మళ్లీ పెరిగిన వంటగ్యాస్‌ ధర | Non Subsidised LPG Prices Hiked | Sakshi
Sakshi News home page

మళ్లీ పెరిగిన వంటగ్యాస్‌ ధర

Nov 1 2017 4:54 PM | Updated on Nov 2 2017 6:58 AM

Non Subsidised LPG Prices Hiked

ఢిల్లీ: వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. సుమారు రూ.4.50 పెరగటంతో ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.495.69 కాగా, సబ్సిడీయేతర సిలిండర్‌ ధర రూ.742 అయింది. సరాసరి పెట్రోలియం ధర, ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ రేట్‌ను బట్టి నెలవారీగా పెట్రోలియం మంత్రిత్వశాఖ గ్యాస్‌ ధరలను నిర్ణయిస్తోంది. ఈ మేరకు గత మే 30వ తేదీ నుంచి నెలకు రూ.4 చొప్పున 19 సార్లు పెరిగి సిలిండర్‌పై రూ.76.51 వరకు చేరుకుంది.

దేశంలో సబ్సిడీ వంటగ్యాస్‌ వినియోగదారులు 18.11 కోట్ల మంది, ప్రధాన్‌మంత్రి ఉజ్వల యోజన కింద ఏడాదిలో ఇచ్చిన మూడు కోట్ల సబ్సిడీ గ్యాస్‌ కనెక‌్షన్లతోపాటు సబ్సిడీయేతర వంటగ్యాస్‌ వినియోగదారులు 2.66 కోట్ల మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి వినియోగదారుడు 14.2కిలోల గ్యాస్‌ సిలిండర్లను ఏడాదిలో 12వరకు సబ్సిడీపై వాడుకునే వీలుంటుంది. ఆ తర్వాత వాడుకోవాలంటే మాత్రం సబ్సిడీ వర్తించదు. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ నిబంధనలు కూడా ఉండవు. వంటగ్యాస్‌కు సబ్సిడీయే ఉండదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement