కాస్ట్యూమ్‌ సెలక్షన్‌లో నో కంప్రమైజ్‌!. అదితీరావు హైదరీ

Star Style Aditi Rao Hydaris Most Stylish Brands - Sakshi

అందం, అభినయంతో ప్రేక్షకులను సమ్మోహనపరుస్తున్న నటి అదితీరావు హైదరీ. స్క్రీన్‌ మీద ఎంచుకునే పాత్రల్లోనే కాదు.. అప్పియరెన్స్‌ కోసం అనుసరించే ఫ్యాషన్‌లోనూ వినూత్నమైన అభిరుచి ఆమెది! ఆ టేస్ట్‌కు అద్దం పట్టే బ్రాండ్సే ఇవీ.. 

ది హౌస్‌ ఆఫ్‌ ఎమ్‌బీజే .. 
‘ది సింబల్‌ ఆఫ్‌ టైమ్‌లెస్‌’.. అనేది ఈ సంస్థ క్యాప్షన్‌. తగ్గట్టుగానే రాజుల కాలం నుంచి నేటి వరకూ ఉన్న ప్రతి డిజైన్‌లో ఆభరణాలు లభిస్తాయిక్కడ. 1897లో ప్రారంభమై, వంద సంవత్సరాలకు పైగా ఎన్నో అద్భుతమైన బంగారు, వెండి, వజ్రాభరణాలను వీరు అందిస్తున్నారు. వివాహాది శుభకార్యాలకు పెట్టింది పేరు. చాలా మంది సెలబ్రిటీస్‌ తమ పెళ్లిళ్లలో వీరి ఆభరణాల్లోనే మెరిశారు. ఇక్కడ ఏది కొనాలన్నా లక్షల నుంచి కోట్లు ఖర్చు చేయాల్సిందే. బంగారం ధర, వజ్రాల నాణ్యతతో సంబంధం ఉండదు. కేవలం డిజైన్‌ ఆధారంగానే ధర నిర్ణయిస్తారు. ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లోనూ ఈ ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. 

 జ్యూయెలరీ బ్రాండ్‌: ది హౌస్‌ ఆఫ్‌ ఎమ్‌బీజే  పునీత్‌ బలానా, సెలబ్రిటీస్‌ స్టైలిస్ట్‌, 
ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది.  

పునీత్‌ బలానా ..
ఇతని కలెక్షన్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడైపోతుంటాయి. కారణం.. పునీత్‌ బలానా అంటే టాప్‌ మోస్ట్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్‌. రాజస్థాన్‌లో పుట్టి, సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేసి, ఎన్నో అందమైన ఫ్యాషన్‌ డిజైన్స్‌ను అందించాడు. ఈ దుస్తులన్నీ ఎంత సంప్రదాయబద్ధంగా ఉంటాయో, అంతే మోడర్న్‌గానూ ఉంటాయి. అదే ఇతని బ్రాండ్‌ వాల్యూనూ పెంచింది. పునీత్‌ బలానా లేబుల్‌ సృష్టిని బాలీవుడ్‌ తారలు విద్యా బాలన్, కృతి సనన్, రవీనా టాండన్, అదితిరావ్‌ హైదరి వంటి ఎంతో మంది సెలబ్రిటీస్‌ కోరుకుంటారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లోనూ ఈ డిజైనర్‌ వేర్‌ అందుబాటులో ఉంది. 

చీర డిజైనర్‌: పునీత్‌ బలానా 
ధర: రూ. 45,000

- దీపిక కొండి

చదవండి: World's loneliest whale: పాపం.. ఒంటరైన తిమింగలం..తలను గోడకేసి బాదుకుని..!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top