జియోనీ నుంచి ఎఫ్103 ప్రో | Gionee F103 Pro With 4G VoLTE Support Launched at Rs. 11999 | Sakshi
Sakshi News home page

జియోనీ నుంచి ఎఫ్103 ప్రో

Jul 13 2016 1:20 AM | Updated on Oct 1 2018 1:16 PM

జియోనీ నుంచి ఎఫ్103 ప్రో - Sakshi

జియోనీ నుంచి ఎఫ్103 ప్రో

మొబైల్స్ తయారీలో ఉన్న జియోనీ తాజాగా ఫ్యాషన్ సిరీస్‌లో ఎఫ్103 ప్రో పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మొబైల్స్ తయారీలో ఉన్న జియోనీ తాజాగా ఫ్యాషన్ సిరీస్‌లో ఎఫ్103 ప్రో పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ధర రూ.11,999. గతేడాది ప్రవేశపెట్టిన ఎఫ్103కు మరిన్ని ఫీచర్లు జోడించి ప్రో మోడల్‌ను రూపొందించారు. 5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3 గిగాహెట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీతో తయారు చేశారు. ఆటోఫోకస్ లెడ్ ఫ్లాష్‌తో 13 ఎంపీ కెమెరా, ఫ్లాష్‌తో 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరిచారు. 0.1 సెకనులోపే ఫోకస్ చేయవచ్చని, సెల్ఫీలు మరింత అందంగా కనపడేలా ఫిల్టర్లు వాడినట్టు కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్, 2,400 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్ ఇతర ఫీచర్లు. 2.5డీ గ్లాస్ రక్షణ ఉంది. వాయిస్ ఓవర్ ఎల్‌టీఈని సపోర్ట్ చేస్తుంది. 128 జీబీ వరకు మెమరీని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement