నిస్సాన్‌ మైక్రాలో ఫ్యాషన్‌ ఎడిషన్‌ | Fashion Edition in Nissan Micra | Sakshi
Sakshi News home page

నిస్సాన్‌ మైక్రాలో ఫ్యాషన్‌ ఎడిషన్‌

Sep 13 2017 12:24 AM | Updated on Oct 1 2018 1:16 PM

నిస్సాన్‌ మైక్రాలో ఫ్యాషన్‌ ఎడిషన్‌ - Sakshi

నిస్సాన్‌ మైక్రాలో ఫ్యాషన్‌ ఎడిషన్‌

ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్‌ ఇండియా’ తాజా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ‘మైక్రా’లో ఫ్యాషన్‌ ఎడిషన్‌ను తీసుకొచ్చింది.

గుర్గావ్‌: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్‌ ఇండియా’ తాజా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ‘మైక్రా’లో ఫ్యాషన్‌ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం యునైటెడ్‌ కలర్స్‌ ఆఫ్‌ బెనెటెన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఢిల్లీలో దీని ఎక్స్‌ షోరూమ్‌ ప్రారంభ ధర రూ.6.09 లక్షలు. మైక్రా ఫ్యాషన్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌లో మెకానికల్‌గా మార్పులేవీ లేకున్నా పలు కాస్మొటిక్‌ అప్‌గ్రేడ్స్‌ (ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌) ఉన్నట్లు కంపెనీ తెలిపింది.  కొత్త మైక్రా ప్రధానంగా ఫ్యాషన్‌ బ్లాక్, ఫ్యాషన్‌ ఆరంజ్‌ రంగుల్లో  లభ్యంకానుంది.

Advertisement
 
Advertisement
Advertisement