ్చేశాయి. ‘సీనియర్ సినీ స్టార్, రాజకీయ నాయకురాలైన రోజా లాంటి ప్రముఖ మహిళకు డ్రైస్ డిజైనింగ్ అంటే ఆషామాషీ కాదు. ఇలాంటి టాస్క్‌లే డిజైనింగ్, స్టైలింగ్ ప్రతిభకు పదును పెడతాయనేది నా నమ్మకం’ అంటారు దీప్తి. దీప్తి పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... చిన్ని తెరపై చిందేస్తున్న డిజైన్లు.. గతంతో పోలిస్తే ఇప్పుడు టీవీ షోలకి విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఆయా షోలలో వ్యాఖ్యాతలు, న్యాయ నిర్ణేతలు తదితరులకూ సినీతారలతో సమానంగా ఫాలోయింగ్ ఉంటోంది. నా ఫస్ట్ టీవీ షో జబర్దస్త్. అందులో రోజా గారికి డిజైన్స్ చేశాను. రోజా గారు అప్పటి వరకు చీరలు, అప్పుడప్పుడు చుడీదార్స్ మాత్రమే ధరించేవారు. మేం కొత్త లుక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్‌టైమ్ పంపిన డిజైన్‌నే ఆమెకు నచ్చింది. ఇక అప్పటి నుంచి దాదాపు ఏడాదిన్నరగా రోజా గారికి డిజైన్ చేస్తున్నాను. అలాగే జయసుధ, సుమ, రేష్మి, అనసూయ, శ్రీముఖిలతో సహా టాప్ టీవీ యాంకర్లకు డిజైన్లు అందిస్తున్నాను. సెట్... హిట్ టీవీ షోలను రక్తికట్టించడంలో ప్రధాన పాత్ర పోషించేది యాంకర్లు. దాదాపు ప్రేక్షకులు వీరినే గమనిస్తుంటారు. కాబట్టి అనుకున్నంత తేలికగా ఉండదీ వర్క్. యాంకర్‌కి డ్రెస్ డిజైన్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ దగ్గర్నుంచి ఎన్నో అంశాలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డ్రెస్ కలర్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో సెట్ అవ్వాలి. కొన్ని సెట్స్ డల్‌గా, డిమ్లైట్స్తో ఉంటాయి. దానికి సోబర్ కలర్స్ డిజైన్ డ్రెస్ ఇస్తే కనిపించదు. ఇప్పుడు సుమ చేస్తున్న ఇ–జంక్షన్ సెట్లో బ్లూ, గ్రీన్ లాంటి కలర్స్ వాడకూడదు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో అవి ఉన్నాయి. ఇలా సెట్లో కలర్స్‌ను బట్టి డిజైనింగ్ ఉండాలి. అంతేకాదు కామెడీ, సీరియస్, ఫెస్టివల్.. ఇలా షో కాన్సెప్ట్‌ను మైండ్‌లో ఉంచుకోవాలి. ఓ వారం కనిపించిన అవుట్‌ఫిట్ మరోవారం అవుట్‌ఫిట్‌కు పూర్తి భిన్నంగా ఉండాలి. దాదాపు 10కి పైగా టాప్ షోలు, బెస్ట్ యాంకర్లకి చేశాను. రాజశ్రీ లాంటి సీరియల్ యాక్టర్లకి డిజైన్లు అందించాను. ఇప్పుడు టీవీ యాక్టర్లు, యాంకర్లు సెలబ్రిటీ హోదాలో ఈవెంట్స్‌కి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవెంట్లో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలిచేలా, వారికి నప్పేలా డ్రెస్ డిజైన్ చేయాలి. -
అమెజాన్ ఫాషన్ వీక్‌లో మోడల్స్ మెరుపులు
-
నిస్సాన్ మైక్రాలో ఫ్యాషన్ ఎడిషన్
గుర్గావ్: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్ ఇండియా’ తాజా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ‘మైక్రా’లో ఫ్యాషన్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటెన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.6.09 లక్షలు. మైక్రా ఫ్యాషన్ లిమిటెడ్ ఎడిషన్‌లో మెకానికల్‌గా మార్పులేవీ లేకున్నా పలు కాస్మొటిక్ అప్‌గ్రేడ్స్ (ఎక్స్టీరియర్, ఇంటీరియర్) ఉన్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త మైక్రా ప్రధానంగా ఫ్యాషన్ బ్లాక్, ఫ్యాషన్ ఆరంజ్ రంగుల్లో లభ్యంకానుంది. -
ఫ్యాషన్ షో అదుర్స్
-
వెస్టర్న్ వసంతం
ప్రపంచం ఎటో వెళ్లిపోతోంది.మాంచి స్పీడ్ మీదుంది. యంగ్‌స్టర్స్ బిగ్‌స్టార్స్ అవుతున్నారు.బిగ్ స్టార్స్ సూపర్ స్టార్స్ అవుతున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఇదేకొత్త ట్రెండ్. ట్రెండ్లను తలదన్నే ట్రెండ్. కథ మారింది. ఫిట్ మారింది. ప్రింట్ మారింది. ఫ్యాబ్రిక్ మారింది.లుక్ మారింది. మరి మనం మారద్దూ! మనం కూడా వరల్డ్ ఫ్యాషన్లని మన భుజం మీద మోయద్దూ!! ఇదో... అదే ఆలోచనతో మీకు ఇవాళ సాక్షి సమర్పిస్తోంది. వస్త్రాలలో ఎన్నో పూల తోటలు. నిజంగా ఒక వెస్టర్న్ వసంతం. ► జార్జెట్, షిఫాన్, క్రేప్ ఫ్యాబ్రిక్స్ వలీ డిజైన్స్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. సన్నగా ఉన్న అమ్మాయిలకు వీటితో డిజైన్ చేయించాలంటే మరింత సన్నగా కనపడతారని అపోహపడతారు. వలీ డిజైన్స్ చూస్తే చిన్న చిన్న మార్పులతో, సరైన కట్, ఫిట్‌తో అందంగా కనిపించేలా డిజైన్ చేయవచ్చు. చేతులు, నడుము, నెక్లైన్ వద్ద కొద్దిపాటి కుచ్చులను జత చేస్తే మార్పులో స్పష్టత సులువుగా అర్థమైపోతుంది. ► బొద్దుగా లేదా పొడవు తక్కువగా ఉన్నవాళ్లకు షార్ట్‌లెంగ్త్ డిజైన్స్ ఎలా నప్పుతాయో వలీ డిజైన్స్ చూసి తెలుసుకోవచ్చు. ఇలాంటి వారికి కొద్దిగా ముదురు రంగులు, చిన్న చిన్న ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి. ► రాసిల్క్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన క్రీమ్ కలర్ షార్ట్ ఫ్రాక్. దాని మీద ఎర్రని పువ్వుల ఎంబ్రాయిడరీ ఆకర్షణీయతను పెంచుతుంది. ఇదే తరహా కాంబినేషన్లో ఇతర డ్రెస్ డిజైన్స్‌నూ మార్చుకోవచ్చు. జియామ్బటిస్టా వలి ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్. రోమ్‌లో పుట్టి, అక్కడే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ చేశాడు. ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్యాషన్ పరిశ్రమ అతనిలో సృజనను తట్టిలేపింది. లండన్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరాడు. అక్కడ వేలాది మంది ఫ్యాషన్ డిజైనింగ్‌లో కోర్సు చేస్తున్నారు. అప్పటికే ఎంతో మంది ఫ్యాషన్ డిజైనర్లు ప్రపంచాన్ని ఏలేస్తున్నారు. వారి మధ్య తను ఎలా నెగ్గుకు రాగలను అని ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రశ్నకు అతనికి చిత్రకళ సమాధానమిచ్చింది. దానిని ఆపోసన పట్టాడు. చిత్రకళను డ్రెస్ డిజైన్స్ మీదకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇతని సృజనను మెచ్చి ప్రముఖ కంపెనీలు ఎర్రతివాచీని పరిచాయి. పీటర్ ఎ పోర్టర్ వంటి కంపెనీలకు క్రియేటివ్ డిజైనర్‌గా ఉండి తర్వాత తనే సొంతంగా స్టోర్ ప్రారంభించాడు. ఇప్పుడు 41 దేశాల్లో 245 సెల్లింగ్ పాయింట్స్ ద్వారా ప్రపంచవ్యాప్త మార్కెట్ ఉంది వలీకి. తలలు పండిన డిజైనర్లు సైతం తమ ప్రతిభను కనబరిచేందుకు ఎదురుచూసే ప్యారిస్ ఫ్యాషన్ షోలో వరుసగా నాలుగు సార్లు పాల్గొనే అవకాశం దక్కింది వలీకి. పువ్వుల సోగయం సిసలైన స్టైల్ శరీరాన్ని హత్తుకుపోయినట్టుండే ప్యానెల్స్, రంగులు, పువ్వుల ప్రింట్లతో ప్రతి యేటా ఓ కొత్తదనం వలీ డిజైన్స్‌లో కనిపిస్తుంది. రాచఠీవితో వెలిగిపోయే డ్రెస్ డిజైనింగ్, నాటకీయతను రూపుకట్టే కేప్స్, పోల్కాడాట్స్.. వలీ డిజైన్స్‌లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పూసలతో చేసిన ఎంబ్రాయిడరీ, బో కాలర్స్, అసెమెట్రికల్ డ్రేపింగ్, విశాలంగా కనిపించే పెప్లమ్స్ ఇట్టే ఆకట్టుకుంటాయి. కాంతిమంతమైన ఎరుపు, నీలం, పసుపులలోనే ఎన్నో షేడ్స్‌ని సృష్టించి వాటితోనే అద్భుతమైన డిజైన్స్ తయారుచేస్తాడు వలీ. ► నీ లెంగ్త్ మిడ్ ఫ్రాక్ ఇది. ప్రొఫెషనల్‌గా రాణించాలనుకునే ఆధునిక యువతులకు కాన్ఫిడెన్స్ ఇచ్చే డెస్ స్టైల్ ఇది. నెక్ కాలర్, స్ట్రెయిట్ కట్‌తో సాదా సీదాగా అనిపించే ఈ స్టైల్‌ని సన్నని బెల్ట్‌ను జత చేసి పూర్తి లుక్ మార్చేశారు. ►నడిచి వచ్చే పువ్వుల దండులా మేనిపై విరుల సోయగం ప్రత్యేకతను చాటుతుంది. దానికి ఫెదర్ని జత చేస్తే రాయంచ కొత్త రెక్కలు తొడుక్కున్నట్టే! టాప్ టు బాటమ్ ఒకే ప్రింట్ ఫ్యాబ్రిక్ వాడినా అందులోని ప్రధాన రంగును ఫెదర్ లేదా దుపట్టా లాంటివి ధరించడానికి ఎంపిక చేసుకోవచ్చు. జియామ్బటిస్టా వలి -
అదరగొట్టిన ఫ్యాషన్ డిజైన్ విద్యార్థులు
-
కలర్ఫుల్గా హైలైఫ్ లక్జరీ డిజైనర్ ఫ్యాషన్ షో
-
'ఫ్యాషన్' మోసంపై ప్రియాంక ధ్వజం
హైదరాబాద్: ప్రియాంక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మిలీనియం ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతోంది. 2014-16 ఏడాదికిగానూ కోర్సు ఫీజు కింద మొదటి విడతలో రూ.2.8 లక్షల అడ్మిషన్ ఫీజు, రెండో ఏడాది రూ.15.7 లక్షలతోపాటు హాస్టల్ ఫీజు మరో రూ. 2.4 లక్షలు.. ఇలా ఫీజుల రూపంలోనే భారీ మొత్తాన్ని చెల్లించింది. అయితే మరో సంవత్సరం మిగిలి ఉండగానే కాలేజీ యాజమాన్యం కోర్సును అర్ధాంతరంగా నిలిపేసింది. తల్లిదండ్రులతోకలిసి కాలేజీ యాజమాన్యం దగ్గరకు వెళ్లిన ప్రియాంక.. ఏం జరుగుతోదని ప్రశ్నించింది. సరైన సమాధానం చెప్పకపోగా ఆమను దుర్భాషలాడిన యాజమాన్యం.. ప్రియాంకను, ఆమె తల్లిదండ్రుల్ని బయటికి గెంటేసింది. దీంతో.. నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ప్రియాంక ఇన్ స్టిట్యూట్ మోసంపై ఫిర్యాదుచేసింది. కళాశాల యాజమాన్యం తమను చీటింగ్ చేసిందని, తనతో పాటు చాలా మంది విద్యార్థులు కోర్సు పూర్తికాక భవిష్యత్తును పాడుచేశాయని ప్రియాంక ఆరోపించింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పేరుతో మోసాలకు పాల్పడుతోన్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఐపీసీ సెక్షన్ 406, 420, 506లను అనుసరించి రఫెల్స్ మిలీనియం ఇంటర్నేషనల్ యాజమాన్యంపై కేసు నమోదుచేసకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
డిజైన్స్ షో
సోమాజిగూడ: హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు రూపొందించిన విభిన్న డిజైన్లను ఇనిస్టిట్యూట్ ఎండీ అజితారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. పంజగుట్టలోని ఇనిస్టిట్యూట్ జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు రూపొందించిన డిజైన్లతో అక్టోబర్ 5న సోమాజిగూడ పార్క్ హోటల్లో ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహించనున్నట్లు చెప్పారు. -
‘యువీ’ కోసం...
-
చాలా పొరపాట్లు చేశాను: నటి
ముంబై: సినిమా జీవితం ఆరంభంలో ఫ్యాషన్ పరంగా చాలా తప్పులు చేశానని బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ తెలిపింది. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చినందున తనకు అప్పట్లో ఫ్యాషన్ పరిజ్ఞానం అంతగా లేదని వెల్లడించింది. లాక్మే ఫ్యాషన్ వీక్ వింటర్/ఫెస్టివ్ 2016లో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘17 ఏళ్ల వయసులో బాలీవుడ్ లో అడుగుపెట్టాను. నాకప్పుడు ఫ్యాషన్ గురించి పెద్దగా తెలియదు. ఫ్యాషన్ పరంగా చాలా పొరపాట్లు చేశాను. అయినప్పటికీ నా డ్రెస్సులను అందరూ మెచ్చుకునేవారు. సినిమాల్లోకి వచ్చేప్పటికి నేను చాలా చిన్నపిల్లని. స్కూల్ నుంచి వచ్చి సినిమాల్లో నటించడం సరదాగా అనిపించేది. అప్పటికి నాకు పెద్దగా ఏమీ తెలియదు. దర్శకులు, నిర్మాతలు ఏ డ్రెస్సులు వేసుకోమంటే అవే వేసుకునేదాన్ని. ఇండస్ట్రీతో పాటు నేను ఎదుగుతూ వచ్చాను. ఫ్యాషన్ పరిజ్ఞానం కూడా పెంచుకున్నాను. ఇప్పుడు నా స్టయిల్ ను అందరూ ఇష్టపడుతున్నార’ని 42 ఏళ్ల కరిష్మా కపూర్ చెప్పింది. అయితే ఇప్పటి హీరోయిన్లు ఫ్యాషన్ విషయంలో పెద్దగా కష్టపడాల్సిన పనిలేదని అంది. హీరోయిన్ల స్టయిల్ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా టీమ్‌లు పనిచేస్తున్నాయని తెలిపింది. తనకు చేతినిండా ఎండార్స్మెంట్స్ ఉన్నాయని చెప్పింది. -
ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉచిత శిక్షణ
సంగారెడ్డి మున్సిపాలిటీ: గ్రామీణ స్వయం ఉపాధి కల్పనా కేంద్రంలో మహిళలకు నెలరోజుల పాటు ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంత యువతులు ఉచిత శిక్షణ పొందేందుకు అర్హులని, శిక్షణా సమయంలో భోజనం, వసతి సౌకర్యాలతో పాటు రవాణా చార్జీలు చెల్లిస్తారన్నారు. ఆసక్తి గల యువతులు ఈనెల 24లోగా తమ దరఖాస్తులను నేరుగా సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయ ఆవరణలోని గ్రామీణ స్వయం ఉపాధి కల్పనా కేంద్రంలో తెల్లరేషన్‌కార్డు, , ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీతో బుధవారం లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి ఈనెల 24 నుంచి వచ్చే నెల 22 వరకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. -
వావ్... ఫ్యాషన్
-
ఢిల్లీలో ఫ్యాషన్ వీక్
-
జియోనీ నుంచి ఎఫ్103 ప్రో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మొబైల్స్ తయారీలో ఉన్న జియోనీ తాజాగా ఫ్యాషన్ సిరీస్‌లో ఎఫ్103 ప్రో పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ధర రూ.11,999. గతేడాది ప్రవేశపెట్టిన ఎఫ్103కు మరిన్ని ఫీచర్లు జోడించి ప్రో మోడల్‌ను రూపొందించారు. 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1.3 గిగాహెట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీతో తయారు చేశారు. ఆటోఫోకస్ లెడ్ ఫ్లాష్‌తో 13 ఎంపీ కెమెరా, ఫ్లాష్‌తో 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరిచారు. 0.1 సెకనులోపే ఫోకస్ చేయవచ్చని, సెల్ఫీలు మరింత అందంగా కనపడేలా ఫిల్టర్లు వాడినట్టు కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్, 2,400 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్ ఇతర ఫీచర్లు. 2.5డీ గ్లాస్ రక్షణ ఉంది. వాయిస్ ఓవర్ ఎల్టీఈని సపోర్ట్ చేస్తుంది. 128 జీబీ వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. -
పారిస్‌లో వింటర్ 2016 ఫ్యాషన్‌షో
-
ఫ్యాషన్ లవర్స్ కోసం హైలైఫ్ ఎగ్జిబిషన్
-
అమెజాన్ ఫ్యాషన్ బ్యాష్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఫ్యాషన్ బ్యాష్ పేరుతో మెగా ఫ్యాషన్ ఈవెంట్‌ను జూన్ 22 వరకు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తాజా ట్రెండ్స్, గొప్ప డీల్స్ కొలువుదీరనున్నాయి. జాకీ, యారో, లివైస్, స్కెచర్స్, క్రాక్స్, ప్రొవోగ్, టైమెక్స్, వైల్డ్‌క్రాఫ్ట్, స్పార్ఎక్స్, ఐడీ తదితర 30 బ్రాండ్లు ఇందులో పాల్గొంటున్నాయి. ప్రతి రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు ట్రెజర్ హంట్ జరుగుతుంది. దీని కింద రూ.1లకే ఎంపిక చేసిన ఉత్పత్తులను వినియోగదార్లు దక్కించుకోవచ్చు. యాప్‌ను వినియోగిస్తున్న కస్టమర్ల కోసం అమెజాన్ ఫ్యాషన్ తొలిసారిగా ఈ ఈవెంట్‌ను జరుపుతోంది. -
దారి చూపుతున్న పాకెట్ మనీ
ఆదర్శం విద్యార్థికి చదువు అనేది విలువైన బహుమతి. విజ్ఞానం నుంచి మాత్రమే కాదు విషాదం నుంచి కూడా విలువైన పాఠాలు నేర్చుకునేవాళ్లే నిజమైన విద్యార్థులవుతారు. చెన్నైలోని ‘కలిగి రంగనాథన్ మౌంట్‌ఫోర్డ్ హైయర్ సెకండరీ స్కూలు’ విద్యార్థులను గమనిస్తే వారు నేర్చుకునే పాఠాలు పుస్తకాలకు మాత్రమే పరిమితం కాలేదని, జీవితం నుంచి కూడా నేర్చుకుంటున్నారనే విషయం అర్థమవుతుంది. గత సంవత్సరం చెన్నై వీధుల్లో భిక్షాటన చేసిన సరోజ... ఇప్పుడు పెరంబూర్ బస్‌స్టాప్ సమీపంలో రకరకాల ఫ్యాషన్ వస్తువులు అమ్ముతున్నారు. ఒక్క సరోజ మాత్రమే కాదు భిక్షాటనే ప్రపంచంగా బతికిన కొద్దిమంది యాచకులు ఇప్పుడు సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సొంతకాళ్ల మీద నిలబడ్డామనే తృప్తి వారి కళ్లలో బలంగా కనిపిస్తోంది. ‘కలిగి రంగనాథన్ మౌంట్‌ఫోర్డ్ హైయర్ సెకండరీ స్కూల్’ విద్యార్థులు తమ పాకెట్‌మనీతో యాచకులను మార్చడానికి, వారిని కొత్త దారిలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. యాచకవృత్తిని వదిలి కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన వాళ్లలో సరోజ నుంచి నాగర్ వరకు ఎందరో ఉన్నారు. ‘‘ఒకప్పుడు రూపాయి కోసం కూడా చేయి చాపాల్సి వచ్చేది. ఇప్పుడు నేను సొంతకాళ్ల మీద నిలబడటమే కాదు కష్టాల్లో ఉన్నవారికి ఎంతో కొంత సహాయం చేయగలుగుతున్నాను. ఇదంతా ఆ పిల్లల చలవే. వారిది చల్లని మనసు’’ అంటోంది సరోజ. రోశమ్మ అనే యాచకురాలిని తమ స్కూల్లో హౌస్‌కీపర్ ఉద్యోగంలో చేర్పించడం ద్వారా ఆమెను యాచకవృత్తి నుంచి బయటికి వచ్చేలా చేశారు విద్యార్థులు. చిరిగిన మురికి దుస్తులతో దేవాలయాల దగ్గర యాచించే నాగర్ ఇప్పుడు ఆ పనికి స్వస్తి చెప్పాడు. ఒక స్టడీ టేబుల్ మీద చాక్లెట్లు అమ్ముతూ ఎవరినీ యాచించకుండా పొట్ట నింపుకుంటున్నాడు. అతడిలో మార్పు రావడానికి కారణం స్కూలు పిల్లలు. అయితే అందరు యాచకులు ఒకేలా స్పందించలేదు. ‘‘మాకు ఎవరి సహాయం అక్కర్లేదు’’ అని కొందరు ఎప్పటిలాగే యాచననే నమ్ముకున్నారు. అలాంటి వాళ్లలో కూడా కొందరిని మాటలతో మార్చారు ఆ విద్యార్థులు. ఆర్థిక సహాయం చేసి చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకొనేలా చేయడమే కాదు... ఉద్యోగాలు చేయాలనుకున్నవారికి సెక్యూరిటీ గార్డ్, స్వీపర్...మొదలైన ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నారు. ఒక చిన్న సంఘటన విద్యార్థుల్లో పెద్ద మార్పు తీసుకువచ్చింది. ఒకసారి స్కూలు ముందు చిన్న అబ్బాయి, అమ్మాయి అడుక్కుంటూ కనిపించారు. ఈ దృశ్యం విద్యార్థుల మనసులను కదిలించింది. ఇక అప్పటి నుంచి ‘బెగ్గర్‌లెస్ సొసైటీ’ నినాదంతో పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఉపాధ్యాయులు కూడా ఇందుకు మద్దతు పలికారు. ‘‘ఆనందం అనేది ఆటపాటల్లోనే కాదు...సేవ చేయడంలో కూడా ఉంటుందనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను’’ అంటాడు క్రిస్టీ అనే విద్యార్థి. ‘‘యాచకులను చాలామంది దూరం పెడతారు. నిజానికి వారి దగ్గరికి వెళ్లి నాలుగు మంచి మాటలు చెబితే... వారు యాచనకు దూరం అవుతారు. కొత్త జీవితాన్ని మొదలుపెడతారు’’ అంటోంది రోషిణి అనే విద్యార్థిని. ‘‘నేను మనిషిని అని చెప్పుకోవడం కంటే మానవత్వంతో కూడిన మనిషిని అని నిరూపించుకునే ప్రయత్నం చేయడం ముఖ్యం. ఈ దిశలో అడుగులు వేయడానికి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం’’ అంటున్నారు స్కూల్ ప్రిన్సిపల్ అనిత డేనియల్. విద్యార్థుల దగ్గర ధన సహాయాన్ని పొందిన వాళ్లలో కొందరు యాచకులు మళ్లీ కనిపించలేదు. కొందరు చిన్న చిన్న షాపులు పెట్టుకొని సొంతకాళ్ల మీద నిలబడాలని ప్రయత్నిస్తున్నారు గానీ మద్యానికి బానిసై పక్కదోవ పడుతున్నారు. అయితే ఇవేమీ విద్యార్థులను నిరాశపరచడం లేదు. మార్పు అనేది ఒక్క అడుగుతో. ఒక్కరోజుతో మొదలు కాదనే విషయం వారికి తెలుసు. అందుకే భవిష్యత్ పట్ల ధీమాగా ఉన్నారు. బెగ్గర్‌లెస్ సొసైటీ గురించి చిన్న వయసులోనే చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. అందరితోనూ ‘శభాష్’ అనిపించుకుంటున్నారు. -
హిట్ హీరోయిన్‌కు ఒక్క సినిమా లేదట!
బాలీవుడ్ స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా.. అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన బ్యూటీ సోనమ్ కపూర్. హీరోయిన్గా సక్సెస్‌లు సాధించలేకపోయినా తన గ్లామర్ షోతో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ పరంగా అప్ డేట్ అవుతూ వస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. ఇటీవల బయోపిక్‌గా తెరకెక్కిన నీర్జా సినిమాలో నటించిన సోనమ్ తొలిసారి నటిగా మంచి మార్కులు సాధించింది. నీర్జా సినిమా సోనమ్‌కు మంచి పేరు తీసుకురావటమే కాదు. కలెక్షన్ల పరంగా కూడా బాలీవుడ్లో సంచలనాలు సృష్టించింది. దీంతో సోనమ్ ఫేట్ మారిపోయినట్టే అని భావించారు అంతా. కానీ అలా జరగలేదు. నీర్జా లాంటి భారీ హిట్ తరువాత కూడా సోనమ్ కపూర్‌కు మంచి అవకాశాలు రావటం లేదట. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'నీర్జా సినిమా తరువాత ఇప్పటివరకు ఒక్క మంచి కథ కూడా రాలేదు. అందుకే ఇంత వరకు సినిమా అంగీకరించలేదు' అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ర్యాంప్ షోలతో టైం పాస్ చేస్తున్న సోనమ్‌కు స్టార్ హీరోయిన్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేని సోనమ్, కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఇండియాలో జరిగే ఈవెంట్స్ లోనే ఓ రేంజ్ గ్లామర్ షో ఇచ్చే సోనమ్ కేన్స్ హాట్ టాపిక్ గా మారనుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు తన సొంత నిర్మాణ సంస్థలో బ్యాటిల్ ఆఫ్ బిట్టోరా పేరుతో సినిమాను నిర్మించే ఆలోచనలో ఉంది. -
గాడీని లాగేసిన దాడీ
తిక్క లెక్క చాలామంది దాడీవాలాలు.. అదేనండీ గడ్డంరాయుళ్లు రకరకాల కారణాల వల్ల గడ్డాలను పెంచుకుంటూ ఉంటారు. మేధావుల్లా కనిపించడానికి కొందరు, తీరికలేక ఇంకొందరు, బద్దకం వల్ల మరికొందరు... కొంతమందికి గడ్డం ఒక ఫ్యాషన్ సింబల్. మరీ అపురూపంగా గడ్డాన్ని సంరక్షించుకుంటూ ఉంటారు. గడ్డంలోని ఒక్క వెంట్రుకకు నష్టం కలిగినా విలవిల్లాడిపోతారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న దాడీవాలా మాత్రం అలాంటి బాపతేం కాదు. ఎలాంటి చాలెంజ్‌నైనా గడ్డం దువ్వి మరీ సవాలు చేసి, సత్తా నిరూపించుకోవడం అంటే ఇతడికి మాచెడ్డ సరదా. అలాంటి సరదాతోనే టాటా ఇండికా కారును గడ్డంతో లాగిపడేశాడు. ఈ దాడివాలా పేరు కపిల్ గెహ్లాట్. పక్కా రాజస్థానీ. జోధ్‌పూర్‌లో ఉంటాడు. గడ్డంతో అతి బరువైన వాహనం లాగినందుకు గిన్నెస్‌బుక్‌లోకి ఎక్కాడు. -
కటింగ్ అప్పుడే మొదలైంది!
ఆధునిక కత్తెరలను ఇంగ్లండ్‌కు చెందిన విలియమ్ వైట్లీ అండ్ సన్స్ కంపెనీ క్రీస్తుశకం 1760 నుంచి తయారు చేయడం ప్రారంభించింది. ఆధునిక కాలంలోనూ వాడుకలో ఉన్న పురాతన వస్తువుల్లో కత్తెర ఒకటి. ప్రాచీన ఈజిప్టులో కత్తెరల వాడుక క్రీస్తుపూర్వం 1500 ఏళ్ల నాడే మొదలైంది. అప్పట్లో పలచని లోహపు రేకును మధ్యకు వంచి, రెండువైపులా పదునైన చాకుల్లా ఉండేలా తయారు చేసేవారు. అప్పటి కత్తెరలను అడకత్తెరలా అరచేత్తో నొక్కాల్సిందే తప్ప వేళ్లతో తేలికగా ఆడించేందుకు రింగుల పిడి ఏర్పాటు ఉండేది కాదు. అప్పట్లో వాడే కత్తెరలకు మధ్యన వంచిన భాగం స్ప్రింగులా ఉపయోగపడేది. మధ్యయుగాల్లో కత్తెరల తయారీ కాస్త పరిణామం చెందింది. ఇనుము లేదా ఉక్కుతో రెండు చాకులను విడివిడిగా తయారు చేసి, తేలికగా కదిపేందుకు వీలుగా వాటి మధ్యలో స్ప్రింగు అమర్చేవారు. అయితే, రింగుల పిడితో విడివిడిగా ఉన్న రెండు చాకులతో ఆధునిక కత్తెరలను ఇంగ్లండ్‌కు చెందిన విలియమ్ వైట్లీ అండ్ సన్స్ కంపెనీ క్రీస్తుశకం 1760 నుంచి తయారు చేయడం ప్రారంభించింది. ఆ కంపెనీ ద్వారా తొలిసారిగా ‘332’ ట్రేడ్‌మార్కుతో బ్రాండెడ్ కత్తెరలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి రకరకాల పరిమాణాల్లోని కత్తెరలు రకరకాల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినా, వాటి డిజైన్‌లో పెద్ద మార్పు రాలేదు. కత్తెరలు విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత శస్త్రచికిత్సలు చేయడం తేలికైంది. దుస్తుల తయారీ సహా ఫ్యాషన్ రంగంలోనూ గణనీయమైన మార్పులు వచ్చాయి. వంటింటి అవసరాల నుంచి పారిశ్రామిక అవసరాల వరకు రకరకాల కత్తెరలు విరివిగా ఉపయోగంలోకి వచ్చాక ఇవి మన జీవితాల్లో విడదీయరాని భాగంగా మారాయి. -
'సింగర్ కాకుంటే ఫ్యాషన్ స్టైలిస్ట్ అయ్యేదాన్ని'
లాస్ ఎంజెల్స్: తాను పాప్ గాయని కాకుంటే మంచి ఫ్యాషన్ సైలిస్ట్ను అయ్యే దాన్నని ప్రముఖ హాలీవుడ్ సింగర్ కాతీ పెర్రీ(31) చెప్పింది. ఆమెకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టమని ఇప్పటికీ తన దుస్తులు, స్నేహితులవి అప్పుడప్పుడు డిజైన్ చేస్తుంటానని తెలిపింది. తాను పాటలు పాడుతున్నా ఇప్పటికీ ఫ్యాషన్ రంగం చాలా ఇష్టమని, ఏ సమయంలోనైనా అందులోకి దూసుకెళ్లాలని ఉంటుందని చెప్పుకొచ్చింది. 'నాకు ఫ్యాషన్ ఇండస్ట్రీలో పనిచేయాలని ఉండేది. స్టైలిస్ట్ గా ఉండటం అంటే నాకు చాలా ఇష్టం. క్రియేటివిటీని నేను ఎక్కువగా ప్రేమిస్తుంటాను. అందుకే వీటిని నేను నా స్నేహితురాళ్లపై ప్రయోగిస్తుంటాను. అది అందంగా వచ్చినప్పుడు ఎంతో మురిసిపోతుంటాను' అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. -
ఆ విషయంలో నేను చాలా వీక్!
దీపికా పదుకొనే చాలా స్టయిలిష్‌గా ఉంటారు. ఆమె వేసుకునే డ్రెస్సులంటే కాలేజీ గాళ్స్‌కి తెగ క్రేజ్. మంచి అభిరుచి ఉంది కాబట్టే దీపికా డ్రెస్సులన్నీ బాగుంటాయని కూడా అంటుంటారు. అంత అందంగా డ్రెస్ చేసుకునే దీపిక బహుశా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఏమైనా చేశారేమో అని కూడా అనుకుంటారు. ఆ మాటే ఈ బ్యూటీతో అంటూ ‘నేనా.. ఫ్యాషన్ డిజైనింగా.. భలేవారే.. నాకసలు ఫ్యాషన్ గురించి ఏమీ తెలియదు’ అని నవ్వేస్తారు. మరి.. ఇంత స్టయిలిష్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? అనే ప్రశ్న దీపిక ముందుంచితే - ‘‘నా ఇంటికొచ్చి నా వార్డ్ రోబ్ చూస్తే, జీన్స్-టీ షర్ట్స్, కాటన్ షర్ట్స్ తప్ప వేరే ఏవీ కనిపించవు. అవి మాత్రమే కొనుక్కోవడం వచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో నేను వీక్. అందుకే డిజైనర్ల మీద ఆధారపడిపోతుంటా. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లాలనుకోండి.. డిజైనర్‌కి ఫోన్ కొడతా. అదెలాంటి ఫంక్షనో చెప్పేస్తా. అందుకు అనుగుణంగా వాళ్లే డ్రెస్ డిజైనింగ్ చేసి ఇచ్చేస్తారు. సినిమాలకు ఎలాగూ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారు కాబట్టి వాళ్ల మీద ఆధారపడిపోతాను. కలర్ కాంబినేషన్ కూడా చెప్పడం తెలియదు. వాళ్లేది తయారు చేసిస్తే అది వేసేసుకుంటా. లక్కీగా అన్నీ బాగుంటున్నాయి. దాంతో నాకు మంచి టేస్ట్ ఉందని అనుకుంటున్నారు. నా టేస్ట్ ప్రకారం నేను బట్టలు వేసుకుంటే ఇక అంతే సంగతులు. ‘దీపికా సో బోరింగ్’ అనేస్తారు’’ అని చెప్పారు. -
హైదరాబాద్‌లో ఫ్యాషన్‌వీక్
-
వరంగల్ అంటే ఇష్టం
త్వరలో మోడలింగ్ శిక్షణ సంస్థ మిస్ ఇండియా రష్మీ ఠాకూర్ పోచమ్మమైదాన్ : వరంగల్ అంటే చాలా ఇష్టమని, చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టమని, ముంబై-ఢిల్లీ తరహాలో తెలంగాణలో త్వరలో మోడలింగ్‌పై శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తానని, ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరం అని మిస్ ఇండియా రష్మి ఠాకూర్ అన్నారు. రిష్మీ ఠాకూర్ వరంగల్‌కు ఆదివారం రాత్రి ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. ఆమె మాటలల్లోనే.. వరంగల్ నాకు నచ్చిన ప్లేస్.. వరంగల్ నాకు చాలా న చ్చిన ప్లేస్. మా సొంత ఊరు కరీంనగర్. ఇప్పుడు హైదారాబాద్‌లో ఉంటున్నాను. వరంగల్ హిస్టరీని అంతా విక్లిపీడియూలో చదివాను. వరంగల్‌ను నా సొంత ఊరులా భావిస్తాను. ఖిలావరంగల్, భద్రకాళి అమ్మవారు, వేయిస్థంబాల ఆలయూలను చూశాను. త్వరలో రామప్ప, లక్నవరంను చుస్తాను. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. ఇంటర్ పూర్తి కాగానే ఫ్యాషన్ డిజైనింగ్‌ను నేర్చుకున్నాను. మొదట్లో ఇంట్లో వాళ్లు వద్దని చెప్పారు. అయినప్పటి కీ వారిని ఒప్పించి అందాల పోటీల్లో పాల్గొన్నాను. హైదారాబాద్‌లో జరిగిన మిస సౌత్ ఇండియా పోటీల్లో గెలుపొందాను. తరువాత కొచ్చిన్ జరిగిన పోటీలలో పాల్గొన్నాను. అక్కడ మిస్ ఏపీ గా గెలిచాను. అలా ముందుకు సాగుతూ మిస్ ఇండియా టైటిల్‌ను సైతం గెలుచుకున్నాను. తెలంగాణలో మోడలింగ్‌పై శిక్షణ సంస్థ మోడలింగ్‌ను నేర్చుకోవాలని కోరిక ఉన్న వారు అందరూ ముంబై, డిల్లీ తదితర ప్రాంతాలకు వె ళ్తున్నారు. మన తెలంగాణలో సైతం త్వరలో మోడలింగ్ పై శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తాను. దీనికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే మరింత ముందుకు వెళ్తాను. అందరు బీటెక్, మెడిసిన్ లాంటి వాటిని నేర్చుకుంటూ మోడలింగ్‌పై శ్రద్ధ పెట్టాలి. బికినీల సంప్రదాయం మనది కాదు అందాల పోటీల్లో చివరకు బికినీలు ధరించాలని ఉంటుంది. దీంతో మన మహిళ సంఘాలు అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నారు. బికినీలు ధరించడం సౌత్ ఇండియా సాంప్రదాయం కాదు కాబట్టి పోటీల్లో పాల్గొనే వారు 80శాతం వరకు వెనకడుగు వేస్తున్నారు. తెలంగాణ నుంచి నేను ఒక్కదాన్నే మన దేశంలో జరిగిన అందాల పోటీలలో పాల్గొని ముందుకు సాగుతున్నా. ప్రతి పేరెంట్ అందాల పోటీల్లో వద్దని చెబుతారు. సినిమా ఆఫర్లు వస్తున్నాయి మిస్ ఇండియా పర్ఫెక్ట్ 2014, మిస్ ఇండియా బ్యూటిఫుల్ ఐస్ 2014 అయ్యాక సినిమా ఆఫర్లు వస్తున్నాయి. మంచి బ్యానర్, ఒక మేసేజ్ ఓరింయటెడ్ సినిమాలో నటిస్తాను. హీరోలల్లో కమల్‌హాసన్, హిరోహియిన్లలో కత్రిన కైఫ్ అంటే చాలా ఇష్టం. వరంగల్ బ్యాక్ గ్రౌండ్లో రూపొందిన చిత్రం రుద్రమాదేవి చిత్రం చూడాలని బాగా ఆతృతతో ఉన్నాను. మన ప్రాంత సినిమాను మనం అందరం ఆదరించి తెలంగాణ సంస్కృతిని కాపాడుదాం. సినిమా మంచి హిట్ కావాలని కోరుకునే వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తిని. గుణశేఖర్‌కు బెస్ట్ ఆఫ్ లక్. -
హైదరాబాద్‌కు విరాట్ కోహ్లీ ఫ్యాషన్ బ్రాండ్ ‘రాన్’
భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్‌కు చెందిన యూత్ ఫ్యాషన్ బ్రాండ్ ‘రాన్'.. ఎక్స్‌క్లూజివ్ రిటైల్ స్టోర్లను విస్తరించే సన్నాహాల్లో ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కూడా స్టోర్‌ను ప్రారంభించనుంది. హైదరాబాద్ తోపాటు ముంబై, బెంగళూరులో ఐదు ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దీంతో పాటు.. షాపర్స్ స్టాప్ స్టోర్లలో షాప్ ఇన్ షాప్స్ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో విస్తరణపై దృష్టిపెట్టామని, వచ్చే రెండుమూడేళ్ల కాలంలో విదేశీ మార్కెట్లలోకి ప్రవేశిస్తామన్నారు. -
ఫ్యాషన్‌ని క్యాష్ చేసుకుంటున్నారు!
హీరోయిన్లు చాలామంది కేవలం నటించడానికే పరిమితం కావడంలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా రకరకాల బిజినెస్‌లు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రధానంగా వీళ్ల ఫోకస్ అంతా ఫ్యాషన్ డిజైనింగ్ మీదే. బాలీవుడ్లో ఇప్పుడు చాలామంది... తారలు ఈ ఫ్యాషన్ బిజినెస్ వైపు ఎంతో ప్యాషన్‌గా అడుగులేస్తున్నారు. ఆ తారల గురించి తెలుసుకుందాం... పిచ్చెక్కిపోవాల్సిందే! మాధురీ దీక్షిత్ ఒకప్పుడు ‘నంబర్ వన్’ హీరోయిన్. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన మాధురి ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఓ పక్క పాత్రలు చేస్తూనే, మరోపక్క ‘మ్యాడ్జ్’ పేరుతో సొంతంగా ఫ్యాషన్ డిజైనింగ్ మొదలుపెట్టారు. 30 ఏళ్ల సినిమా కెరీర్లో మాధురి ఎన్నో కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్‌లో కనిపించిన విషయం తెలిసిందే. ఆ కాస్ట్యూమ్స్‌ని ఎలా డిజైన్ చేశారనే విషయంపై ఆమె దృష్టి పెట్టేవారట. ఆ విధంగా ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఆమెకు మంచి అవగాహన ఏర్పడింది. ఆ అవగాహనతోనే ఆమె ‘మ్యాడ్జ్’ని ప్రారంభించారు. కాటన్, లిక్రా.. ప్రధానంగా ఈ రెండు రకాల మెటీరియల్స్‌తో దుస్తులు తయారు చేస్తుంటుంది మ్యాడ్జ్. మాధురి తన వ్యక్తిగత అభిరుచిని క్రోడీకరించి, దుస్తులు డిజైన్ చేయిస్తున్నారు. సో.. మ్యాడ్జ్ కలక్షన్స్ ధరిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే అన్నమాట. బెబో... డిజైన్ అబ్బో! ట్రెండీగా ఉండటం కరీనా కపూర్‌కి చాలా ఇష్టం. ఆమెను ‘ఫ్యాషన్ ఐకాన్’ అని అంటారు. ట్రెండ్‌కి తగ్గట్టుగా అప్డేట్ అవుతుంటారు. అందుకే, ఒక అంతర్జాతీయ బ్రాండ్ కరీనాని తమ కోసం డెనిమ్స్ డిజైన్ చేయమని కోరింది. కరీనా ముద్దు పేరు బెబో. ఆమె డిజైన్ చేసే కలక్షన్కి ఆ పేరే పెట్టారు. డెనిమ్ మెటీరియల్‌తో కరీనా డిజైన్ చేయించే ట్రెండీ డ్రెస్సులకు బాగా క్రేజ్ ఉందని సమాచారం. బెబో డిజైన్ అబ్బో అని కూడా చాలామంది అంటున్నారట. ట్రెండీ ట్రెండీగా... ఫ్యాషన్‌గా ఉండటం బిపాసా బసుకి చాలా ఇష్టం. తొడుక్కునే బట్టలు, పెట్టుకునే నగలు, వేసుకునే చెప్పులు.. ఇలా అన్నీ చాలా స్టయిల్‌గా ఉండాలనుకుంటారు. విడిగా కూడా చాలామంది అమ్మాయిలు స్టయిల్‌కి బోల్డంత ప్రాధాన్యమిస్తారు కాబట్టి.. వాళ్ల కోసం ‘ట్రంక్ లేబుల్’ పేరుతో బిపాసా బసు ఫ్యాషన్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టారు. చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, ఆభరణాలు... ఇవన్నీ డిజైన్ చేయిస్తున్నారామె. బిపాసానా మజాకానా అన్న చందంగా ఆ డిజైన్స్ అన్నీ ట్రెండీ ట్రెండీగా ఉన్నాయని బాలీవుడ్ టాక్. లైట్ వెయిట్ శారీస్ సో నైస్ ప్రపంచంలో ఎన్ని రకాల డ్రెస్సులు అయినా రానివ్వండి.. చీరకట్టులో ఉన్న అందం వేరే దేనిలోనూ ఉండదు. అందుకే, శిల్పాశెట్టి మగువల మనసు దోచేలా మంచి చీరలు డిజైన్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే ‘ఎస్ఎస్కె’ డిజైనర్స్ ఆరంభించారామె. శిల్పా మంచి మంచి డిజైనర్ శారీస్ కట్టుకుంటుంటారు. ఎస్ఎస్కెలో అలాంటివే తయారు చేయిస్తున్నారు. షిఫాన్, జార్జెట్ చీరలకు జరీ ఎంబ్రాయిడరీ, క్రిస్టల్ వర్క్‌తో హంగులద్ది డిజైనర్ శారీస్ తయారు చేయిస్తున్నారామె. లైట్ వెయిట్ శారీసే తమ ప్రధాన లక్ష్యమని, భారతీయ వనితలను దృష్టిలో పెట్టుకునే చీరలు డిజైన్ చేయిస్తున్నామని, ఆధునికతకు పెద్ద పీట వేస్తున్నామని శిల్పా అంటున్నారు. యువతరం ఫ్లాట్ అయ్యేలా... కుర్ర కథానాయిక సోనమ్ కపూర్ కూడా వ్యాపారం మొదలుపెట్టేశారు. తన చెల్లెలు రియా కపూర్‌తో కలిసి ‘రీసన్’ అనే పేరుతో ఫ్యాషన్ లైన్ ఆరంభించారు. సోనమ్ వేసుకునే దుస్తులను దాదాపు రియానే డిజైన్ చేస్తారు. ఆమెకు డిజైనింగ్ మీద మంచి పట్టు ఉంది. అవి సోనమ్ ధరిస్తుంటారు కాబట్టే, ఆమెకు స్టయిలిష్ హీరోయిన్ అనే పేరు వచ్చింది. కాలేజీ గాళ్స్‌కి సోనమ్ స్టయిల్ అంటే క్రేజ్. వాళ్లని దృష్టిలో పెట్టుకునే రీసన్లో ట్రెండీ డ్రెస్సులు తయారు చేయిస్తున్నారు. ఈ అక్కాచెల్లెళ్లు యువతరం ఓటు తమ బ్రాండ్‌కే అంటున్నారు. యంగ్ ఎట్ హార్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలన్నది శ్రద్ధాకపూర్ కల. అందుకే ‘ఇమారా’ పేరుతో ఫ్యాషన్ డిజైనింగ్ మొదలుపెట్టారు. శ్రద్ధా టార్గెట్ అంతా మోడ్రన్ గాళ్స్ మీదే. పాత కాలం డిజైన్స్‌ని ఆదర్శంగా తీసుకుని క్లాస్ టచ్‌తో దుస్తులు తయారు చేయించడం తన లక్ష్యం అని శ్రద్ధా అంటున్నారు. ముఖ్యంగా ఇంటి గడప దాటి ఇండిపెండెంట్‌గా ఉద్యోగాలు చేసుకునే మహిళలను దృష్టిలో పెట్టుకుని, దుస్తులు తయారు చేయిస్తున్నారామె. వయసులో ఉన్నవాళ్లు మాత్రమే కాదు.. మధ్యవయస్కులూ ‘ఇమారా’ డిజైన్ చేసిన దుస్తులు ధరిస్తే, ‘యంగ్ ఎట్ హార్ట్’లా ఫీలవుతారట. తెరపై హాట్..తెరవెనుక ట్రెడిషనల్ హాట్ గాళ్ ఇమేజ్ సొంతం చేసుకున్న మలైకా అరోరా ఖాన్ ఆ ఇమేజ్‌కి భిన్నంగా దుస్తులు డిజైన్ చేయాలనుకున్నారు. ఆమె ఫ్యాషన్ లేబుల్ పేరు ‘ది క్లోజస్ట్ లేబుల్.కామ్’. తెరపై సెక్సీ అవుట్‌ఫిట్స్‌లో కనిపించే మలైకా, తన క్లాతింగ్ లైన్ ఆల్మోస్ట్ ట్రెడిషనల్‌గా ఉండేట్లు చూసుకుంటున్నారు. అలాగని, లేటెస్ట్ ట్రెండ్‌ని మాత్రం మిస్ కావడంలేదు. సరసమైన ధరలతోనే డిజైనర్ కాస్ట్యూమ్స్ అందరికీ అందుబాటులో ఉండే దుస్తులు అందించాలన్నది లారా దత్తా కొన్నేళ్ల కల. ఈ ఏడాది ఆ కలను నెరవేర్చుకున్నారు. పాపకు జన్మనిచ్చాక ఇంటిపట్టున ఉన్న లారా దత్తా ఫ్యాషన్ గురించి కొంచెం స్టడీ చేశారు. ఆ అవగాహతో ఓన్ లేబుల్ మొదలుపెట్టారు. భారతీయ వనితల కోసమే డిజైన్ చేస్తున్నానని, అందరికీ అందుబాటులో ఉండే ధరలతోనే లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. ‘చాబ్రా 555’ అనే డిజైనింగ్ లైన్‌తో కలిసి లారా దత్తా ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్‌లోకి ఎంటరయ్యారు. రే ఆఫ్ హోప్! జీవితం హాయిగా సాగుతున్నప్పుడు క్యాన్సర్ రూపంలో లిసా రేకి పెద్ద కుదుపే వచ్చింది. కానీ, నమ్మకంతో చికిత్స చేయించుకుని, సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు. ‘రే ఆఫ్ హోప్’ పేరుతో ఓ డిజైనర్ లేబుల్‌ని ఆరంభించారు. జీవితం అంటే ఓ నమ్మకమని, తన జీవితాన్ని ఆదర్శంగా తీసుకునే ఫ్యాషన్ డిజైనింగ్ లేబుల్‌కి ‘రే ఆఫ్ హోప్’తో పేరు పెట్టానని లిసా పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకి మాత్రమే కాదు.. అనారోగ్యంతో బాధపడేవారిలో ఆత్మవిశ్వాసం కల్పించే విధంగా ఉండే చీరలు డిజైన్ చేయించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నారు లిసా రే. - డి.జి. భవాని -
సందడిగా గ్రాడ్యుయేషన్‌డే
-
హోటల్ మేనేజ్మెంట్ కోర్సు..
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును అందించే ఇన్స్టిట్యూట్ల వివరాలు తెలపండి? -రాధ, విజయవాడ ఫ్యాషన్ డిజైనింగ్.. చాలా విస్తృతమైన సబ్జెక్టు. ఇందులో గార్మెంట్ డిజైనింగ్, టెక్స్టైల్ డిజైనింగ్, జ్యువెలరీ డిజైనింగ్ లాంటి వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇది యువతకు మంచి ఉపాధి వేదికగా మారడంతో ఎక్కువమంది దీనివైపు ఆకర్షితులవుతున్నారు.హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్‌లో నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇందులో టెక్స్టైల్ డిజైన్, ఆక్సెసరీ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్ అండ్ కమ్యూనికేషన్ లాంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థ అపారెల్ ప్రొడక్షన్లో బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సును అందిస్తోంది. ఈ సంస్థ మాస్టర్స్ ప్రోగ్రామ్స్‌ను కూడా అందిస్తోంది. వెబ్సైట్: www.nift.ac.in హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్.. ఫ్యాషన్ డిజైనింగ్‌లో టెక్స్టైల్ డిజైనింగ్ ఒక సబ్జెక్టుగా ఆరు నెలల డిప్లొమా కోర్సును అందిస్తోంది. అర్హత: పదో తరగతి వెబ్సైట్: www.iiftindia.net హైదరాబాద్‌లోని అపారెల్ ట్రెయినింగ్ అండ్ డిజైన్ సెంటర్.. ఒకేడాది అపారెల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీల్లో డిప్లొమా కోర్సులను అందిస్తోంది. ఈ రెండు సబ్జెక్టుల్లో రెండేళ్ల అసోసియేట్ డిగ్రీలను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ సంస్థ అడ్వాన్స్డ్ ప్యాటర్న్ మేకింగ్‌లో డిప్లొమా కోర్సును అందిస్తోంది. ఇది వొకేషనల్ కోర్సులకు శిక్షణనిచ్చే సంస్థ. అర్హత: పదో తరగతి/ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. వెబ్సైట్: www.atdcindia.co.in ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తయింది. ఏ విధమైన షార్ట్ టర్మ్ కోర్సులు చేయడం ద్వారా ఉద్యోగావకాశాలు మెరుగవుతాయో వివరించండి? -వినయ్, విశాఖపట్నం ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్(పీఎల్సీ).. ఎలక్ట్రో మెకానికల్ ప్రాసెస్లను నియంత్రిస్తుంది. సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా ఆక్విజిషన్(ఎస్సీఏడీఏ).. పరిశ్రమల్లో పర్యవేక్షణకు, మౌలిక వసతులను, మెషినరీని నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. వీటిపై శిక్షణ తీసుకోవడం ద్వారా అవకాశాలు మెరుగవుతాయి. హైదరాబాద్‌లోని ప్రొలిఫిక్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్.. ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్స్ విభాగంలో శిక్షణ ఇస్తుంది. దీనికి సర్టిఫికెట్ కూడా అందిస్తుంది.ఈ ప్రోగ్రామ్‌లో పీఎల్సీ, ఎస్సీఏడీఏ లాంటి అంశాలు ఉంటాయి. ఈ ఇన్స్టిట్యూట్ ప్లేస్‌మెంట్స్ కూడా అందిస్తోంది. అర్హత: ఈ విభాగంలో డిగ్రీ ఉన్నవారు, పని అనుభవం ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: www.plcscadatraining.com హైదరాబాద్‌లో రామాంతపూర్‌లోని జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రెయినింగ్లోని అడ్వాన్స్డ్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రాసెస్ ఇన్స్ట్రుమెంటేషన్.. పీఎల్సీ, ఎస్సీఏడీఏల్లో శిక్షణ అందిస్తుంది.అర్హత: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొ మా. వెబ్సైట్: ఠీఠీఠీ.్చ్టజ్ఛీఞజీజిడఛ్ఛీట్చఛ్చఛీ.జౌఠి.జీ హోటల్ మేనేజ్మెంట్/కలినరీ టెక్నాలజీ కోర్సులను అందించే ఇన్స్టిట్యూట్ల వివరాలు తెలపండి? -వినోద్, మెదక్ హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రీషన్.. హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో బీఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: ఇంటర్మీడియెట్/10+2 లేదా తత్సమానం ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.ihmhyd.org. ా్నలజీల్లో బ్యాచిలర్ డిగ్రీ అందిస్తోంది. అర్హత: ఇంటర్మీడియెట్/10+2 ప్రవేశం: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: ఠీఠీఠీ.టఛిజిఝఛ్టి.ౌటజ. హైదరాబాద్‌లోని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా వివిధ కోర్సులను అందిస్తోంది. వాటి వివరాలు... క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ కలినరీ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ. అర్హత: ఇంటర్మీడియెట్/10+2 ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా. అర్హత: హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ, హోటల్/హాస్పిటాలిటీ విభాగాల్లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్/ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌తో రెండేళ్ల పని అనుభవం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్లో బీఎస్సీ, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో బీఏ, కలినరీ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్. ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా. ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పాటిస్సెరి(పేస్ట్రీస్)లో సర్టిఫికెట్ కోర్సు అర్హత: పదో తరగతి. ఇంగ్లిష్ ప్రావీణ్యం తప్పనిసరి. ప్రవేశం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.iactchefacademy.com -
గసీ ఫ్యాషన్ షో
-
టునిషియా ఫ్యాషన్ వీక్
-
లెబనాన్ ఫ్యాషన్ వీక్
-
ఈ ఫ్యాషన్స్‌తో వెన్ను నొప్పి ఖాయం
న్యూఢిల్లీ: నేటితరంలో చాలామంది ఫ్యాషనబుల్‌గా ఉండడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా ఒంటికి అతుక్కుపోయే దుస్తులను ఎక్కువగా ధరిస్తున్నారు. అయితే ఇలా ఒంటికి అతుక్కుపోయే డ్రెస్‌లు నరాల పనితీరుమీద ఒత్తి డి కలిగిస్తాయని, దీంతో వెన్నునొప్పి లాంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. న్యూఢిల్లీలోని క్యూఐ స్పైన్ క్లినిక్‌కి చెందిన వెన్నునొప్పి నిపుణులు సూరజ్ బఫ్నా ఈ సమస్యపై తన సూచనలిస్తున్నారు. ► ఒంటికి అతుక్కుపోయే జీన్స్ నడుము, తొడలు, కండరాలపై ఒత్తిడిన కలుగజేస్తాయి. ఇది మోకాలి జాయింట్ పేయిన్స్కి కారణమవుతాయి. ► బరువైన బ్యాగ్‌లు ధరించడం కూడా ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది. సాధారణంగా బ్యాగ్‌ను ఏదైనా ఒకవైపే ఎక్కువగా ధరిస్తాం. అధిక బరువు ఉన్న బ్యాగ్‌లను ఒకే వైపు ఉంచడంతో వెన్ను మీద అధిక భారం పడుతుంది. ఇది వెన్ను నొప్పిని కలిగిస్తుంది. ► నగరాల్లో యువతులు ఎక్కువగా హైహీల్స్ ధరిస్తున్నారు. ఇది పాదాలు, వెన్నెముకపై ఒత్తిడి కలిగిస్తుంది. తొడ కండరాలు క్షీణించేలా చేస్తుంది. దీంతో రక్త ప్రసరణ సమస్యలు తలెత్తడంతోపాటు, మోకాలి చిప్ప అరుగుదలకు కూడా కారణమవుతుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా కంఫర్టబుల్ పాదరక్షలు వాడడం ఉత్తమం. -
సరికొత్తలుక్‌లో ’సైనా ’
-
నిత్యనూతనం... ఫ్యాషన్ డిజైనింగ్ పరిశ్రమ!
మీరే పారిశ్రామికవేత్త: దుస్తులు ధరించడం నాగరికత. అది అధునాతనంగా రోజుకో కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది. ఫ్యాషన్ ప్రపంచంలో వస్త్రాలలో వచ్చినన్ని మార్పులు... బహుశా మరి వేటికీ రావేమో! ఆ కొత్త పోకడల హవాలో గార్మెంట్ మేకింగ్ ఇండస్ట్రీ ఏకంగా ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీగా మారిపోయింది. ఈ పరిశ్రమ ప్రారంభించాలంటే... యంత్రాలు, ఇతర సామగ్రి: కుట్టు మిషన్లు (ఇండస్ట్రియల్ మెషీన్లు)- 3(ఒక్కొక్కటి 20 వేల వరకు ఉంటుంది) గది - వెయ్యి చదరపు అడుగుల జాగా కావాలి (అద్దె, అడ్వాన్సు వంటి ఖర్చులు ప్రదేశాన్ని బట్టి మారుతుంటాయి) కటింగ్ టేబుల్ - 1 (మూడు వేలు) కత్తెరలు - 4 (మాస్టర్ సిజర్స్ ఒక్కొక్కటి ఎనిమిది వందలవుతుంది. మామూలు కత్తెర 250కి వస్తుంది) మెజరింగ్ టేపు, స్కేళ్లు, బాబిన్స్, దారాలు, ఐరన్‌బాక్సు, ఐరన్ చేయడానికి టేబుల్ వంటి ఇతర సామగ్రి పదివేల లోపు అవుతుంది. ఈ వసతులతో ఐదుగురు పని చేసుకోవచ్చు. కాబట్టి పరిశ్రమ స్థాపించిన వారితోపాటు నలుగురు ఉద్యోగులు అనుకుంటే నలుగురికి జీతాలు (ఒక్కొక్కరికి కనీసంగా నెలకు ఐదు వేలు, మాస్టర్‌కి పదివేల రూపాయలు ఉంటుంది). శిక్షణ తీసుకున్న నలుగురైదుగురు కలిసి నిర్వహించునేటప్పుడు ఈ వేతనాల ఖర్చు ఉండదు. ముడిసరుకు... చొక్కాలు, నైట్‌సూట్, నైటీ, చుడీదార్, లేడీస్ టాప్స్... వంటివి కుట్టడానికి తగిన మెటీరియల్ కొనుక్కోవాలి. సాధారణంగా నైట్సూట్స్కి, నైటీలకు కాటన్, టాప్స్‌కి జార్జెట్, షిఫాన్ వంటివి ఉపయోగిస్తారు. అలాగే నెట్టెడ్ మెటీరియల్, గుండీలు, లేసుల వంటివి కూడా టోకుగా కొనుక్కోవచ్చు. ఇవన్నీ చార్మినార్ సమీపంలోని దుకాణాల్లో లభిస్తాయి. ముడిసరుకు కొనుగోలుకు రెండు లక్షలు అనుకుంటే మొత్తం యూనిట్ ప్రారంభించడానికి మూడు - నాలుగు లక్షల ఖర్చవుతుంది. ఇదే యూనిట్‌ని భారీ స్థాయిలో 30 ఇండస్ట్రియల్ మెషీన్లతో ప్రారంభించవచ్చు. అప్పుడు పాతిక లక్షలవుతుంది. స్కూలు యూనిఫామ్ వంటి భారీ ఆర్డర్లు తెచ్చుకోగలిగితే సాఫీగా నడిపించవచ్చు. చాలా స్కూళ్లు మెటీరియల్ ఇచ్చి కుట్టించుకుంటాయి కాబట్టి ముడిసరుకు కొనుగోలు శ్రమ తప్పుతుంది. మరో మార్గం ఏమిటంటే... ఇంట్లోనే ఉంటూ ఒక సాధారణ కుట్టు మిషన్ (పదివేలకు వస్తుంది)తో వర్క్ చేసుకోవచ్చు. పరిశ్రమ స్థాపించిన వారికి పని చేసి పీస్ లెక్కన డబ్బు తీసుకోవచ్చు. యూనిట్ పెట్టాలనుకునే వారికి ఆ రకమైన గైడ్‌లైన్స్ కూడా శిక్షణలోనే ఇస్తాం. ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికేట్ కాబట్టి శిక్షణ తరవాత బ్యాంకు నుంచి రుణాలు పొందడానికి మార్గం సులువవుతుంది. శిక్షణలో... బ్లవుజ్, స్కర్టు, టాప్, షర్ట్, నిక్కర్, ఫ్రాక్, సల్వార్ కమీజ్, చుడీదార్లు డ్రాఫ్టింగ్, కటింగ్, స్టిచింగ్ నేర్పిస్తారు. శిక్షణ కాలం... రెండు నెలలు. రా మెటీరియల్ఉచితంగా ఇస్తారు. శిక్షణ తర్వాత పరీక్ష పెట్టి ఉత్తీర్ణులైన వారికి ‘మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్’ నుంచి సర్టిఫికేట్ ఇస్తారు. రిజిస్ట్రేషన్ కోసం: 1800 123 2388 (ఉ॥10 ॥నుంచి సా॥5 ॥మధ్య), 88866 65895 నంబర్లలో సంప్రదించవచ్చు. - ఎలీప్ ఇచ్చిన వివరాలతో... -
ఫెస్ట్... జబర్దస్త్!
ఫ్యాషన్వాక్, సోలో డ్యాన్స్, మేనేజ్మెంట్ స్కిట్స్.... డిఫరె ంట్ కాన్సెప్ట్స్ తో ఆంగ్లోఫైల్ బిజినెస్ స్కూల్ యాన్యువల్ ఫెస్ట్-2015 జోష్ ఫుల్‌గా సాగింది. మూడు థీమ్స్‌తో సాగిన మూడు రౌండ్ల ఫ్యాషన్ షో విద్యార్థుల సృజనాత్మకతను కళ్లకు కట్టింది. విద్యార్థులు రౌండ్లో జంటగా, రెండో రౌండ్లో వెస్ట్రన్ అండ్ ఫ్లోరల్ వేర్లో, మూడో రౌండ్లో ఎథ్నిక్ అండ్ డిజైనర్ వేర్లో ర్యాంప్‌పై ప్రొఫెషనల్ మోడల్స్‌కు దీటుగా హొయలు పోయారు. గెస్ ది బ్రాండ్, అడ్వర్టైజింగ్స్ అండ్ నాస్టాల్జియా వంటి మేనేజ్మెంట్ గేమ్స్ స్టూడెంట్స్ మెదడుకు పదును పెట్టాయి. సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వినితా సురానా ప్రసంగం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపింది. -
ఫ్యాషన్ డిజైనింగ్
ఫ్యాషన్‌కు సంబంధించి సర్టిఫికెట్, డిప్లొమా, బ్యాచిలర్, మాస్టర్ స్థాయి వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ కోర్సులు-బీడీఈఎస్ ఇన్ ఫ్యాషన్ కమ్యూనికేషన్, బీడీఈఎస్ ఇన్ ఫ్యాషన్ డిజైన్, బీడీఈఎస్ ఇన్ నిట్వేర్ డిజైన్, బీడీఈఎస్ ఇన్ లెదర్ డిజైన్, బీడీఈఎస్ ఇన్ టెక్స్టైల్ డిజైన్, బీఎఫ్‌టెక్ (అపెరల్ ప్రొడక్షన్). బ్యాచిలర్ కోర్సుల్లో చేరడానికి అర్హత ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం. మాస్టర్ కోర్సులు: మాస్టర్ ఆఫ్ డిజైన్,మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. మాస్టర్ కోర్సుల్లో ప్రవేశించాలంటే సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సర్టిఫికెట్/డిప్లొమా కోర్సులకు 10వ తరగతి/ఇంటర్మీడియెట్ కావాలి. కెరీర్లో ఉన్నత స్థానాలకు చేరాలంటే మాత్రం బ్యాచిలర్ లేదా పీజీ కోర్సులు చేయడం తప్పనిసరి. స్కిల్స్: సృజనాత్మకత, భిన్నంగా ఆలోచించడం, విశ్లేషణ సామర్థ్యం, తార్కిక ఆలోచన, కలర్ సెన్స్ (కలర్ల ఎంపిక పట్ల చక్కని అవగాహన), మార్కెట్ అవసరాలను/వినియోగదారుల అభిరుచిని అంచనా వేయడం. అవకాశాలు: ఫ్యాషన్ అంటే చాలా మంది కేవలం దుస్తుల డిజైనింగ్ అనే భావనలో ఉంటారు. మనం ఉపయోగించే లెదర్ వస్తువులు, యాక్ససరీస్, టెక్స్టైల్, కమ్యూనికేషన్, అపెరల్ ప్రొడక్షన్, నిట్వేర్ వంటి విభాగాల్లో కూడా డిజైనర్ల సేవలు అవసరం. ఫ్యాషన్, న్యూ ట్రెండ్స్ పట్ల పెరుగుతున్న అవగాహన, ఆసక్తి కారణంగా అంతే స్థాయిలో కొత్త పరిశ్రమలు, బొటిక్‌ల ఏర్పాటు సాగుతోంది. దీంతో ఈ కోర్సు పూర్తిచేసిన వారు డిజైనర్‌గా, ఫ్రీలాన్స్ డిజైన్ కన్సల్టెంట్, స్టయిలిస్ట్, కాస్ట్యుమ్ డిజైనర్, ఇల్స్ట్రేటర్స్, ప్యాట్రన్ ఇంజనీర్లు, ఫ్యాషన్ జర్నలిస్ట్, బ్రాండ్ మేనేజర్, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా స్థిరపడొచ్చు. టాప్ రిక్రూటర్స్: అల్పైన్ ఇంటర్నేషనల్, ఐటీసీ లిమిటెడ్, స్వరోస్కీ ఇండియా, ఇండస్ లీగ్ క్లాతింగ్, మాధుర గార్మెంట్స్, ప్రొలైన్, స్పైకర్, పాంటాలూన్, లీవిస్, రాబియా లెదర్స్, పాంటాలూన్స్, షాపర్స్ స్టాప్. వేతనాలు: బ్యాచిలర్ డిగ్రీతో కెరీర్ ప్రారంభంలో నెలకు రూ. 25-30 వేల వేతనం లభిస్తుంది. తర్వాత ఉన్నత చదువులు, హోదా ఆధారంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. మాస్ట ర్స్ డిగ్రీతో నెలకు రూ. 30-40 వేలు జీతం పొందొచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ వివరాలకు: www.nift.ac.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వివరాలకు: www.nid.edu సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-పుణే వెబ్సైట్: జ్ట్టిఞ://sid.edu.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ- బెంగళూరు, వెబ్సైట్: http://iiftbangalore.com సృజనాత్మకత అవసరం ఫ్యాషన్ ఇప్పుడు దైనందిన జీవితంలో భాగమైంది. ఒకప్పుడు కేవలం డ్రెస్ డిజైన్‌కే పరిమితమైన ఫ్యాషన్ టెక్నాలజీ ఇప్పుడు హెయిర్ స్టైల్ నుంచి షూ వేర్ వరకు విస్తరించింది. ఏటా 15-20 శాతం వార్షిక వృద్ధి సాధిస్తోంది. ఫలితంగా అవకాశాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రంగంలో ప్రవేశించాలనుకునే విద్యార్థులకు సృజనాత్మకత, కొత్త ట్రెండ్స్‌పై నిరంతర అవగాహన అవసరం. - ఆర్.గోపాలకృష్ణ, జాయింట్ డెరైక్టర్, నిఫ్ట్, హైదరాబాద్ క్యాంపస్. ఫైన్ ఆర్ట్స్ ఇతర రంగాలకు భిన్నంగా.. కళాత్మాక రంగంలో కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే వారికి చక్కని వేదికగా నిలుస్తు న్నాయి..ఫైన్ ఆర్ట్స్ కోర్సులు. తమ సృజనాత్మకత శక్తి, ఉహకల్పనతో గుర్తింపు పొందడానికి సరైన అవకాశాలు కల్పిస్తున్నాయి . పెయింటింగ్, ఫోటోగ్రఫీ, అప్లయిడ్ ఆర్ట్స్,స్కల్‌ప్చ్‌ర్, మ్యూజిక్, నాట్యం తదితర కోర్సులు ఫైన్ఆర్ట్స్ పరిధిలోకి వస్తాయి. ఇన్స్టిట్యూట్లు: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్‌ఏఎఫ్‌యూ), ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం.. ఫైన్ ఆర్ట్స్ విభాగంలో డిప్లొమా నుంచి మాస్టర్ స్థాయి వరకు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్లో..వివిధ విభాగాల్లో డి ప్లొమా నుంచి మాస్టర్ స్థాయి కోర్సుల వరకు అందుబాటులో ఉన్నాయి. కోర్సులు: బీఎఫ్ఏ(అప్లయిడ్ ఆర్ట్), బీఎఫ్ఏ (ఫోటోగ్రఫీ), బీఎఫ్ఏ(స్కల్‌ప్చ్‌ర్), బీఎఫ్ఏ (పెయింటింగ్), బీఎఫ్ఏ (శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్). మాస్టర్ కోర్సులు: ఎంఎఫ్ఏ(అప్లయిడ్ ఆర్ట్), ఎంఎఫ్ఏ(పెయింటింగ్) , ఎంఎఫ్ఏ(స్కల్‌ప్చ్‌ర్), ఎంఎఫ్ఏ(ఫోటోగ్రఫీ), ఎంఏ(మ్యూజిక్), ఎంఏ (పెర్ఫామింగ్ ఆర్ట్స్), ఎంపీఏ-కూచిపూడి నృత్యం, ఎంపీఏ-ఆంధ్రనాట్యం, ఎంపీఏ-జానపద కళలు, ఎంఫిల్ సంగీతం, ఎంపీఏ డ్యాన్స్(కూచిపూడి, భరతనాట్యం), ఎంపీఏ డ్యాన్స్(ఫ్లోక్). ఇవి కాకుండా ఆయా విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా, బ్రిడ్జ్, ఈవినింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీలను బట్టి అర్హత, ఎంపిక విధానం, కోర్సు వ్యవధి సంబంధిత అంశాలు మారుతు ఉంటాయి. కాబట్టి సంబంధిత. వివరాలను ఆయా వర్సీటీల వెబ్సైట్ల నుంచి పొందొచ్చు. అవకాశాలు: ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు చదువుకుంటూనే సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ విద్యార్థి నైపుణ్యం ఆధారంగా సంపాదన ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు మ్యూజియం, పబ్లికేషన్స్, యూనివర్సిటీలు, అడ్వర్టైజింగ్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, మీడియా సంస్థలు, ఫ్యాషన్ హౌసెస్, డ్రామా థియేటర్స్, ఆర్ట్ స్టూడియోలు, ప్రొడక్షన్ హౌస్‌లలో పలు హోదాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. పెయింటింగ్, ఫోటోగ్రఫీ, సంగీతం, నృత్య విభాగాల అభ్యర్థులు టెలివిజన్, సినిమా రంగాల్లో కూడా స్థిర పడొచ్చు. ప్రభుత్వ విభాగాల విషయానికొస్తే..ట్రైబల్ వేల్పేర్ డిపార్ట్మెంట్, దూరదర్శన్, ఆకాశవాణి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్లలలో అవకాశాలు ఉంటాయి. పెయింటింగ్, స్కల్పచర్, మ్యూజిక్‌లలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వివిధ సంస్థల్లో కాంట్రాక్ట్‌బేస్డ్ పద్ధతిలో పని చేయవచ్చు. సొంతంగా ఆర్ట్ గ్యాలరీలను నెలకొల్పడం, ఆర్ట్ ఎగ్జిబిషన్లను నిర్వహించడం వంటి వాటి ద్వారా స్వయం ఉపాధిని పొందొచ్చు. వివిధ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో మ్యూజిక్, డ్యాన్స్ టీచర్‌గా సేవలు అందించవచ్చు. సొంతంగా మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్ స్కూళ్లను స్థాపించవచ్చు. వేతనాలు: అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, మీడియా సంస్థలు, ఫ్యాషన్ హౌసెస్, డ్రామా థియేటర్స్, ఆర్ట్ స్టూడియోలలో సాధారణంగా అసిస్టెంట్/అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్/గ్రాఫిక్ డిజైనర్/విజువలర్స్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. ఈ దశలో వీరికి నెలకు రూ. 8 వేల-రూ. 20 వేల వరకు ఉంటుంది. తర్వాత హోదాను బట్టి నెలకు రూ. 25 వేల నుంచి రూ. 40 వేలకు సంపాదించవచ్చు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ-లెర్నింగ్ బిజినెస్ సంస్థల్లో గ్రాఫిక్ డిజైనర్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రారంభంలో రూ. 12 వేల నుంచి రూ. 25వేల వరకు ఆర్జించవచ్చు. థియేటర్, డ్రామా, ప్రొడక్షన్ హౌసెస్లలో ప్రారంభంలో రూ. 8 వేల నుంచి రూ. 20 వేల వరకు సంపాదించవచ్చు. ఆ రెండిటితో అందలాలు.. అభిరుచి, సృజనాత్మకత ఈ రెండు నైపుణ్యాలున్న విద్యార్థులకు ఉన్నత కెరీర్‌ను సొంతం చేసే రంగం.. ఫైన్ ఆర్ట్స్. ప్రకృతిలోని అద్భుతాలకు.. అందరినీ ఆకట్టుకునే విధంగా చిత్ర రూపం ఇచ్చే ఫోటోగ్రఫీ, శిల్పకళ వంటివన్నీ ఫైన్ఆర్ట్స్ పరిధిలోకి వస్తాయి. ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు మ్యూజియంలు, మీడియా హౌస్‌లు, యానిమేషన్ సంస్థలు,విజువల్ గ్రాఫిక్ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. - బి. శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, జేఎన్ఏఎఫ్ఏయూ. డిజైనింగ్ కోర్సులు నేటి ఫ్యాషన్ యుగంలో ఆటోమొబైల్ నుంచి లైఫ్ స్టైల్ వరకు.. సిరామిక్స్ నుంచి ఇంటీరియర్ వరకు ఇలా అన్ని రంగాల్లో ప్రొఫెషనర్ల డిజైనర్ల అవసరం ఎంతో. అంతేకాకుండా మారుతున్న అభిరుచులకనుగుణంగా మార్కెట్లోకి ప్రవేశించే ప్రతి వస్తువును ప్రత్యేకంగా రూపొందించాలంటే ప్రొఫెషనల్ డిజైనర్లు కావాల్సిందే. ఇలా అన్ని రంగాలకు చెందిన వస్తువులను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వినూత్న రీతిలో డిజైన్ చేయడాన్ని తెలిపేవే డిజైనింగ్ కోర్సులు. స్పెషలైజేషన్స్: మోటార్ బైక్ నుంచి టీవీ రిమోట్ వరకు అన్ని వస్తువుల్లో డిజైనర్ల పాత్ర కీలకం. ఈ క్రమంలో ఉండే స్పెషలైజేషన్స్..ప్రొడక్ట్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, ఎగ్జిబిషన్ డిజైన్, ఫర్నీచర్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, సిరామిక్ డిజైన్, ట్రాన్స్‌పోర్టేషన్ డిజైన్, ఆటోమొబైల్ డిజైన్ తదితరాలు. కావల్సిన స్కిల్స్: ఈ రంగంలో రాణించాలంటే కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. అవి..సృజనాత్మకత, వినూత్ననంగా ఆలోచించడం, ఆర్టిస్టిక్ వ్యూ, డ్రాయింగ్ వేసే నేర్పు, విశ్లేషణ సామర్థ్యం, కలర్ సెన్స్ (కలర్ల ఎంపిక పట్ల చక్కని అవగాహన), మార్కెట్ అవసరాలను/వినియోగదారుల అభిరుచిని అంచనా వేయడం. అవకాశాలు: ప్రతి కంపెనీ, సంస్థ, కమ్యూనిటీలు అన్నీ మార్కెట్ ట్రెండ్‌ను అందుకునే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి అందరికీ డిజైనర్స్ అవసరం ఉంటుంది. ఈ క్రమంలో కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్న సంస్థలు: ఆటోమొబైల్ కంపెనీలు, ఫ్యాషన్ స్టూడియోస్, మాన్యుఫాక్చరింగ్ సంస్థలు, మీడియా హౌసెస్, రిటైల్ సంస్థలు, సిరామిక్ ఇండస్ట్రీస్, గ్లాస్ వేర్ హౌసెస్, యానిమేషన్ స్టూడియోలు, గేమింగ్ కంపెనీలు, బోటిక్స్, టాయ్ ఇండస్ట్రీస్. కెరీర్-వేతనాలు: కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. తర్వాత అసోసియేట్, చీఫ్ డెరైక్టర్/డిజైనర్, క్రియేటివ్ డెరైక్టర్ వంటి హోదాలకు చేరుకోవచ్చు. ప్రారంభంలో సంవత్సరానికి రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు వేతనాన్ని అందుకోవచ్చు. తర్వాత హోదా ఆధారంగా రూ.8-10 లక్షల వరకు కూడా అందుకోవచ్చు. టాప్ రిక్రూటర్స్: మారుతీ సుజుకీ, రెనాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా మోటార్స్, ట్రాక్ట ర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్, ఎల్జీ, వర్లపుల్, గోద్రేజ్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, జీఈ హెల్త్‌కేర్. ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) వివరాలకు: www.nid.edu ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-గౌహతి వివరాలకు: www.iitg.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-కాన్పూర్ వివరాలకు: www.iitk.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- బాంబే వివరాలకు: www.iitb.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరు వివరాలకు: www.iisc.ernet.in ఫారెన్ లాంగ్వేజెస్ గ్లోబలైజేషన్ కారణంగా .. మల్టీనేషనల్ కంపెనీలు భారత్‌కు రావడం.. స్వదేశీ కంపెనీలు జాయింట్ వెంచర్స్ పేరిట విదేశాలకు వ్యాపారాన్ని విస్తరిస్తుండటం.. ఫలితంగా విదేశీ నిపుణులతో సంప్రదింపులు, డాక్యుమెంటేషన్ నిత్యకృత్యమయ్యాయి. దాంతో ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకున్నవారికి డిమాండ్ ఏర్పడింది. ప్రవేశం.. కోర్సులు: బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశానికి కావల్సిన అర్హత ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం. కొన్ని యూనివర్సిటీలు.. డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సులను అందిస్తుంటే మరికొన్ని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, కన్సల్టెన్సీలు కూడా సంబంధిత భాషల్లో కోర్సులను నిర్వహిస్తున్నాయి. డిమాండ్ ఉన్న భాషలు: ఫ్రెంచ్, జర్మనీ, రష్యన్, చైనీస్,జపనీస్, స్పానిష్,కొరియన్ భాషతో కెరీర్ అవకాశాలు: ఫారెన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ట్రాన్స్‌లేటర్స్, ఇంటిప్రిటేటర్స్, డీకోడర్స్, టెక్నికల్ రైటర్స్, కంటెంట్ రైటర్స్, టూర్ ఆపరేటర్స్, ఫ్యాకల్టీ వంటి వివిధ స్థాయిల్లో స్థిరపడొచ్చు. మీడియా, పార్లమెంట్, బోధన, పరిశ్రమలు, కార్పొరేట్ హౌసెస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, పబ్లిషింగ్ హౌస్‌లు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ రాయబార కార్యాల యాలు, హెచ్‌పీ,ఒరాకిల్,స్యామ్సంగ్, హ్యుందాయ్, ఎల్జీ, థామ్సన్, జీఈ, టూరిజం సంస్థలు, హోటల్ పరిశ్రమ, ఎయిర్‌లైన్ ఆఫీస్‌లు, వరల్డ్ బ్యాంక్, యూఎన్ఓ, యునెస్కో, డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. వేతనాలు.. టాప్ రిక్రూటర్స్: అనువాదకులు, ఇంటర్ప్రిటేటర్లుగా పనిచేసేవారికి ఆదాయం కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. భాష ఆధారంగా ట్రాన్స్లేటర్లకు ఒక్కో పేజీకి దాదాపు రూ. 200 నుంచి రూ. 500 వరకు లభిస్తంది. నెల వారీగా రూ. 20 నుంచి రూ. 40 వేల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉంది. అధ్యాపకులకు ప్రారంభంలో 25వేలకుపైగా వేతనం లభిస్తుంది. ఇంటర్‌ప్రిటేటర్లకు గంటకు రూ. 400-500 వరకు చెల్లిస్తున్నారు. రాయబార కార్యాలయాలు, కార్పొరేట్ హౌసెస్, ఫార్మాస్యూటికల్, మెడికల్, తదితర రంగాల్లో స్థిర పడిన వారికి రూ. 15 వేల నుంచి ప్రారంభంలో వేతనం ఉంటుంది. ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఇఫ్లూ-హైదరాబాద్ వెబ్సైట్: www.efluniversity.ac.in ఢిల్లీ యూనివర్సిటీ-న్యూఢిల్లీ వెబ్సైట్: www.du.ac.in జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ-ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ ముంబై,వెబ్సైట్:www.mu.ac.in డీఈఈ సెట్ ఇంటర్మీడియెట్ తర్వాత చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అవకాశం కల్పిస్తోంది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇంటర్ తర్వాత రెండేళ్ల కాలవ్యవధి గల ఈ కోర్సులో ప్రవేశానికి పాఠశాల విద్యాశాఖ ఏటా డీఈఈసెట్ నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా డీఎడ్ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. దీని తర్వాత డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టవచ్చు. -
యాక్టివ్ ఫ్లో
లేడీస్ క్లబ్ సిటీలో భారీస్థాయి వ్యాపారాన్ని ప్రారంభించేవారైనా, ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ ఈవెంట్స్ నిర్వహించేవారైనా.. ఆ లేడీస్ ఆర్గనైజేషన్ వైపు చూడాల్సిందే. సదరు ఆర్గనైజేషన్ సభ్యులు తమ ఆహ్వానితుల జాబితాలో ఉండాలని తహతహలాడాల్సిందే. అదే..ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్. నగరంలో ఈ పేరు తెలియని బిగ్షాట్స్ ఉండరు. నగర వ్యాపార సామ్రాజ్యం ముద్దుగా ఫ్లో (ఎఫ్ఎల్ఓ) అని పిలుచుకునే ఈ లేడీస్ ఆర్గనైజేషన్ అన్ని విధాలుగానూ ప్రత్యేకమైనదే. ..:: ఎస్.సత్యబాబు ఔత్సాహిక వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు, ఎగ్జిక్యూటివ్స్, అంతేకాకుండా అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములు కావాలనుకున్న గృహిణులు సైతం సభ్యులుగా కళకళలాడేదే ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్. దేశవ్యాప్తంగా పనిచేసే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ఇది అనుబంధ విభాగం. ఢిల్లీ ప్రధాన కేంద్ర ంగా కలిగిన ఫిక్కీకి మన నగరంతో పాటు ముంబై, కోల్‌కతా, గువాహటి, కోయంబత్తూర్, జైపూర్‌లోనూ చాప్టర్స్ ఉన్నాయి. ప్రోత్సాహమే పరమా‘విధి’... మహిళా స్వయం సాధికారతను, మహిళల్లో విభిన్న నైపుణ్యాలను ప్రోత్సహించడమే ఫిక్కీ ప్రధానోద్దేశం అని ఆ సంస్థ చైర్పర్సన్ మోనికా అగర్వాల్ అంటున్నారు. ఇందుకోసం మహిళలకు సంబంధించిన ఎడ్యుకేషనల్, వొకేషనల్ ప్రోగ్రామ్స్, టాక్స్, సెమినార్స్, ప్యానెల్ డిస్కషన్స్, వర్క్‌షాప్స్ వంటి ఈవెంట్స్ నిర్వహిస్తోంది ఫిక్కీ. ఈ సంస్థ నిర్వహిస్తున్న పలు ఈవెంట్లు సిటీవాసుల్లో ఆసక్తి రేకెత్తించేవిగా ఉంటాయి. నగరానికి చెందిన పలువురు విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తలను గుర్తించి వారిని తగిన పురస్కారాలు అందిస్తుంటుంది కూడా. పలు రంగాల్లో మహిళలకు సలహాలు, సూచనలు అందించేందుకు నగరంలో బిజినెస్ కన్సల్టెన్సీ సెల్‌ను కూడా నిర్వహిస్తోంది. పేజ్ త్రీ నుంచి.. సిటీలోని పేజ్ త్రీ సోషలైట్స్ నుంచి పేరొందిన టాప్ ప్రొడక్ట్స్ తయారీదారుల దాకా ఈ ఆర్గనైజేషన్‌లో సభ్యులే. నగర సోషలైట్ పింకీరెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ రేఖాలహోటి, ఎక్స్పో నిర్వాహకురాలిగా పేరొందిన కామినిషరాఫ్.. ఇలాంటి వారెందరో ఫిక్కీ సభ్యులుగా ఉన్నారు. వ్యాపార రంగంలో ప్రవేశించిన మహిళలు.. లక్ష్యం దిశగా సాగే క్రమంలో ఫిక్కీతో దోస్తీ చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎనర్జిటిక్ టాక్‌ల నుంచి ఎంటర్టైనింగ్ ఎగ్జిబిషన్ల దాకా నగరంలో పలు ఈవెంట్లు జరుగుతుంటాయి. ‘నెలకు కనీసం 2 యాక్టివిటీస్ తప్పకుండా నిర్వహిస్తున్నాం. మహిళల స్వయం సాధికారతకు, వారి వ్యాపార విస్తృతికి, విభిన్న రంగాల్లో వారు రాణించేలా చేసేందుకు తోడ్పడుతున్నాం’ అని చెప్పారు మోనికా అగర్వాల్. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించి వారి జీవితానుభవాలనే తమ సభ్యులకు పాఠ్యాంశాలుగా మార్చడంలో ఫిక్కీకి సాటిలేదు. గత నెలలో ఐఎస్బీలో ఈ-కామర్స్ మీద నిర్వహించిన ఈవెంట్, ఈ నెలలో సినీనటి, దియామీర్జాను ఆహ్వానించి నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లు ఫిక్కీ నిర్వహించే కార్యక్రమాల్లో వైవిధ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఆఫీసు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఫిక్కీ.. నగర మహిళల్లో వ్యాపార, సాంకేతిక పరమైన అంశాలలో చైతన్యం పెంచేందుకు నిర్విరామ కృషి చేస్తోంది. ఈ ఆర్గనైజేషన్‌కు చైర్పర్సన్, సెక్రటరీ, ఇలా మొత్తం ఐదుగురి ఆధ్వర్యంలో గవర్నింగ్ బాడీ ఉంది. రెండేళ్లకు ఒకసారి ఈ గవర్నింగ్ బాడీ మారుతూ ఉంటుంది. ‘మా సభ్యుల సంఖ్య 450కి పైగానే. దేశంలో పెద్ద సంఖ్యలో సభ్యులున్న ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ మాది’ అని సగర్వంగా చెబుతారు మోనికా అగర్వాల్. మధ్యతరగతి మహిళలు సైతం తమ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందే విధంగా భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తున్నామన్నారామె. మహిళల కోసం మహిళలు.. సిటీలో మా కార్యకలాపాలన్నీ మహిళల అభివృద్ధిని ప్రధానంగా తీసుకునే నిర్వహిస్తున్నాం. టీనేజ్ పిల్లలపై సాంకేతిక విప్లవం ప్రభావం అనే ఇంటి సమస్య దగ్గర్నుంచి గ్లోబలైజేషన్లో మహిళలకు అందే అవకాశాలు అనే ఇంటర్నేషనల్ ఇష్యూస్ దాకా విభిన్న అంశాలపై వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం. మధ్యతరగతి మహిళలకు సైతం ఇవి అందుబాటులో ఉండేలా వీటిని రూపొందింస్తున్నాం. - మోనికా అగర్వాల్, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ -
క్యూట్ & లవ్లీ
పబ్స్ అంటే రాకింగ్ మ్యూజిక్కు ‘షేక్’ అవుతూ ఏదో ప్రపంచంలో తేలిపోవడమే కాదు... సరికొత్త ట్రెండ్స్‌కు... ఫ్యాషన్ పరేడ్స్కు ‘హాట్’ స్పాట్లు కూడా! అమ్మాయిలు... అబ్బాయిలు సాయంత్రాలు అలా అలా వెళ్లి... జీరో క్యాండిల్ వెలుగుల్లో... ‘డిమ్’గా అప్పుడప్పుడూ ఓ సిప్ చేస్తూ... చిందుల్లో గ‘మ్మత్తు’లు ఆస్వాదించడమే అసలు అజెండా అయినా... లే‘టేస్ట్’ డ్రెస్సింగ్ సెన్స్‌నూ చెప్పకనే చెప్పే వేదికలు కూడా! కాదంటారా..! ఇదిగో ఈ భామలను చూడండి..! పబ్ ‘క్లబ్’లోకి వెళ్లేముందు ఇలా ‘లెన్స్’లో క్యూట్‌గా ఫిక్సయిపోయారు. ఒకరిని మించి ఒకరు... ట్రెండీ డ్రెస్సింగ్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో మురిపిస్తున్నారు.సోమాజిగూడ హోటల్ పార్క్‌లోని కిస్మత్ పబ్‌లో లవ్లీ క్లిక్స్ ఇవి. -
వస్త్రాలంకరణ ఇంతింతై!
విస్తరిస్తున్న బొటిక్ ఫ్యాషన్ కోల్‌కతా డిజైనర్లకు బహు గిరాకీ రాజధానికి దీటుగా కుట్లు, అల్లికలు రోజురోజుకూ పెరుగుతున్న మగువల మక్కువ ఖమ్మం : అందంగా కనిపించాలని కోరుకోని మహిళలు ఉండటం అరుదు. అందుకే.. ఆడవారి అలంకరణకు ఆది నుంచే ప్రాముఖ్యత ఉంది. కట్టు, బొట్టు, నిండైన వస్త్రధారణ మన సంస్కృతికి ప్రతీక. ఈ తరహా దుస్తుల తయారీలో భారతీయులు అందెవేసిన చేయి. వస్త్రాలపై అల్లికలు, అద్దాలు, పూలు, డిజైన్లు కుట్టుకోవడం అనాదిగా వస్తోంది. ఒకమాటలో చెప్పాలంటే ఇది మన సంప్రదాయంలో భాగమైంది. పెళ్లిళ్లు, పేరంటాలు, పుట్టిన రోజు తదితర శుభకార్యాలకు వెళ్లినప్పుడు మహిళలు ఈ తరహా వస్త్రాలు ధరిస్తుంటారు. నలుగురు ఒకచోట చేరినప్పుడు ప్రధానంగా అల్లికల ముచ్చట్లే. బొటిక్ ఫ్యాషన్ గురించే చర్చలు. ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కత్తా, సూరత్, హైదరాబాద్ నగరాలకే పరిమితమైన బొటిక్ సంస్కృతి ఇప్పుడు జిల్లాకు కూడా విస్తరించింది. ఖమ్మంతోపాటు కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం, మణుగూరు ప్రాంతాల్లో కూడా బొటిక్‌లు వెలిశాయి. బంజారాల సంప్రదాయ దుస్తుల నుంచి.. తెలంగాణ ప్రాంతంలో బంజారాలు ఏం చేసినా ప్రత్యేకత ఉంటుంది. భాష, సంస్కృతీ సంప్రదాయాలు, వేషధారణ అంతా వెరైటీనే. వారు ధరించే దుస్తులు రాజస్తానీ రాణులను మించిన విధంగా ఉంటాయి. వీరి దుస్తులు రంగురంగు దారాలు, అల్లికలు, వాటి మధ్య అద్దాలు కుట్టి ఆకర్షణీయంగా ఉంటాయి. యుక్త వయస్సు అమ్మాయి మొదలుకొని వృద్ధుల వరకూ వీటిని ధరిస్తుంటారు. వివాహ శుభకార్యం సమయంలో ఈ దుస్తులకు మరింత ప్రాధాన్యత ఉంటుంది. పెళ్లి కూతురు ధరించే జాకెట్‌ను తండాల్లో మహిళలు సుమారు పది రోజులపాటు సమష్టిగా కష్టపడి తయారు చేస్తారు. ఇలాంటి కుట్లు, అల్లికలు కాలగర్భంలో కలుస్తాయేమో అనుకునే సమయంలో ఆ సంస్కృతి మళ్లీ తెరమీదకు వచ్చింది. కొంత మార్పుతో బొటిక్ ఫ్యాషన్‌గా మన ముందుకు వచ్చింది. రకరకాల డిజైన్లు, అల్లికలు బ్లౌజ్‌లు, చీరలు, పంజాబీ డ్రస్సులు, పటియాలు, మిడ్డీలు.. ఇలా ఏ దుస్తులైనా నేడు డిజైన్‌తో కూడుకుని ఉంటున్నాయి. ప్రధానంగా మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ, డిజైనింగ్ బ్లౌజ్‌లు, స్టోన్ వర్క్స్, కలీ, నార, పూసలు, జర్గోస్, గోల్డ్ వర్క్, డైమండ్, థ్రెడ్‌వర్క్, బీట్, నెక్లెస్, జ్యూవలరీ వర్క్స్ ఇలా రకరకాల వర్క్స్‌తో కుట్టే వస్త్రాలను మహిళలు ఇష్ట పడుతున్నారు. వీటికి కుట్టేందుకు థ్రెడ్ వర్క్, వెల్వెట్, నెట్, రాసిల్క్, జూట్ వంటి వస్తువులను ఉపయోగిస్తుంటారు. వీటిని విక్రయించేందుకు ప్రత్యేక షాపులు కూడా ఉన్నాయి. మరీ మంచి డిజైన్ వస్తువులు కావాలంటే హైదరాబాద్, బెనారస్, ముంబై, కలకత్తా తదితర మహానగరాల నుంచి జరీ పట్టీలు, ఇతర అలంకరణ వస్తువులు దిగుమతి చేసుకుంటారు. వీటిని కుట్టేందుకు ఒక్క బ్లౌజ్‌కు రూ. 500 నుంచి రూ. 8 వేల వరకు తీసుకుంటారు. ఇదే హైదరాబాద్ వంటి నగరాల్లో సినిమా యాక్టర్లు, మోడల్స్, పారిశ్రామిక వేత్తలు, ఉన్నతస్థాయి మహిళలు కుట్టించే దుస్తులు రూ. 10 వేలకు మించి ఉంటాయి. చీరలపై డిజైన్ కుట్టించాలంటే రూ. 10 వేల నుంచి రూ. 30 వేల వరకూ ఉంటుంది. వీటిని కుట్టేందుకు కోల్కత్తా నుంచి వర్కర్లను తీసుకొస్తారు. రోజుకో కొత్త డిజైన్ మార్కెట్లో రోజుకో కొత్త డిజైన్ వస్తోంది. దానికి అనుగుణంగా రేటు నిర్ధారిస్తుంటాం. డిజైన్లను వెబ్సైట్ల నుంచి వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని కష్టమర్లకు చూపిస్తుంటాం. శుభకార్యాలు, పండగలకు గిరాకీ బాగా ఉంటుంది. - హరిత, బొటిక్ నిర్వాహకురాలు డిజైన్ డ్రెస్ వేసుకోవాల్సిందే.. సాదాసీదాగా డ్రస్సులు వేసే వాళ్లం. మారుతున్న కాలంతోపాటు డిజైన్ డ్రస్సులు ప్రత్యేకంగా ఉంటున్నాయి. ఖరీదు ఎక్కువ అయినా యువతులు, విద్యార్థులు డిజైన్ డ్రస్సులు కుట్టించుకుంటున్నారు. కొత్త మోడల్స్ వస్తే ఆ మోడల్ డ్రస్ కుట్టించుకోవాల్సిందే. దీని అనుగుణంగా ఖమ్మంలో బొటిక్‌లు పెట్టడం సంతోషం. - ప్రియాంక, యువతి నలుగురు కూడితే డిజైన్ల ముచ్చట్లే.. గతంలో బతుకమ్మ పండుగ, వివాహా శుభకార్యాల వద్ద బంగారు ఆభరణాల గురించి చర్చ జరి గేది. ఇప్పుడు నలుగురు మహిళలు ఒక చోటికి చేరితే డిజైనింగ్, బోటిక్‌ల ముచ్చట్లే. వేలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన చీరలకు అనుగుణంగా జాకెట్లు కుట్టించుకోవాలి. బంగారు నగలతోపాటు డిజైన్లతో కూడిన బ్లౌజ్ కుట్టించుకోవాలి. ఇందుకు ఎంత ఖర్చయినా వెనకాడేది లేదు. - కడారు ప్రమద, గృహిణి -
కింగ్ ఫిషర్ ఫ్యాషన్ షో
-
బూటిజం..
చలికాలం వచ్చేసిందంటే, జనం వెచ్చదనం కోసం వెంపర్లాడతారు. అవకాశం దొరికితే దుప్పటి ముసుగు తన్నేసి ముడుచుకుపోతారు. ముసుగు తన్నేసే అవకాశం ఎల్లవేళలా ఉండదు కదా! చలి తాకిడి ఎంతగా వణికిస్తున్నా, పనుల కోసం బయటకు రాక తప్పదు. బయటకు వచ్చేటప్పుడు స్వెటర్లు, శాలువలు.. జాకెట్లు, జర్కిన్లు.. మఫ్లర్లు, మంకీక్యాపులు.. దొరికినవి దొరికినట్టుగానే చుట్టేసుకుని, ముసుగువీరుల్లా వీధుల్లోకి వస్తారు. వెచ్చదనం కోసం పైపైనే కప్పుకునే వారు, పాదాలను మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడూ వాడే చెప్పులు లేదా షూస్‌తోనే సరిపెట్టేసుకుంటారు. అయితే, ఫ్యాషన్ప్రియుల తీరే వేరు. ఏ కాలంలోనైనా కళాపోషణలో తీసిపోరు. నిజానికి మిగిలిన కాలాలతో పోలిస్తే, ఫ్యాషన్‌కు అనువైనది. మిరుమిట్లు గొలిపే రంగు రంగుల ఉలెన్ దుస్తులను ధరించవచ్చు. కాలిపిక్కల వరకు కవర్ చేసే బూట్లు తొడగవచ్చు. చలికాలంలో ఎన్ని రకాల దుస్తులు తొడిగినా, వాటికి నప్పే బూట్లు ధరిస్తేనే వింటర్ అలంకరణ పూర్తయినట్లని ఫ్యాషన్ నిపుణుల అభిప్రాయం. పెపె పంప్స్, ఉలెన్ బూట్స్, టైగర్ ప్రింటెడ్ బూట్స్ వంటి వెరైటీ బూట్లు ఈ సీజన్లో సరికొత్తగా అందుబాటులోకి రావడంతో అమ్మాయిలు వీటిని ధరించి ట్రెండీగా కనిపిస్తున్నారు. పెన్సిల్ కట్ జీన్స్, స్కర్ట్స్ ధరించినప్పుడు వాటికి జతగా మోకాలి వరకు కప్పి ఉంచే బూట్లు ధరిస్తే, ఆ లుక్కే అదరహో! అనిపిస్తుంది. బూట్లు ధరించినప్పుడు యాక్సెసరీలు తక్కువగా ధరించడం మంచిది. అలాగైతేనే, అందరి దృష్టీ బూట్లపై నిలుస్తుంది. టాప్ టిప్స్.. బూట్లు ధరించినప్పుడు టిప్ టాప్‌గా కనిపించాలంటే, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు. ఫ్యాషన్ నిపుణులు సూచించే టాప్ టిప్స్ ఇవే.. డెనిమ్ షార్ట్ ప్యాంట్, మందంగా ఉండే స్కేటర్ స్కర్ట్ వంటి వాటిపై బూట్లు ధరిస్తే, తప్పనిసరిగా స్టాకింగ్స్ వాడాలి. అలాంటప్పుడు అందరి దృష్టినీ ఆకర్షించాలంటే, జుట్టును బన్‌లా ముడి వేసుకుంటే చాలు. పొడవాటి స్వెట్టర్లు, లాంగ్ జాకెట్లు ధరించినట్లయితే, వాటికి బ్రౌన్‌కలర్ బూట్లు బాగా నప్పుతాయి. పూర్తిగా నల్లని దుస్తులే ధరించేటప్పుడు మాత్రం నల్లని బూట్లే ధరించాలి. వాటికి నప్పేలా రెడ్/ఆరెంజ్/స్కైబ్లూ స్కార్ఫ్‌లు ధరిస్తే అద్భుతంగా కనిపిస్తారు. లేతరంగుల దుస్తులు ధరించినట్లయితే, వాటిపైకి యానిమల్ ప్రింటెడ్ బూట్లు ట్రెండీగా ఉంటాయి. లేసులు ఉన్న బూట్లు, లెదర్ బూట్లను ధరించేటప్పుడు స్టాకింగ్స్ వాడటం తప్పనిసరి అని గుర్తుపెట్టుకోవాలి. - సిద్ధాంతి -
చక్‌దే చక్కదనం
అందానికి అందం సొంతం చేసుకున్న ఈ పుత్తడి బొమ్మలు ఫ్యాషన్ వేదికపై తళుక్కుమన్నాయి. నగరంలోని ‘గుజరాతీ-రాజస్థానీ’ కమ్యూనిటీలు సంయుక్తంగా నిర్వహించనున్న ‘చక్‌దే’ ఈవెంట్ ఏ రేంజ్లో ఉంటుందో తమ సోయగాలతో ట్రైలర్ చూపించారు చక్కనమ్మలు. ఈ నెల 21న మొదలయ్యే ఈ ఫెస్ట్ మార్చి 1 వరకు కొనసాగనుంది. ఆర్ట్స్, స్పోర్ట్స్, కల్చర్, టీ20 క్రికెట్ టోర్నమెంట్, రియాలిటీ షోలు, అందాల పోటీలు, డ్యాన్స్ కాంపిటీషన్స్... ఇలా మొత్తం 15 రకాల ఈవెంట్లు ఉంటాయని నిర్వాహకులు గురువారం తెలిపారు. ఇందులో 11 ఈవెంట్లను తమ కమ్యూనిటీకి మాత్రమే పరిమితం చేసినా, మిగిలిన వాటిలో నగరవాసులు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. -
అనుష్కతో అనుబంధంపై కోహ్లి
దాపరికం ఏమీ లేదు! ముంబై: అనుష్కశర్మ, తాను ఒకరినొకరు ఇష్ట పడుతున్నామని, ఇందులో దాచాల్సిన విషయం ఏమీ లేదని విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. అన్నీ తెలిసి కూడా పదే పదే అదే అడగటం బాగా లేదని అతను అన్నాడు. ‘మా ఇద్దరి మధ్య ఏముందో మీకందరికి కనిపిస్తూనే ఉంది. మేం దీనిని దాచాలని భావించడం లేదు కూడా. ఇకపై ఉత్కంఠ అనవసరం. కానీ కొంతమంది అవునా, ఇది నిజమేనా అని మళ్లీ మళ్లీ అడుగుతున్నారు. ఆ మాత్రం అర్థం చేసుకునే లోకజ్ఞానం లేదా! ఇది వ్యక్తిగత విషయం. దీనిపై బహిరంగంగా మాట్లాడటం మాకు ఇష్టం లేదు. కాబట్టి మమ్మల్ని ఏకాంతంగా ఉండనివ్వండి’ అని కుండబద్దలు కొట్టాడు. గురువారం ఇక్కడ కోహ్లి ‘రాంగ్’ పేరుతో సొంత ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించాడు. ‘నంబర్‌వన్’గానే భారత్: ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్‌వన్ స్థానంలోనే కొనసాగుతోంది. గురువారం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో భారత్ 117 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా (115) రెండో స్థానంలో నిలవగా...దక్షిణాఫ్రికా (114) మూడో స్థానంలో ఉంది. వన్డే బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతుండగా, బౌలర్ల ర్యాంకుల్లో భువనేశ్వర్ కుమార్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. -
ఫ్యాషన్ బ్రాండ్‌నేమ్!
సత్వం ఎవరో గల్లీకుర్రాడు వేసుకున్న టీ షర్ట్ మీద మీకు ఈ పేరు కనిపించివుండొచ్చు: క్యాల్విన్ క్లెయిన్! సంక్షిప్తంగా సి.కె. అదేమిటో కూడా తెలియకుండానే, ఒప్పందం కుదుర్చుకోని మోడల్‌గా మారిపోయాడు కుర్రాడు. ‘ఫ్యాషన్ బిజినెస్ ఇక ఎంతమాత్రమూ స్థానికమైనది కాదు; అది ప్రపంచ వ్యాపారం’ అని చెప్పే అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ క్యాల్విన్ క్లెయిన్... ప్రపంచం మీదకు చొచ్చుకువచ్చిన తీరుకు ఇది అద్దం పడుతుంది. పచారీ కొట్టు నడిపే తండ్రికి 1942 నవంబరు 19న జన్మించిన క్లెయిన్... ఐదేళ్లప్పుడు వాళ్ల చెల్లెలి బొమ్మలకు బట్టలు కుట్టాడు. నెమ్మదిగా అది ఆడవాళ్ల దుస్తుల మీద ప్రత్యేక ఆసక్తికి కారణమైంది. 60ల చివర్లో సొంత స్టోర్ ప్రారంభించాడు. ర్యాంగ్లర్, లీవై, లీ లాంటి ‘సంప్రదాయ జీన్సు తయారీదార్ల’ కు పోటీగా, ‘మా ఉత్పత్తులకు మాదైన తంత్రం, మాదైన తత్వం అద్దుతాం,’ అని బరిలోకి దిగాడు. ‘నాకూ క్యాల్విన్స్‌కు మధ్యన ఏముందో తెలుసుకోవాలనుందా? ఏమీలేదు’ అంటూ తొలియౌవనంలో ఉన్న బ్రూక్ షీల్డ్స్‌తో ఊహకు అవకాశమిచ్చేలా డైలాగ్ చెప్పించాడు. ‘నీకు పూర్తిగా తగినది కనుక్కో’మని ఊరిస్తూ, కౌమారంలోకి అడుగిడుతున్న అమ్మాయిలను ఆకట్టుకున్నాడు. ‘ఇంతకుముందుకంటే మనుషులు మరింత చక్కటి ఆకృతుల్లో ఉంటున్నారు. కొంచెం శ్రద్ధ పెడితే మీరు బాగా కనబడతారు. దుస్తులు ధరించినప్పుడు యౌవనపు అనుభూతి కలగాలి. అవి మీ ధోరణిని ప్రతిబింబిస్తాయి’ అని చెప్పాడు. ‘ఆధునిక సొగసు’కు మాస్టర్ డిజైనర్‌గా పేరొందిన సి.కె. తన పేరునే బ్రాండ్‌నేమ్ చేసుకున్నాడు. కోట్లు, జీన్సు, అండర్వేర్, స్పోర్ట్స్ వేర్, హ్యాండ్ బ్యాగ్స్, పెర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, బెడ్ షీట్స్, డైనింగ్ టేబుల్స్, డిషెస్, గ్లాస్‌వేర్... ఇలా అన్నింటా విస్తరిస్తూ వచ్చాడు. ‘ఎంతకాలం మన్నుతుంది, అనేదాన్నిబట్టి జీన్సు ధర నిర్ణయమవదు; దాన్ని ఉత్పత్తి చేయడంలో ఎంత శ్రమ దాగుంది? డిజైన్ సామర్థ్యం, వాష్ ఎంత అసలైనది... ఇలాంటివి ధరను నిర్ణయిస్తాయి’ అంటాడు. క్యాల్విన్ అన్ని సందర్భాల్లోనూ ఉత్పత్తిదారు కాదు. తన స్పెసిఫికేషన్స్‌కు తగ్గట్టుగా ఉత్పత్తుల్ని రూపొందించేలా ఇతర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. అమ్మకాల మీద రాయల్టీలు పొందుతాడు. ఎన్ని రకాల డిజైన్లు చేసినప్పటికీ, తనను తాను తొలుత ఉమెన్ డిజైనర్‌గా భావిస్తాడు. మహిళల శరీరాలు, వాటి ధర్మాలు, వారి కోరికలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ‘వాళ్లకు సంబంధించిన ప్రతిదీ, ఇన్నర్‌వేర్, ఔటర్వేర్ ఏదైనా తేడా లేదు’; వాళ్లు అన్నీ అందంగానే ఉండాలని కోరుకుంటారంటాడు. ‘ఉత్పత్తికి సంబంధించిన ప్యాకేజింగ్, దాని వాణిజ్య ప్రకటన అన్నీ ఆ ఉత్పత్తిని ప్రతిబింబించాలి... అయితే, సెలబ్రిటీలకు నా బ్రాండ్ దుస్తులను తొడిగించడంలో ఏనాడూ ఆసక్తిలేదు; ఆధునిక అమెరికా మహిళ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడ్రన్ వర్కింగ్ వుమెన్... ఆమె యాక్టివ్, యంగ్, తనకో కుటుంబం ఉంటుంది, బిజీగా ఉంటుంది... స్త్రీగా ఉండటాన్ని ఆనందిస్తూనే కేవలం ఫ్యాషన్ బొమ్మగా పరిగణించడాన్ని సహించదు... వాళ్లు సోషలైట్స్ కానక్కర్లేదు... అలాంటివాళ్లకు డిజైన్ చేయడం’లో తనకు ఆనందం ఉందంటాడు. అయితే వాణిజ్య ప్రకటనల్ని‘సెక్సీ’గా రూపొందించడం ద్వారా చాలాసార్లు విమర్శల పాలయ్యాడు. అలాగే, సౌష్టవమైన దేహంకన్నా బక్కపలుచటి మోడల్ కేట్‌మాస్‌ను వినియోగించినప్పుడు కూడా, ‘అస్తవ్యస్త పోషణ’కు కారణమయ్యాడంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, చక్కటి ఆకృతిలో ఉండటానికిగానూ వ్యాయామం చేసేలా ప్రేరేపిస్తోందికదా, అని నవ్వేస్తాడు. మద్యపానం, మాదకద్రవ్యాలు, బై సెక్సువల్ ఇమేజీ కూడా ఆయన్ని చాలాకాలం ప్రతికూల వార్తల్లో ఉంచాయి. తన ఉత్పత్తులకు తరచూ మోడళ్లను రిపీట్ చేస్తాడు క్యాల్విన్. దానిలో ఉన్న సానుకూల అంశం ఏమిటంటే, ‘అది ఉత్పత్తికి సంబంధించిన కొనసాగింపు’ను సూచిస్తుందంటాడు. తన ఉత్పత్తులకు మోడళ్లనే ఎక్కువగా వినియోగించడానికి కారణం, ‘మోడల్ ఎంతో చెప్పగలుగుతుంది. అదే సెలబ్రిటీలు, నటులు వారిదైన మనుషులు’ అంటాడు. అందుకే, ప్రయాణిస్తున్నప్పుడు దారిలో కనబడిన మనిషి దగ్గర తన కారు ఆపుకొని అతణ్ని ఎంపిక చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి(ఉదా: టామ్ హింట్‌నౌస్). తనను మరొకరు కాపీ కొట్టడం సంతోషమేనని చెబుతాడు. ‘ఫ్యాషన్ పరిశ్రమ అనేది కొత్తది కనుక్కోవడం కాదు’, ఉన్నదాన్ని మెరుగుపరుచుకుంటూ వెళ్లేదే! ‘అసలు ఎవరైనా మనల్ని కాపీ కొట్టకపోతేనే సమస్య. మనం సరైనది ఇవ్వనట్టు లెక్క’ అంటాడు. ఫ్యాషన్ గురించి చక్కటి ముక్తాయింపు ఇస్తాడు. ‘ఒకరిని అందంగా కనిపింపజేయడంలో సహాయపడటానికి మించిన ఉత్సాహవంతమైన పని ఇంకేముంటుంది?’ - ఆర్.ఆర్. ఒకరిని అందంగా కనిపింపజేయడంలో సహాయపడటానికి మించిన ఉత్సాహవంతమైన పని ఇంకేముంటుంది?’ - క్యాల్విన్ క్లెయిన్, ఫ్యాషన్ డిజైనర్ -
ఫ్యాషన్ ఎక్స్పో
సిటీవాసులకు సరికొత్త ఫ్యాషన్ వేర్స్‌తో అలరించనుంది స్టైల్ అండ్ వీవ్స్ ఎక్స్పో. సోమవారం ప్రారంభం అవుతున్న ఈ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ఈ నెల 17 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. కోల్‌కతా, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన ఫ్యాబ్రిక్, శారీస్, డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్ ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నారు. అమీర్‌పేటలోని కమ్మసంఘంలో ఏర్పాటవుతున్న ఈ ఎక్స్పో ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకూ సందర్శించవచ్చు. -
వింటర్ క్రాప్
ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవుతున్న మగువలు వింటర్ సీజన్‌కు గ్రాండ్‌గా వెల్కం చెబుతున్నారు. ఏ కలెక్షన్ అయినా హాయిగా వేసుకునే సీజన్ వచ్చేసిందని సంబరపడిపోతున్నారు. మార్కెట్లో ఉన్న అన్ని కలెక్షన్స్‌ను తనివితీరా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా యువతుల ఆదరణ పొందుతున్న కలెక్షన్ లిస్ట్‌లో క్రాప్ టాప్స్ చేరిపోయింది. ఈతరం అమ్మాయిలకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్న ఈ నయాట్రెండ్ శీతాకాలంలో కలర్‌ఫుల్ కలెక్షన్గా నిలిచిపోతోంది. కళ్ల ముందు ఎన్ని కలెక్షన్స్ ఉన్నా.. కబోర్డ్ నిండా జతల జతల ఫ్యాషన్స్ ఉన్నా.. మగువల డ్రెసింగ్ టేస్ట్‌ను పరిస్థితులు డామినేట్ చేస్తుంటాయి. నిండు వేసవిలో కలర్ ఫుల్ డిజైనింగ్స్ ఎన్ని ఉన్నా ఏం లాభం.. కాటన్ వస్త్రాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. అదే రెయినీ సీజన్లో అందమైన డ్రెస్‌లు బీరువా నుంచి తీయడానికి కూడా యువతులు ఇష్టపడరు. వానజల్లు గిల్లితే ఎక్కడ డ్రెస్ పాడవుతుందోననే భయంతో వానాకాలం ఫ్యాషన్స్‌కు కాస్త దూరంగానే ఉంటారు. అదే వింటర్ సీజన్ వచ్చిందంటే మాత్రం.. నయా పోకడలకు తలుపులు తెరుస్తారు. బ్యూటిఫుల్ సీజన్‌ను ఫ్యాషన్ మంత్రం పఠిస్తూ వెళ్లదీస్తుంటారు. టాప్ లుక్.. వింటర్ సీజన్లో క్రాప్డ్ టాప్స్‌కు కాలేజ్ గాళ్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. క్రాప్డ్ టాప్కు జోడీగా డిఫరెంట్ బాటమ్స్ జతచేస్తున్నారు. టాప్, బాటమ్ మధ్య ఉన్న గ్యాప్ నయా లుక్ ఇవ్వడమే కాకుండా ఎండ వేడిమిని గ్రహించి శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. అందుకే వింటర్ సీజన్లో క్రాప్డ్ టాప్‌పై మగువలు మనసుపారేసుకుంటున్నారు. సినీతారలు కూడా బయటకు వెళ్లే సమయాల్లో ఈ కలెక్షన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. డిఫరెంట్ మోడల్స్.. టాప్ విషయానికి వస్తే.. నెక్లెస్, యూ నెక్, కాలర్డ్ నెక్ ఇలా డిఫరెంట్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. బాటమ్ విషయంలో కొందరు ప్యాంట్స్‌కు ప్రిఫరెన్స్ ఇస్తే.. మరికొందరు స్కర్ట్స్ వేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. నగరంలోని దాదాపు అన్ని కలెక్షన్ సెంటర్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. - సిద్ధాంతి -
మల్కా ఇన్ ఫ్యారీస్
సిటీ డిజైనింగ్ పతాక ఈఫిల్ టవర్‌పై ఎగరనుంది. ఫ్యాషన్ వరల్డ్‌కు కేరాఫ్ అనిపించుకునే పారిస్‌లో హైదరాబాద్ తొలి అడుగు వేయనుంది. తెలంగాణ చేనేత వైభవం ఎల్లలు దాటనుంది. ఈఫిల్ టవర్ మీద ఫ్యాషన్ వేడుకతో ఈ సంచలనాలను మనకు చవి చూపించనున్నారు తెలంగాణ ఫ్యాషన్ సెన్సేషన్ శిల్పారెడ్డి. సిటీ డిజైనర్లు అంతర్జాతీయ యవనికపై రాణిస్తున్న తరుణంలో శిల్పారెడ్డి... సిటీ ఫ్యాషన్ ను ఫ్యాషన్ల స్వర్గమైన పారిస్ దాకా తీసుకెళ్లనున్నారు. తద్వారా హైదరాబాద్ నుంచి ఈ క్రెడిట్ సాధించిన ఫస్ట్ డిజైనర్‌గా నిలవనున్నారు. ఆమెతో బాటే తెలంగాణకు చెందిన మల్ఖా ఫ్యాబ్రిక్ కూడా ర్యాంప్‌పై తళుకులీననుండటం విశేషం. ఈఫిల్ టవర్‌ను వేదికగా చేసుకుని ఈ నెల 31న ఈ ఫ్యాషన్ వండర్ జరుగనుంది. తనను తాను మలచుకునే ‘శిల్ప’ం.. మోడల్, ఫిట్నెస్ ఎక్స్పర్ట్, న్యూట్రిషనిస్ట్, డిజైనర్.. మిసెస్ ఇండియా.. ఇలా తన పేరుకు ముందు బోలెడన్ని విశేషణాలు చేర్చుకుంటూ విభిన్న రంగాల్లో విజయాలు నమోదు చేస్తున్నారు శిల్పారెడ్డి. ప్రస్తుతం డిజైనర్లకు కలల గమ్యం లాంటి పారిస్‌లో తొలిసారి కాలు మోపుతున్నారు. ‘ ఈఫిల్ టవర్ అనే ఆర్కిటెక్చర్ అద్భుతంపై నా డిజైన్లను ప్రదర్శించే అవకాశం రావడం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు శిల్పారెడ్డి. తన డిజైన్ల కోసం తెలంగాణ, ఆంధ్రప్రాంతాల్లో మాత్రమే వినియోగించే, తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం లాంటి మల్ఖా చేనేతను వినియోగించనున్నారు. ‘మన ప్రాంతానికి విశిష్టత తేవడం, సంప్రదాయ ఫ్యాబ్రిక్స్‌ను ఉపయోగించుకుని కూడా ఫ్యాషన్‌ను నిలబెట్టవచ్చునని తెలియజెప్పడమే పారిస్‌లో మల్ఖా ప్రదర్శనకు కారణం’ అన్నారామె. ఇప్పటిదాకా ఈ ఫ్యాబ్రిక్‌ని ఇంటర్నేషనల్ ఫ్యాషన్‌లో ప్రదర్శించలేదని ఆమె గుర్తు చేస్తున్నారు. ప్లాంట్ బేస్డ్ డైస్‌ను ఉపయోగించి చేసిన పర్యావరణహిత ఫ్యాబ్రిక్ మల్ఖా అని చెప్పారు. దీన్ని ఉపయోగించి ఫుట్‌వేర్‌ను సైతం శిల్పారెడ్డి సృష్టించడం విశేషం. ‘ఈ అవకాశం నన్ను ఉత్తేజితురాల్ని చేస్తోంది. అదే సమయంలో కాస్త నెర్వస్‌గానూ ఫీలవుతున్నాను. నన్ను ఒక డిజైనర్‌గా కాకుండా ఒక భారతీయ ఫ్యాషన్ ప్రతినిధిగా చూస్తారు. ఇది పెద్ద బాధ్యత. మన భారతీయ ఫ్యాషన్‌కే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాను’ అని అంటున్నారు శిల్ప. ‘వండర్’ ఫుల్.. జెస్సికా ఆర్కిటెక్చర్ అద్భుతాలపై డిజైనింగ్ ఆవిష్కరణలు చేయడంలో విదేశీ మోడల్, జెస్సికా మినాహ్ స్పెషలైజ్ చేశారు. న్యూయార్క్‌కు చెందిన జెస్సికా ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో నివసిస్తున్నారు. ఐకానిక్ వెన్యూలను అద్భుతమైన క్యాట్వాక్లకు వేదికలుగామలచడం ద్వారా జెస్సికా పేరొందింది. ఈ తరహా వేదికలపై ర్యాంప్‌వాక్‌లు నిర్వహించడానికి అనుమతి ఉన్న ఏకైక ఫ్యాషన్ డిజైనర్ ఈమే. గ్రాండ్ కెన్యన్ స్కైవాక్ (అమెరికా), లండన్స్ టవర్ బ్రిడ్జ్ (యూకే), పెట్రొనాస్ ట్విన్ టవర్స్ స్కై బ్రిడ్జ్ (మలేషియా), కోస్టా అట్లాంటా (దుబాయ్), గార్డెన్స్ బై ది బేస్ ఒసిబిసి స్కై వే (సింగపూర్), సియెనె రివర్ (పారిస్), వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (న్యూయార్క్)లలో ఆమె ఇప్పటిదాకా షోస్ నిర్వహించి ఫ్యాషన్ ప్రపంచాన్ని అబ్బుర పరిచింది. విశేషమేమిటంటే వీటిలో ఇప్పటిదాకా ఒకే ఒక ఇండియన్ డిజైనర్ పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత సిటీడిజైనర్ శిల్పారెడ్డికి మాత్రమే ఆ అవకాశం లభించింది. ఆమెతో పాటు ఈ షోలో మరో 10 దేశాల నుంచి డిజైనర్స్ పాల్గొంటున్నారు. పల్లెల నుంచి... పారిస్ దాకా... సున్నితత్వాన్ని ప్రతిబింబించే మల్ మల్, గట్టిదనాన్ని చెప్పే ఖాదీల కలయికకు మల్ఖా పేరు పెట్టారు. ఎక్కువగా తెలంగాణ, తక్కువగా ఆంధ్ర రీజియన్స్‌లో మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది మల్ఖా. మహబూబ్‌నగర్‌లోని బూర్గుల గ్రామం, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, ఎల్లంటకుంట, ఖమ్మం జిల్లాలోని పునుకుల గ్రామం అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీరాల, ఈస్ట్‌గోదావరి పులకుర్తిలో తయారవుతుంది. ఈ మల్ఖా బ్రాండ్ ఫ్యాబ్రిక్‌ని తరుణ్తహిల్యానీ, సవ్యసాచి ముఖర్జీ తదితర టాప్ డిజైనర్లు సైతం వినియోగిస్తున్నారు. ప్రధానంగా మెహిదీపట్నంలోని ఖాదీబోర్డు షోరూం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతోంది. - ఎస్.సత్యబాబు -
ఎక్స్పో తారల సందడి
-
ఫ్యాషన్ ‘మార్క్’
నగరవాసులకు ఇంటర్నేషనల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు లండన్‌కు చెందిన ఫ్యాషన్ ఉత్పత్తుల బ్రాండ్ ‘మార్క్ అండ్ స్పెన్సర్’ స్టోర్ అందుబాటులోకి వచ్చింది. దక్షిణాదిలోని 10వ స్టోర్‌ను జూబ్లీహిల్స్‌లో గురువారం ప్రారంభించింది. మెన్స్, ఉమెన్స్ వేర్, ఫుట్‌వేర్ వంటి విభిన్న డిజైన్లు ఇక్కడ లభిస్తున్నాయి. వీటితో పాటు స్కిన్‌కేర్, బాడీ, బాత్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా వింటేజ్ కార్లలో ర్యాలీగా వచ్చిన అందాల మోడల్స్‌తో షోరూమ్‌లో ఫ్యాషన్ షో నిర్వహించారు. సంస్థ ఎండీ వేణునాయర్, నటి దీక్షాపంత్ తదితరులు పాల్గొన్నారు. - సాక్షి, సిటీ ప్లస్ -
షో.. బ్యూటిఫుల్
ఫ్యాషన్ రాజధాని ముంబైని మరిపిస్తోంది మన సిటీ. రోజుకో ట్రెండ్.. వెరైటీ స్టైల్స్ ఇక్కడ పరిచయమవుతున్నాయి. వాటికి లవర్స్... ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. అందుకు తగ్గట్టుగానే ట్రెండీ డిజైన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ డిజైనర్లు తమ ప్రత్యేకతను చాటుతున్నారు. దేశంలోనే కాదు... విదేశాల్లో జరిగే ప్రముఖ ఫ్యాషన్ షోలలో కూడా లేటెస్ట్ వెరైటీలతో మెరిపిస్తున్నారు. తాజాగా నగరానికి చెందిన డిజైనర్ శ్రవణ్‌కుమార్ రామస్వామి కెనడా వాంకోవర్ ఫ్యాషన్ వీక్‌లో అందరినీ ఆకర్షించారు. రెండు దశాబ్దాలుగా ఎకో ఫ్రెండ్లీ డిజైన్లతో ఆకట్టుకుంటున్న ఆయన... ఈ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న ఏకైక భారతీయ డిజైనర్. ఆదివారం నగరానికి తిరిగి వచ్చిన శ్రవణ్‌కుమార్‌తో ‘సిటీ ప్లస్’ ముచ్చటించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 మంది డిజైనర్ల సృజనకు వేదిక వాంకోవర్ ఫ్యాషన్ వీక్. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద షో ఇది. ఈ మెగా ఈవెంట్లో డిజైన్లు ప్రదర్శించే అవకాశం అంటే..! ఎవరికైనా అదో పెద్ద అచీవ్మెంటే. ‘ఈ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనడం రెండోసారి. మార్చిలో ఒకసారి వెళ్లా. గత నెల 18న సమర్పించిన నా షోలో అజ్రక్ ప్రింట్స్, నారాయణపేట చేనేతలతో రూపొందిన దుస్తుల కలెక్షన్‌ను ప్రదర్శించా. బాలీవుడ్ నటి సిమ్రాన్ కౌర్ ముండి షో స్టాపర్. మంచి ప్రశంసలు వచ్చాయి. అంతా వెజిటబుల్ డైస్‌తో నేను రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ దుస్తులు వారికి చాలా బాగా నచ్చాయి. భారతీయ చేనేతల గ్రాండ్ లుక్కు విదేశీయులు కూడా మెస్మరైజ్ అయ్యారు. మొత్తం 40 గార్మెంట్స్ నేను ప్రదర్శించినా ఇందులో 32 మహిళలవి, మిగిలినవి పురుషులవి... సేల్స్, ఆర్డర్స్ అన్నీ అనెక్స్పెక్టెడ్ రేంజ్లో ఉన్నాయి’ అన్నారు శ్రవణ్. కెనడాలో భారతీయుల సంఖ్య ఎక్కువని, ముఖ్యంగా వాంకోవర్ సిటీలో పంజాబీలు అధికమని చెప్పారు. వారందరికీ ఈ హైదరాబాదీ స్టైల్స్ నచ్చాయన్నారు. సిటీ డిజైనర్లలో తనకంటూ ప్రత్యేక శైలితో రాణిస్తున్న శ్రవణ్... భారతీయ చేనేతలకు ‘ఆలయం’ సంస్థ ద్వారా చేయూతను అందిస్తున్నారు. విదేశాల్లో సిసలైన దేశీ డిజైన్లకు క్రేజ్ తీసుకురావడమే మన దేశ చేనేత రంగానికి మనం చేయదగిన సేవ అంటారు శ్రవణ్. ఎస్. సత్యబాబు -
వీధిబాలలే లక్ష్యంగా...
అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ, హాయిగా ఆడుతూ పాడుతూ, చదువుకోవలసిన వయసులో కొందరు బాలలు మత్తుపదార్థాలకు బానిస అయ్యారు. మరికొందరు కడుపు నింపుకోవడం కోసం యాచన చేస్తుంటే, ఇంకొందరు జేబులు కొట్టేయడం, వ్యభిచారానికి పాల్పడటం వంటి అసాంఘిక కార్యకలాపాలలో భాగస్వాములయ్యారు. అలాంటి వారి దయనీయ స్థితిని చూసి ఆమె మనసు కలత చెందింది. వారికి ఆసరా ఇస్తే వీటి నుంచి దూరం కాగలుగుతారనుకుంది. అందుకే ఆమె వారి కోసం లక్ష్యం అనే పాఠశాలను స్థాపించింది. ఇంతకూ ఎవరీమె? ఈమె లక్ష్యం ఎంత మేరకు నెరవేరిందో చూద్దామా! ఢిల్లీకి చెందిన యువ సామాజిక కార్యకర్త రాశి ఆనంద్. వీధి బాలల సంక్షేమం కోసమే ‘లక్ష్యం’ అనే ఎన్జీవోను నిర్వహిస్తున్న రాశి, వసంత్ కుంజ్‌లో ‘సాక్ష్యం’ అనే పాఠశాలను స్థాపించారు. ఇందులో ఇప్పటికి సుమారు 200 మంది బాలలు చేరారు. నిర్వాహకులు వారికి చదువుతో పాటు చేతి పనులు కూడా నేర్పుతున్నారు. ఈ పిల్లల కోసం... ఫ్లై ఓవర్ల కింద చిన్న చిన్న వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. రెడ్ లైట్ ఏరియాలకు, రైల్వే స్టేషన్లకు వెళ్లి అక్కడ మత్తుపదార్థాలకు బానిసలైనవారికీ, పొగాకు సేవించేవారికీ వాటి వలన కలిగే నష్టాల గురించి తెలియచేస్తున్నారు. ‘‘అతి తక్కువ కాలంలోనే అంటే కేవలం ఏడాదిన్నరలోనే మా ప్రయత్నం ఫలించింది. మా ‘లక్ష్యం’ సంస్థ జార్ఖండ్, ఢిల్లీ, బెంగళూరు, ఉత్తరాఖండ్, తమిళనాడు, కర్ణాటక వంటి ఆరు రాష్ట్రాలకు వ్యాపించింది. ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’’ అంటారు రాశి ఆనంద్. ఆ బాలలు... పాడైపోయిన టైర్లు, ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, రాళ్లు... వీటితో ఆడుకుంటారు. వారు మంచి మంచి బొమ్మలతో ఆడుకునేందుకు తనకు తోచిన సహాయం చేయాలనుకుంది. ఏదో చేయాలనే తపన కలిగించింది. ‘లక్ష్యం’ పేరుతో బొమ్మల కేంద్రం ఏర్పరిచింది. ఢిల్లీలోని పన్నెండు పాఠశాలల్లో పెద్ద పెద్ద బాక్సులు ఏర్పాటు చేసింది. ఆయా పాఠశాలల్లో చదువుకునే పిల్లలు వారి దగ్గర ఉన్న బొమ్మలను తెచ్చి ఆ బాక్సులో ఉంచేలా వారిని ఉత్తేజపరిచారు. ‘‘మాకు మంచి స్పందనే వచ్చింది. సుమారు 60,000 బొమ్మలు, పుస్తకాలు, బాక్సులు సమకూరాయి. వాటిని ఢిల్లీలోని వీధిబాలలకు అందచేశాం’’ అంటారు రాశి. బొమ్మల సంఖ్య బాగా పెరగడంతో రాశి మరిన్ని ఇతర సంస్థలతో సంబంధం పెట్టుకుని, వారి ద్వారా బీహార్ రాష్ట్రంలోని అనేక గ్రామాలకు, ధర్మశాలలోని శరణార్థులు ఉన్న ప్రాంతాలకి వీటిని అందచేశారు. అమ్మ నుంచి అలవాటయింది... ‘‘నేను ఇన్ని సాధించడానికి మా అమ్మ పూనమ్ ఆనంద్ నాకు ప్రేరణ. ఆమె ‘లక్ష్య’ అనే ఒక ఎన్జివో స్థాపించి గిరిజన మహిళలకు సేవ చేశారు. అప్పట్లో నేను అందులో సభ్యురాలిని. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. ఆ సంస్థ ద్వారా రాంచీలో ఒక అనాథాశ్రమం స్థాపించారు. గుడ్డి, మూగ, చెవిటి వారితో సుమారు మూడు సంవత్సరాలు పనిచేశారు. అమ్మ కారణంగానే, నేను చిన్న వయసులోనే అంటే నాకు 25 సంవత్సరాల వయసు వచ్చేసరికే సుమారు 7381 మంది జీవితాలను దగ్గరగా చూశాను. పేద- ధనిక తారతమ్యం తెలుసుకున్నాను, సామాజిక సేవ నేర్చుకున్నాను.’’ అని చెబుతారు రాశి ఆనంద్. తల్లి స్థాపించిన లక్ష్య’ సంస్థను మరింత మందికి సేవ చేయడానికిగాను ‘లక్ష్యం’ పేరుగా 2004లో మార్పు చేశారు. మరో కోణం... ‘మిర్రర్స్’ అనే ఈవెంట్ మేనేజ్మెంట్, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని గత ఐదుసంవత్సరాలుగా నడుపుతున్నారు రాశి. ఇందులో భాగంగా జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాల నుంచే ‘లక్ష్యం’ సంస్థ కోసం నిధులు సేకరిస్తారు. ‘బీయింగ్ హ్యూమన్’ పేరిట వీధి బాలలకు సల్మాన్‌ఖాన్‌ను కలిసే అవకాశం కల్పించారు. ‘‘సల్మాన్‌ఖాన్ మా సంస్థకు కొంత డబ్బు విరాళంగా ఇచ్చారు’’ అని చెబుతారు రాశి. ‘ఫ్యాషన్ ఫర్ ఏ కాజ్’ పేరిట ఒక ఫ్యాషన్ షో ఏర్పాటుచేశారు. అందులో... ఢిల్లీ రెడ్ లైట్ ఏరియాలోని ఆర్కె పురం బాలలు ర్యాంప్ మీద నడిచారు. ‘‘ఆ బాలలకు సహాయం చేయడానికి మరిన్ని నిధులు సేకరించాను. బాలీవుడ్, ఫ్యాషన్ పరిశ్రమ... అందరూ ఈ కార్యక్రమానికి వారి మద్దతు ప్రకటించి నా కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు’’ సంతోషంగా చెప్పారు రాశి. ర్యాంప్ మీద జేబుదొంగలు, మత్తుపదార్థాలకు బానిసైనవారు ఎంతో వయ్యారంగా నడిచారు. ఒక్క రాత్రిలో వారి జీవితమే మారిపోయింది. ఏ చేతితో వారిని అసహ్యించుకున్నారో, అదే చేతులు ఆ బాలలతో కరచాలనం చేశాయి. ఆమె మనసు ఆనందంతో పొంగిపోయింది. మరింత మంది బాలతారల జీవితాలను మార్చడం కోసం కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్న రాశి ఆనంద్ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. - డా.వైజయంతి -
జోష్ ఫుల్
ఎప్పుడూ బిజీబిజీగా పరుగులేనా..! లైఫ్ అంటే అప్పుడప్పుడూ కాస్త కొత్తగా... ఇంకాస్త గవ్ముత్తుగా... ఆస్వాదించేలా ఉండాలి. అదేనండీ... కూసింత కళా పోషణ ఉండాలి. అప్పుడే మాజా. ఫ్యాషన్ డిజైనింగ్‌లో మునిగిపోయే అమ్మయిలు , అబ్బాయిలదీ ఇదే థీమ్. మాదాపూర్ నిఫ్ట్‌లో శుక్రవారం జరిగిన ఫ్రెషర్స్ డేలో ఆడేసి... పాడేసి... ఆపై ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌లు చేసేసి అద్భుతః అనిపించారు. ఆమ్ ఆద్మీ చాయ్‌వాలా అంటూ ఇద్దరు విద్యార్థులు వెరైటీ స్కిట్ ‘ప్లే’ చేస్తే... మా ఐటమ్ చూడండంటూ ఇంకొందరు సల్సా డ్యాన్స్‌లతో ఊపేశారు. ఈలోగా వురో యుువతి స్టేజి పైకి దూసుకొచ్చి.. యోగాను తలపించే నాట్య విన్యాసంతో అదరహో అనిపించింది. ఈ వుధ్యలో నుంచి అమ్మాయిలు, అబ్బాయిలు చేసిన క్యాట్‌వాక్ ఫ్యాషన్ షోను తలపించారుు. చివరకు అంతా కలిసి బ్యాండ్ బాజాలతో.. వుధురానుభూతులను పంచుతూ ఉల్లాసాల కేళితో ఫ్రెషర్స్‌కు స్వాగతం పలికారు. ఈవెంట్లో మిస్ ఫ్రెఫర్గా సంజన.. మిస్టర్ ఫ్రెషర్‌గా అవినాష్ ఎన్నికయ్యారు. -
ఫ్యాషన్ ఫర్ ఏ కాజ్
సోషలైట్స్, డాక్టర్లు, వివిధ సంస్థల నిర్వాహకులు... మోడల్స్‌ను తలదన్నేలా ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేసి అదరగొట్టారు. అందాల తార వుధులగ్నాదాస్ షో స్టాపర్‌గా ప్రత్యక్షమై మైవురిపించింది. మోహన్ ఫౌండేషన్ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సోమాజిగూడ హోటల్ కత్రియూలో నిర్వహించిన ‘ఫ్యాషన్ ఫర్ ఏ కాజ్’ సరికొత్త అనుభూతి పంచింది. యాంకర్ ఝాన్సీతో పాటు ఫౌండేషన్ నిర్వాహకులు సుమన, పల్లవికుమార్, డిజైనర్ ప్రత్యూష తదితరులు హంస నడకలతో అలరించారు. -
లాఖోం మే ఏక్
ఇప్పుడు సిటీలో పేజ్‌త్రీ, ఫ్యాషన్ రంగ ప్రముఖులంతా తమ చూపును ముంబై మీదే కేంద్రీకరించారు.దీనికి కారణం లాక్మే ఫ్యాషన్ వీక్! ప్రపంచవ్యాప్త మీడియా, టెక్స్టైల్, సినీ, గ్లామర్ ఇండస్ట్రీలను ఒకేసారి అటెన్షన్లోకి తెచ్చే ఈ ఫ్యాషన్ ఫెస్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది సిటీ. ఈనెల 20న ముంబైలో ప్రారంభం కానున్న జాతీయస్థాయి డిజైనర్ వార్‌లో పాల్గొనేందుకు లాక్మే ఫ్యాషన్ వీక్లోసిటీకి చెందిన నలుగురు ఫ్యాషన్ డిజైనర్లు అవకాశం దక్కించుకున్నారు. ..:: ఎస్.సత్యబాబు ప్రపంచంలోని ప్రతిష్టాత్మక ఫ్యాషన్ ప్రదర్శన లాక్మే ఫ్యాషన్ వీక్ ద్వారా దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించడంతో పాటు బాలీవుడ్‌నీ ఆకట్టుకునేందుకు అవకాశం కలుగుతుంది. అందుకనే డిజైనర్లు, మోడల్స్, ఇంకా ఫ్యాషన్ పరిశ్రమలోని ఏ విభాగానికి చెందిన వారైనా సరే ఈ షోలో పాల్గొనడాన్ని గొప్ప విజయంగా భావిస్తారు. కొంతకాలంగా భాగ్యనగర సృజనకు లాక్మే రెడ్‌కార్పెట్ పరుస్తోంది. ముంబయిలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న డిజైనింగ్ పండుగలో అరడజను మందిదాకా సిటీ డిజైనర్లు (యాక్సెసరీస్‌తో కలిపి) పాల్గొంటున్నారు. లాక్మే.. లక్ కాదు దేశవ్యాప్తంగా డిజైనర్లకు ప్రాతినిధ్యం కల్పించే ఈ ‘షో’లో అవకాశం దక్కడం అంత సులభం కాదు. ఈ షోలో పాల్గొనాలంటే కనీసం 18 నుంచి 30 డిజైన్ల వరకూ ప్రత్యేకంగా రూపొందించి నిర్వాహకుల్ని మెప్పించాల్సి ఉంటుంది. అంతేకాదు.. టాప్‌మోడల్స్, షోస్టాపర్స్, ఇంకా సంబంధిత ఖర్చుల కోసం కూడా భారీగా వ్యయం అవుతుంది. అయితే అవకాశం దక్కలేదని వాపోయేవాళ్ల కోసం ఈవెంట్ జరిగే చోట స్టాల్స్ ఏర్పాటు చేసుకునే వెసులు బాటు కల్పిస్తారు. ఈ నేపధ్యంలో ఈ మెగా ఫ్యాషన్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న నగర డిజైనర్లను పలకరించినప్పుడు... ఇలా స్పందించారు. ‘టీ’టైమ్.. గత ఏడాది 2012లో లాక్మే కోసం జెన్ ఎక్స్‌లో పాల్గొన్నాం. అయితే ఈ సారి విభాగం మారింది. తొలిరోజే అంటే 20వ తేదీన నా షో ఉంటోంది. నా కలెక్షన్స్ పేరు ‘టీజమ్’. ఈ కలెక్షన్లో ఇండో వెస్ట్రన్ మిక్స్ ఉంటుంది. - అర్చనారావు తొలిసారి.. డిజైన్ల తొలకరి తొలిసారి లాక్మేలో పార్టిసిపేట్ చేస్తుండటం చాలా ఆనందాన్నిస్తోంది. అలాగే ఉద్వేగంగా కూడా ఉంది. ఈ ప్రదర్శన కోసం చాలా శ్రమిస్తున్నాను. ‘మిల్లె ఫ్లూర్స్’- ఎ థౌజండ్ ఫ్లవర్స్ పేరిట ప్రత్యేక కలెక్షన్‌ను ప్రదర్శిస్తున్నా. అచ్చమైన అర్బన్ స్టైల్స్‌కు అద్దం పట్టే కలెక్షన్ ఇది. - నేహ అగర్వాల్ శుభాముద్గల్ సంగీతం.. చిత్రసేన ప్రదర్శన లాక్మేలో పాల్గొనడం అనేది నాకు కొత్త కాదు. సందర్శకులకు ఎప్పటికప్పుడు కొత్త అనుభూతినివ్వడం నా పంథా. నా సరికొత్త కలెక్షన్‌ను ‘చిత్-్రసేన’ పేరుతో లాక్మేలో ప్రదర్శిస్తున్నా. దీనికి హిందూస్థానీ క్లాసికల్ మ్యూజిక్ జత కలపడం ఈసారి నేను చూపబోతున్న స్పెషాలిటీ. ఈ లైవ్మ్యూజిక్ను ప్రసిద్ధ గాయని శుభాముద్గల్ ఈ నెల 22న ప్రదర్శిస్తారు. ఇక నా చిత్-్రసేన విషయానికి వస్తే ఇదొక ప్రాచీన-ఆధునికతల శైలుల అపురూప సంగమం. పురాతన ఆలయ శిల్పాల నుంచి స్ఫూర్తి పొంది 16వశతాబ్దం నాటి వస్త్ర ైవె భవాన్ని, 21వ శతాబ్దపు చిత్రకళతో జత చేసి దీన్ని రూపుదిద్దాను. దాదాపు ఆరునెలల కృషి ఫలితమిది. కాంచీపురం చేనేత కళాకారుల పనితనం, అక్కడి కొర్వాయి నేత శైలి ఈ కలెక్షన్లో ప్రతిఫలిస్తాయి. నా దుస్తులన్నీ భారతీయ సంప్రదాయం, పురాణాల విశిష్టతకు అద్దం పడతాయి. ఊహించని కలర్ కాంబినేషన్స్, నాణ్యమైన సిల్క్ ఫ్యాబ్రిక్‌కు జర్దోసి ఎంబ్రాయిడరీ అద్దుకున్న ధోతీ, షేర్వానీ.. వంటివి నా కలెక్షన్లో కొన్ని మాత్రమే. - గౌరాంగ్షా ముచ్చటగా మూడోసారి గతంలో రెండుసార్లు లాక్మేలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇది మూడోసారి. అయితే ఈ సారి ఇండియన్ టెక్స్‌టైల్‌కు సంబంధించి సౌతిండియా నుంచి ఎంపికైన ఏకైక డిజైనర్‌ని కావడం సంతోషంగా ఉంది. ఈ నెల 21న ఇండియన్ టెక్స్టైల్ డే పేరిట జరిగే షోలో డిజైన్లను ప్రదర్శించనున్నాను. కళంకారి, పోచంపల్లి, ఇకత్ చేనేతల పనితనాన్ని చూపడం నా ప్రత్యేకత. ఇది వింటర్ సీజన్. అందుకే ఖాదీని వింటర్‌కు సైతం నప్పే చక్కని ఫ్యాబ్రిక్‌గా చూపబోతున్నా. ‘సపరేట్స్’ పేరిట నేను ప్రదర్శించే కలెక్షన్లో గాగ్రా, కుర్తా, స్టోల్, స్కర్ట్స్, జాకెట్స్, డ్రెసెస్, శారీస్ ఉంటాయి. కుర్తా, ప్యాంట్ ఇలా దేనికదే సెపరేట్‌గా కొనుగోలు చేయవచ్చు. మొత్తం 16 నుంచి 18 గార్మెంట్స్ చూపిస్తున్నా. - శశికాంత్ నాయుడు -
అందాల పోటీ.. అందాలకే పోటీ!
-
ఫ్యాషన్ ఫ్రెండ్స్.. రాజ్‌దీప్ రణావత్
చిట్‌చాట్: ఫ్యాషన్ హబ్‌గా శరవేగంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు... స్టైలిష్ స్టేటస్‌లో 3వ స్థానం ఇస్తానని ఢిల్లీ డిజైనర్ రాజ్‌దీప్ రణావత్ అంటున్నారు. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా తన కలెక్షన్స్‌ను ప్రదర్శిస్తున్న ఈ యువ డిజైనర్... సిటీలోనే డిజైనింగ్ ఓనమాలు దిద్దడం విశేషం. బంజారాహిల్స్‌లోని అనహిత బొటిక్‌లో ఆటమ్/వింటర్, ఫెస్టివ్ కలెక్షన్స్‌ను లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో ముచ్చటించాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... ఫ్యాషన్ టేస్ట్ విషయంలో మెట్రో నగరాల్లో ఢిల్లీకి ఫస్ట్ ప్లేస్ ఇస్తా. తర్వాతి ప్లేస్‌లు వరుసగా ముంబయి, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరుది. హెదరాబాద్ నిఫ్ట్‌లో డిజైనింగ్ ఓన మాలు దిద్దా. అప్పటితో పోలిస్తే ఫ్యాషన్ రంగంలో సిటీ బాగా ఇంప్రూవ్ అయింది. టాప్‌క్లాస్, టాప్ టేస్ట్ ఉన్న ఫ్యాషన్ లవర్స్ పెరుగుతున్నారిక్కడ. ఈ స్పీడ్ చూస్తూంటే మరింత ఫ్యూచర్ కనిపిస్తోంది. కొన్నేళ్లుగా క్రమంతప్పకుండా ఇక్కడే కలెక్షన్స్ లాంచ్ చేస్తున్నా. విదేశీ మోడల్స్ ఫ్రెండ్లీ... నేనే కాదు ఈ మధ్య చాలా మంది డిజైనర్స్ యూకే, రష్యా, అమెరికా... తదితర దేశాలకు చెందిన మోడల్స్‌తో పనిచేస్తున్నారు. దీనికి కారణం మనవారితో పోలిస్తే వీరు మరింత ఫ్లెక్సిబుల్‌గా ఉండడమే. వీరు చాలా ఫ్రెండ్లీగా, ఓపెన్ మైండ్‌తో ఉంటారు. బ్యాక్‌స్టేజ్‌లో ప్రాబ్లెమ్స్ ఉండవు. తాజా కలెక్షన్స్‌పై... ఈసారి ఫెస్టివ్ వింటర్ ఆటమ్ సీజన్‌కు నేను ప్రయోగాల మీదే కాన్సన్ట్రేట్ చేశాను. ట్రెండ్‌ను ఫాలో అవడం కంటే క్రియేట్ చేయడమే నాకు ఈజీగా అనిపిస్తుంది. ఈ కలెక్షన్లో ట్యునిక్స్, కుర్తాస్, అఫ్తాన్స్ ఉన్నాయి. నేచర్ ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ కలెక్షన్ డిజైన్ చేశా. గ్రీన్ విత్ పర్పుల్, ఎల్లో విత్ బ్రౌన్, రెడ్-బ్లాక్... ఇలా కలర్ మిక్సింగ్‌తో ప్రయోగాలు చేశా. ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ కూడా ఈ సారి కలెక్షన్లో హైలైట్. - ఎస్.సత్యబాబు -
లేడీస్.. స్పెషల్
లేటెస్ట్ ట్రెండ్స్‌తో నిర్వహించిన ‘ఫ్యాషన్ యూత్ర’ సిటీజనులకు వినూత్న వెరైటీలను పరిచయుం చేసింది. బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణాలో సోషలైట్ కామినీ షరాఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు ఫ్యాషన్ లవర్స క్యూ కట్టారు. దుస్తులు, జ్యువెలరీ, ఫుట్‌వేర్, డెకార్స్, యాక్సెసరీస్ వంటి ఐటమ్స్‌తో స్టాల్స్ కొలువుదీరాయి. - ఈ ప్రదర్శనలో పాల్గొన్నవారంతా మహిళలే. ఈసారి ఏర్పాటు చేసిన డిజైనర్ ఉత్పత్తుల ప్రదర్శనలో 67 స్టాల్స్ అన్నీ మహిళలవే. - ఫిలిప్పీన్స్ నుంచి దిగుమతి చేసుకున్న ఆల్చిప్పలతో రూపొందిన మ్యూజికల్ సెట్స్, గౌతమ్‌బుద్ధ వంటి అలంకరణ వస్తువులు ఆకట్టుకున్నాయి. ముంబై నుంచి వచ్చిన మరో వ్యాపారి.. సౌదీ అరేబియా నుంచి తెచ్చిన డ్రైఫ్రూట్స్‌తో చేసిన స్వీట్స్ టేస్టీగా ఉన్నారుు. తిబర్‌మాల్ జ్యువెలర్స్‌కు చెందిన పంకజ్గుప్తా డిజైన్ చేసిన ఆభరణాలతో మోడల్స్ వావ్ అనిపించారు. ఇంకా ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ కాని, ఇటలీకి చెందిన ఒక బ్రాండ్ కంపెనీ తొలిసారి తమ ఉత్పత్తులను ప్రదర్శించింది. - పేజ్ త్రీ ప్రవుుఖులు వినీతాపిట్టి, నీరాశారెన్, పింకీరెడ్డి, హీరో వెంకటేష్ సతీవుణి నీరజ, నిర్మాత సురేష్‌బాబు సతీవుణి లక్ష్మి షాపింగ్ చేశారు. - ఈ ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయంలో కొంత శాతాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేసే నాన్హి కలి, హెల్ప్, పీఎఫ్‌ఏలకు అందజేస్తారు. - ‘ఇది తొమ్మిదో ఏడాది. వచ్చే ఏడాది మరింత డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నా. సామాజిక ప్రయోజనం కోసం చేస్తున్న ఈ కార్యక్రవుం విజయువంతం కావడం సంతోషంగా ఉంది’ అని నిర్వాహకురాలు కామినీ షరాఫ్ చెప్పారు. - శిరీష చల్లపల్లి ఫొటోలు: సృజన్ పున్నా -
మహిళలకు భరోసా
విజయనగరం టౌన్: ఉపాధి కోర్సులపై మహిళలు మంచి ఆసక్తి కనబరుస్తున్నారు. స్వయం ఉపాధి మెండుగా ఉన్న రంగాలపై వారు ఇష్టం చూపుతున్నారు. కుట్లు, అల్లికలు, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు, మెహందీ, శారీ పెయింటింగ్, తదితర కోర్సులను నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. అయితే వేలకు వేలు డబ్బులు పెట్టి బయట ఇనిస్టిట్యూట్లలో నేర్చుకుంటున్నా పూర్తిస్థాయిలో వారికి అవగాహన కలగడం లేదు. దీనికి తోడు ప్రైవేటు సంస్థలిచ్చే సర్టిఫికెట్లతో వారికి రుణాలు కూడా రావడం లేదు. దీంతో పారిశ్రామిక శిక్షణా సంస్థ అందించే ఉచిత శిక్షణలను వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. విజయనగరంలోని వీటీ అగ్రహారంలో ఉన్న ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో కుట్లు, అల్లికలకు సంబంధించి ప్రత్యేక ట్రేడ్ ఉంది. ఇక్కడ శిక్షణా కాలంలో విద్యార్థినులకు కుట్లు, అల్లికలు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తదితర వాటిలో నిష్ణాతులు చేసి ఏడాది పొడవునా శిక్షణ ఇస్తారు. అనంతరం ప్రభుత్వం రూపొందించిన ఐటీఐ సర్టిఫికేట్‌ను అందజేస్తారు. దీంతో పాటూ పరిసర ప్రాంతాల్లో పలు సంస్థల్లో అవకాశం కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ శిక్షణపై మగువలు మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ శిక్షణ పొందిన వారిలో అనేక మంది ఇతర ప్రాంతాల్లో ఉద్యోగులుగా స్థిరపడ్డారని ఐటీఐ డ్రెస్ మేకింగ్ ఫ్యాకల్టీ కోమలి తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలలో ప్రస్తుతం దరఖాస్తులు అందజేస్తున్నారని, అవకాశం ఉన్న మేరకు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె సూచించారు. కుట్టు మిషన్లు, మహిళలకు సంబంధించి అన్ని రకాల వస్త్రాల కుట్లు, అల్లికలుతో పాటూ ప్రత్యేకంగా కుందన్ డిజైనింగ్, వర్క్ శారీ, పెయింటింగ్ శారీ, డిజైనింగ్ శారీస్, బేబీ సూట్స్, ఎంబ్రాయిడరీ, ఆర్యావర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీలో వెరైటీస్, బేబీ ప్రాక్స్, పుల్, అంబ్రెళ్లా ప్రాక్స్, పార్టీ వేర్, బ్లౌజ్లో నెక్, రౌండ్, కటోరా కటింగ్ వంటి వాటిని ఇక్కడ నేర్పిస్తున్నారు. దీనికి తోడు సంస్థ అందించే సర్టిఫికెట్లతో రుణాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో డ్రస్ మేకింగ్ ట్రేడ్‌లో 20 సీట్లు, భద్రగిరి ప్రభుత్వ ఐటీఐలో 20 సీట్లు ఉన్నాయని కోమలి తెలిపారు. 16 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకూ విద్యార్థినులు, మహిళలు ఈ అవకాశాన్ని విని యోగించుకోవాలన్నారు. కుట్లు, అల్లికలకు సంబంధించి ఏడాదిలో ప్రతీ ఆరు నెలలకు రెండు సెమిస్టర్ విధానంలో పరీక్ష ఉంటుందని, సబ్జెక్ట్‌కి సంబంధించిన చిన్న ప్రశ్నలకు సమాధానం రాస్తే సరిపోతుందన్నారు. ప్రస్తు తం దరఖాస్తులను కార్యాలయంలో రూ.10 ప్రభుత్వ రుసుం చెల్లించి తీసుకోవచ్చని తెలిపారు. -
విల్లా.. హరివిల్లా..
