హిట్ హీరోయిన్‌కు ఒక్క సినిమా లేదట! | Sonam takes a short break between films | Sakshi
Sakshi News home page

హిట్ హీరోయిన్‌కు ఒక్క సినిమా లేదట!

May 11 2016 4:58 PM | Updated on Oct 1 2018 1:16 PM

హిట్ హీరోయిన్‌కు ఒక్క సినిమా లేదట! - Sakshi

హిట్ హీరోయిన్‌కు ఒక్క సినిమా లేదట!

బాలీవుడ్ స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా.. అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన బ్యూటీ సోనమ్ కపూర్. హీరోయిన్గా సక్సెస్లు సాధించలేకపోయినా తన గ్లామర్ షోతో మాత్రం మంచి గుర్తింపు పొందింది.

బాలీవుడ్ స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా.. అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన బ్యూటీ సోనమ్ కపూర్. హీరోయిన్గా సక్సెస్లు సాధించలేకపోయినా తన గ్లామర్ షోతో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ పరంగా అప్ డేట్ అవుతూ వస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్గా పేరు తెచ్చుకుంది. ఇటీవల బయోపిక్గా తెరకెక్కిన నీర్జా సినిమాలో నటించిన సోనమ్ తొలిసారి నటిగా మంచి మార్కులు సాధించింది.

నీర్జా సినిమా సోనమ్కు మంచి పేరు తీసుకురావటమే కాదు. కలెక్షన్ల పరంగా కూడా బాలీవుడ్లో సంచలనాలు సృష్టించింది. దీంతో సోనమ్ ఫేట్ మారిపోయినట్టే అని భావించారు అంతా. కానీ అలా జరగలేదు. నీర్జా లాంటి భారీ హిట్ తరువాత కూడా సోనమ్ కపూర్కు మంచి అవకాశాలు రావటం లేదట. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'నీర్జా సినిమా తరువాత ఇప్పటివరకు ఒక్క మంచి కథ కూడా రాలేదు. అందుకే ఇంత వరకు సినిమా అంగీకరించలేదు' అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ర్యాంప్ షోలతో టైం పాస్ చేస్తున్న సోనమ్కు స్టార్ హీరోయిన్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తోంది.

ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేని సోనమ్, కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఇండియాలో జరిగే ఈవెంట్స్ లోనే ఓ రేంజ్ గ్లామర్ షో ఇచ్చే సోనమ్ కేన్స్ హాట్ టాపిక్ గా మారనుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు తన సొంత నిర్మాణ సంస్థలో బ్యాటిల్ ఆఫ్ బిట్టోరా పేరుతో సినిమాను నిర్మించే ఆలోచనలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement