వంట గ్యాస్ ధరల తగ్గింపు | cooking gas prices reduced | Sakshi
Sakshi News home page

వంట గ్యాస్ ధరల తగ్గింపు

Nov 2 2013 8:08 AM | Updated on Jul 6 2019 3:20 PM

వంట గ్యాస్ ధరల తగ్గింపు - Sakshi

వంట గ్యాస్ ధరల తగ్గింపు

వంటగ్యాస్ ధరను చమురు కంపెనీలు తగ్గించాయి. గృహ వినియోగానికి సరఫరా చేసే 14.2 కిలోల సిలిండర్పై 53.50 రూపాయల వంతున ధరను తగ్గించాయి.

దీపావళి సందర్భంగా పిండివంటలు చేసుకోవాలంటే గ్యాస్ ఎక్కువ అయిపోతుందని భయపడుతున్నారా? అయితే మీకో శుభవార్త. వంటగ్యాస్ ధరను చమురు కంపెనీలు తగ్గించాయి. గృహ వినియోగానికి సరఫరా చేసే 14.2 కిలోల సిలిండర్పై 53.50 రూపాయల వంతున ధరను తగ్గించాయి. ఇటీవలే పెట్రోలు ధరను లీటరు 1.15 రూపాయల చొప్పను తగ్గించిన చమురు సంస్థలు, తాజాగా వంటగ్యాస్ ధరను కూడా తగ్గించడం విశేషం.

గృహ వినియోగ సిలిండర్లే కాక, వాణిజ్య సిలిండర్ల ధరలను కూడా చమురు కంపెనీలు తగ్గించాయి. ఒక్కో వాణిజ్య సిలిండర్ ధరను 91 రూపాయల వంతున తగ్గించడంతో చిరు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన ధరలు శుక్రవారం నుంచే అమలులోకి వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement