ఇదే సరైన సమయం: జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ | G20 Summit Let us weaken the wretched drug terror economy says PM Modi in Johannesburg | Sakshi
Sakshi News home page

ఇదే సరైన సమయం: జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ

Nov 22 2025 6:11 PM | Updated on Nov 22 2025 6:56 PM

G20 Summit Let us weaken the wretched drug terror economy says PM Modi in Johannesburg

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన G20 సమ్మిట్ మొదటి సెషన్‌లో ప్రసంగించారు. ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన మోదీ పర్యావరణ సమతుల్యత, సాంస్కృతికంగా, సామాజికంగా సమ్మిళిత జీవన విధానాలను పరిరక్షించడానికి G20 కింద గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 

సర్వతోముఖ వృద్ధి అనే కలను సాకారం చేసుకోవడానికి కొన్ని కార్యాచరణలను ప్రతిపాదించారు. ప్రపంచ అభివృద్ధి పారామితులను లోతుగా పునరాలోచించాలని పిలుపునిచ్చారు అలాగే మాదక ద్రవ్య-ఉగ్రవాద సంబంధాన్ని ఎదుర్కోవడానికి G20 ఇనీషియేటివ్‌ను, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేయాలని మోదీ ప్రతిపాదించారు.

దేశ అతిపెద్ద ఆర్థిక కేంద్రం  జోహన్నెస్‌బర్గ్‌లో మూడు రోజుల పాటు జరిగే 20వ జీ20 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. తొలిరోజున సమ్మిళిత, స్థిరమైన వృద్ధిపై దృష్టి సారించింది. ఆఫ్రికా మొదటిసారిగా G20 సమ్మిట్‌ను నిర్వహిస్తున్నందున, మన అభివృద్ధి పారామితులను పునఃసమీక్షించడానికి, సమ్మిళిత స్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయమని మోదీ పేర్కొన్నారు. భారతదేశ నాగరికత విలువలు, ముఖ్యంగా సమగ్ర మానవతావాదం  సూత్రం ముందుకు సాగడానికి ఒక మార్గాన్ని అందిస్తుందని తెలిపారు.

 

చదవండి: 17 ఏళ్ల తరువాత ఇండియాకు ఎన్‌ఆర్‌ఐ జంట, వీడియో వైరల్‌

ప్రధాని మోదీ ప్రతిపాదించిన వాటిల్లో మొదటిది G20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీని సృష్టించడం. ఈ విషయంలో భారతదేశానికి గొప్ప చరిత్ర ఉందనీ, ఇది మంచి ఆరోగ్యం, శ్రేయస్సును మరింతగా పెంచడానికి మన సమిష్టి జ్ఞానాన్ని అందించడానికి  దోహదపడుతుందని మోదీ చెప్పారు.  

ఇందుకోసం G20 గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని భారత్‌ ప్రతిపాదిస్తోందన్నారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు మరియు ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో కలిసి పనిచేస్తే బలంగా ఉంటుందని,  ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా మోహరించడానికి సిద్ధంగా ఉన్న తోటి G20 దేశాల నుండి శిక్షణ పొందిన వైద్య నిపుణుల బృందాలను తయారు చేసుకోవడం కీలకమన్నారు.

భారతదేశం మాదకద్రవ్య-ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా సవాళ్లను అధిగమించడానికి, ముఖ్యంగా ఫెంటానిల్ వంటి అత్యంత ప్రమాదకరమైన పదార్థాల వ్యాప్తిని అధిగమించడానికి గాను G20 ఇనీషియేటివ్‌ను ప్రతిపాదించారు. మాదకద్రవ్య-ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థను బలహీనపరుద్దామని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశం ఎల్లప్పుడూ ఆఫ్రికాతో సంఘీభావంగా నిలిచిందనీ, ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత G20 సభ్యునిగా మారడం తమకు గర్వకారణమన్నారు. రాబోయే దశాబ్దంలో ఆఫ్రికాలో పది లక్షల సర్టిఫైడ్ శిక్షకులను సృష్టించడం తమ  సమిష్టి లక్ష్యం  అని మోదీ  పేర్కొన్నారు. 

చదవండి: దాదాపు రెండు దశాబ్దాల జ్ఞాపకం : అసలా విమానం ఉన్నట్టే తెలియదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement