భారీ విద్యారుణం నుంచి మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగి రేంజ్‌కు..! | From Flight Ticket On Loan To Job At Microsoft, Priyanka Vargadia Shares Her Inspiring Journey Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

భారీ విద్యారుణం నుంచి మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగి రేంజ్‌కు..!

Mar 23 2026 11:15 AM | Updated on Mar 23 2026 11:29 AM

From Flight Ticket On Loan To Job At Microsoft Goes Viral

ప్రారంభంలో ఒడిదొడుకులు ఎదుర్కోవడం సహజం. అయితే వాటిని అధిగమిస్తు ఎలా ముదుకుపోతామనే దానిపైనే సక్సెస్‌ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ టెకీ ఎంతో తీవ్రమైన ఒత్తిడిని అధిగమిస్తూ.. అందంగా తీర్చిదిద్దుకున్న తన కెరీర్‌ సక్సెస్‌ని షేర్‌ చేసుకున్నారు. అలాంటి సమయంలో ఎవ్వరైన చూపించాల్సిన తెగువ, పట్టుదలను హైలెట్‌ చేస్తున్న ఈ స్టోరీ నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. 

ఆ టెకీనే బారతీ సంతతికి చెందిన ప్రియాంక వర్గాడియా. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌లో సీనియర్‌ డైరెక్టర్‌ డెవలపర్‌ జీటీఎం మార్కెటింగ్‌గా పనిచేస్తున్నారామె. ఇన్‌స్టాగ్రామ్‌లో తన కెరీర్‌ అనుభవాలను పంచుకున్నారు. పోస్ట్‌లో తన కెరీర్‌ ప్రారంభంలో చాలా పోరాటాలు, రిస్క్‌లు ఉన్నాయన్నారు. ఉన్నత విద్య కోసం భారత్‌ నుంచి అమెరికా వెళ్లే క్రమంలో భారీ విద్యా రుణం తీసుకున్నానని వెల్లడించింది. అక్కడ అమెరికాలో మాస్టర్‌ డిగ్రీ చేసేందుకు సుమారు రూ. 40 లక్షల దాక రుణం తీసుకున్నట్లు తెలిపింది. 

ఆ తర్వాత భారత్‌ నుంచి అమెరికాకు తన తొలి ఫ్లైట్‌ జర్నీ కోసం కూడా తన తండ్రి భూమిని తాకట్టు పెట్టినట్లు వెల్లడించింది. ఆ రోజు తన విదేశీ ప్రయాణం ఎంత భారమైందో మర్చిపోలేనని, అక్కడ ఒంటరిగా చదవు సాగించడం అంత సులభం కాదని అంటోంది. అక్కడ విద్యా వ్యవస్థకు అలవాటు పడటం కాస్త కష్టంగా ఉంటుందని అంటోంది. ఎందుకంటే అక్కడ బోధనాపద్ధతులు, కొత్త వాతావరణానికి సర్దుకుపోవడం అంత సులభమైనవి కావని, పైగా తన చదువు, వంట, ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడం వంటి అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. 

దాంతోపాటు తన విద్యార్ధి రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన ఒత్తిడిని కూడా భరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తన అప్పులు తీర్చుకోవడానికి గ్రాడ్యుయేషన్‌ అయిన వెంటనే ఉద్యోగం సంపాందించక తప్పని పరిస్థితి. ఇవన్నీ తనని ఎంతో ఉక్కిరిబిక్కిరి చేసేవని అంటోంది. ఈ సవాళ్లన్నింటిని ఎదుర్కొనడానికి తొందరలో మంచి భవిష్యత్తు కచ్చితంగా ఉందనే ఆశ..కొండంత ధైర్యాన్ని ఇచ్చేదని పేర్కొంది. 

ముందున్న జీవితం గురించి అంతరంగంలో నిశబ్దమైన ఉత్సాహం, అలాగే తాను తీసుకున్న సాహసం చివరికి మంచి ఫలితాన్నే ఇస్తుందన్న నమ్మకం తదితరాలతో ముందుకు సాగానని చెప్పుకొచ్చింది. తన వృత్తిపరమైన అనుభవాలను పంచుకుంటూ ఆమె మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఇంటెల్‌ వంటి ప్రపంచ టెక్‌ దిగ్గజాలతో కలిసి పనిచేసినట్లు వెల్లడించారు. 

అలాగే తన ఉద్యోగం కారణంగా అనేక ప్రదేశాలకు పర్యటించే అవకాశం కూడా లభించిందని ఆమె పేర్కొన్నారు. తన గ్రాడ్యుయేషన్‌ డే వేడుక కోసం తన తల్లిదండ్రులను అమెరికాకి తీసుకురావడం.. తాను సాధించిన అతిపెద్ద ఘనత అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. తన తల్లిదండ్రులకు అదే తొలి విమాన ప్రయాణ అనుభవమని ఆనందంగా చెప్పుకొచ్చింది. ఉద్యోగ కెరీర్‌ లైఫ్‌లో ఎన్నో విమాన ప్రయాణాలు చేసినా.. తన హృదయంలో మాత్రం.. ఆనాడు భయంతో చేసిన తొలి విమాన ప్రయాణానికే ఎప్పటికీ ప్రత్యేక స్థానం అని చెబుతోంది.

(చదవండి: కొండచిలువ రక్తంతో ఊబకాయానికి చెక్‌..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement