గాడీని లాగేసిన దాడీ | Kapil Gehlot record to he's Beard in Guinness Book | Sakshi
Sakshi News home page

గాడీని లాగేసిన దాడీ

Mar 30 2016 12:22 AM | Updated on Oct 1 2018 1:16 PM

గాడీని లాగేసిన దాడీ - Sakshi

గాడీని లాగేసిన దాడీ

చాలామంది దాడీవాలాలు.. అదేనండీ గడ్డంరాయుళ్లు రకరకాల కారణాల వల్ల గడ్డాలను పెంచుకుంటూ ఉంటారు.

   తిక్క  లెక్క
చాలామంది దాడీవాలాలు.. అదేనండీ గడ్డంరాయుళ్లు రకరకాల కారణాల వల్ల గడ్డాలను పెంచుకుంటూ ఉంటారు. మేధావుల్లా కనిపించడానికి కొందరు, తీరికలేక ఇంకొందరు, బద్దకం వల్ల మరికొందరు... కొంతమందికి గడ్డం ఒక ఫ్యాషన్ సింబల్. మరీ అపురూపంగా గడ్డాన్ని సంరక్షించుకుంటూ ఉంటారు. గడ్డంలోని ఒక్క వెంట్రుకకు నష్టం కలిగినా విలవిల్లాడిపోతారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న దాడీవాలా మాత్రం అలాంటి బాపతేం కాదు. ఎలాంటి చాలెంజ్‌నైనా గడ్డం దువ్వి మరీ సవాలు చేసి, సత్తా నిరూపించుకోవడం అంటే ఇతడికి మాచెడ్డ సరదా. అలాంటి సరదాతోనే టాటా ఇండికా కారును గడ్డంతో లాగిపడేశాడు. ఈ దాడివాలా పేరు కపిల్ గెహ్లాట్. పక్కా రాజస్థానీ. జోధ్‌పూర్‌లో ఉంటాడు. గడ్డంతో అతి బరువైన వాహనం లాగినందుకు గిన్నెస్‌బుక్‌లోకి ఎక్కాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement