విమానం ఎగిరితే.. కోట్లాది రూపాయలు ఇలా కురుస్తాయ్‌? | Flight Revenue Sources Operating Costs of a Flight explained | Sakshi
Sakshi News home page

విమానం ఎగిరితే.. కోట్లాది రూపాయలు ఇలా కురుస్తాయ్‌?

May 30 2026 9:24 PM | Updated on May 30 2026 9:27 PM

Flight Revenue Sources Operating Costs of a Flight explained

ఆకాశంలో ఫ్లైట్స్ ఎన్నో ఎగురుతూ ఉంటాయి. విమానాల వల్లే సుదూర ప్రాంతాలకు తొందరగా చేరుకోగలుగుతున్నాం. ఏ రంగమైనా రెవెన్యూతో ముడిపడి ఉంటుంది. మరి ఫ్లైట్ రెవెన్యూ అంటే అసలుఏంటి? ఒక ఎయిర్‌లైన్ సంస్థకు విమాన ప్రయాణాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఫ్లైట్ రెవెన్యూ అంటారు.

ప్రధానంగా రెవెన్యూ వచ్చే మార్గాలు
ప్రయాణికుల టికెట్ బుకింగ్స్ నుంచి అంటే.. బిజినెస్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్ టికెట్స్ నుంచి అదనపు లగేజ్ చార్జీలు ఫుడ్ అండ్ బెవరేజ్ సేల్స్ కార్గో అండ్ పార్సల్ సర్వీసులు, ఇన్‌ఫ్లైట్‌ వైఫై లేదా ప్రీమియం సేవలు అంటే ఇది దాదాపు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే ఫ్యూయల్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పైలట్ అండ్ సిబ్బంది జీతాలు, ఎయిర్‌పోర్ట్ చార్జీలు, విమాన మెయింటెనెన్స్, ట్యాక్సీలు ఇవన్నీ కలిపి కూడా ఫ్లైట్ రెవెన్యూ కిందకు వస్తుంటాయి.

ఎగరడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకుందాం..
ఉదాహరణకు.. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ప‍్యాసింజర్ ప్లేన్ ఒక ఎయిర్ బస్ A380 ఒక సింగల్ ఫ్లైట్ లో ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్లైట్ దుబాయ్ నుంచి లండన్ వెళ్తుంది అనుకుందాం. ప్రయాణం 7 గంటలు పడుతుందనుకుందాం. దీంట్లో 506 సీట్స్ ఉంటాయి. ఫుల్లీ బుక్డ్ అనుకుందాం.. ఈ ఫ్లైట్ మొత్తం మరి దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఇందులో 14 ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్స్ ఉంటే అందులో నుంచి వీళ్లకు వచ్చే ఆదాయం అక్షరాల ఒకటిన్నర కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇక మిగిలిన సీట్లు ఉంటాయి కదా.. 76 బిజినెస్ క్లాట్స్ ప‍్యాసెంజర్స్ సీట్స్ ఉంటాయి. మరి అందులో నుంచి వారికి 86 అంటే 86.2 లాక్స్ ఆదాయం వస్తుంది. అలాగే 416 ఎకానమీ  ప్యాసెంజర్ సీట్స్ ఉంటాయి.

అంటే ఫస్ట్ క్లాస్ తర్వాత మిగిలిన సీట్స్ తర్వాత ఎకానమీ ప్యాసెంజర్స్ సీట్స్ ఉంటాయి. వాళ్ల నుంచి వీళ్లకు వచ్చే ఆదాయం 1/2 కోట్లు ఉండొచ్చు. మరి ఇక టికెట్ రెవెన్యూ రఫ్ గా చూసుకున్నట్లయితే వీళ్లకి రూ.3.16 కోట్లు. అలాగే మన కార్గో చార్జీలు అన్నీ ఉంటాయి కదా వాటికి కూడా వాళ్లకి వచ్చే ఆదాయం 67 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక టోటల్ రెవెన్యూ మాత్రం దగ్గర దగ్గరగా 3.83 కోట్ల వరకు వస్తుంది.

ఒక ఫ్లైట్ నడపడానికి అయ్యే ఖర్చు?
ఒకవేళ ఈ ఫ్లైట్ నే తీసుకుందాం A380.  ఈ ఫ్లైట్ అసలు నడవడానికి కొంతవరకు బర్న్ అయ్యే ఫ్యూయల్ ఉంటుంది కదా.. ఒకవేళ 2600 గలోన్స్ ఆఫ్ ఫ్యూయల్ పర్ అవర్ ఉంటే ఒక ఫ్లైట్ కి కావాల్సింది 27600 గెలోన్స్ దీనికి కాస్ట్ ఎంత పడుతుందనుకుంటున్నారు? నియర్లీ 60,000 డాలర్.. అంటే అక్షరాల రూ.57 లక్షలు అవుతుంది. 

మరి ల్యాండింగ్  ఫీస్ సెక్యూరిటీ బ్యాగేజ్ హ్యాండిలింగ్ ఫీస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా వీటికి కూడా 12.45 లక్ష అవుతుంది. ఇక ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ ఫీస్ ఉంటుంది 11.5 లాక్స్ అవుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే క్రూ ఉంటారు ఫ్లైట్ లో మరి వాటికి కూడా వాళ్లకు కూడా చార్జీలు ఉంటాయి. ఇక క్రూ మొత్తం కలుపుకుంటే ఆ పెద్ద ఫ్లైట్ లో 22 ఫ్లైట్ అటెండెన్స్ ఉంటాయి. అంటే 22 ఫ్లైట్ అటెండెన్స్ ప్లస్ఫోర్ పైలట్స్ చూసుకున్నట్లయితే వాళ్లకి కూడా శాలరీస్ ఉంటాయి. 

మరి దానికి ఖర్చు రూ.14.36 లక్షలు ఉండొచ్చు. ఇక ఇంజన్ సిస్టం మెయింటనెన్స్ కాస్ట్‌లు పడుతూ ఉంటాయి. మరి దానికి అయ్యే ఖర్చు రూ.4.78 లక్షలు. ఇక వేరియబుల్ కాస్ట్ అన్ని కలిపి ఒక కోటి రూపాయల వరకు అవ్వచ్చు. మరి అలాగే డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మేనేజ్మెంట్ ఖర్చులు ఉంటాయి. 

వాటికి కూడా 47.87 లక్షల రూపాయలు అవుతుంది. అంత స్మూత్ గా వెళ్తుంటే రూ.2.35 క్రోర్స్ వరకు వాళ్లకు ఆదాయం వస్తుంది. అంటే ఒక ఫ్లైట్ నడపడానికి అయ్యే ఖర్చులు ఆదాయాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం చూసే ప్రతి ఫ్లైట్ కేవలం ప్రయాణం మాత్రమే కాదు. వేలాది ఉద్యోగాలు కోట్ల రూపాయల బిజినెస్, బారి ప్లానింగ్ తో నడిచే ఒక పెద్ద ఇండస్ట్రీ ఆకాశంలో ఎగిరేది విమానం మాత్రమే కాదు.. దాని వెనక ఉన్న రెవెన్యూ కూడా...

Advertisement
 
Advertisement
Advertisement