
పాకిస్తాన్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు (Pakistan vs South Africa) ముందు సౌతాఫ్రికాకు (South Africa) భారీ షాక్‌లు తగిలాయి. ఆ జట్టు టీ20 కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (David Miller), కీలక బౌలర్ గెరాల్డ్ కొయెట్జీ (Gerald Coetzee) గాయాల కారణంగా ఈ సిరీస్‌లకు దూరమయ్యారు.
మిల్లర్ కొద్ది రోజుల కిందట ప్రాక్టీస్ చేస్తూ గ్రేడ్-1 హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరికి గురి కాగా.. కొయెట్జీ నబీమియాతో ఇటీవల జరిగిన టీ20 సందర్భంగా కండరాల గాయం బారిన పడ్డాడు. దీంతో ఈ ఇద్దరు పాక్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమయ్యారు.
మిల్లర్ గైర్హాజరీలో టీ20 జట్టు కెప్టెన్‌గా అప్పటికే జట్టులో ఉన్న డొనోవన్ ఫెరీరాను ఎంపిక చేశారు. మిల్లర్ స్థానాన్ని మాథ్యూ బ్రీట్జ్కే భర్తీ చేశారు. కొయెట్జీ స్థానాన్ని టీ20ల్లో టోనీ డి జోర్జితో, వన్డేల్లో ఓట్నీల్ బార్ట్‌మన్‌తో భర్తీ చేశారు. ఈ రెండు మార్పులు మినహా ముందుగా ప్రకటించిన జట్టు యధాతథంగా కొనసాగనుంది.
పాక్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రావల్పిండి వేదికగా.. రెండో టీ20 అక్టోబర్ 31న లాహోర్ వేదికగా.. మూడో టీ20 నవంబర్ 1న అదే లాహోర్ వేదికగా జరుగనున్నాయి.
అనంతరం నవంబర్ 4 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 4, 6, 8 తేదీల్లో ఫైసలాబాద్ వేదికగా మూడు వన్డేలు జరుగనున్నాయి. పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ముందు సౌతాఫ్రికా పాక్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడింది.
ఇవాళే (అక్టోబర్ 23) ముగిసిన ఈ సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. తొలి టెస్ట్‌లో పాకిస్తాన్, రెండో టెస్ట్‌లో పర్యాటక సౌతాఫ్రికా గెలుపొందాయి.
పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: డోనోవన్ ఫెరీరా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, లుంగీ ఎంగిడి, న్‌క్వాబా పీటర్, లూహాన్ డ్రి ప్రిటోరియస్, అండైల్ సైమ్‌లేన్, లిజాడ్ విలియమ్స్
వన్డే జట్టు: మాథ్యూ బ్రీట్జ్కే (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, జోర్న్ ఫోర్టుయిన్, జార్జ్ లిండే, లుంగి ఎంగిడి, న్‌క్వాబా పీటర్, లుహాన్ డ్రి ప్రిటోరియస్, సినేతెంబా క్వెషైల్, లిజాడ్ విలియమ్స్
చదవండి: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్మృతి మంధన సూపర్ సెంచరీ