రూ.10 కోట్ల ఫెరారీ కారు: దీని గురించి తెలుసా? | Ferrari 849 Testarossa Debuts in India | Sakshi
Sakshi News home page

రూ.10 కోట్ల ఫెరారీ కారు: దీని గురించి తెలుసా?

Mar 15 2026 10:34 AM | Updated on Mar 15 2026 12:36 PM

Ferrari 849 Testarossa Debuts in India

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ.. భారతదేశంలో కొత్త ఫెరారీ 849 టెస్టరోస్సాను ఆవిష్కరించింది. దీని ధర రూ. 10.37 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది గ్లోబల్ లైనప్‌లో ఫెరారీ SF90 స్ట్రాడేల్ స్థానంలో ఉంటుంది.

ఫెరారీ 849 టెస్టరోస్సా కారు మూడు ఎలక్ట్రిక్ మోటార్లు & లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జత చేయబడిన 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్ పొందుతుంది. ఇది దాదాపు 1,050 Bhp పవర్ అందిస్తుంది. కాబట్టి ఈ కారు ఇప్పటివరకు అత్యంత శక్తివంతమైన ఫెరారీగా నిలిచింది. 849 టెస్టరోస్సా 2.3 సెకన్ల కాలంలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 330 కిలోమీటర్లు. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టం ద్వారా 25 కిమీ పరిధి లభిస్తుంది.

కొత్త మోడల్ క్లాసిక్ టెస్టరోస్సా నుంచి ప్రేరణ పొందటం వల్ల కొత్త ఫెరారీ కారు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. లేటెస్ట్ ఏరోడైనమిక్ ఎలిమెంట్స్, షార్ప్ బాడీవర్క్‌తో వస్తుంది. ఛాసిస్ కూడా అప్‌గ్రేడ్‌లను పొందింది. ఈ కొత్త మోడల్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement