జోహన్నెస్‌బర్గ్: 18వ శతాబ్దపు యోగి, ఆధ్యాత్మిక గురువు నీలకంఠ వర్ణి 42 అడుగుల కాంస్య విగ్రహాన్ని దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ప్రతిíÙ్ఠంచారు. అతిపెద్ద బోచాసన్‌వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (బీఏపీఎస్) ఆలయంలో ఆదివారం ఈ విగ్రహాన్ని ప్రతిíÙ్ఠంచారు. ఇది దక్షిణాఫ్రికాలోనే అత్యంత ఎతై ్తన కాంస్య విగ్రహం. వృక్షాసన భంగిమలో ఉన్న విగ్రహం ఈ ఆలయ భారీ సముదాయం ప్రవేశ ద్వారం వద్ద కొలువై ఉంది.
ఇది కేవలం ఒక మతాన్ని ప్రతిబింబించే విగ్రహం కాదని, స్వీయ క్రమశిక్షణ, పట్టుదల, లక్ష్యం పట్ల ఉన్నత స్పష్టత, సమాజసేవ వంటి నీలకంఠ వర్ణి విలువలకు ప్రతీకని బీఏపీఎస్ ప్రతినిధి హేమాంగ్ దేశాయ్ తెలిపారు. రాగి, ఇత్తడితో తయారు చేసిన 20 టన్నుల బరువున్న ఈ విగ్రహం ఒకే కాలిపై నిలబడి ఉంటుందని, ఇది అసాధారణ ఇంజనీరింగ్ ఘనతకు తార్కాణమని అభివరి్ణంచారు.
అత్యంత సీనియర్ సన్యాసులలో ఒకరైన స్వయంప్రకాశ్ స్వామి, దక్షిణాఫ్రికా ఉప ఆర్థిక మంత్రి అషోర్ సరూపెన్ సమక్షంలో అధికారికంగా విగ్రహాన్ని దక్షిణాఫ్రికాకు అప్పగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయం పక్కనే బీఏపీఎస్ శాఖాహార రెస్టారెంట్ ‘షయోనా’ఏర్పాటు చేశారు. ఇది గ్రేటర్ జోహన్నెస్‌బర్గ్ ప్రాంతంలోని పర్యాటకులకు ఖచి్చతంగా ఉపయోగపడుతుందని హేమాంగ్ అన్నారు.


