బయోమాస్‌ సేకరణపై ఫోకస్‌.. ఖర్చు ఎంతంటే.. | Sakshi
Sakshi News home page

బయోమాస్‌ సేకరణపై ఫోకస్‌.. ఖర్చు ఎంతంటే..

Published Mon, Feb 12 2024 9:47 AM

IBA Recommended An Investment 30000 Cr For Biomass - Sakshi

అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల నిత్యం గ్యాస్‌ ధరల పెరుగుతున్నాయి. భారత్‌ విదేశాల నుంచి గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. దాంతో ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతోంది. చేసేదేమిలేక ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపుతోంది. అయితే దిగుమతి చేసుకునే గ్యాస్‌ స్థానే స్థానికంగా బయోమాస్‌ను సేకరించి దీన్ని తయారుచేసుకోవాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్(ఐబీఏ) సూచించింది. అందుకు అనుగుణంగా బయోమాస్‌‌‌‌ సేకరణపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్‌‌‌‌ పెట్టాలని ఐబీఏ పేర్కొంది.

బయోగ్యాస్ ప్లాంట్లకు బయోమాస్‌‌‌‌ను సప్లయ్ చేయడానికి  మెషినరీ, ఎక్విప్‌‌‌‌మెంట్ల కోసం రూ.30 వేలకోట్ల వరకు పెట్టుబడులు అవసరం అవుతాయని ఐబీఏ అంచనా వేసింది. ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌జీ (లిక్విఫైడ్‌‌‌‌ నేచురల్ గ్యాస్‌‌‌‌) దిగుమతులను తగ్గించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. వరిగడ్డి వంటి అగ్రి వేస్టేజ్‌‌‌‌ను  బయోఎనర్జీ  ఉత్పత్తికి వాడుకోవాలని  ఇండియన్ బయోగ్యాస్‌‌‌‌ అసోసియేషన్ చైర్మన్ గౌరవ్ కేడియా అన్నారు. 

అయితే బయోమాస్‌ను సేకరించడంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. దాన్ని సేకరించడం, స్టోర్ చేయడం, రవాణా వంటి వాటికి అధికమొత్తంలో ఖర్చువుతుందని, దీంతో వరిగడ్డి వంటి అగ్రి వేస్ట్‌‌‌‌ను అమ్మడం కంటే తగలబెట్టడానికే రైతులు మొగ్గు చూపుతున్నారని  వెల్లడించారు. ప్రభుత్వం  లాజిస్టిక్స్‌‌‌‌ను మెరుగుపరచడం కంటే  వరి గడ్డిని సమర్ధవంతంగా సేకరించగలిగే ఎక్విప్‌‌‌‌మెంట్లను వాడేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

ఇదీ చదవండి: ‘వేర్‌’వేర్లు..! విభిన్న సాఫ్ట్‌వేర్లు..

Advertisement
Advertisement