LPG Cylinder Price: మళ్ళీ తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు.. ఈ సారి ఎంతంటే?

LPG cylinder new price details - Sakshi

LPG Cylinder Price: పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు 'ఎల్‌పీజీ' (LPG) ధరలు కూడా మారుతూ ఉంటాయి. తాజాగా మరో సారి గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. ఎల్‌పీజీ కొత్త ధరలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. ఈ రోజు (2023 జూన్ 01) నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు వినియోగదారులకు భారీ ఊరటను కలిగించనున్నాయి. ప్రస్తుతం తగ్గిన గ్యాస్ సిలిండర్ల ధరలు కేవలం కమర్షియల్ గ్యాస్‌కి మాత్రమే వర్తిస్తాయి. కాగా డొమెస్టిక్ గ్యాస్ ధరలలో ఎటువంటి మార్పు లేదు.

(ఇదీ చదవండి: కస్టమర్లకు షాకిచ్చిన ఓలా.. పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు)

14.2 కేజీల గ్యాస్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కావున దీని ధర రూ. 1133 వద్ద స్థిరంగా ఉంది. అదే సమయంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1856.50 వద్ద నుంచి రూ. 1773 కి తగ్గింది. అంటే ఈ ధరలు మునుపటి కంటే రూ. 83 తగ్గినట్లు తెలుస్తోంది. 2023 మే 1న కూడా కమర్షియల్ గ్యాస్ ధరలు ఏకంగా రూ. 171.50 తగ్గాయి. అప్పుడు కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు.

ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గి, డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో మార్పు లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు కొంత నిరాశ చెందుతున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top