భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్‌ ఫ్లయిట్‌ టికెట్ చార్జీలు | Akasa Air Flight Ticket Charges Have Increased | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్‌ ఫ్లయిట్‌ టికెట్ చార్జీలు

Mar 15 2026 8:51 AM | Updated on Mar 15 2026 12:31 PM

Akasa Air Flight Ticket Charges Have Increased

ఇతర విమానయాన సంస్థల బాటలోనే ఆకాశ ఎయిర్‌ కూడా తమ ఫ్లయిట్‌ టికెట్లపై ఇంధన సర్‌చార్జీ విధించనున్నట్లు ప్రకటించింది. దేశ, విదేశ రూట్లను బట్టి చార్జీలు రూ. 199 నుంచి రూ. 1,300 వరకు ఉంటాయి. ఇది మార్చి 15 (నేడు) నుంచి అమల్లోకి వస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఇంధనాల రేట్లు భగ్గుమన్న నేపథ్యంలో దేశీ ఎయిర్‌లైన్స్‌ ఈ చార్జీలు విధిస్తున్నాయి. సాధారణంగా విమానయాన సంస్థల వ్యయాల్లో ఇంధనం భారం 40 శాతం స్థాయిలో ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement