విజయ్ కార్ కలెక్షన్: లెక్సస్ నుంచి స్విఫ్ట్ వరకు.. | Actor Vijay Garage Holds Some Iconic Cars Maruti Swift To BMW i7 | Sakshi
Sakshi News home page

విజయ్ కార్ కలెక్షన్: లెక్సస్ నుంచి స్విఫ్ట్ వరకు..

May 4 2026 3:16 PM | Updated on May 4 2026 3:37 PM

Actor Vijay Garage Holds Some Iconic Cars Maruti Swift To BMW i7

నటుడుగా, రాజకీయ నాయకుడుగా మాత్రమే తెలిసిన విజయ్.. ఆటోమొబైల్ ఔత్సాహికుడు కూడా. ఈ కారణంగా ఆయన గ్యారేజిలో ఖరీదైన అన్యదేశ్య కార్లు, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి చిన్న కారు కూడా ఉంది. ఈ కథనంలో విజయ్ కాల్ కలెక్షన్ గురించి వివరంగా తెలుసుకుందాం.

లెక్సస్ ఎల్ఏం 350హెచ్
విజయ్ ఉపయోగించే కార్ల జాబితాలో లెక్సస్ ఎల్ఏం 350హెచ్ ఒకటి. దీని ధర సుమారు రూ.2.20 కోట్లు. మంచి డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు 2.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది. 48 అంగుళాల డిస్‌ప్లే, అల్ట్రా-ప్రీమియం సీటింగ్ వంటి ఫీచర్ల కారణంగా ఇదొక ప్రైవేట్ లాంజ్‌ మాదిరిగా అనిపిస్తుంది.

బీఎండబ్ల్యూ 5 సిరీస్
బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 5 సిరీస్ కూడా విజయ్ గ్యారేజిలో ఉంది. రూ.74.80 లక్షల ధర వద్ద లభించే ఈ కారు 2.0 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. కర్వ్డ్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, అత్యుత్తమ సౌండ్ సిస్టమ్‌తో సహా ప్రీమియం ఇంటీరియర్‌ ఇందులో చూడవచ్చు. ఇది రోజువారీ వినియోగం కోసం ఉపయోగపడే లగ్జరీ సెడాన్.

బీఎండబ్ల్యూ ఐ7
విజయ్ గ్యారేజిలోని ఎలక్ట్రిక్ సెడాన్ బీఎండబ్ల్యూ ఐ7. దీని ధర రూ.2.5 కోట్లు. ఇది 449 హార్స్ పవర్ అందిస్తుంది. థియేటర్ స్క్రీన్, యాంబియంట్ లైటింగ్ వంటివి ఈ కారులో ఉన్నాయి. ఎక్కువమంది సెలబ్రిటీలకు ఇష్టమైన కార్ల జాబితాలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.

టయోటా వెల్‌ఫైర్‌
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ టయోటా వెల్‌ఫైర్‌ కారును ఎంచుకున్నట్లు సమాచారం. సుమారు రూ. 1.19 కోట్ల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారును ఎక్కువ మంది సెలబ్రిటీలు, రాజకీయంగా నాయకులు ఉపయోగిస్తున్నారు. సౌకర్యవంతమైన సీట్లు, 2.5-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉండటం వల్ల ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్
టీవీకే అధినేత విజయ్ వద్ద మారుతి స్విఫ్ట్ కూడా ఉంది. ఎన్నికల సమయంలో దీనిని ఉపయోగించినట్లు సమాచారం. ఈ కారు సరసమైనది మాత్రమే కాదు, ఆచరణాత్మకమైనది.. భారతదేశంలో అత్యంత ఇష్టపడే హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో నడిచే ఈ కారు రోజువారీ వినియోగానికి ఉపయోగకరంగా ఉంటుంది.

రోల్స్ రాయ్స్ ఘోస్ట్
విజయ్ గతంలో రోల్స్-రాయ్స్ ఘోస్ట్ సిరీస్ I కారును కలిగి ఉండేవారు, దానిని విక్రయించినట్లు సమాచారం. ఈ లగ్జరీ సెడాన్‌లో 6.6 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ ఉండేది. ఇది 563 Bhp పవర్, 780 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, రియర్-వీల్ డ్రైవ్‌తో ఉంటుంది. దీని ధర రూ. 2 కోట్ల ధరకు అందుబాటులో ఉండేది.

Advertisement
 
Advertisement
Advertisement