Elon Musk: ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఇతడే..

Tesla ceo elon musk now world richest person - Sakshi

World Richest Person Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న టెస్లా సీఈఓ 'ఎలాన్ మస్క్' (Elon Musk) ఎట్టకేలకు మొదటి స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించాడు. ప్రపంచంలోని 500 మంది ధనవంతుల జాబితాలో ఆయన అగ్రస్థానంలో నిలిచాడు. ద్రవ్యోల్బణం నేపథ్యంలో టెక్ పరిశ్రమ కష్టాల కారణంగా ఆర్నాల్ట్ డిసెంబర్‌లో మస్క్‌ను అధిగమించారు. అయితే ఎట్టకేలకు మళ్ళీ ఆ స్థానాన్ని మస్క్ సొంతం చేసుకున్నారు.

(ఇదీ చదవండి: భారతీయ వంటకాలపై మనసులో మాట చెప్పిన ఎలాన్ మస్క్)

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ అందించిన సమాచారం ప్రకారం.. ఎలాన్ మస్క్ సంపద సుమారు 192.3 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా ఇప్పుడు రెండవ స్థానానికి చేరిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద 186.6 బిలియన్ డాలర్లు. ఏప్రిల్ నుంచి LVMH షేర్లు క్రమంగా తగ్గుముఖం పట్టి 10 శాతం పడిపోయాయి. ఈ కారణంగా ఆర్నాల్డ్ నికర విలువ ఒక్క రోజులోనే 11 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి. దీంతో ఎలాన్ మస్క్ మళ్ళీ మొదటి స్థానం సొంతం చేసుకున్నాడు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top