గ్రామీణ స్వయం ఉపాధి కల్పనా కేంద్రంలో మహిళలకు నెలరోజుల పాటు ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు.
సంగారెడ్డి మున్సిపాలిటీ: గ్రామీణ స్వయం ఉపాధి కల్పనా కేంద్రంలో మహిళలకు నెలరోజుల పాటు ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంత యువతులు ఉచిత శిక్షణ పొందేందుకు అర్హులని, శిక్షణా సమయంలో భోజనం, వసతి సౌకర్యాలతో పాటు రవాణా చార్జీలు చెల్లిస్తారన్నారు. ఆసక్తి గల యువతులు ఈనెల 24లోగా తమ దరఖాస్తులను నేరుగా సంగారెడ్డిలోని పాత డీఆర్‌డీఏ కార్యాలయ ఆవరణలోని గ్రామీణ స్వయం ఉపాధి కల్పనా కేంద్రంలో తెల్లరేషన్‌కార్డు, , ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీతో బుధవారం లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి ఈనెల 24 నుంచి వచ్చే నెల 22 వరకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు.