'ఫ్యాషన్' మోసంపై ప్రియాంక ధ్వజం
ఏం జరుగుతోదని ప్రశ్నించిన ప్రియాంకను దుర్భాషలాడటమేకాక బయటికి గెంటేశారు..
హైదరాబాద్: ప్రియాంక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మిలీనియం ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతోంది. 2014-16 ఏడాదికిగానూ కోర్సు ఫీజు కింద మొదటి విడతలో రూ.2.8 లక్షల అడ్మిషన్ ఫీజు, రెండో ఏడాది రూ.15.7 లక్షలతోపాటు హాస్టల్ ఫీజు మరో రూ. 2.4 లక్షలు.. ఇలా ఫీజుల రూపంలోనే భారీ మొత్తాన్ని చెల్లించింది. అయితే మరో సంవత్సరం మిగిలి ఉండగానే కాలేజీ యాజమాన్యం కోర్సును అర్ధాంతరంగా నిలిపేసింది. తల్లిదండ్రులతోకలిసి కాలేజీ యాజమాన్యం దగ్గరకు వెళ్లిన ప్రియాంక.. ఏం జరుగుతోదని ప్రశ్నించింది. సరైన సమాధానం చెప్పకపోగా ఆమను దుర్భాషలాడిన యాజమాన్యం.. ప్రియాంకను, ఆమె తల్లిదండ్రుల్ని బయటికి గెంటేసింది. దీంతో..
నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ప్రియాంక ఇన్ స్టిట్యూట్ మోసంపై ఫిర్యాదుచేసింది. కళాశాల యాజమాన్యం తమను చీటింగ్ చేసిందని, తనతో పాటు చాలా మంది విద్యార్థులు కోర్సు పూర్తికాక భవిష్యత్తును పాడుచేశాయని ప్రియాంక ఆరోపించింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పేరుతో మోసాలకు పాల్పడుతోన్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఐపీసీ సెక్షన్ 406, 420, 506లను అనుసరించి రఫెల్స్ మిలీనియం ఇంటర్నేషనల్ యాజమాన్యంపై కేసు నమోదుచేసకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.