సంగారెడ్డి: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను జీవితంలో సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయనన్నారు. సంగారెడ్డి మేధావులు తనను ఓడించారని అందుకే ఇక జీవితంలో ఇక్కడ నుంచి పోటీ చేయనని తేల్చిచెప్పారు.
‘రాహుల్ గాంధీ వచ్చి నన్ను గెలిపించాలని ప్రచారం చేస్తే, నన్ను ఇక్కడ ఓడించారు. రాహుల్ గాంధీని ఇన్సల్ట్ చేసినట్లు అయ్యింది. జగ్గారెడ్డిని గెలిపించాలని రాహుల్ గాంధీ అడిగితే.. నన్ను ఓడించారు. నా జీవితంలో ఇది మరిచిపోలేనిది. అందుకే సంగారెడ్డిలో జీవితంలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా.
నా ఓటమికి కారణం పేద ప్రజలు కాదు..ఇక్కడి మేధావులు.. పెద్దలది. రేపు సంగారెడ్డిలో నా భార్య నిర్మలా పోటీ చేసిన కూడా నేను ప్రచారం చేయను.రాష్ట్రంలో నేను ఎక్కడికైన వెళ్ళి ప్రచారం చేస్తా కానీ.. సంగారెడ్డిలో ప్రచారం చేయను’ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.


