సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో హాస్టల్ వార్డెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు అన్నంలో విషం కలిపి చంపండి అంటూ వంట మనుషులతో మాట్లాడటం సంచలనంగా మారింది. దీంతో, సదరు హాస్టల్ వార్డెన్‌పై పేరెంట్స్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హాస్టల్ వార్డెన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
వివరాల మేరకు.. సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ ఎస్సీ హాస్టల్‌లో తమ సమస్యలపై విద్యార్థులు ధర్నా చేశారు. దీంతో, హాస్టల్ వార్డెన్ కిషన్ ఆగ్రహంతో రెచ్చిపోయారు. బూతులతో రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే విద్యార్థుల పట్ల అనుచితంగా మాట్లాడుతూ.. విద్యార్థులు తినే అన్నంలో విషయం కలిపి చంపండి అని వంట మనుషులకు చెప్పాడు. అంతటితో ఆగకుండగా హాస్టల్ భవనంపై నుంచి విద్యార్థులను తోసేసి చంపేస్తా అంటూ హెచ్చరించారు. దీంతో, వార్డెన్ కిషన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ విషయాన్ని హాస్టల్ విద్యార్థులు తమ పేరెంట్స్‌కు చెప్పడం ఈ విషయంలో చర్చనీయాంశంగా మారింది. హాస్టల్ వార్డెన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పేరెంట్స్.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, కలెక్టర్ వార్డెన్ కిషన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.



