breaking news
dgca chief
-
డీజీసీఏ చీఫ్‌గా కొత్త అధికారి
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) కొత్త చీఫ్‌గా సీనియర్ అధికారి వీర్ విక్రమ్ యాదవ్‌ని నియమించింది. దానితో పాటు ఒకేసారి 25 మంది సివిల్ సర్వెంట్లను వివిధ శాఖలకు బదిలీ చేసింది.కేంద్ర ప్రభుత్వం మంగళవారం భారీ పరిపాలనా ప్రక్షాళనలో భాగంగా పౌర విమానయాన నియంత్రణ సంస్థ నూతన చీఫ్‌గా సీనియర్ బ్యూరోక్రాట్ వీర్ విక్రమ్ యాదవ్ నియమాకం చేపట్టింది. దానితో పాటు ఒకేసారి 25 మంది సివిల్ సర్వెంట్లను వివిధ శాఖల్లో అదనపు కార్యదర్శి స్థాయి హోదాల్లో నియమించింది.పునీత్ కన్సల్: పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి. విశాల్ గగన్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కార్యదర్శిగా, జ్ఞానేంద్ర డి త్రిపాఠి భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) కార్యదర్శి మరియు వ్యవసాయ పరిశోధనా విభాగం అదనపు కార్యదర్శిగా నియమించింది.ఒడిశా క్యాడర్‌కు చెందిన 1996 బ్యాచ్ ఐఏఎస్ ఐఏఎస్ అధికారి వీర్ విక్రమ్ యాదవ్ ప్రస్తుతం కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాగా ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరియు పాలనా అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ భారీ బదిలీలను చేపట్టినట్లు తెలుస్తోంది. -
డీజీసీఏకి సత్యవతి సారథ్యం
న్యూఢిల్లీ: కొత్త డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)గా ఎం. సత్యవతి నిన్న పదవీ బాధ్యతలు స్వీకరించారు. డీజీసీఏ అధిపతిగా ఒక మహిళ పనిచేయడం ఇదే ప్రథమం. ప్రభాత్ కుమార్ స్థానంలో వచ్చిన 1982 ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమె మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. ఈ పదవికి ముందు ఆమె పౌర విమానయాన శాఖకు అదనపు కార్యదర్శిగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. పాండిచ్చేరి ముఖ్య కార్యదర్శిగానూ పనిచేశారు. ఉత్తర ప్రదేశ్ కేడర్ 1985 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ప్రభాత్ కుమార్‌ను మళ్లీ ఉత్తరప్రదేశ్‌కే పంపించారు. ఎఫ్ఏఏ వంటి అంతర్జాతీయ సంస్థలు లెవనెత్తిన పలు భద్రత లోపాలను సరిదిద్దడానికి ఆయన పలు విజయవంతమైన చర్యలు తీసుకున్నారు.


