న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే,సిరీస్‌కు సంబంధించి భారత జట్టున ప్రకటించింది బీసీసీఐ. మూడు వన్డేల సిరీస్‌కు సంబంధించి జట్లను ప్రకటించారు. వన్డే జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న వన్డే సిరీస్‌కు గిల్ స్థానంలో రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
మెడ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో ఆ స్థానంలో కెప్టెన్‌గా రాహుల్‌ను నియమించారు. ఇక విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు తిరిగి జట్టులోకి వచ్చారు. రాహుల్‌కు డిప్యూటీగా రిషభ్ పంత్ వ్యవహరిస్తారు.
సఫారీలతో వన్డే సిరీస్‌కు భారత జట్టు
కేఎల్ రాహల్(కెప్టెన్), రిషభ్ పంత్(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, జైశ్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ రాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధ్రువ్ జురెల్


