భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్ల ప్రకటన | South Africa Squads Announced For India Limited Overs Series | Sakshi
Sakshi News home page

భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్ల ప్రకటన

Nov 21 2025 6:29 PM | Updated on Nov 22 2025 8:33 AM

South Africa Squads Announced For India Limited Overs Series

త్వరలో భారత్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల (India vs South Africa) కోసం వేర్వేరు సౌతాఫ్రికా జట్లను (South Africa) ఇవాళ (నవంబర్‌ 21) ప్రకటించారు. వన్డే జట్టు కెప్టెన్‌గా టెంబా బవుమా (Temba Bavuma), టీ20 జట్టు కెప్టెన్‌గా ఎయిడెన్‌ మార్క్రమ్‌ (Aiden Markram) ఎంపికయ్యారు. 

గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్‌ పేసర్‌ అన్రిచ్‌ నోర్జే టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా పాకిస్తాన్‌పై అరంగేట్రం చేసిన రూబిన్‌ హెర్మన్‌ వన్డే జట్టులో కొనసాగాడు. క్వింటన్‌ డికాక్‌, ఎయిడెన్ మార్క్రమ్, ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నవంబర్‌ 30, డిసెంబర్‌ 3, 6 తేదీల్లో రాంచీ, రాయ్‌పూర్‌, విశాఖ వేదికలుగా జరుగనుంది. అనంతరం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ డిసెంబర్‌ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్‌, ముల్లాన్‌పూర్‌, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్‌ వేదికగా జరుగనుంది.

భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు:
టెంబా బవుమా (కెప్టెన్‌), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మన్, కేశవ్ మహారాజ్, మార్కో జన్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, ప్రెనెలన్‌ సుబ్రాయన్‌.

భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు:
ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్‌), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, ట్రిస్టన్‌ స్టబ్స్‌.

చదవండి: టీమిండియాతో సెమీఫైనల్‌.. బంగ్లాదేశ్‌ భారీ స్కోర్‌

Advertisement
 
Advertisement
Advertisement