లేడీస్.. స్పెషల్ | Ladies special for latest design Jewellery | Sakshi
Sakshi News home page

లేడీస్.. స్పెషల్

Jul 26 2014 2:19 AM | Updated on Oct 1 2018 1:16 PM

లేడీస్.. స్పెషల్ - Sakshi

లేడీస్.. స్పెషల్

లేటెస్ట్ ట్రెండ్స్‌తో నిర్వహించిన ‘ఫ్యాషన్ యాత్ర’ సిటీజనులకు వినూత్న వెరైటీలను పరిచయుం చేసింది.

లేటెస్ట్ ట్రెండ్స్‌తో నిర్వహించిన ‘ఫ్యాషన్ యూత్ర’ సిటీజనులకు వినూత్న వెరైటీలను పరిచయుం చేసింది. బంజారాహిల్స్ హోటల్ తాజ్  కృష్ణాలో సోషలైట్ కామినీ షరాఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు ఫ్యాషన్ లవర్‌‌స క్యూ కట్టారు. దుస్తులు, జ్యువెలరీ, ఫుట్‌వేర్, డెకార్స్, యాక్సెసరీస్ వంటి ఐటమ్స్‌తో స్టాల్స్ కొలువుదీరాయి.  
 
 -    ఈ ప్రదర్శనలో పాల్గొన్నవారంతా మహిళలే. ఈసారి ఏర్పాటు చేసిన డిజైనర్ ఉత్పత్తుల ప్రదర్శనలో 67 స్టాల్స్ అన్నీ మహిళలవే.
 -    ఫిలిప్పీన్స్ నుంచి దిగుమతి చేసుకున్న ఆల్చిప్పలతో రూపొందిన మ్యూజికల్ సెట్స్, గౌతమ్‌బుద్ధ వంటి అలంకరణ వస్తువులు ఆకట్టుకున్నాయి. ముంబై నుంచి వచ్చిన మరో వ్యాపారి.. సౌదీ అరేబియా నుంచి తెచ్చిన డ్రైఫ్రూట్స్‌తో చేసిన స్వీట్స్ టేస్టీగా ఉన్నారుు. తిబర్‌మాల్ జ్యువెలర్స్‌కు చెందిన పంకజ్‌గుప్తా డిజైన్ చేసిన ఆభరణాలతో మోడల్స్ వావ్ అనిపించారు. ఇంకా ఇండియన్ మార్కెట్‌లోకి లాంచ్ కాని, ఇటలీకి చెందిన ఒక బ్రాండ్ కంపెనీ తొలిసారి తమ ఉత్పత్తులను ప్రదర్శించింది.
 -    పేజ్ త్రీ ప్రవుుఖులు వినీతాపిట్టి, నీరాశారెన్, పింకీరెడ్డి, హీరో వెంకటేష్ సతీవుణి నీరజ, నిర్మాత సురేష్‌బాబు సతీవుణి లక్ష్మి షాపింగ్ చేశారు.
 -    ఈ ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయంలో కొంత శాతాన్ని ప్రభుత్వ పాఠశాల
 విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేసే నాన్హి కలి, హెల్ప్, పీఎఫ్‌ఏలకు అందజేస్తారు.  
 -    ‘ఇది తొమ్మిదో ఏడాది. వచ్చే ఏడాది మరింత డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నా.
 సామాజిక ప్రయోజనం కోసం చేస్తున్న ఈ కార్యక్రవుం విజయువంతం కావడం
 సంతోషంగా ఉంది’ అని నిర్వాహకురాలు కామినీ షరాఫ్ చెప్పారు.
 -  శిరీష చల్లపల్లి
 ఫొటోలు: సృజన్ పున్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement