25 పరుగులతో దక్షిణాఫ్రికా ఓటమి
అండర్–19 వన్డే సిరీస్
బెనోనీ: అండర్–19 వరల్డ్ కప్‌కు ముందు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో మొదలైన వన్డే సిరీస్‌లో భారత యువ జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి వన్డేలో భారత అండర్–19 జట్టు 25 పరుగుల తేడాతో (డక్‌వర్త్ – లూయీస్ ప్రకారం) దక్షిణాఫ్రికా అండర్–19పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. హర్‌వంశ్ పంగాలియా (95 బంతుల్లో 93; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
ఇతర బ్యాటర్లలో ఆర్‌ఎస్ అంబరీశ్ (79 బంతుల్లో 65; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కని‹Ù్క చౌహాన్ (23 బంతుల్లో 32; 3 ఫోర్లు), ఖిలాన్ పటేల్ (12 బంతుల్లో 26; 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. సఫారీ బౌలర్లలో జేజే బాసన్ 4 వికెట్లతో భారత్‌ను పడగొట్టాడు. అనంతరం దక్షిణాఫ్రికా 27.4 ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసింది. జోరిక్ వాన్ షావిక్ (72 బంతుల్లో 60 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయగా, అర్మాన్ మనక్ (59 బంతుల్లో 46; 4 పోర్లు) రాణించాడు.
భారత్ తరఫున దీపేశ్ దేవేంద్రన్ 2 వికెట్లు తీయగా, ఖిలాన్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ దశలో ముందుగా ఉరుములు, మెరుపుల కారణంగా ఆట ఆగిపోయింది. ఆ తర్వాత వర్షం కూడా రావడంతో అంపైర్లు పూర్తిగా మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. ఆట నిలిచిపోయే సమయానికి డక్‌వర్త్ – లూయీస్ నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. అయితే జట్టు లక్ష్యానికి 26 పరుగులు వెనుకబడి ఉండటంతో ఓటమి ఖాయమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజ వేయగా...రెండో వన్డే ఇదే మైదానంలో సోమవారం జరుగుతుంది.


