ఎల్‌పీజీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి?

What is The Reason Behind the Increase in LPG Gas - Sakshi

దేశంలోని దాదాపు ప్రతి ఇంటిలోనూ వంటగ్యాస్‌ అంటే ఎల్‌పీజీ కనెక్షన్ ఉంది. గ్రామాల్లో కూడా మట్టి పొయ్యిలకు బదులు గ్యాస్‌ స్టవ్‌లు వినియోగిస్తున్నారు. అయితే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఏడాదికేడాది పెరుగుతున్నాయి.

ఉజ్వల పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు అందించిన తర్వాత వంటగ్యాస్‌ వినియోగం మరింతగా పెరిగింది. గత 10 సంవత్సరాలలో ఎల్‌పీజీ వినియోగదారుల సంఖ్య 32 కోట్లకు పైగా పెరిగింది. గత ఐదేళ్లలో దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తి నాలుగు శాతం పెరిగింది. అయితే వినియోగం 22 శాతం మేరకు పెరిగింది.

పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని  గ్యాస్‌ను ప్రభుత్వం దిగుమతి చేస్తోంది. గత ఐదేళ్లలో ఎల్‌పీజీ దిగుమతులు 60 శాతం  మేరకు పెరిగాయి. భారతదేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ నుండి గ్యాస్‌ సరఫరా అవుతోంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అందించిన డేటా ప్రకారం గత కొన్నేళ్లుగా భారత్.. అమెరికా నుంచి కూడా గ్యాస్‌ దిగుమతి చేసుకుంటోంది. ఇలా ఎల్‌పీజీ దిగుమతులు పెరిగిన కారణంగానే వాటి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. 

భారతదేశంలో 90 శాతం ఎల్‌పీజీ గృహ వినియోగం కోసం ఉపయోగిస్తున్నారు. మిగిలిన మొత్తం పారిశ్రామిక, వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారు. దేశంలో ఎల్‌పీజీ వినియోగంలో 13 శాతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఇది మహారాష్ట్రలో 12 శాతం మేరకు ఉంది. ఈ విషయంలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది.

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top