breaking news
cargo flight
-
దాదాపు రెండు దశాబ్దాల జ్ఞాపకం : అసలా విమానం ఉన్నట్టే తెలియదు!
ఎయిరిండియాలో ఒక వింత సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక పాత బోయింగ్ 737-200 కార్గో విమానాన్ని 13 ఏళ్లుగా అసలు అలాంటి ఒక విమానం ఉందన్న విషయాన్నే మర్చిపోయింది. గత వారమే దీన్ని విక్రయించింది. మరి గత దశాబ్దంన్నర కాలంగా పట్టించుకోకుండా వదిలేసిన విమానం గురించి ఎలా తెలిసింది? ఎలా విక్రయించింది?“పాత విమానాలను అలా వదిలేయడం అసాధారణం కానప్పటికీ,ఇటీవలి దాకా ఇలాంటి విమానం ఒకటి ఉందీ అనేది తెలియదు! కాలక్రమేణా, అది జ్ఞాపకంగా మిగిలిపోయింది. కోల్‌కతా విమానాశ్రయంలోని రిమోట్ పార్కింగ్ బేలో ఉన్న దీని గురించి చెప్పి, దానిని తీసివేయమని అడిగినప్పుడు మాత్రమే వెలుగులోకి వచ్చింది! నిజంగా అది మనదేనా ధృవీకరించిన తర్వాత, విక్రయించాం అని ఎయిరిఇండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ సిబ్బందికి పంపిన సందేశంలో చెప్పారు. గత 13 ఏళ్ల కోల్‌కతా విమానాశ్రయంలోని రిమోట్ పార్కింగ్ బేలో అలా పడి ఉంది. గత 13 ఏళ్లకు పైగా దీని ఉనికిని మరచిపోయింది సంస్థ ప్రైవేటీకరణ తర్వాత దాదాపు మూడు సంవత్సరాల తర్వస్థీ కార్గో విమానం బయటపడింది, అధికారులు టాటా గ్రూప్ కంపెనీని కోల్‌కతా విమానాశ్రయ ప్రాంగణం నుండి దానిని తీసివేయమని కోరారు. దీంతో ఈ విమానాన్ని సేల్ చేసింది ఎయిరిండియా.చదవండి: 17 ఏళ్ల తరువాత ఇండియాకు ఎన్ఆర్ఐ జంట, వీడియో వైరల్ కాగా 2012లో తన కార్గో వ్యాపారాన్ని మూసివేసింది ఎయిరిండియా. గతంలో బోయింగ్ 737-200 కార్గో విమానాలను నిర్వహించింది. వ్యాపారాన్ని మూసి వేసిన నేపథ్యంలో ప్రస్తుతం కార్గో విమానాలను ఉపయోగించడం లేదు. విమాన ట్రాకింగ్ వెబ్సైట్ planspotters.netలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం VT-EHH 43.2 సంవత్సరాల కంటే పాతది మరియు సెప్టెంబర్ 1982లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు డెలివరీ చేయబడింది. ఈ విమానాన్ని ఫిబ్రవరి 1998 లో అలయన్స్ ఎయిర్ లీజుకు తీసుకుంది. జూలై 2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ సరుకు రవాణాకోసం దీన్ని ఉపయోగించారు. రెండు విమానయాన సంస్థల విలీనం తరువాత ఇది ఎయిరిండియాకు వచ్చింది.ఇదీ చదవండి: రాయల్ వెడ్డింగ్ : గర్ల్‌ఫ్రెండ్‌తో జూ. ట్రంప్ స్టెప్పులు -
విమాన ప్రమాదం.. అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లి..
హాంకాంగ్: హాంకాంగ్‌లో ఘోర విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Hong Kong Airport) కార్గో విమానం రన్‌వేపై అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది చనిపోయినట్టు సమాచారం.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హాంకాంగ్‌లో అంతర్జాతీయ విమానాశ్రయంలో(cargo Flight Accident) సోమవారం తెల్లవారుజామున 3.50 సమయంలో బోయింగ్ 747-481 మోడల్‌కి చెందిన కార్గో విమానం ప్రమాదానికి గురైంది. దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరుకొన్న ఎమిరేట్స్ విమానం అత్యంత రద్దీగా ఉండే నార్త్ రన్‌వేపై దిగి అదుపుతప్పి ఓ వాహనాన్ని ఢీకొని సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బంది మృతి చెందారు. విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.New footage of the Air ACT 747 that ran off the runway at Hong Kong International Airport this morning. pic.twitter.com/3tHlBwruwu— OSINTtechnical (@Osinttechnical) October 20, 2025ప్రమాదం కారణంగా విమానం పాక్షికంగా నీటిలో మునిగిపోయింది. బోయింగ్ 737 శ్రేణికి చెందిన EK9788 విమానాన్ని ఎమిరేట్స్ నుంచి తుర్కియే సంస్థ ఏసీటీ ఎయిర్ లైన్స్ లీజుకు తీసుకొని నడుపుతోంది. ప్రమాదం జరిగిన రన్‌వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయితే విమానాశ్రయంలోని మిగతా రెండు రన్వేలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.‼️Sortie de piste d’un Boeing 747 Cargo à Hong Kong🔸L’appareil de la compagnie turque Air Act opérait un vol depuis Dubaï pour le compte d’Emirates🔸Le Boeing était à l’atterrissage piste 07L, quand il a fait une sortie latérale de piste et a terminé sa course dans la mer… pic.twitter.com/1LRFBnzv24— Aero Gazette ✈️ (@AeroGazette) October 20, 2025 -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్, సాక్షి: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఓ కార్గో విమానానికి ల్యాండింగ్ సమస్య తలెత్తడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే పైలట్ అప్రమత్తతో విమానం సేఫ్‌గా దిగగా.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ విమానాలకు అనుమతులు కాసేపు నిలిపివేశారు.చెన్నై నుండి హైదరాబాద్‌కు వస్తున్న బ్లూడార్ట్ కార్గో విమానానికి ల్యాండింగ్ గేర్(Landing Gear) సమస్య తలెత్తింది. పైలట్ అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్‌కు ఎయిర్‌పోర్టు అధికారుల అనుమతి కోరాడు. వెంటనే అధికారులు స్పందించి ఇతర అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్, టేకాఫ్(Landing Take Off)ను నిలిపివేశారు. దీంతో.. ఎటువంటి అవాంతరాలు లేకుండా, పైలట్ విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ చేయగలిగారు. ఆ విమానంలో ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో(Shamshabad Airport) కాసేపు భయాందోళన కలిగించింది. విమానం ల్యాండింగ్ గేర్ సమస్యను సాంకేతిక నిపుణులు పరిశీలిస్తున్నారు.విదేశీ కరెన్సీ పట్టివేతహైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని నిఘా వర్గాలు పట్టుకున్నాయి. నగరం నుంచి దుబాయ్ వెళ్తున్న అమీర్ అహ్మద్ అనే ప్రయాణికుడి వద్ద అనుమానాస్పద రీతిలో 22.75 లక్షల విలువైన విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ప్రకటించారు. అతనిని అదుపులోకి తీసుని విచారిస్తుట్లు తెలిపారు. -
బెలూగా.. భలేగా..
శంషాబాద్: ఆకాశ తిమింగలంగా పేరొందిన ప్రపంచంలోని అతిపెద్ద అయింది. ఈ నెల 27న ఫ్రాన్స్‌లోని టూలూజ్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లేందుకు బయలుదేరిన ఈ విమానం 28న ఫ్రాన్స్‌లోని మార్సెల్లే, 29న ఈజిప్టు రాజధాని కైరో, కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్ బెలూగా (ఏ300–608ఎస్టీ3) మరోసారి భాగ్యనగరాన్ని పలకరించింది. గురువారం అర్ధరాత్రి 12:23 గంటలకు ముచ్చటగా మూడోసారి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ ఒమన్ రాజధాని మస్కట్ మీదుగా ప్రయాణించి ఇంధనం నింపుకోవడంతోపాటు సిబ్బంది విశ్రాంతి కోసం హైదరాబాద్ చేరుకుంది. దాదాపు 15 గంటల హాల్టింగ్ అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు థాయ్‌లాండ్ బయలుదేరింది. బెలూగా–3 విమానం 2022 డిసెంబర్లో తొలిసారి, 2023 ఆగస్టులో రెండోసారి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండైంది.ప్రత్యేకతలు ఇవీ..రష్యన్ భాషలో బెలూగా అంటే తెల్ల తిమింగలం అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఈ రకం విమానాలు కేవలం ఐదే ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన అంటోనోవ్–225కన్నా ఇది 20 మీటర్లు చిన్నగా ఉంటుంది. సాధారణ కార్గో విమానాల్లోతరలించలేని భారీ సామగ్రిని ప్రత్యేకించి విమానాల విడిభాగాలు, రక్షణ రంగ పరికరాలను ఈ విమానంలో తరలిస్తారు. దీని పొడవు పొడవు 56.15 మీటర్లు, ఎత్తు 17.24 మీటర్లు, కార్గో మోసుకెళ్లే సామర్థ్యం 47 టన్నులు. -
స్పైస్‌జెట్ రుణ పునర్వ్యవస్థీకరణ
ముంబై: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ రుణ పునర్వ్యవస్థీకరణకు తెరతీసింది. రుణాలను ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా కార్లయిల్ ఏవియేషన్ పార్టనర్స్‌కు కంపెనీలో 7.5 శాతం ఈక్విటీ వాటాను కేటాయించనుంది. కార్గో బిజినెస్(స్పైస్‌ఎక్స్‌ప్రెస్)లోనూ కార్లయిల్ ఏవియేషన్ వాటాను సొంతం చేసుకోనుంది. అంతేకాకుండా అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్)కు సెక్యూరిటీల జారీ ద్వారా మరో రూ. 2,500 కోట్లు సమకూర్చుకోనుంది. విమాన లీజింగ్ కంపెనీ కార్లయిల్ ఏవియేషన్‌కు చెల్లించవలసిన 10 కోట్ల డాలర్ల(సుమారు రూ. 830 కోట్లు)కుపైగా రుణాలను ఈక్విటీతోపాటు తప్పనిసరిగా మార్పిడికి లోనయ్యే డిబెంచర్లు(సీసీడీలు)గా మార్పిడి చేయనుంది. ఇందుకు స్పైస్‌జెట్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. షేరుకి రూ. 48 లేదా సెబీ నిర్ధారిత ధరలో 7.5 శాతం వాటాను కార్లయిల్(2.95 కోట్ల డాలర్లు)కు స్పైస్‌జెట్ కేటాయించనుంది. కార్గో బిజినెస్‌కు చెందిన సీసీడీలను(6.55 కోట్ల డాలర్లు) కార్లయిల్‌కు బదిలీ చేయనుంది. వెరసి 10 కోట్ల డాలర్ల రుణ భారాన్ని తగ్గించుకోనుంది. -
స్పైస్‌జెట్‌కు ఏమైంది?.. రాడార్ సమస్యతో వెనక్కి వచ్చిన కార్గో విమానం
కోల్‌కతా: గతకొన్ని రోజులుగా విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న ఘటనలతో.. స్పైస్‌జెట్‌కు ఏమైంది అనే ప్రశ్నలు ప్రతిఒక్కరిలోనూ లేవనెత్తుతున్నాయి. గడిచిన మూడు వారాల వ్యవధిలో 8 స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు వెలుగు చూశాయి. ఒక్క మంగళవారం రోజే రెండు విమానల్లో భద్రత సమస్యలు ఏర్పడి అత్యవసర ల్యాండింగ్ చేయగా.. తాజాగా కల్‌కతా నుంచి చైనా బయలుదేరిన స్పైస్‌జెట్ కార్గో విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. స్పైస్‌జెట్ బోయింగ్ 737 కార్గో విమానం జూలై అయిదో తేదీన కోల్‌కతా నుంచి ఛాంగ్‌క్వింగ్ వెళ్లాల్సి ఉంది. కోల్‌కతా నుంచి టేకాఫ్ అయిన తరువాత విమనాంలో వాతావరణ రాడార్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి కోల్‌కతాకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కతాలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. చదవండి: ముంబైలో మరో స్పైస్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. గత 17 రోజుల్లో ఏడు ఘటనలు కాగా ఈ ఘటన కంటే ముందు ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని దారి మళ్లించి కరాచి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. స్పైస్‌జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతోనే కరాచికి మళ్లించారు. అంతేగాక గుజరాత్‌లోని కాండ్లా నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగా విండ్‌షీల్డ్ ఔటర్ పేన్ పగలడంతో ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్ తెలిపింది. -
కార్గో ఫ్లైట్ ద్వారా మత్స్య సంపద ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు
-
చైనాకు వెళ్లిన హైదరాబాదీ గుండెపోటుతో..
చైనా నుంచి మృతదేహం తెప్పించండి ప్రైవేట్ వ్యాపారం నిమిత్తం వెళ్లి గుండెపోటుతో మరణించిన నగరవాసి బాలన్ వెల్లా మృతదేహం తెప్పించేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలంటూ వేడుకోలు సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేట్ వ్యాపారం నిమిత్తం చైనాకు వెళ్లి గుండెపోటుతో మరణించిన నగరానికి చెందిన బాలన్ వెల్లా మృతదేహన్ని తెప్పించేందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలని అతని కుటుంబసభ్యులు, బంధువులు కోరుతున్నారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా జెజ్లాంగ్ ప్రావిన్స్‌లోని తైజువాలో ఈ నెల 15న బాలన్ వెల్ల మృతిచెందినట్లు చైనాలోని భారత రాయభార కార్యాలయం అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహన్ని భారత్‌కు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని, అయితే కార్గోలో తీసుకొచ్చేందుకు రూ.7,50,000 ఖర్చవుతుందన్నారు. ఆ ఖర్చును భరించే స్థోమత తమకు లేదని తెలిపారు. ప్రభుత్వం మృతదేహన్ని నగరానికి తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. చైర్ డై, స్టూల్ డై పనులు చేసే బాలన్ వెల్లా కుటుంబం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి బోయిన్‌పల్లిలోని స్వాతినికేతన్ అపార్ట్మెంట్లో ఉంటోంది. ఇటీవల చైర్ డై, స్టూల్ డైకు సంబంధించిన మోల్డ్ కొనుగోలు చేసేందుకు వెళుతున్న ఢిల్లీకి చెందిన వ్యాపారుతో కలిసి బాలన్ వెల్లా ఈ నెల7న చైనా వెళ్లాడు. అక్కడ ఓ హోటల్లో ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించారని, గుండెపోటుతో ఈ నెల 15న మరణించాడని భారత రాయభార అధికారులు ధ్రువీకరించారని తెలిపారు. మృతుడికి భార్య శ్యామల, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


