ఫైనల్లీ.. తన క్రష్‌ ఎవరో బయటపెట్టిన రష్మిక! | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: రష్మిక ధరించిన ఈ చీర ధరెంతో తెలుసా?

Published Tue, Dec 12 2023 3:31 PM

Rashmika Mandanna Stunning In Arpita Mehta Pink Saree See Details - Sakshi

నేషనల్‌ క్రష్‌ రష్మికా మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. యానిమల్‌ మూవీతో రీసెంట్‌గా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటీని దక్కించుకున్న రష్మిక.. స్టార్ హీరోలకి మించిన ఫాలోయింగ్‌తో సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్‌ అవుతూ ఉంటుంది. వరుస హిట్స్‌తో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ దక్కించుకుంది.

అటు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తెగ బిజీగా మారిపోయిందీ బ్యూటీ. ఇక రష్మిక అండే పడి చచ్చే అభిమానులు ఎంతో మంది ఉంటారు. మరి రష్మిక క్రష్‌ ఎవరో తెలుసా? ఈమధ్యే తన క్రష్‌ని బయటపెట్టింది రష్మిక. సాంప్రదాయ చీరకట్టు అంటే తనకెంతో ఇష్టమని, ఫ్యాన్స్‌ ఆ ఇష్టాన్ని మరింత పెంచేశారు అంటూ రీసెంట్‌గానే చెప్పుకొచ్చింది.

ఇక యానిమల్‌ ప్రమోషన్స్‌లోనూ దాదాపు చీరకట్టులోనే కనిపించింది ఈ బ్యూటీ. సాంప్రదాయంగా కనిపిస్తూనే ఫ్యాషన్‌ ట్రెండ్‌ను సెట్‌ చేయడంలో తగ్గేదేలే అంటుంది రష్మిక. ఇక తన దుస్తుల్లో స్ట్టన్నింగ్‌గా కంటే కంఫర్ట్‌గా ఉండటాన్నే ఇష్టపడతాను. అందుకే కంఫర్ట్‌గా ఉండే ఔట్‌ఫిట్సే నా ఫ్యాషన్‌ స్టయిల్‌ అంటూ రివీల్‌ చేసింది. తాజాగా ప్రమోషన్స్‌లో గులాబీ రంగు చీరలో తళుక్కుమంది ఈ బ్యూటీ. ప్రముఖ డిజైనర్‌ అర్పితా మెహతా డిజైన్‌ చేసిన ఈ చీర ధర అక్షరాలు రూ. 1,90,000లుగా ఉంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement