ఫైసలాబాద్: పాకిస్తాన్‌తో గురువారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 269 పరుగులు చేసింది.
సయీమ్ అయూబ్ (53; 5 ఫోర్లు, 1 సిక్స్), సల్మాన్ ఆఘా (69; 5 ఫోర్లు), నవాజ్ (59; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లు నాండ్రె బర్గర్ 4 వికెట్లు, పీటర్ 3 వికెట్లు తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా 40.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 270 పరుగులు సాధించి గెలిచింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డికాక్ (119 బంతుల్లో 123; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ సెంచరీతో దక్షిణాఫ్రికాను విజయతీరాలకు చేర్చాడు. టోనీ జోర్జి (63 బంతుల్లో 76; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించాడు.


