వింటర్ క్రాప్ | Ladies to grand welcome to winter season | Sakshi
Sakshi News home page

వింటర్ క్రాప్

Oct 30 2014 1:10 AM | Updated on Oct 1 2018 1:16 PM

వింటర్ క్రాప్ - Sakshi

వింటర్ క్రాప్

ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవుతున్న మగువలు వింటర్ సీజన్‌కు గ్రాండ్‌గా వెల్‌కం చెబుతున్నారు. ఏ కలెక్షన్ అయినా హాయిగా వేసుకునే సీజన్ వచ్చేసిందని సంబరపడిపోతున్నారు.

ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవుతున్న మగువలు వింటర్ సీజన్‌కు గ్రాండ్‌గా వెల్‌కం చెబుతున్నారు. ఏ కలెక్షన్ అయినా హాయిగా వేసుకునే సీజన్ వచ్చేసిందని సంబరపడిపోతున్నారు. మార్కెట్‌లో ఉన్న అన్ని కలెక్షన్స్‌ను తనివితీరా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా యువతుల ఆదరణ పొందుతున్న కలెక్షన్ లిస్ట్‌లో క్రాప్ టాప్స్ చేరిపోయింది. ఈతరం అమ్మాయిలకు పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతున్న ఈ నయాట్రెండ్ శీతాకాలంలో కలర్‌ఫుల్ కలెక్షన్‌గా నిలిచిపోతోంది.
 
 కళ్ల ముందు ఎన్ని కలెక్షన్స్ ఉన్నా.. కబోర్డ్ నిండా జతల జతల ఫ్యాషన్స్ ఉన్నా.. మగువల డ్రెసింగ్ టేస్ట్‌ను పరిస్థితులు డామినేట్ చేస్తుంటాయి. నిండు వేసవిలో కలర్ ఫుల్ డిజైనింగ్స్ ఎన్ని ఉన్నా ఏం లాభం.. కాటన్ వస్త్రాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. అదే రెయినీ సీజన్‌లో అందమైన డ్రెస్‌లు బీరువా నుంచి తీయడానికి కూడా యువతులు ఇష్టపడరు. వానజల్లు గిల్లితే ఎక్కడ డ్రెస్ పాడవుతుందోననే భయంతో వానాకాలం ఫ్యాషన్స్‌కు కాస్త దూరంగానే ఉంటారు. అదే వింటర్ సీజన్ వచ్చిందంటే మాత్రం.. నయా పోకడలకు తలుపులు తెరుస్తారు. బ్యూటిఫుల్ సీజన్‌ను ఫ్యాషన్ మంత్రం పఠిస్తూ  వెళ్లదీస్తుంటారు.
 
 టాప్ లుక్..
 వింటర్ సీజన్‌లో క్రాప్డ్ టాప్స్‌కు కాలేజ్ గాళ్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. క్రాప్డ్ టాప్‌కు జోడీగా డిఫరెంట్ బాటమ్స్ జతచేస్తున్నారు. టాప్, బాటమ్ మధ్య ఉన్న గ్యాప్ నయా లుక్ ఇవ్వడమే కాకుండా ఎండ వేడిమిని గ్రహించి శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. అందుకే వింటర్ సీజన్‌లో క్రాప్డ్ టాప్‌పై మగువలు మనసుపారేసుకుంటున్నారు. సినీతారలు కూడా బయటకు వెళ్లే సమయాల్లో ఈ కలెక్షన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు.
 
డిఫరెంట్ మోడల్స్..
 టాప్ విషయానికి వస్తే.. నెక్‌లెస్, యూ నెక్, కాలర్డ్ నెక్ ఇలా డిఫరెంట్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. బాటమ్ విషయంలో కొందరు ప్యాంట్స్‌కు ప్రిఫరెన్స్ ఇస్తే.. మరికొందరు స్కర్ట్స్ వేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. నగరంలోని దాదాపు అన్ని కలెక్షన్ సెంటర్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి.
 - సిద్ధాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement