అనుకోకుండానే.. అయిపోయా! | City plus chit chat with Gorgeous Shilpi sharma | Sakshi
Sakshi News home page

అనుకోకుండానే.. అయిపోయా!

Jun 24 2014 1:06 AM | Updated on Sep 2 2017 9:16 AM

ఫ్యాషన్ డిజైనింగ్ చేసి మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన శిల్పిశర్మ తెలుగు సినిమా ‘గ్రీన్‌సిగ్నల్’తో తెరంగేట్రం చేసింది..

ఫ్యాషన్ డిజైనింగ్ చేసి మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన శిల్పిశర్మ తెలుగు సినిమా ‘గ్రీన్‌సిగ్నల్’తో తెరంగేట్రం చేసింది.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోడానికి మరింతగా కష్టపడతానంటున్న ఈ ముద్దుగుమ్మ నగరానికి వచ్చిన సందర్భంగా ‘సిటీప్లస్’ జరిపిన చిట్‌చాట్..  ‘నా జీవితంలో అన్నీ అనుకోకుండానే జరిగిపోయాయి...నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన నేను అనుకోకుండా మోడలింగ్ రంగంలో అడుగుపెట్టా. అలాగే, అనుకోకుండానే నటిగా తెరమీదికి వచ్చా. గ్రీన్‌సిగ్నల్ మూవీ తర్వాత ఇప్పుడు  రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. టాలీవుడ్‌లో అల్లు అర్జున్, రాంచరణ్, మహేష్ ఇలా అందరి యాక్టింగ్ ఇష్టం. అలాగే శ్రీదేవి, సమంతల నటన కూడా నచ్చుతుంది. అలాగని వాళ్లను కాపీ కొట్టను.. నాకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తా. సింపుల్‌గా ఉండటమంటేనే నాకు  ఇష్టం. అన్నట్టు మీకు చెప్పడం మరిచిపోయా..నాకు చిన్నప్పటి నుంచి నీళ్లంటే భయంఅందుకే  వాటర్‌ఫోబియాను పోగొట్టుకునేందుకు ఈత నేర్చుకున్నా. ఇప్పడు ఖాళీ సమయంలో నీటితోనే స్నేహం చేస్తున్నా..’
 - నర్సింహారెడ్డి, బంజారాహిల్స్

Advertisement
 
Advertisement
Advertisement