పెరిగిన నిస్సాన్ గ్రావిటీ ధర: కొత్త రేటు ఇదే.. | Nissan Gravite MPV Price Hiked In India | Sakshi
Sakshi News home page

పెరిగిన నిస్సాన్ గ్రావిటీ ధర: కొత్త రేటు ఇదే..

Jun 9 2026 1:18 AM | Updated on Jun 9 2026 1:18 AM

Nissan Gravite MPV Price Hiked In India

నిస్సాన్ కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేసిన ఏడు సీట్ల ఎంపీవీ 'గ్రావిటీ' ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. లాంచ్ అయిన కొన్ని నెలల్లోనే కంపెనీ తీసుకున్న నిర్ణయం కొనుగోలుదారులపై ప్రభావం చూపనుంది.

నిస్సాన్ గ్రావిటీ లాంచ్ అయినప్పుడు రూ. 5.65 లక్షల ఎక్స్ షోరూమ్ ధర వద్ద అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ధరలు కొంతకాలం వరకు మాత్రమే ఉంటాయని కంపెనీ లాంచ్ సమయంలోనే వెల్లడించింది. కాబట్టి సంస్థ ఇచ్చిన ప్రత్యేక లాంచ్ ఆఫర్ ఇప్పుడు ముగియడంతో కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.

ధర పెరుగుదల తర్వాత నిస్సాన్ గ్రావిటీ ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు రూ.5.73 లక్షల నుంచి రూ.9.08 లక్షల వరకు ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి ధరలు భిన్నంగా ఉంటాయి. కొన్ని వేరియంట్ల ధరలు రూ. 8,000 మాత్రమే పెరిగింది. మరికొన్ని వేరియంట్ల ధరలు గరిష్టంగా రూ.18,000 వరకు పెరిగింది.

డిజైన్ పరంగా నిస్సాన్‌ గ్రావైట్‌.. రెనాల్ట్‌ ట్రైబర్‌ ప్రాథమిక సిల్హౌట్‌ను కొనసాగిస్తుంది. అయితే నిస్సాన్‌ కొన్ని ప్రత్యేక స్టైలింగ్ ఎలిమెంట్స్ జోడించింది. ముందు భాగంలో హనీకాంబ్ ప్యాటర్న్‌తో కూడిన బోల్డ్ గ్రిల్, బోనెట్‌పై ‘GRAVITE’ లెటరింగ్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. స్లిమ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌ క్రోమ్ స్ట్రిప్‌తో కనెక్ట్ చేయటం వలన ఫ్రంట్ లుక్ మరింత ఆధునికంగా కనిపిస్తుంది.

సైడ్ ప్రొఫైల్‌లో రెనాల్ట్‌ ట్రైబర్‌ పోలిక స్పష్టంగా కనిపిస్తుంది. 15-అంగుళాల స్టైలిష్ స్టీల్ వీల్స్, ఎత్తైన రూఫ్‌లైన్, ఉప్రైట్ స్టాన్స్ వాహనానికి ప్రాక్టికల్, స్పేసియస్ లుక్ ఇస్తాయి. వెనుక భాగంలో ర్యాప్-అరౌండ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ క్రోమ్ స్ట్రిప్‌తో కలిపి అమర్చారు. బంపర్‌పై C-షేప్ సిల్వర్ యాక్సెంట్స్ ముందుభాగానికి అనుసరణగా ఉన్నాయి.

ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ బ్లాక్-బేజ్ థీమ్ ఉపయోగించారు. డాష్‌బోర్డ్ డిజైన్ పాత ట్రైబర్‌ మోడల్‌ను గుర్తు చేస్తుంది. మధ్యలో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, దాని కింద మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ కోసం మూడు రొటరీ నాబ్స్ అమర్చారు. మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, 7-ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కలిపి సరళమైన, ఉపయోగకరమైన సెటప్‌ను అందిస్తున్నాయి.

గ్రావైట్‌లో లభించే ముఖ్య ఫీచర్లు 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ (వైర్‌లెస్ యాపిల్‌ కార్‌ప్లే & ఆండ్రాయిడ్‌ ఆటో), 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, మాన్యువల్ ఏసీ (రియర్ వెంట్స్‌తో), కీ-లెస్ ఎంట్రీ & పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్. ఇక సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్ (స్టాండర్డ్), ఏబీఎస్‌ కూడిన ఈబీడీ,  ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ పార్కింగ్ సెన్సర్లు & కెమెరా, టీపీఎంఎస్‌ ఉన్నాయి.

గ్రావైట్‌లో 1-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందిస్తున్నారు. ఇది 72 పీఎస్‌ పవర్, 96 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ MT / 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఇవ్వగా.. ఇంధన సామర్థ్యం 19.3 kmpl (MT), 19.6 kmpl (AMT) వరకు ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement