
హాంకాంగ్: హాంకాంగ్‌లో ఘోర విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Hong Kong Airport) కార్గో విమానం రన్‌వేపై అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది చనిపోయినట్టు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హాంకాంగ్‌లో అంతర్జాతీయ విమానాశ్రయంలో(cargo Flight Accident) సోమవారం తెల్లవారుజామున 3.50 సమయంలో బోయింగ్ 747-481 మోడల్‌కి చెందిన కార్గో విమానం ప్రమాదానికి గురైంది. దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరుకొన్న ఎమిరేట్స్ విమానం అత్యంత రద్దీగా ఉండే నార్త్ రన్‌వేపై దిగి అదుపుతప్పి ఓ వాహనాన్ని ఢీకొని సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బంది మృతి చెందారు. విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
New footage of the Air ACT 747 that ran off the runway at Hong Kong International Airport this morning. pic.twitter.com/3tHlBwruwu
— OSINTtechnical (@Osinttechnical) October 20, 2025
ప్రమాదం కారణంగా విమానం పాక్షికంగా నీటిలో మునిగిపోయింది. బోయింగ్ 737 శ్రేణికి చెందిన EK9788 విమానాన్ని ఎమిరేట్స్ నుంచి తుర్కియే సంస్థ ఏసీటీ ఎయిర్ లైన్స్ లీజుకు తీసుకొని నడుపుతోంది. ప్రమాదం జరిగిన రన్‌వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయితే విమానాశ్రయంలోని మిగతా రెండు రన్‌వేలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

‼️Sortie de piste d’un Boeing 747 Cargo à Hong Kong
🔸L’appareil de la compagnie turque Air Act opérait un vol depuis Dubaï pour le compte d’Emirates
🔸Le Boeing était à l’atterrissage piste 07L, quand il a fait une sortie latérale de piste et a terminé sa course dans la mer… pic.twitter.com/1LRFBnzv24— Aero Gazette ✈️ (@AeroGazette) October 20, 2025