'సింగర్ కాకుంటే ఫ్యాషన్ స్టైలిస్ట్ అయ్యేదాన్ని' | Katy Perry would have been a fashion stylist if not singer | Sakshi
Sakshi News home page

'సింగర్ కాకుంటే ఫ్యాషన్ స్టైలిస్ట్ అయ్యేదాన్ని'

Dec 22 2015 9:32 AM | Updated on Oct 1 2018 1:16 PM

'సింగర్ కాకుంటే ఫ్యాషన్ స్టైలిస్ట్ అయ్యేదాన్ని' - Sakshi

'సింగర్ కాకుంటే ఫ్యాషన్ స్టైలిస్ట్ అయ్యేదాన్ని'

తాను పాప్ గాయని కాకుంటే మంచి ఫ్యాషన్ సైలిస్ట్ను అయ్యే దాన్నని ప్రముఖ హాలీవుడ్ సింగర్ కాతీ పెర్రీ(31) చెప్పింది.

లాస్ ఎంజెల్స్: తాను పాప్ గాయని కాకుంటే మంచి ఫ్యాషన్ సైలిస్ట్ను అయ్యే దాన్నని ప్రముఖ హాలీవుడ్ సింగర్ కాతీ పెర్రీ(31) చెప్పింది. ఆమెకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టమని ఇప్పటికీ తన దుస్తులు, స్నేహితులవి అప్పుడప్పుడు డిజైన్ చేస్తుంటానని తెలిపింది. తాను పాటలు పాడుతున్నా ఇప్పటికీ ఫ్యాషన్ రంగం చాలా ఇష్టమని, ఏ సమయంలోనైనా అందులోకి దూసుకెళ్లాలని ఉంటుందని చెప్పుకొచ్చింది.

'నాకు ఫ్యాషన్ ఇండస్ట్రీలో పనిచేయాలని ఉండేది. స్టైలిస్ట్ గా ఉండటం అంటే నాకు చాలా ఇష్టం. క్రియేటివిటీని నేను ఎక్కువగా ప్రేమిస్తుంటాను. అందుకే వీటిని నేను నా స్నేహితురాళ్లపై ప్రయోగిస్తుంటాను. అది అందంగా వచ్చినప్పుడు ఎంతో మురిసిపోతుంటాను' అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement