పెరిగిన వంట గ్యాస్ ధర | Non Subsidised LPG Price Hiked Marginally In Metros | Sakshi
Sakshi News home page

 పెరిగిన వంట గ్యాస్ ధర

Jul 1 2020 9:38 AM | Updated on Jul 1 2020 9:41 AM

Non Subsidised LPG Price Hiked Marginally In Metros - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వంట గ్యాస్ ధరలు స్వల్పంగా పెరిగాయి.  బుధవారం (జూలై1) అమల్లోకి వచ్చేలా మెట్రో నగరాల్లో  సిలిండర్‌కు 4.50 రూపాయలకు వరకు పెంచారు. ఎల్‌పీజీ సిలిండర్ల ధరను వరుసగా రెండవ నెలలోనూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్ పై ఢిల్లీలో ఒక రూపాయి, ముంబైలో 3 రూపాయల 50 పైసలు , కోల్‌కతాలో  4.50 రూపాయలు, చెన్నైలో 4 రూపాయలు, హైదరాబాద్ లో 4.50 రూపాయలు చొప్పున  పెరిగింది

సబ్సిడీయేతర ఎల్‌పీజీ సిలిండర్ రేట్లు (14.2 కిలోలు)
హైదరాబాద్ : 645.50 రూపాయలు
ఢిల్లీ : 594  రూపాయలు
కోల్‌కతా  :  620.50 రూపాయలు
ముంబై : 594 రూపాయలు
చెన్నై : 610.50రూపాయలు

Advertisement
 
Advertisement
Advertisement