శుభవార్త అందించిన ఐఓసీ!

 LPG price cut by up to Rs 65 with effect from April 1 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కారణంగా దేశం మొత్తం కష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎల్‌పీజీ వినియోగదారులకు కేంద్రం శుభవార్తను అందించింది. సబ్సీడియేతర లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ) సిలిండర్‌ (14.2 కేజీ) ధరను రూ.65 తగ్గిస్తున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్‌ ధరలు 55 శాతం మేర పడిపోవడంతో రేట్లు తగ్గించినట్లు ఐఓసీ తెలిపింది. ఈ తగ్గించిన రేట్లు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమలు కానున్నాయి. దీంతో ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్‌ రూ. 744కి లభించనుంది. గత నెలలో ఇది రూ. 805.5 ఉండగా రూ. 61.5 రూపాయలు తగ్గింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top