
యుద్ధ విహంగంపై శాంతి సందేశం
దక్షిణాఫ్రికా కళాకారుడు రాల్ఫ్ జిమాన్ సృష్టి
దక్షిణాఫ్రికాకు చెందిన కళాకారుడు రాల్ఫ్ జిమాన్ అయిదేళ్లపాటు 3.5 కోట్ల పూసలు ఉపయోగించి ఒక పాత సోవియట్ మిగ్–21 ఫైటర్ జెట్‌కు కొత్త రూపాన్ని ఇచ్చాడు. యుద్ధ చిహా్నలను కళాఖండాలుగా మార్చే అతని ‘వెపన్స్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్’ శ్రేణిలో ఇది చివరిది, అత్యంత ప్రతిష్టాత్మకమైనది. రాల్ఫ్ జిమాన్‌కు చిన్నప్పటి నుంచే ఆయుధాలతో భయంకరమైన అనుభవాలున్నాయి.
1970లలో, జోహన్నెస్‌బర్గ్‌లో 13 లేదా 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, అతన్ని ఓ వ్యక్తి .45 మాగ్నమ్ తుపాకీతో బెదిరించాడు. కానీ తనకు 50 ఏళ్ల వయసు వచ్చేసరికి దాదాపు 15 నుంచి 20 సార్లు తుపాకీ గురి పెట్టినట్లు జిమాన్ గుర్తు చేసుకున్నాడు. ఈ భయంకరమైన అనుభవాల వల్లే ఆయన ‘తుపాకుల వ్యతిరేకి’గా మారారు.
ప్రస్తుతం లాస్ ఏంజిలెస్‌లో ఉంటున్న జిమాన్, వృత్తిరీత్యా కమర్షియల్ ఫొటోగ్రాఫర్, ఫిల్మ్‌మేకర్. దశాబ్ద కాలంగా యుద్ధ కళాఖండాలను లక్షలాది చేతితో అల్లిన పూసలు ఉపయోగించి కళాత్మక వస్తువులుగా మార్చ డమే తన పనిగా పెట్టుకున్నాడు. జిమాన్ తన కళాఖండాల ద్వారా దక్షిణాఫ్రికా చరిత్రలో హింసపై ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. అందుకోసం 2019లో అత్యంత పెద్ద సవాలుగా మిగ్–21 విమానాన్ని ఎంచుకున్నాడు.
అయిదేళ్ల కష్టం.. మిగ్–21 కళాఖండం
మొదట, జిమాన్ ఫ్లోరిడాలోని ఒక సైనిక కాంట్రాక్టర్ నుండి మిగ్–21 జెట్‌ను కొనుగోలు చేశాడు. అది ముక్కలుగా, మంచి స్థితిలో లేకపోయినా, కళాఖండంగా మార్చడానికి కచ్చితంగా సరిపోతుందని ఆయన భావించాడు. తొలు త ఆయన బృందం మిగ్ ఇంజన్‌ను తొలగించి విమానాన్ని లాస్ ఏంజిలెస్‌లోని స్టూడియోకు తరలించింది.
జిమాన్ అల్యూమినియం ప్యానెల్‌లపై డిజైన్‌లను రూపొందించి, ఆ పేపర్ షీట్‌లను దక్షిణాఫ్రికాకు పంపాడు. జోహన్నెస్‌బర్గ్, క్వాజులు–నటల్, మ్పుమలంగా ప్రావిన్సుల నుండి వచ్చిన జింబాబ్వేయన్, న్డెబెలె కమ్యూనిటీలకు చెందిన 100 మందికి పైగా కళాకారులు ఈ ప్యానెళ్లను పూసలతో తయారు చేయడం ప్రారంభించారు. ఈ కళాఖండాన్ని పూర్తి చేయడానికి 5 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. 51 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పు ఉన్న ఈ విమానంపై సుమారు 3.5 కోట్ల పూసలు అమర్చినట్లు అంచనా.
విద్యకు నిధి
మిగ్–21 ప్రాజెక్టుకు మద్దతు ఇచి్చన డీటీగ్రుయిల్లె చారిటీ సంస్థ ద్వారా ఈ కళాకారుల పిల్లలు, ఇతర యువత 25 మంది విద్యకు స్పాన్సర్íÙప్ లభిస్తోంది. వీరు వైద్యం, నర్సింగ్, ఫ్యాషన్ డిజైన్ వంటి కోర్సులు చదువుతున్నారు. ఈ అద్భుతమైన మిగ్–21 విమాన కళాఖండాన్ని అమెరికాలో ప్రదర్శన తర్వాత అమ్మకానికి ఉంచుతారు. దీనిద్వారా వచ్చే నిధులు విద్యా కార్యక్రమాలకు, ఉక్రెయిన్‌లో యుద్ధ బాధితులైన పిల్లలకు ఆర్ట్ థెరపీ అందించడానికి వినియోగిస్తారు. యుద్ధ చిహ్నాలను ఆకర్షణీయమైన కళాఖండాలుగా మార్చడం ద్వారా రాల్ఫ్ జిమాన్ కళతో శాంతి, ఆశ సందేశాన్ని ప్రపంచానికి బలంగా తెలియజేస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్