జీ-20 సదస్సులో మరో వివాదం | G20 Summit South Africa Refuses to Transfer Presidency | Sakshi
Sakshi News home page

జీ-20సదస్సులో మరో వివాదం

Nov 23 2025 7:24 PM | Updated on Nov 23 2025 7:29 PM

G20 Summit South Africa Refuses to Transfer Presidency

దక్షిణాఫ్రికా జోహాన్స్ బర్గ‍్ లో నిర్వహిస్తున్న జీ-2౦ శిఖరాగ్ర సమావేశం ఆదివారం సాయంత్రం ముగిసింది. అయితే ఈ సదస్సు ముగింపులో చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. శిఖరాగ్ర సమావేశం ముగింపులో తదుపరి జీ-20 సదస్సు నిర్వహించే దేశానికిచ్చే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడానికి సౌతాఫ్రికా నిరాకరించింది.

జీ-20 సమావేశం ప్రారంభం నుంచి సౌతాఫ్రికా- అమెరిాకా మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. అమెరికా ఈ సమావేశంలో పాల్గొంటుందని సౌతాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా అనడం దానిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఖండించడం  అంతా తెలిసిందే. అయితే ఈ శిఖరాగ్ర సమావేశం ముగింపు సమయంలో మరో వివాదం చోటు చేసుకుంది.  శిఖరాగ్ర సదస్సు ముగింపులో తదుపరి జీ-20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించే దేశానికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి. కానీ ఆ బాధ్యతలివ్వడానికి సౌతాఫ్రికా నిరాకరించింది.

తమ దేశాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలను అమెరికా అధికారికి అప్పగించబోరని సౌతాఫ్రికా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. అమెరికా జీ-20లో మెంబర్ వారు ఈ శిఖరాగ్ర సదస్సును రిప్రజెంట్ చేయాలంటే ఏవరినైనా సరైన హోదా గల వ్యక్తిని తమ దేశానికి పంపాలన్నారు. వారు దేశాధ్యక్షుడైనా, లేదా మంత్రైనా ప్రభుత్వం చేత నియమించబడిన ప్రత్యేక రాయబారి అయినా కావచ్చు అని ఆయన తెలిపారు. లేకపోతే ఆ బాధ్యతలను ప్రభుత్వ కార్యాలయంలో ఒకే ర్యాంకు గల అధికారులచే మార్పు చేయబడుతుందని స్పష్టం చేశారు.

అయితే సౌతాఫ్రికాలో శ్వేత జాతీయులపై అక్కడి ప్రభుత్వం వేదింపులకు పాల్పడుతోందని ‍అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. అందుకు గాను ఆ దేశంలో జరిగే జీ-౨౦ శిఖరాగ్ర సదస్సులో తమ దేశం పాల్గొనబోదని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో సౌతాఫ్రికా సైతం ఘూటుగానే స్పందించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement