ఎక్కువ మైలేజ్ కోసం ఒక్క కిట్: రూ.83 వేలతో.. | Nissan Magnite Gets Affordable CNG Retrofit Option With 3 Year Warranty, Priced At ₹82,999 | Sakshi
Sakshi News home page

ఎక్కువ మైలేజ్ కోసం ఒక్క కిట్: రూ.83 వేలతో..

May 4 2026 5:01 PM | Updated on May 4 2026 5:22 PM

Nissan GRAVITE CNG Debuts Know The Details

నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (NMIPL) ఆల్ న్యూ నిస్సాన్ గ్రావైట్ కోసం.. ప్రభుత్వ ఆమోదం పొందిన సీఎన్‌జీ రిట్రోఫిట్ కిట్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 82,999. ఇది దేశంలోని 16 రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుంది.

ఈ సీఎన్‌జీ కిట్‌ను మోటోజెన్ తయారు చేసి.. నాణ్యతను కూడా నిర్ధారించింది. వినియోగదారులు ఈ కిట్‌ను నిస్సాన్ అధికారిక డీలర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ కిట్‌పై 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ కూడా లభిస్తుంది.

సీఎన్‌జీ రిట్రోఫిట్ కిట్‌లో రెండు 25 లీటర్ సిలిండర్లు ఉంటాయి. కాబట్టి దీనిని కారులో ఫిక్స్ చేసినప్పుడు కూడా అదే స్పేస్ ఉంటుంది. మూడో వరుస సీటింగ్‌లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. తక్కువ ఖర్చుతో.. కొంత ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారు ఈ కిట్ ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: విజయ్ కార్ కలెక్షన్: లెక్సస్ నుంచి స్విఫ్ట్ వరకు..

Advertisement
 
Advertisement
Advertisement