పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే? | LPG Commercial Gas Cylinder Price Hike | Sakshi
Sakshi News home page

పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?

Oct 1 2024 8:03 AM | Updated on Oct 1 2024 9:09 AM

LPG Commercial Gas Cylinder Price Hike

న్యూఢిల్లీ: దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్ ఒకటిన ఉదయాన్నే వంటగ్యాస్‌ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. 19 కిలోల గ్యాస్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.48.50 నుంచి రూ.50కి పెరిగింది.

ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఇప్పుడు ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర 1740 రూపాయలకు చేరింది. అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలో కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. గతంలో మాదిరిగానే ఢిల్లీలో రూ.803కే లభ్యం కానుంది.

2024, అక్టోబర్  ఒకటి నుండి, వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ముంబైలో రూ. 1,692.50, కోల్‌కతాలో రూ. 1,850.50, చెన్నైలో రూ. 1,903కు చేరింది. దీనికిముందు సెప్టెంబర్‌లో కూడా ఎల్‌పీజీ సిలిండర్ ధర సుమారు రూ.39 పెరిగి రూ.1,691.50కి చేరింది. దీనికి ముందు రూ.1,652.50గా ఉంది. కోల్‌కతాలో మంగళవారం నుంచి 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.48 పెరిగింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల కారణంగా, రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాలలోని ఆహార ధరలు పెరగనున్నాయి.

ఇది కూడా చదవండి: 31నే దీపావళి.. తేల్చిచెప్పిన కాశీ పండితులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement