Ola Electric: కస్టమర్లకు షాకిచ్చిన ఓలా.. పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు

Ola s1 s1 pro price hiked and new details - Sakshi

Ola Electric Price Hiked: భారతదేశంలో రోజు రోజుకి మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్న 'ఓలా ఎలక్ట్రిక్' ఇప్పుడు కస్టమర్లకు ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించింది. కంపెనీ ఇప్పుడు తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను అమాంతం పెంచినట్లు ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ కొత్త ధరలను గురించి మరికొన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కొత్త ధరలు..
నివేదికల ప్రకారం.. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 & ఎస్1 ప్రో ధరలు మాత్రమే పెరిగాయి. ఎంట్రీ లెవెల్ మోడల్ అయిన 'ఎస్1 ఎయిర్' ధరలు మారలేదు. ఓలా మిడ్-స్పెక్ ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్‌లనులో లభిస్తుంది. అవి ఒకటి 2 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్, రెండు 3 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్. గతంలో ఎస్1 3kWh ధర రూ. 1.15 లక్షలు కాగా, ఇప్పుడు ఈ స్కూటర్ ధర రూ. 15,000 పెరిగి రూ. 1.30 లక్షలు చేరింది. అదే సమయంలో S1 ప్రో ధర రూ. 1.40 లక్షలకు చేరింది.

(ఇదీ చదవండి: ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఇతడే..)

ఇక ఓలా ఎలక్ట్రిక్ ఎంట్రీ లెవెల్ మోడల్ ఎస్1 ఎయిర్ విషయానికి వస్తే, ఇది 2kWh, 3kWh, 4kWh అనే మూడు బ్యాటరీ ఫ్యాక్స్ కలిగి ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ. 84999, రూ. 99999, రూ. 1.10 లక్షలు. రేంజ్ విషయానికి వస్తే 85 కిమీ, 125 కిమీ, 165 కిమీ. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇవి చాలా ఉత్తమంగా ఉంటాయి. ధరల పెరుగుదల అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top