డీజీసీఏ చీఫ్‌గా కొత్త అధికారి | vikram yadav appointed new aviation body dgca chief | Sakshi
Sakshi News home page

డీజీసీఏ చీఫ్‌గా కొత్త అధికారి

Mar 31 2026 11:30 PM | Updated on Apr 1 2026 3:11 AM

vikram yadav appointed new aviation body dgca chief

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) కొత్త చీఫ్‌గా సీనియర్ అధికారి  వీర్ విక్రమ్ యాదవ్‌ని నియమించింది. దానితో పాటు ఒకేసారి 25 మంది సివిల్ సర్వెంట్లను వివిధ శాఖలకు బదిలీ చేసింది.

కేంద్ర ప్రభుత్వం మంగళవారం భారీ పరిపాలనా ప్రక్షాళనలో భాగంగా పౌర విమానయాన నియంత్రణ సంస్థ  నూతన చీఫ్‌గా సీనియర్ బ్యూరోక్రాట్ వీర్ విక్రమ్ యాదవ్ నియమాకం చేపట్టింది. దానితో పాటు ఒకేసారి 25 మంది సివిల్ సర్వెంట్లను వివిధ శాఖల్లో అదనపు కార్యదర్శి స్థాయి హోదాల్లో నియమించింది.

పునీత్ కన్సల్: పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి. విశాల్ గగన్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్  కార్యదర్శిగా, జ్ఞానేంద్ర డి త్రిపాఠి భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) కార్యదర్శి మరియు వ్యవసాయ పరిశోధనా విభాగం అదనపు కార్యదర్శిగా నియమించింది.

ఒడిశా క్యాడర్‌కు చెందిన 1996 బ్యాచ్ ఐఏఎస్ ఐఏఎస్ అధికారి వీర్ విక్రమ్ యాదవ్ ప్రస్తుతం కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు.  కాగా ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరియు పాలనా అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ భారీ బదిలీలను చేపట్టినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement