ఎయిరిండియాలో ఒక వింత సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక పాత బోయింగ్ 737-200 కార్గో విమానాన్ని 13 ఏళ్లుగా అసలు అలాంటి ఒక విమానం ఉందన్న విషయాన్నే మర్చిపోయింది. గత వారమే దీన్ని విక్రయించింది. మరి గత దశాబ్దంన్నర కాలంగా పట్టించుకోకుండా వదిలేసిన విమానం గురించి ఎలా తెలిసింది? ఎలా విక్రయించింది?
“పాత విమానాలను అలా వదిలేయడం అసాధారణం కానప్పటికీ,ఇటీవలి దాకా ఇలాంటి విమానం ఒకటి ఉందీ అనేది తెలియదు! కాలక్రమేణా, అది జ్ఞాపకంగా మిగిలిపోయింది. కోల్‌కతా విమానాశ్రయంలోని రిమోట్ పార్కింగ్ బేలో ఉన్న దీని గురించి చెప్పి, దానిని తీసివేయమని అడిగినప్పుడు మాత్రమే వెలుగులోకి వచ్చింది! నిజంగా అది మనదేనా ధృవీకరించిన తర్వాత, విక్రయించాం అని ఎయిరిఇండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ సిబ్బందికి పంపిన సందేశంలో చెప్పారు. గత 13 ఏళ్ల కోల్‌కతా విమానాశ్రయంలోని రిమోట్ పార్కింగ్ బేలో అలా పడి ఉంది. గత 13 ఏళ్లకు పైగా దీని ఉనికిని మరచిపోయింది సంస్థ ప్రైవేటీకరణ తర్వాత దాదాపు మూడు సంవత్సరాల తర్వస్థీ కార్గో విమానం బయటపడింది, అధికారులు టాటా గ్రూప్ కంపెనీని కోల్‌కతా విమానాశ్రయ ప్రాంగణం నుండి దానిని తీసివేయమని కోరారు. దీంతో ఈ విమానాన్ని సేల్ చేసింది ఎయిరిండియా.
చదవండి: 17 ఏళ్ల తరువాత ఇండియాకు ఎన్‌ఆర్‌ఐ జంట, వీడియో వైరల్
కాగా 2012లో తన కార్గో వ్యాపారాన్ని మూసివేసింది ఎయిరిండియా. గతంలో బోయింగ్ 737-200 కార్గో విమానాలను నిర్వహించింది. వ్యాపారాన్ని మూసి వేసిన నేపథ్యంలో ప్రస్తుతం కార్గో విమానాలను ఉపయోగించడం లేదు. విమాన ట్రాకింగ్ వెబ్‌సైట్ planspotters.netలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం VT-EHH 43.2 సంవత్సరాల కంటే పాతది మరియు సెప్టెంబర్ 1982లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు డెలివరీ చేయబడింది. ఈ విమానాన్ని ఫిబ్రవరి 1998 లో అలయన్స్ ఎయిర్ లీజుకు తీసుకుంది. జూలై 2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ సరుకు రవాణాకోసం దీన్ని ఉపయోగించారు. రెండు విమానయాన సంస్థల విలీనం తరువాత ఇది ఎయిరిండియాకు వచ్చింది.
ఇదీ చదవండి: రాయల్ వెడ్డింగ్ : గర్ల్‌ఫ్రెండ్‌తో జూ. ట్రంప్ స్టెప్పులు