-
అనుకోకుండానే.. అయిపోయా!
ఫ్యాషన్ డిజైనింగ్ చేసి మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన శిల్పిశర్మ తెలుగు సినిమా ‘గ్రీన్‌సిగ్నల్’తో తెరంగేట్రం చేసింది.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోడానికి మరింతగా కష్టపడతానంటున్న ఈ ముద్దుగుమ్మ నగరానికి వచ్చిన సందర్భంగా ‘సిటీప్లస్’ జరిపిన చిట్‌చాట్.. ‘నా జీవితంలో అన్నీ అనుకోకుండానే జరిగిపోయాయి...నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన నేను అనుకోకుండా మోడలింగ్ రంగంలో అడుగుపెట్టా. అలాగే, అనుకోకుండానే నటిగా తెరమీదికి వచ్చా. గ్రీన్‌సిగ్నల్ మూవీ తర్వాత ఇప్పుడు రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. టాలీవుడ్లో అల్లు అర్జున్, రాంచరణ్, మహేష్ ఇలా అందరి యాక్టింగ్ ఇష్టం. అలాగే శ్రీదేవి, సమంతల నటన కూడా నచ్చుతుంది. అలాగని వాళ్లను కాపీ కొట్టను.. నాకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తా. సింపుల్‌గా ఉండటమంటేనే నాకు ఇష్టం. అన్నట్టు మీకు చెప్పడం మరిచిపోయా..నాకు చిన్నప్పటి నుంచి నీళ్లంటే భయంఅందుకే వాటర్ఫోబియాను పోగొట్టుకునేందుకు ఈత నేర్చుకున్నా. ఇప్పడు ఖాళీ సమయంలో నీటితోనే స్నేహం చేస్తున్నా..’ - నర్సింహారెడ్డి, బంజారాహిల్స్ -
నరేంద్ర మోడీ.. ప్రపంచ ఫ్యాషన్ హీరో
వాషింగ్టన్: ఒకప్పుడు నరేంద్ర మోడీ అంటేనే అమెరికా మీడియా అంతెత్తున ఎగిరిపడేది. మోడీకి వీసా ఇవ్వడానికి కూడా అమెరికా ప్రభుత్వం అప్పట్లో నిరాకరించింది. ఇదంతా గతం. ఇప్పడు అమెరికా మీడియాకు భారత ప్రధాని మోడీ ఫ్యాషన్ హీరో. లోక్‌సభ ఎన్నికల్లో తన సారథ్యంలో బీజేపీకి ఘనవిజయం అందించి.. ప్రధానిగా మోడీ ప్రమాణం స్వీకారం చేశాక అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది. అమెరికాలో అత్యధిక సర్క్యులేషన్ గల టైమ్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికలు మోడీ వేషధారణను ప్రశంసిస్తూ ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. మోడీని ఫ్యాషన్ ఐకాన్‌గా అభివర్ణించాయి. 'నాయకుడంటే ఇలాంటి దుస్తులే ధరించాలి' అని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. మోడీ ధరించే కుర్తా గురించి రాశారు. వస్త్రధారణపై ప్రత్యేక శ్రద్ధ చూపే అమెరికా ప్రథమ మహిళ మిచెల్లి ఒబామా, రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్‌లతో పోలుస్తూ మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ఇక వాషింగ్టన్ పోస్ట్ అయితే ప్రపంచానికి కొత్త ఫ్యాషన్ ఐకాన్ వచ్చారంటూ మోడీని ప్రశంసించింది. -
బధిరుల బంధువు
‘‘మీ కలలను విడిచిపెట్టకండి. కలలు మాత్రమే మనల్ని ముందుకు నడిపించగలవు. దేనినైనా సాధించేలా చేయగలవు. నా కలలే నన్ను నడిపించాయి. మిమ్మల్నీ నడిపిస్తాయి’’. ఈ మాటలు వింటే ఓ తలపండిన అనుభవజ్ఞుడు చెప్పిన సూక్తులేమో అనిపిస్తుంది. కానీ వీటిని చెప్పింది ఓ ఇరవై మూడేళ్ల అమ్మాయి. ఆమె పేరు స్మృతీ నాగ్‌పాల్. బధిరుల కోసమే జీవితాన్ని అంకితం చేసి, వారిని ముందుకు నడిపేందుకు నడుం కట్టిన ఓ ఆదర్శప్రాయమైన యువతి! భావాలను వెల్లడించాలంటే ఏ మనిషికైనా భాష కావాలి. మరి భాషే తెలియని చెవిటి, మూగవారి పరిస్థితి ఏమిటి? వారు ఎవరికైనా ఏదైనా ఎలా చెప్పగలరు? ఎవరైనా చెప్పేది వాళ్లు ఎలా అర్థం చేసుకోగలరు? ఈ ప్రశ్నలు ఇరవై యేళ్ల వయసున్న అమ్మాయి మనసులో రావడం అరుదే. సినిమాలు, షికార్లు, చాటింగులు అంటూ తిరిగే వయసులో ఓ పెద్ద సమస్యకు పరిష్కారం కోసం ఆమె ఆలోచించడం గొప్ప విషయమే. ఇంజనీరింగ్, మెడిసిన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎయిర్ఫోర్స... అంటూ నేటి యువతీ యువకులంతా పాకులాడుతుంటే... స్మృతీ నాగ్‌పాల్ మాత్రం బధిరుల కోసం ఏం చేయాలి అని ఆలోచించేది. ఆ ఆలోచన ఆమెను ఓ విభిన్నమైన దారిలో నడిపించింది. ఆ ప్రయాణం ఆమెను ఓ ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగేలా చేసింది. ఆమె అండతో మరికొన్ని జీవితాలు నిలబడేందుకు దోహదపడింది. ఇంటి నుంచే మొదలు...: దేశ రాజధాని ఢిల్లీలో పుట్టి పెరిగింది స్మృతి. కష్టాలు పడే కుటుంబం కాదు. కానీ చుట్టూ సంతోషమే ఉన్నా... మనసులో మాత్రం ఏదో బాధ స్మృతికి. ఆ వేదన... ఆమె అక్కల వల్ల ఏర్పడింది. స్మృతికి ఇద్దరు అక్కలు. వాళ్లకీ ఆమెకీ మధ్య దాదాపు పదేళ్ల వయోభేదం ఉంది. దానితో పాటే మరో భేదమూ ఉంది. వాళ్లిద్దరూ బధిరులు. చిన్నప్పుడు ఆ సంగతి తెలియక వారితో మామూలుగా మాట్లాడేసేది స్మృతి. వాళ్లకి అది అర్థం కాదని తెలిశాక చాలా బాధపడిపోయేది. తాను అనుకున్నది వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడానికి నానా తంటాలూ పడేది. అలాగే వాళ్లు తమ భావాలను వెల్లడించడానికి పడే కష్టమూ ఆమెను బాధించేది. అప్పుడే ఆమెకు రకరకాల ఆలోచనలు కలిగేవి. సాధారణంగా బధిరులంతా మూగవాళ్లే అవుతారు. ఎందుకంటే... వారికి భాష తెలియదు కాబట్టి. మాట ఎలా పలకాలో అర్థం కాదు కాబట్టి. వారు తమ భావాలను సైగల ద్వారానో, రాసి చూపడం ద్వారానో వ్యక్తపరచాలి. చదువు అనేది పెద్ద వ్యవహారమే. కానీ సైగలు తేలికైన పరిష్కారం. అందుకే బధిరులకు సైగల భాష వచ్చి తీరాలి అనుకుంది స్మృతి. ఆమె తన అక్కలిద్దరికీ సైగలతోనే అర్థమయ్యేలా చెప్పేది. కానీ వాళ్లలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు కదా! వాళ్లకీ తాను ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగానే దూరదర్శన్‌లో చేరింది. రోజూ ఉదయం బధిరుల వార్తలు చదివి, తర్వాత కాలేజీకి వెళ్లేది. బధిరుల భాషను అందరికీ నేర్పాలని తపన పడేది. బధిరుల పాఠశాలలకు వెళ్లి వాళ్లతో గడిపేది. వాళ్లకు సైగల భాషను నేర్పించేది. సైగల ద్వారానే వాళ్లతో సంభాషించేది. అంతలో ఆమె డిగ్రీ పూర్తయ్యింది. ఓరోజు అనుకోకుండా తారసపడిన ఓ స్నేహితుడు... ఆమె మార్గాన్ని మరోవైపు మళ్లించాడు. నేస్తం తెలిపిన వాస్తవమే ఊతంగా...: ఓరోజు బధిరుడైన తన చిన్ననాటి స్నేహితుడిని కలిసింది స్మృతి. ఏం చేస్తున్నావని అడిగితే... తానో చిన్న కంపెనీలో పని చేస్తున్నానని చెప్పాడతను. వెంటనే అతడు ఓ మంచి చిత్రకారుడన్న విషయం గుర్తొచ్చిందామెకి. పైగా అతడు ఫైన్ ఆర్ట్సలో పీజీ కూడా చేశాడని తెలిసి, మరి ఈ పనెందుకు చేస్తున్నావని అడిగితే, తనలాంటి వాళ్లకి ప్రతిభ ఉంటే చాలదు, ప్రోత్సాహం కూడా ఉండాలని చెప్పాడు. ఆ మాట స్మృతి మనసులో సూటిగా నాటుకు పోయింది. నిజమే. ప్రోత్సాహం లేకపోతే ఎంతటి కళ అయినా మరుగున పడిపోతుంది. ఎంత మంచి కళాకారుడి జీవితమైనా నిరర్థకమైపోతుంది. ఈ విషయం అవగత మవగానే స్మృతి మనసులో ఓ లక్ష్యం రూపు దిద్దుకుంది. అది, ‘అతుల్యకళ’ సంస్థగా ఆవిర్భవించింది. ఈ సంస్థ లక్ష్యం... తమలో ఈ ప్రతిభ ఉంది అని చెప్పుకోలేని, చెప్పుకోవడం చేతకాని బధిరులకు అండగా నిలబడటం. స్మృతి ఆశయాన్ని చూసి ఆకర్షితులైన కొందరు యువతీ యువకులు ఆమెతో చేతులు కలిపారు. అతుల్యకళలో సభ్యులయ్యారు. వీరంతా కలిసి ఎక్కడెక్కడ బధిరులున్నా వారిని కలుస్తారు. వారిలో ఏ ప్రతిభ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తారు. వారి ప్రతిభకు తగిన విధంగా పలు సంస్థల వారితో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పిస్తారు. బధిరులు తయారు చేసిన కళాకృతులు, చిత్రాలను అమ్మి పెడతారు. తర్వాత మెల్లగా వారికే అమ్మడమెలాగో నేర్పిస్తారు. అందుకు అవసరమైన సంజ్ఞల భాషలో తర్ఫీదు నిస్తారు. మొత్తంగా వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారి ప్రతిభనే వారి జీవితాలకు ఆధారంగా చేసి ముందుకు నడిపిస్తారు. ‘‘ప్రతి ఒక్కరికీ తమకు నచ్చినట్టు జీవించే హక్కు ఉంది. వైకల్యం ఉన్నంతమాత్రాన ఎవరి ప్రతిభా మరుగునపడిపోకూడదు’’ అనే స్మ ృతి సహకారంతో, ‘అతుల్యకళ’ అండతో కొన్ని వేలమంది బధిరుల ప్రతిభ ప్రపంచం ముందుకు వచ్చింది. కొందరు ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు అయ్యారు. కొందరు రచయితలు అయ్యారు. కొందరు చిత్రకారులయ్యారు. కొందరు సొంతంగా షాపులు పెట్టుకుని, తాము తయారు చేసిన వస్తువులను అమ్ముతూ జీవిస్తున్నారు. స్మృతి పుణ్యమా అని... వారికిప్పుడు భాష తెలుసు. భావాలను ప్రకటించడం తెలుసు. భరోసాగా బతకడమూ తెలుసు! - సమీర నేలపూడి ‘అతుల్యకళ’ అండతో బధిరులు సృష్టిస్తున్న కళాకృతులకు మంచి గిరాకీయే ఉంది. వీళ్లను ప్రోత్సహిద్దామన్న ఉద్దేశంతో కొనేవాళ్లతో పాటు, ఆ కళాత్మకతకు ముగ్ధులై కొనే కస్టమర్లూ బోలెడంత మంది ఉన్నారు. ఈ ఉత్పత్తులను http://www.craftsvilla.com వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. -
ముంబైలో ఆకట్టుకున్న ఫ్యాషన్ షో
-
కేక పుట్టించిన ఢిల్లీ ఫ్యాషన్ వీక్
-
ముంబైలో లాక్మే ఫ్యాషన్ వీక్ ధూమ్
-
లండన్ ష్యాషన్ వీక్... క్యాట్ వాక్
-
ఇగ్నో.. వినూత్న కోర్సులు..
జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వినూత్న కోర్సులను ప్రవేశపెట్టడంలో ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ముందుంది. ఈ యూనివర్సిటీ అందిస్తునన్ని కోర్సులను మరే యూనివర్సిటీ ఆఫర్ చేయడం లేదు. సర్టిఫికెట్ కోర్సులు మొదలుకుని ీపీహెచ్డీ కోర్సుల వరకు ఇగ్నోలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలా వరకు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులే. ఇగ్నో అందిస్తున్న కోర్సుల వివరాలు.. సర్టిఫికెట్ కోర్సులు: ఎయిర్ టికెటింగ్, ఎయిర్‌లైన్ ఇన్ ఫ్లైట్ సర్వీసెస్, బీ కీపింగ్, బిజినెస్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్-బీపీవో-ఐటీఈఎస్, లైఫ్‌లాంగ్ లెర్నింగ్, యూత్ ఇన్ డెవలప్మెంట్ వర్క్, టెలిసెంటర్/విలేజ్ నాలెడ్జ్ సెంటర్ మేనేజ్మెంట్, హ్యాండ్‌మేడ్ పేపర్ ఐటెమ్స్, డిస్పెన్సింగ్ ఆప్టిక్స్, కమ్యూనిటీ రేడియో, పీసీ హార్డ్‌వేర్ అండ్ నెట్వర్కింగ్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్, క్రాఫ్ట్ అండ్ డిజైన్, ఎర్లీ చైల్డ్ హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజిటల్ ఫిల్మ్ మేకింగ్, డయాబెటీస్ కేర్ ఫర్ కమ్యూనిటీ వర్కర్, క్రియేటివ్ మీడియా ఆర్ట్స్- డిజిటల్ సౌండ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, ఫంక్షనల్ ఇంగ్లిష్ (ప్రాథమిక స్థాయి), ఎనర్జీ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ మొదలైనవి. వ్యవధి: ఆరు నెలలు. అర్హత: కోర్సులను బట్టి 8వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు అర్హతలున్నాయి. పీజీ డిప్లొమా/అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు: కార్పొరేట్ గవర్నెన్స్, రూరల్ బ్యాంకింగ్, పార్టిసిపేటరీ డెవలప్మెంట్, బుక్ పబ్లిషింగ్, ఆడియో ప్రోగ్రామ్ ప్రొడక్షన్, ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఫైర్ సేఫ్టీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మొదలైనవి. అర్హత: గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సులు: ఆక్వాకల్చర్, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ టెక్నాలజీ, రేడియో ఇమేజినింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, పంచాయతీ లెవల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్, డెయిరీ టెక్నాలజీ, హెచ్ఐవీ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, క్రిటికల్ కేర్ నర్సింగ్, న్యూట్రిషన్ అండ్ హెల్త్‌కేర్ ఎడ్యుకేషన్, ఫిష్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్, ఎర్లీచైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ . వ్యవధి: ఏడాది, అర్హత: 10+2. బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు: బీఎస్సీ: నాటికల్ సైన్స్, నర్సింగ్ (పోస్ట్ బేసిక్), హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, ఫ్యాషన్ మర్చండైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్మెంట్, లెదర్‌గూడ్స్ అండ్ యాక్ససరీస్ డిజైన్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ అండ్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్/టెక్నాలజీ, మెడికల్ రికార్డ్స్ సైన్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. బీఎస్సీ ఆనర్స్: ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్, ఆప్టోమెట్రీ అండ్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్. బీఏ: ఇంగ్లిష్, హిందీ, 3డీ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్, ఉర్దూ, ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, టూరిజం స్టడీస్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, అప్పారెల్ డిజైన్ అండ్ మర్చండైజింగ్. ఇతర కోర్సులు: బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్), బీఎల్ఐఎస్సీ, బీఎస్‌డబ్ల్యు, బీబీఏ (రిటైలింగ్), బీకాం, బీకాం (ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంటింగ్, కార్పొరేట్ అఫైర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, అకౌంటెన్సీ అండ్ ఫైనాన్స్). మాస్టర్స్ డిగ్రీ కోర్సులు: ఎంఎస్సీ: యాక్చూరియల్ సైన్స్, క్లినికల్ ట్రైల్స్, కెమిస్ట్రీ, డైటిటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్, లెదర్ గూడ్స్ అండ్ యాక్ససరీస్ డిజైన్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, ఫ్యాషన్ మర్చండైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్. ఎంఏ: అడల్డ్ ఎడ్యుకేషన్, పార్టిసిపేటరీ డెవలప్మెంట్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, ఇంగ్లిష్, ఉమెన్స్ అండ్ జెండర్ స్టడీస్, జెండర్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్, ఎక్స్టెన్షన్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్, హిందీ, హిస్టరీ, ఫిలాసఫీ, లేబర్ అండ్ డెవలప్మెంట్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, రూరల్ డెవలప్మెంట్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీ, సోషియాలజీ, టూరిజం మేనేజ్మెంట్, ట్రాన్స్లేషన్ స్టడీస్, ఫ్యాషన్ రిటైల్ మేనేజ్మెంట్, అప్పారెల్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. ఇతర పీజీ కోర్సులు: ఎంఎస్డబ్ల్యు, ఎంఎఫ్ఏ (పెయింటింగ్), ఎంఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్), ఎంఎల్ఐఎస్సీ, ఎంకాం, ఎంకాం (మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్), (బిజినెస్ పాలసీ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్), ఎంబీఏ, ఎంబీఏ (హాస్పిటాలిటీ మేనేజ్మెంట్), (కార్పొరేట్ గవర్నెన్స్), (ఫైనాన్షియల్ మార్కెట్స్), (బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్), (హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్), ఎంటెక్ ఇన్ సైబర్ ఫోరెన్సిక్, ఐటీ. నిరుద్యోగ యువత అవకాశాలకు ఇగ్నో.. బీకాం అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఎంఏ సైకాలజీలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన ఉంది. వచ్చే జూలై నుంచి పీజీ డిప్లొమాలో అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కోర్సును ప్రవేశపెట్టనున్నాం. ప్రపంచీకరణ నేపథ్యంలో జాబ్ మార్కెట్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వీటిని అందుకునేలా ఎన్నో కోర్సులను దూరవిద్య ద్వారా అందిస్తున్నాం. ముఖ్యంగా ఉద్యోగులు విలువైన సమయాన్ని నష్టపోకుండా తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకునేందుకు డిస్టెన్స్ కోర్సులు ఉపయోగపడతాయి. ముఖ్యంగా టూరిజం, హెల్త్, లీగల్, అగ్రికల్చర్, టీచింగ్ వంటి రంగాల్లో అపార అవకాశాలున్నాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకుంటే కోరుకున్న కెరీర్లో ఆశించిన స్థాయికి చేరొచ్చు. యూజీసీ, సంబంధిత సంస్థల గుర్తింపు ఉన్న కోర్సులను పూర్తిచేస్తే విలువైన సమయం, డబ్బు ఆదా అవడమే కాకుండా చేసిన కోర్సుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. - డాక్టర్ కామేశ్వరిమూర్తి, రీజనల్ డెరైక్టర్, ఇగ్నో, హైదరాబాద్. -
వేస్ట్‌తో... బెస్ట్ షో...
-
గార్డెన్ సిటీలో ఫ్యాషన్ వీక్
-
భవిష్యత్తు ఫ్యాషన్ రంగానిదే
ఐఐఎం కొజికోడ్ డెరైక్టర్ దెబాషిష్ ఛటర్జీ నిఫ్ట్‌లో ‘రిఫ్లెక్షన్-14’ సదస్సు ప్రారంభం మాదాపూర్, న్యూస్‌లైన్: ఫ్యాషన్ రంగానికి ప్రాధాన్యం పెరుగుతోందని, యేటా మూడువేల మంది ఫ్యాషన్ డిజైనర్లు నిఫ్ట్ ద్వారా బయటకు వస్తున్నారని ఐఐఎం కొజికోడ్ డెరైక్టర్ దెబాషిష్ ఛటర్జీ అన్నారు. మాదాపూర్ నిఫ్ట్ ఆడిటోరియంలో గురువారం ‘రిఫ్లెక్షన్స్-14’ పేరిట అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దెబాషిష్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సదస్సులో భావితరాలకు ఏ విధమైన డిజైన్స్ అందించాలి, రిటైల్, మేనేజ్మెంట్ అంశాలపై చర్చించనున్నామన్నారు. నిఫ్ట్ డెరైక్టర్ ప్రేమ్‌కుమార్ గేర మాట్లాడుతూ నేటి తరం ఫ్యాషన్ రంగంపై మక్కువ చూపుపుతున్నారని, ఈ రంగంలో చేరేవారి సంఖ్య యేటా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. అనంతరం విద్యార్థులు తమ ఫ్యాషన్ మెళకువలను సంక్రాంతి ముగ్గులకు జోడించి ప్రాంగణాన్ని రంగవల్లులతో అలంకరించారు. -
హైదరాబాద్‌లో వినూత్న ఫ్యాషన్ షో
-
‘కింగ్ ఫిషర్’ ఫ్యాషన్ వీక్
-
చుక్కనమ్మలు
ఎలాంటి ఫ్యాషన్లు ఎవర్ గ్రీన్‌గా ఉంటాయి? అమ్మాయిలు ఫాలో అయ్యేవా? అమ్మాయిల్ని ఫాలో అయ్యేవా? అమ్మాయిల్ని ఫాలో అయ్యేవే! నైన్టీన్ సిక్స్టీస్ నుంచి ‘పోల్కా’ అనే ఒక ఫ్యాషన్... అమ్మాయిల్ని ఫాలో అవుతూ వస్తోంది. వాళ్ల బట్టల్నీ, తట్టాబుట్టల్నీ, గోళ్ల రంగుల్నీ... చుక్కలు చుక్కలుగా డిజైన్ చేస్తూ చక్కనమ్మలుగా ముస్తాబు చేస్తోంది. వాళ్ల ఇష్టాయిష్టాలను తెలుసుకుని గౌరవ మర్యాదలు పొందుతోంది. దీన్ని బట్టి ఏం అర్థమౌతోంది? అమ్మాయిల్ని ఫాలో అవాలంటే ఒక స్టేచర్, ఒక డిగ్నిటీ ఉండాలని కదా! ఆ రెండూ పోల్కాకి ఉన్నాయి కనుకనే... ఈవారం ఈ టాపిక్. గుండ్రటి, పెద్ద పెద్ద చుక్కలు అన్నీ ఒకే పరిమాణంలో, సమానమైన దూరంలో కనిపిస్తాయి. తమ మధ్యా ఒక బంధం ఉందన్న భావనను తెలుపుతుంటాయి. ఆ భావనే పోల్కా ప్రింట్కు ప్రాణం అంటారు ఫ్యాషన్ డిజైనర్లు. మొదట స్విమ్‌సూట్ మీద ఊపిరిపోసుకున్న ఈ చుక్కలు ఆ తర్వాత పిల్లల దుస్తులు మొదలుకొని ఆధునికం నుంచి సంప్రదాయం వరకు అన్నింటా పాకిపోయాయి. పోల్కా డాట్స్‌కు సామాన్యులే కాదు రాజకీయ నాయకులూ దాసోహమన్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని జాన్ మేజర్, ప్రస్తుత ప్రదాని టోనీ బ్లేయర్ తమ డ్రెస్ నెక్ భాగంలో పోల్కా డాట్స్ ఉండేలా డిజైన్ చేయించుకునేవారు. 1950లో గ్లామర్ క్వీన్ మార్లిన్ మన్రో తన దుస్తుల్లో పోల్కాకు ప్రత్యేకమైన స్థానమిచ్చారు. అనుకరణే ఆయుధం: రెట్రో ఫ్యాషన్‌కి అతి పెద్ద దారిని చూపాయి పోల్కా డిజైనర్ దుస్తులు. వీటిలో ఉండే స్పార్క్ అత్యంత వేగంగా దుస్తుల నుంచి యాక్ససరీస్ వరకు పాకింది. ‘చుక్కలు ఎప్పుడైతే ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చాయో, అప్పుటి నుంచి మనమూ వాటి చుట్టూ తిరగడం మొదలుపెట్టాం’ అంటారు ప్రఖ్యాత డిజైనర్ సత్యపాల్! దానికి తగ్గట్టే లుక్ ఎలా కావాలంటే అలా మారిపోతుంది పోల్కా డ్రెస్ ధరిస్తే! పోల్కా ప్రింటెడ్ బ్లౌజ్ ధరించి, సాదా చీర కట్టినా, సాదా జాకెట్టు వేసి పోల్కా చుక్కల చీర కట్టినా ఆ అందమే వేరు. అలాగే ప్యాంట్ షర్ట పైన చుక్కల ఓవర్ కోట్ వేసి, సన్ గ్లాసెస్ పెడితే చాలు అల్ట్రామోడ్రన్గానూ వెలిగిపోవచ్చు. జీన్స్ పై పోల్కా: చుక్కల డిజైనింగ్‌లో తమదైన ముద్ర వేయాలనుకుంటే చుక్కల ప్రింట్స్ నచ్చిన దుస్తుల మీద ఫ్యాబ్రిక్ పెయింట్‌తో వేసుకోవచ్చు. బ్లూ, బ్లాక్ జీన్స్, జెగ్గింగ్స్ పైనా పోల్కా చుక్కలను వేసి, సరికొత్త లుక్‌తో మీరు మెరిసిపోవచ్చు. డిజైనర్స్ ఫేవరేట్ పోల్కా: జార్జెట్, షిఫాన్, క్రేప్, బ్రాసో.. అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మీదా అందంగా ఒదిగిపోయే సుగుణం పోల్కా చుక్కల సొంతం. అందుకే డిజైనర్ల పాలిట అదృష్టంగా మారింది పోల్కా. సెలబ్రిటీల అందచందాలను మరింతగా చూపించడానికి పోల్కాను ప్రధానంగా వాడుతున్నారు డిజైనర్లు. ర్యాంప్ పై చుక్కలను చుట్టుకున్న చక్కనమ్మలు చుక్కల్లో చంద్రుడిలా వెలిగిపోతూ డిజైనర్లకు హ్యాట్సాప్ చెబుతున్నారు. పోల్కాతో జిమ్మిక్కులు చేసే డిజైనర్లలో రోహిత్‌బాల్, సవ్యసాచి, సత్యపాల్ వంటి ప్రముఖులూ ఉన్నారు. పోల్కా డాట్స్ డ్రెస్సింగ్ గురించి వారు చెబుతున్న కొన్ని సూచనలు.. మీ వార్డ్ రోబ్‌లో ఒక్క పోల్కా డ్రెస్ లేదా ఏ ఒక్క యాక్ససరీ ఉన్నా చాలు. వెస్ట్రన్ పార్టీకి 5 నిమిషాల్లో రెడీ అయిపోవచ్చు. ప్లెయిన్ డ్రెస్ ధరించి ఒక్క టోపీ వాడితే చాలు. లేదంటే అదే ప్లెయిన్ డ్రెస్‌కు పోల్కా చుక్కలు ఉన్న బెల్ట్ ఉపయోగించినా అల్ట్రామోడ్రన్ అనిపిస్తారు. కాటన్ షూ, శాండల్స్, చెప్పల్స్, బ్యాగ్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్... ఏ చిన్న అలంకరణ వస్తువైనా పోల్కాకు స్థానమిస్తే ఆ లుక్ రిఫరెంట్ అనిపించకమానదు. పోల్కా డ్రెస్ వేసుకుంటున్నాం కదా! అని టాప్ టు బాటమ్ ‘ఇదే తరహా’లో వెళ్లాలనుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే అలంకరణలో ఏదో ఒక ఎలిమెంట్కే ప్రాధాన్యం ఇవ్వడం మేలు. -
పుణేలో భారీ అగ్నిప్రమాదం
పింప్రి, న్యూస్‌లైన్: పుణే క్యాంప్‌లోని ఫ్యాషన్స్ట్రీట్లో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 దుకాణాలు మంటల్లో చిక్కుకొని బూడిదయ్యాయి. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సుమారు 500 దుకాణాల సముదాయంతో ఉన్న ఈ ఫ్యాషన్ స్ట్రీట్‌లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించడంతో నష్టం భారీగానే జరిగింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్ని మాపకశాఖ అధికారులు ఆరు వాహనాలతో వెంట నే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎంత ప్రయత్నించినా 15 దుకాణాల వరకు మంటల్లో కాలి బూడిదయ్యాయి. నంబరు 107 నుంచి 121 వరకు ఉన్న రెడీమేడ్ దుస్తులు, లెదర్ బ్యాగులు, బూట్లు, అల్పాహార దుకాణాలు ఈ దుర్ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదంలో జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది. -
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులతో ఉపాధి, ఉద్యోగావకాశాలు
శివాజీనగర్, న్యూస్‌లైన్ : ఫ్యాషన్ డిజైనింగ్ ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి పొందవచ్చని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) జాయింట్ డెరైక్టర్ ఇప్ప వెంకటరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పృథ్వీరాజ్మాల్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... నిఫ్ట్ స్వయం ప్రతిపత్తి గల విద్యా సంస్థ అని, 1986లో కేంద్ర వస్త్ర మంత్రిత్వశాఖ ద్వారా సంస్థ ఏర్పాటైందన్నారు. ఫ్యాషన్ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన విద్యా శిక్షణ ఇచ్చి పరిశ్రమ అభివృద్ధికి నిఫ్ట్ కృషిచేస్తుందన్నారు. నిఫ్ట్ విద్యా సంస్థ పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడి ందని, సంస్థ ఇచ్చే డిగ్రీకి ప్రభుత్వ గుర్తింపు ఉందన్నారు. సంస్థ కార్యాలయం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉందన్నారు. జిల్లాలోని విద్యావంతులైన వారు 2014 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సులో శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇంటర్ పూర్తిచేసిన వారు ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, టెక్స్టైల్ డిజైనింగ్, ఎక్సేసరీ డిజైనింగ్, నిట్వేర్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు, డిగ్రీ చదివిన వారు ఫ్యాషన్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండేళ్ల కోర్సుకు అర్హులన్నారు. దరఖాస్తులను జనవరి 10లోగా పంపాలన్నారు. రాత పరీక్ష 2014, ఫిబ్రవరి 9, 23 తేదీల్లో ఉంటాయని వారు తెలిపారు. -
ఇండోనేషియాలో ఫ్యాషన్ వీక్
-
అమ్మాయిలకు నచ్చితే.. అమ్మలకు నచ్చినట్టే!
ఇంటికి కావాల్సిన వస్తువుల విషయంలో ఇల్లాలి మాటే దాదాపు ఫైనల్! ఆమెకు సంబంధించిన దుస్తుల విషయంలో..? అమ్మాయిల మాటలకే అమ్మలు ఓటేస్తారట. చీరలు మొదలుకొని అన్ని రకాలు దస్తులు, ఫ్యాషన్ విషయంలో అమ్మాయిలు ఓకే చెప్పాల్సిందే. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది. వయసు అంతరమున్నాఅమ్మల మనసు తెలుసుకుని ఎలాంటివైతే నచ్చుతాయో వాటినే అమ్మాయిలు ఎంపిక చేస్తారట. దుస్తుల ఎంపికలో అమ్మాయిల మాటే ఫైనల్ అని 48 శాతం మంది మహిళలు చెప్పారు. ఇక 19 శాతం మంది.. గతంలో పిల్లలతో వాదించేవారమని, ప్రస్తుతం అమ్మాయిలకే దుస్తుల నాణ్యత గురించి ఎక్కువ తెలుసని చెప్పారు. మరో 35 శాతం మంది.. తమ అమ్మాయిలకున్న డ్రెస్‌ల వంటివే పొరపాటున కొనుగోలు చేయకుండా ఉండేందుకు వారితో సంప్రదిస్తామని తెలిపారు. మొత్తమ్మీద దుస్తుల కొనుగోలు విషయంలో ఈ తరం అమ్మలకు అమ్మాయిల మాటే వేదవాక్కు. 'అమ్మకు నచ్చితే.. అమ్మాయికి నచ్చినట్టే' అన్నది పాత మాట. 'అమ్మాయికి నచ్చితే.. అమ్మకు నచ్చినట్టే' అన్నది కొత్త సంగతి. ఇక ఫ్యాషన్ విషయంలోనూ.. అంటే తమ వయసుకు తగ్గట్టు హుందాగా ఉండేలా కూతుళ్ల సలహాలను పాటిస్తారట. -
పవన్‌కల్యాణ్ నయా లుక్ డ్రెస్సింగ్ డిజైనర్ రాజేశ్
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: కాస్త రఫ్‌గా కనిపించాలి.. మాస్‌ను మైమరిపించాలి.. క్లాస్‌ను కట్టిపడేయాలి.. అమ్మాయిలను ఆకర్షించే కొత్త లుక్‌లో కనిపించాలి.. ఆ స్టైల్‌ను యూత్ క్రేజీగా అనుకరించాలి.. మొత్తంగా చూస్తే.. ‘పవనిజానికి’, ఫ్యాషన్‌కు పట్టం కట్టాలి.. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌ను రూపొందించేది మన నగర యువకుడే. ‘కొమురం పులి’లో పవన్‌కల్యాణ్ డిఫరెంట్‌గా కనిపించడం వెనుక.. ‘అత్తారింటికి దారేది’లో పవర్‌స్టార్ నయా లుక్‌లో ఆకట్టుకోవడం వెనుక అతని ప్రతిభ దాగి ఉంది. అతనే రాజేశ్. నగరానికి చెందిన ఆయన పవన్‌కు డ్రెస్సింగ్, స్టైలింగ్‌లో పర్ఫెక్ట్నెస్ను తీసుకొచ్చారు. ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపించేలా డిజైనింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.ముంబైలో ఓ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న రాజేశ్.. నగరానికి వచ్చిన సందర్భంగా ‘న్యూస్‌లైన్’తో తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన మాటల్లోనే... ఫ్యామిలీ, స్టడీ.. అమ్మనాన్నలిద్దరూ హైదరాబాద్‌లోనే ఉంటారు. చదువంతా ఇక్కడే సాగింది. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేశా. అనంతరం బెంగుళూరుకు వెళ్లి అక్కడ వివిధ అంతర్జాతీయ స్థాయి డిజైనింగ్ సంస్థలలో పని చేశా. అనుకోకుండా సినిమాల్లోకి.. అనుకోకుండా సినీ పరిశ్రమ నుంచి పిలుపొచ్చింది. మొదటి నుంచి డిజైనింగ్ రంగంలో ఉండటంతో పరిశ్రమలోని కొంత మందితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఒక రోజు దర్శకుడు ఎస్జే సూర్య నుంచి కాల్ వచ్చింది. ఆయన తీస్తున్న కొమురం పులి చిత్రంలో పవన్‌కు డ్రెస్ డిజైనింగ్ చేయాలని సూచించారు. అలా ఆ చిత్రంలో మూడు పాటలకు పవన్ కల్యాణ్‌కు నేనే డిజైనింగ్ చేసే అవకాశం వచ్చింది. అందరిని మెప్పించేలా.. పవన్‌కల్యాణ్‌కు డిజైనింగ్ చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే అలా చేసే సమయంలో పవన్ ఒక్కడినే కాదు.. ఆయనకు ఉండే లక్షలాది మంది అభిమానులను మెప్పించాలి. అదే ఆలోచనతో ప్రతి చిత్రంలో పవర్‌స్టార్‌కు ప్రత్యేకమైన డిజైనింగ్ చేస్తున్నా. క్లాస్ నుంచి మాస్ వరకు అందరిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాను. అందుకే గబ్బర్‌సింగ్ 2 లో సైతం పవన్ నాకు అవకాశం ఇచ్చారు. పవన్‌తో పనిచేయడం నా జీవితంలో ఊహించలేని అద్భుతమైన ఘట్టం. పవన్‌తో అనుబంధం.. కొమురం పులి చిత్రంలో చేసిన డిజైనింగ్‌తో పవన్‌కల్యాణ్‌కు చాలా దగ్గరయ్యాను. అలా ఆయనతో కలిసి చేసిన ప్రయాణంలో భాగంగా తీన్మార్, గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది చిత్రాల్లో ఆయనకు డ్రెస్ డిజైన్ చేసే అవకాశం లభించింది. తీన్మార్ చిత్రంలో పవన్ రెండు పాత్రలకు ఎంతో ప్రాధాన్యం తీసుకొని జాగ్రత్తగా డిజైన్ చేశాను. అలాగే అత్తారింటికి దారేది చిత్రంలో సైతం మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించే పవన్ డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నా. -
ఇంగ్లీష్ టీచరే ఫ్యాషన్ గురువు
నాస్కూల్ డేస్‌లో టీచర్లంతా చక్కగా చీరలు కట్టుకుని వచ్చేవారు. వారందరిలో ఇంగ్లీష్ టీచర్ మరీ ప్రత్యేకంగా ఉండేది. 9గజాల చీరతో ఎంత అద్భుతంగా కనపడేదంటే కళ్లార్పడం మరచిపోయేదాన్ని. పొడవుగా, స్లిమ్‌గా ఉండే ఆమెకు ఏ చీరైనా బాగా నప్పేది. నేను రకరకాల చీరల్లో ఆమెను చూస్తూ ఆమెకు ఎలాంటి డిజైన్లు బాగుంటాయో ఊహించుకునేదాన్ని. నాలో చీర మీద ఆసక్తితో పాటు డిజైనింగ్‌ని కెరీర్‌గా మార్చుకోవడానికి కూడా ఆమే కారణమేమో అనిపిస్తోంది. ఓ రకంగా ఫ్యాషన్ రంగంలో ఆమే నాకు గురువు అని చెప్పాలి. ఫ్యాషన్ స్కూల్ నడుపుతూ నేనూ టీచర్ పాత్రకు మారా. ఆమెలానే చీరకట్టుకే ప్రాధాన్యమిస్తున్నా - ఆయేషాలఖోటియా, లఖోటియా ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఏకలవ్య శిష్యురాలిని డిజైనర్లు రోహిత్‌బాల్, సవ్యసాచిలకు ఏకలవ్య శిష్యురాలిని నేను. ఇద్దరినీ పరిశీలిస్తూ నా డిజైనింగ్‌లో మెరుగులు దిద్దుకున్నాను. వీరిలో రోహిత్‌బాల్ ఒక నిజమైన కొచూరియర్ అయితే సవ్యసాచి భారతీయ ఫ్యాబ్రిక్స్‌కి సమకాలీన శైలిని అద్దడంలో దిట్ట. ఎప్పటికప్పుడు ప్రపంచ విపణి మార్పులకు అనుగుణంగా తమను తాము మలచుకునే ఈ ఫ్యాషన్ సామ్రాట్టుల పనితీరుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేను. వీరిద్దరూ నాకు ఎప్పుడూ స్ఫూర్తి ప్రదాతలే. అంతేకాదు నేను డిజైనింగ్ కోర్సు చేసి నిఫ్ట్లోనే వీరు నాకు సీనియర్స్ కావడం కూడా ఒక విశేషం. ఫ్యాషన్ డిజైనింగ్‌లో నాకంటూ ఒక స్థానం తెచ్చుకున్న తర్వాత సవ్యసాచిని ఒకసారి కలవగలిగాను. ఆ అపురూప సందర్భం నేనెప్పటికీ గుర్తుంచుకుంటాను. - ఇషితాసింగ్, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ -
ఇంగ్లీష్ టీచరే ఫ్యాషన్ గురువు
నాస్కూల్ డేస్‌లో టీచర్లంతా చక్కగా చీరలు కట్టుకుని వచ్చేవారు. వారందరిలో ఇంగ్లీష్ టీచర్ మరీ ప్రత్యేకంగా ఉండేది. 9గజాల చీరతో ఎంత అద్భుతంగా కనపడేదంటే కళ్లార్పడం మరచిపోయేదాన్ని. పొడవుగా, స్లిమ్‌గా ఉండే ఆమెకు ఏ చీరైనా బాగా నప్పేది. నేను రకరకాల చీరల్లో ఆమెను చూస్తూ ఆమెకు ఎలాంటి డిజైన్లు బాగుంటాయో ఊహించుకునేదాన్ని. నాలో చీర మీద ఆసక్తితో పాటు డిజైనింగ్‌ని కెరీర్‌గా మార్చుకోవడానికి కూడా ఆమే కారణమేమో అనిపిస్తోంది. ఓ రకంగా ఫ్యాషన్ రంగంలో ఆమే నాకు గురువు అని చెప్పాలి. ఫ్యాషన్ స్కూల్ నడుపుతూ నేనూ టీచర్ పాత్రకు మారా. ఆమెలానే చీరకట్టుకే ప్రాధాన్యమిస్తున్నా - ఆయేషాలఖోటియా, లఖోటియా ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఏకలవ్య శిష్యురాలిని డిజైనర్లు రోహిత్‌బాల్, సవ్యసాచిలకు ఏకలవ్య శిష్యురాలిని నేను. ఇద్దరినీ పరిశీలిస్తూ నా డిజైనింగ్‌లో మెరుగులు దిద్దుకున్నాను. వీరిలో రోహిత్‌బాల్ ఒక నిజమైన కొచూరియర్ అయితే సవ్యసాచి భారతీయ ఫ్యాబ్రిక్స్‌కి సమకాలీన శైలిని అద్దడంలో దిట్ట. ఎప్పటికప్పుడు ప్రపంచ విపణి మార్పులకు అనుగుణంగా తమను తాము మలచుకునే ఈ ఫ్యాషన్ సామ్రాట్టుల పనితీరుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేను. వీరిద్దరూ నాకు ఎప్పుడూ స్ఫూర్తి ప్రదాతలే. అంతేకాదు నేను డిజైనింగ్ కోర్సు చేసి నిఫ్ట్లోనే వీరు నాకు సీనియర్స్ కావడం కూడా ఒక విశేషం. ఫ్యాషన్ డిజైనింగ్‌లో నాకంటూ ఒక స్థానం తెచ్చుకున్న తర్వాత సవ్యసాచిని ఒకసారి కలవగలిగాను. ఆ అపురూప సందర్భం నేనెప్పటికీ గుర్తుంచుకుంటాను. - ఇషితాసింగ్, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ -
నవ్వులతో పోటీపడేలా..!
ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకున్నా, ప్రత్యేకంగా అనిపించాలన్నా దుస్తులు, హెయిర్ స్టైల్స్‌తో పాటు గాజుల గలగలలు కూడా తప్పనిసరి. సంప్రదాయం, ఆధునికం ఏదైనా రకరకాల మోడల్ గాజులను ధరించడం అంటే అమ్మాయిలకు అమితమైన మక్కువ. గాజుల గలగలలు నవ్వులతో పోటీపడాలంటే వాటి ఎంపికలోనూ, ధరించడంలోనూ మెళకువలను పాటించాలి. ఎక్కువ గాజులు వేసుకునేటప్పుడు చూడగానే కంటికి నదురుగా కనిపించే ఒక ప్రత్యేకమైన గాజును సెంటర్లో ఉండేట్టుగా వేసుకోవాలి. ఫ్యాషనబుల్‌గా కనిపించాలంటే ఒక చేతికి మాత్రమే గాజులు వేసుకొని, ఆ గాజులను పోలి ఉండే ఫంకీ రింగ్‌ను మరొక చేతి వేలికి ధరించాలి. నాలుగు నుంచి ఆరు గాజులు వేసుకునేటప్పుడు వాటికి మరికొన్ని భిన్నమైన గాజులను జోడించి ధరించాలి. వెండి, బంగారు, ఇతర లోహపు గాజులు ధరించేటప్పుడు రంగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువగా నేచరల్ కలర్స్‌ని ఎంపిక చేసుకుంటే కాంప్లిమెంట్స్ కూడా అందుతాయి. లెదర్, దారం, పూసలతో తయారుచేసిన బ్రేస్‌లెట్స్‌ను ధరించినప్పుడు ఇతర సంప్రదాయ గాజులకు దూరంగా ఉండటం మంచిది. గాజుల ఎంపిక సమయంలో మీ మణికట్టు పరిమాణం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. -
నవ్వులతో పోటీపడేలా..!
ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకున్నా, ప్రత్యేకంగా అనిపించాలన్నా దుస్తులు, హెయిర్ స్టైల్స్‌తో పాటు గాజుల గలగలలు కూడా తప్పనిసరి. సంప్రదాయం, ఆధునికం ఏదైనా రకరకాల మోడల్ గాజులను ధరించడం అంటే అమ్మాయిలకు అమితమైన మక్కువ. గాజుల గలగలలు నవ్వులతో పోటీపడాలంటే వాటి ఎంపికలోనూ, ధరించడంలోనూ మెళకువలను పాటించాలి. ఎక్కువ గాజులు వేసుకునేటప్పుడు చూడగానే కంటికి నదురుగా కనిపించే ఒక ప్రత్యేకమైన గాజును సెంటర్లో ఉండేట్టుగా వేసుకోవాలి. ఫ్యాషనబుల్‌గా కనిపించాలంటే ఒక చేతికి మాత్రమే గాజులు వేసుకొని, ఆ గాజులను పోలి ఉండే ఫంకీ రింగ్‌ను మరొక చేతి వేలికి ధరించాలి. నాలుగు నుంచి ఆరు గాజులు వేసుకునేటప్పుడు వాటికి మరికొన్ని భిన్నమైన గాజులను జోడించి ధరించాలి. వెండి, బంగారు, ఇతర లోహపు గాజులు ధరించేటప్పుడు రంగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువగా నేచరల్ కలర్స్‌ని ఎంపిక చేసుకుంటే కాంప్లిమెంట్స్ కూడా అందుతాయి. లెదర్, దారం, పూసలతో తయారుచేసిన బ్రేస్‌లెట్స్‌ను ధరించినప్పుడు ఇతర సంప్రదాయ గాజులకు దూరంగా ఉండటం మంచిది. గాజుల ఎంపిక సమయంలో మీ మణికట్టు పరిమాణం కూడా పరిగణనలోకి తీసుకోవాలి.